ఢిల్లీ: మహారాష్ట్ర కాంగ్రెస్ ఏకైక ఎంపీ సురేశ్ ‘బాలు’ ధానోర్కర్(47) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట ఆయన తండ్రి అనారోగ్యంతో మరణించగా.. ఇవాళ ఆయన కూడా మరణించడం ఆ కుటుంబంలో, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నింపింది. సురేశ్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నీలో రాళ్లకు చికిత్స తీసుకునేందుకు మే 26న సురేశ్ ధానోర్కర్ నాగ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత ఆదివారం ఆయన్ను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ తెలిపారు.
సురేష్ ధానోర్కర్ తండ్రి నారాయణ్ ధానోర్కర్ (80) దీర్ఘకాలిక అనారోగ్యంతో గత శనివారం మరణించారు. ఆస్పత్రిలో ఉండడంతో.. ఆదివారం జరిగిన తండ్రి అంత్యక్రియలకు కూడా ఎంపీ హాజరుకాలేకపోయారు.
మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎంపీ సురేశ్ ధానోర్కరే. బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరి రాజకీయ కెరీర్‌ను ప్రారంభించిన సురేశ్.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
సురేశ్ భార్ పేరు ప్రతిభ. ఆమె 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరోరా-భద్రావతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. స్వస్థలం వారోరాలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Sad to learn that our @INCIndia parliamentary colleague, Suresh Narayan Dhanorkar (MP from Chandrapur constituency in Maharashtra) passed away overnight, the second demise of a Congress MP during the 17th Lok Sabha. He was only 47. My condolences to his loved ones. Om Shanti. pic.twitter.com/qwCQ8XamEc
— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2023
ఇదీ చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన.. అధికారికి షాక్
Comments
Please login to add a commentAdd a comment