
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడటం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఫేస్‌బుక్ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని తెలిపారు. బుధవారం ఆమె లోక్‌సభ జీరోఅవర్‌లో మాట్లాడుతూ.. భారత రాజకీయాలు, ఎన్నికల్లో ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల జోక్యాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అల్ జజీరా, ది రిపోర్టర్స్ కలెక్టివ్‌లో ప్రచురించిన రిపోర్టును సోనియా గాంధీ ప్రస్తావిస్తూ.. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే ఫేస్‌బుక్ ఎన్నికల ప్రకటనల కోసం బీజేపీకి మాత్రమే తక్కువ ధరలో డీల్ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగంలోని ఎన్నికల వ్యవస్థలో సోషల్ మీడియా జోక్యాన్ని క్రమంగా తగ్గించాలని కోరారు. సోషల్ మీడియం జోక్యాన్ని పక్షపాత రాజకీయాలకు అతీతంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ పార్టీ ఆధికారంలో ఉన్నా..బాధ్యతగా మనమంతా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment