train launch
-
‘నమో భారత్’కు ప్రధాని మోదీ పచ్చజెండా
సాహిబాబాద్: దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు(ర్యాపిడ్ రైలు సర్వీసు)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్)లో 17 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. ఈ 17 కిలోమీటర్ల కారిడార్‌తోపాటు ఇదే మార్గంలో ‘నమో భారత్’ రైలును మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ నుంచి దుహాయి డిపో వరకు ఆయన నమో భారత్ రైలులో ప్రయాణించారు. రైలులో పాఠశాల విద్యార్థులు, రైల్వే సిబ్బందితో మాట్లాడారు. ఢిల్లీ–ఘజియాబాద్–మీరట్ ఆర్ఆర్టీఎస్ మొత్తం పొడవు 82.15 కిలోమీటర్లు. మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని, దాన్ని తానే ప్రారంభిస్తానని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తోపాటు హరియాణా, రాజస్తాన్‌లో నగరాలు, పట్టణాలను అనుసంధానించేలా మరికొన్ని నమో భారత్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్, బెంగళూరు మెట్రో రైలును కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. -
2025 నాటికి 25 నగరాల్లో మెట్రో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్‌లెస్ ట్రైన్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో అన్ని ప్రజా రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించే ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’నూ ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండగా, ప్రస్తుతం ఆ సేవలు 18 నగరాలకు విస్తరించాయన్నారు. ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటే పట్టణాలో ‘మెట్రోలైట్’ విధానంలో తక్కువ ఖర్చుతో మెట్రో సేవలందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జల మార్గాలకు అవకాశమున్న నగరాల్లో ‘వాటర్ మెట్రో’ విధానం ఒక వినూత్న ఆలోచన అవుతుందన్నారు. ప్రస్తుతం మెజెంటా లైన్(జానక్‌పురి వెస్ట్ – బొటానికల్ గార్డెన్)లో ఈ ట్రైన్లు నడుస్తాయని, మరో ఆరు నెలల్లో పింక్ లైన్(మజ్లిస్ పార్క్ – శివ్ విహార్)లో ప్రారంభిస్తామని వెల్లడించింది. 21వ శతాబ్దపు భారత దేశ వైభవాన్ని ఢిల్లీ ప్రతిబింబించాలని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని పాత పర్యాటక నిర్మాణాలను ఆధునీకరించడంతో పాటు, నగరానికి 21వ శతాబ్దపు హంగులను అద్దనున్నామన్నారు. సాగు ఉత్పత్తుల కోసం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో సోమవారం 100వ కిసాన్ రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్లోని షాలిమార్ వరకు ఈ కిసాన్ రైలు నడవనుంది. చిన్న, మధ్య తరహా రైతులు తమ ఉత్పత్తులను సూదూరంలో ఉన్న మార్కెట్లలో అమ్ముకునేందుకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న ఈ కిసాన్ రైళ్లు ఉపయోగపడ్తాయని ప్రధాని వివరించారు. ఈ రైళ్లకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్లకు దగ్గరలో రైల్ కార్గో సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. -
పట్టాలపైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూపొందించడం వెనుక డిజైనర్లు, ఇంజనీర్ల కృషిని అభినందిస్తున్నానని ప్రధాని మోదీ ప్రశంసించారు. నాలుగున్నరేళ్ల తమ పాలనలో రైల్వేలను మెరుగుపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. ఈ అత్యాదునిక రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో కేవలం 18 నెలల్లో తయారు చేయడం దేశానికి గర్వకారణమన్నారు. ట్రైన్‌ను ప్రారంభించిన అనంతరం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇతర అధికారులతో కలిసి కలియతిరుగుతూ రైలును పరిశీలించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైన్ 18కు ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరును నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈనెల 17 నుంచి ఢిల్లీ-వారణాసి మధ్య వారానికి ఐదు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లతో పాటు 16 ఏసీ కోచ్‌లుంటాయి. ఈ రైలులో ఒకేసారి 1128 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు. అన్ని కోచ్‌ల్లో ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ వంటి అత్యాధునిక సదుపాయాలను అందుబాటులో ఉంచారు. తాజా వంటకాలను ప్రయాణీకులకు అందించేందుకు ప్రతి కోచ్‌లో పాంట్రీని ఏర్పాటు చేశారు. -
విశాఖ-పారాదీప్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
విశాఖపట్నం: విశాఖపట్నం-పారాదీప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపైకి ఎక్కింది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ రైలును ప్రారంభించగా, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఎంపీ హరిబాబు జెండా ఊపారు.