
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ఫిబ్రవరి 1 మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన సమయంలో వికసిత భారత్ గురించి ప్రస్తావించారు. ఇవాళ జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంబంధించిన విజన్ ఇండియా డాక్యుమెంట్‌ను మోదీ సమర్పించినట్లు సమాచారం.
ప్రణాళికలు పౌరులకు సాధికారత కల్పించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడంపై ఆధారపడి ఉంటుంది. 25 ఏళ్ల ప్రణాళికలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా టెక్నాలజీ, ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. 2021 డిసెంబర్ నుంచి జనవరి 2024 వరకు మంత్రిత్వ శాఖలలో జరిగిన సమావేశాల తర్వాత విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు.
మంత్రులు, శాఖల కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధాని గంటపాటు మాట్లాడారు. భవిష్యత్ సాంకేతికతల కోసం బడ్జెట్‌లో ఒక లక్ష కోట్లు కేటాయించడం, ఆవిష్కరణలో భారతదేశం ముందుంటుందనే ఆలోచనలు కూడా ఇందులో ప్రధానమని తెలుస్తోంది.
వికసిత్ భారత్ సెమినార్‌లను ప్రతి శాఖ ఎజెండాలో చేర్చాలని, అంతే కాకుండా తమ ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ వంటి వ్యాపార సంస్థలు కూడా దీనిపై చర్చలు ప్రారంభించాలని కోరారు.