సోషల్‌ మీడియాతో ఎన్నికల్లో గెలుపు ఖాయమా? | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాతో ఎన్నికల్లో గెలుపు ఖాయమా?

Published Sun, Mar 17 2024 1:17 PM

Political Parties Use Social Media Influences To Voters - Sakshi

దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నాయి. మరో వైపు వాట్సప్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా  మాధ్యమాలు ఓటర్ సైకాలజీని ప్రభావితం చేసే మాధ్యమాలుగా ఉద్భవించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు,రాజకీయ పార్టీలు తమ విజయాలను ప్రచారం చేయడానికి, ఓటర్ల నుండి మద్దతు పొందడానికి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

పార్టీలు ఓటర్లను ఎలా ఆకర్షిస్తున్నాయి?
భారత్‌లో ప్రతినెలా 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్ల ఉన్న వాట్సప్‌లో  లెటర్‌ ఫ్రమ్‌ ది ప్రైమ్‌ మినిస్టర్‌ పేరుతో ప్రధాని మోదీ ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. తద్వారా తాను ప్రధానిగా దేశానికి చేసిన సేవ, సంక్షేమ పథకాలు, పనితీరు వంటి విషయాల గురించి అవగాహన కల్పిస్తూ అభిప్రాయాల్ని సేకరించేందుకు ఉపయోగపడుతుంది.  

‘మై ఫస్ట్ ఓట్‌ ఫర్ మోడీ’
బీజేపీ ‘మై ఫస్ట్ ఓట్‌ ఫర్ మోడీ’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వెబ్‌సైట్‌ను విజిట్‌ చేసే యూజర్లు మోదీకి ఓటు వేసేలా ప్రతిజ్ఞ చేయడం, అందుకు గల కారణాల్ని తెలుపుతూ వీడియోల్ని క్రియేట్‌ చేసి అభిప్రాయాల్ని పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తాయి. 

వాట్సప్‌లో రాహుల్‌ గాంధీ సైతం
మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాట్సప్ గ్రూప్‌ను నడుపుతున్నారు. ఇందులో ప్రజలతో సంభాషించడంతో పాటు వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. తద్వారా పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడడమే కాదు ఓటర్ల బేస్‌ను గుర్తించవచ్చు.  

పాండమిక్‌ తర్వాత ట్రెండ్‌ మారింది
కోవిడ్‌-19 మహమ్మారి తర్వాత, సమాచార సాధనంగా సోషల్ మీడియా పట్ల దృక్పథం గణనీయంగా మారిపోయిందని, పొలిటిక్ అడ్వైజర్ వ్యవస్థాపకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఐటీ సెల్ హెడ్ అంకిత్ లాల్ అన్నారు. ‘సమాచారాన్ని పొందడానికి సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడే ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి అనేక రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ ఎన్నికల ప్రచారానికి డిజిటల్ వ్యూహాన్ని అవలంబించాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లు మరో మాధ్యమంగా మారారు. వీరి ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయోచ్చని తెలిపారు. 

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు 
గత కొన్ని నెలలుగా యువ ఓటర్లను కనెక్ట్ అవ్వడానికి పలువురు రాజకీయ నాయకులు ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు యూట్యూబ్ ఛానెల్స్‌ వరుసు ఇంటర్వ్యూలతో హోరెత్తించారు. ఎస్ జైశంకర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి బీజేపీ నేతలు యూట్యూబ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న పోడ్‌కాస్టర్ రణవీర్ అలహబాడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పాడ్‌కాస్ట్ కర్లీ టేల్స్ వ్యవస్థాపకుడు కమియా జానీతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 ప్రతి పక్షాలకు అదే ఎదురు దెబ్బ
 2014 సార్వత్రిక ఎన్నికల్లో చాలా మంది నాయకులు సోషల్‌ మీడియాను వినియోగించుకోవడంలో వెనుకబడి పోయారు. దీంతో ఆ ప్రభావం ప్రతిపక్షంలో ఉండేలా చేసింది. ప్రతిపక్షాల కంటే ముందే సోషల్‌ మీడియాను వినియోగించుకోవడం ముందున్న బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిందని అంకిత్ లాల్ చెప్పారు.   

పోల్ ఫలితాలపై సోషల్ మీడియా ప్రభావం
పోల్ ఫలితాలపై సోషల్ మీడియా ప్రచారం ప్రాముఖ్యతను లాల్ వివరిస్తూ, ‘40 శాతం ఇంటర్నెట్ వ్యాప్తితో, సగటున రెండు లక్షల మంది జనాభా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో డిజిటల్ మాధ్యమాల ద్వారా 75,000 నుండి 80,000 మందిని ప్రభావితం చేయడం సాధ్యమవుతుంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా 5,000 ఓట్ల తేడా మంచి గెలుపు ఓటమి తేడా ఉంటుంది. అదే సమయంలో  ఇతర విశ్లేషకులు  ప్రజలను ఓటర్లుగా మార్చడంలో సోషల్ మీడియా శక్తిపై అనేక సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement