Indian armed forces
-
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
రూ. 2.23 లక్షల కోట్లతో ‘రక్షణ’ కొనుగోలు ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: రూ.2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(డీఏసీ) గురువారం ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలిక్టాపర్లను త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. దీనివల్ల భారత సైనిక దళాలు మరింత శక్తివంతంగా మారుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్–పాకిస్తాన్, భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సమకూర్చుకోవాలని రక్షణ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. రూ.2.23 లక్షల కోట్లతో కొనుగోలు చేస్తే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో 98 శాతం స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ పేర్కొంది. -
ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న సెలెబ్రెటీస్
-
సైన్యం చేతికి సరికొత్త మిసైల్.. చైనా తోకజాడిస్తే ‘ప్రళయ’మే..!
న్యూఢిల్లీ: సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్ గర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని భూభాగాన్ని చైనా అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. భారత సైనిక దళాల అమ్ముల పొదిలో అత్యాధునికి మిసైల్ చేరనుంది. ‘ప్రళయ్’గా పిలిచే ఈ బాలిస్టిక్ మిసైల్ 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బాలిస్టిక్ మిసైల్‌ను సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది భారత రక్షణ దళం. ఈ వారంతాంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో అందుకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖలో రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని చర్చల కొనసాగుతున్న క్రమంలోనే ఈ క్షిపణిని తీసుకురావలన్న ప్రతిపాదన రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఓ సమావేశంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో శత్రువులను ధీటుగా ఎదుర్కొనేందుకు రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కృషి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రళయ్ ప్రత్యేకతలు.. ► మిసైల్ ప్రళయ్‌ను గత ఏడాది డిసెంబర్లో వరుసగా రెండు రోజుల్లో విజయవంతంగా పరీక్షించారు. ► విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన ఈ క్షిపణిని సైన్యంలో చేర్చుకోవాలని బలగాలు భావిస్తున్నాయి. ► ఈ మిసైల్ 150- 500 కిలోమీటర్ల దూరంలోని సూదూర లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ► ప్రళయ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారు సహా ఇతర కొత్త సాంకేతికలతో పని చేస్తుంది. ► ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే పాక్షిక-బాలిస్టిక్ మిసైల్. ► శుత్రువుల మిసైల్స్‌ను కూల్చేందుకు సైతం దీనిని ఉపయోగించేలా రూపొందించారు. ► గాల్లో కొంత దూరం వెళ్లాక దాని మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం సైతం ఈ మిసైల్‌కు ఉంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు.. -
యోధులారా.. వందనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు త్రివిధ దళాలు ఆదివారం ఘనమైన రీతిలో సంఘీభావం ప్రకటించాయి. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు ప్రధాన నగరాల్లో ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నాయి. అలాగే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. కరోనా భయం వదిలి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్న స్ఫూర్తిని చాటాయి. ఆసుపత్రుల వద్ద సైనికులు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, గువాహటి, పట్నా, లక్నో, శ్రీనగర్, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూరు, తిరువనంతపురం తదితర నగరాల్లో యుద్ధ విమానాల ఫ్లై పాస్టు ప్రజలను అబ్బురపరిచింది. వైమానిక దళం, నావికా దళానికి చెందిన హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూల జల్లు కురిపించాయి. కరోనా యోధులకు మద్దతుగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనల పట్ల హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వందనాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న యోధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైరస్ వ్యాప్తిని అంతం చేసే దిశగా ధైర్యంగా ముందుకు సాగుతున్న యోధులకు వందనాలు. మన సైనిక దళాలు వారికి గొప్పగా కృతజ్ఞతలు తెలిపాయి’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై పూలు చల్లుతున్న హెలికాప్టర్లు, సైనిక బ్యాండ్ ప్రదర్శన వీడియోను పోస్టు చేశారు. ఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక స్థూపంపై పూల వర్షం కురిపిస్తున్న భారత వైమానిక దళం హెలికాప్టర్ -
గత15 రోజుల్లో 10 మంది పాకిస్తాన్ కమాండోలు హతం
జమ్మూకశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తర్వాత పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. ఏదో ఒక చోట కవ్వింపులకు పాల్పడుతూ భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 10 మంది పాకిస్తాన్ ఆర్మీ కమాండోలను హతమార్చింది. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం సహకారంతో భారత్‌కి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆగస్టు 5 నుండి నేటి వరకు పదిమంది పాకిస్తాన్ కమాండోలను హతం చేసినట్టు భారత భద్రతా దళాలు వెల్లడించాయి. గత మూడు వారాలుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చోరబడటానికి ప్రయత్నిస్తోందని, పాకిస్తాన్ ఉగ్రవాదులను వెనక్కి పంపే ప్రయత్నంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పులలో పది మందికి పైగా ఎస్ఎస్జీ కమాండోలు మరణించినట్లు భద్రతా దళ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘటనను పాకిస్తాన్ ఆర్మీ అంతర్జాతీయం చేయాలని చుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే గత 15 రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ వందమందికి పైగా కమాండోలను నియంత్రణ రేఖ వద్ద కాపలా ఉంచి భారత దళాలపై బ్యాట్ చర్యకు ప్రతిపాదించినట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి నియంత్రరేఖ వద్ద భారత ఆర్మీ దళాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి. -
‘నినాదాలు చేయడం కాదు.. సైన్యంలో చేరి పోరాడండి’
ముంబై: ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఎంఐ-17 విమానం కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత వాయుసేన అధికారి నినాద్ ముందావ్‌గనే కూడా మృతిచెందారు. శుక్రవారం రోజున ఆయన మృతదేహానికి ప్రభుత్వ లాంఛానలతో నాసిక్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నినాద్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో భారత్ మాతా కీ జై, వందేమాతరమ్, వీర జవాన్ అమర్ హై అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలపై నినాద్ భార్య విజేత ముందావ్‌గనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేసేవారికి కూడా ఆమె ఓ సూచన చేశారు. సోషల్ మీడియాలో జై భారత్, వందేమాతరమ్ వంటి నినాదాలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. దేశభక్తి ఉండి.. దేశం ప్రజల కోసం ఎదైనా చేయాలని భావిస్తే త్రివిధ దళాలలో చేరాలని.. లేకపోతే మీ కుటుంబంలో ఎవరినో ఒకరినైనా చేర్చాలని అన్నారు. అది కూడా కుదరని పక్షంలో సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలని.. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆమె సందేశం విస్తృతంగా ప్రచారంలో ఉంది. -
లేడీ కమాండో
‘‘మొదటి’’ ప్లేస్‌లో చాలామంది ఉంటారు!ఏకైక అనేది అతికొద్దిమందికే దక్కుతుంది!ఇది అరుదైన అవకాశం.. ప్రత్యేకమైన స్థానం!ఇది దక్కించుకున్న మహిళ డాక్టర్ సీమారావు..ఆ అర్హత ఆమెకు ఆషామాషీగా రాలేదు.వీరగాథలు విన్నది.. వీరోచిత పోరాటాలు చేసింది..సైన్యానికి యుద్ధ విద్యలను నేర్పుతోంది!ఫస్ట్ అండ్ ఓన్లీ ఫీమేల్ కమాండో ట్రైనర్‌గా భారత సాయుధ దళాలు ఆమెకు సెల్యూట్ చేస్తున్నాయి!! ‘‘నాన్న పోయారు’’ ఇంటి నుంచి ఫోన్. ఆ ఫోన్‌కాల్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాక మనసులో పొగిలి పొగిలి ఏడ్వడం తప్ప ఆమె ఉన్న పళంగా బయలుదేరి తండ్రి చివరి చూపుకు నోచుకోలేదు. కారణం.. అప్పుడామె తన సొంతూరుకి వందల కిలోమీటర్ల దూరంలో.. కాలి నడకే దుస్సహాసమైన పర్వతసానువుల్లో ఉంది. ‘‘అమ్... మా...’’ నరాలు తెగిపోతున్న బాధను పంటి వరకు పరిమితం చేసి గొంతు నొక్కేసి పెదువులు బిగించేసింది. ‘‘ఓర్చుకో...’’ఫస్ట్ ఎయిడ్ చేస్తూ చెప్పాడు భర్త. ‘‘ఉమ్...’’ కేకగా బయటకు రాని నొప్పి నీళ్లుగా కళ్లలోంచి జారుతుండగా కళ్లను గట్టిగా మూసుకుంటూ అంది. ‘‘ఇవన్నీ నీకు కొత్తకాదు కదా..’’ భార్య భుజం తడుతూ అన్నాడు. ఆ సున్నితమైన ఆత్మీయ స్పర్శను కూడా భరించే స్థితిలో లేదామే. అర్థమైనవాడల్లే వెంటనే భుజమ్మీద నుంచి చేయి తీసేసాడు భర్త. ‘‘దీపక్.. మనకు పిల్లలు వద్దు’’ అన్నది. భర్తలో ఆశ్చర్యం, ఆవేశం ఏమీ లేదు. ఎందుకు అన్న ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే అతనికి తెలుసు అది ఆమె స్థిర నిర్ణయం అని. ‘‘అమ్మాయి పుట్టిందని చెత్తకుప్పలో పడేసిన తండ్రి’’... ‘‘గర్భంలో ఉన్నది ఆడపిల్ల తెలిసి అబార్షన్ చేయించుకొమ్మని అత్తింటివారి బలవంతం’’... ‘‘పుట్టిన అమ్మాయిని పురిట్లోనే చంపేసిన కాసాయి తండ్రి’’.. వార్తాపత్రికల్లో ఒకే రోజు వచ్చిన ఆ వార్తలకు చలించిపోయింది ఆమె. ‘‘మనం ఓ ఆడపిల్లను దత్తత తీసుకుందాం’’ చెప్పింది భర్తతో. ఈసారి మారుమాట లేకుండా ఆనందంగా ఒప్పుకున్నాడు భర్త. ఆమే సీమా రావు. భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా కమెండో శిక్షకురాలు. పైన చెప్పిన సంఘటనలన్నీ సీమా ఎంచుకున్న రంగం వల్ల ఆమెకు ఎదురైన అనుభవాలు, కోల్పోయిన అవకాశాలు! అయినా కర్తవ్యమే మిన్న అంటారు సీమా. తల్లి కావాలని ఏ స్త్రీ కలకనదు? ఆశ పడదు? కాని కమెండో ట్రైనర్‌గా తన శరీర కష్టం ఎలాంటిదో తెలుసు.. ఎన్నో సార్లు ఆమె మీద దాడులు జరిగాయి. ఆమే ఎదురు దాడి చేసింది. వెన్నుముక విరిగింది. తలకూ తీవ్రగాయలై కొన్ని నెలలపాటు జ్ఞాపకశక్తిని కోల్పోయి తనను తానే మరిచిపోయింది. ఇవన్నీ అనుభవించాకే నిశ్చయించుకుంది అమ్మతనం వద్దని. చేస్తున్న పనిపట్ల అంత నిబద్ధత.. అంకిత భావం. వారసత్వంలోనే ఉంది.. సీమ తత్వంలో ఉన్న పోరాటపటిమ ఆమెకు వారసత్వంగా వచ్చిందే. ఆమె తండ్రి ప్రొఫెసర్ రమాకాంత్ సినరి స్వాతంత్య్ర సమరయోధుడు. పోర్చుగీస్ ఆక్రమణలో ఉన్న గోవా విముక్తి కోసం పోరాడిన వీరుడు. సీమా చిన్నప్పుడు ఆ వీరోచిత పోరాట సంఘటనలనే కథలుగా చెప్పేవాడు కూతురికి. తర్వాత ఆమె ఎంచుకున్న కెరీర్‌కు అవే స్ఫూర్తి. దేశం కోసం ఏదైనా చేయాలి... సైనికురాలిగా దేశాన్ని కాపాడాలి అనే తపనతోనే పెరిగారు సీమ. చానెల్.. సీమ శక్తికి, యుక్తికి సరైన చానల్ ఆమె పదహారవ యేట దొరికింది. దీపక్ రావు పరిచయం అయ్యాడు. అప్పటికే ఆయన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా ఉన్నాడు. ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు ఆమె. అలా దీపక్‌రావుతో పరిచయం, ఆయన దగ్గర శిక్షణ... ఇద్దరూ కలిసి జీవితంలోనూ ప్రయాణించే పరిణయంగా మారింది. పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మిలిటరీ మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. ఓవైపు మెడిసిన్ చదువుతూనే ఇంకో వైపు షూటింగ్, వెపన్ డిఫెన్స్‌లలో ట్రైనింగ్ తీసుకోసాగారు. డాక్టర్ అయ్యాక సీమా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఏంబీఏ కూడా చేశారు. అయినా ఏదో అసంతృప్తి. చిన్నప్పటి నుంచి తను కలగన్నది వేరు. లక్ష్యం వేరు. అది సాధించాలి. దేశానికి సేవ చేసే అవకాశం పొందాలి అని ఆలోచించి చివరకు దేశ సాయుధ దళ సైనికులకు శిక్షణనివ్వాలని నిర్ణయించుకున్నారు. వెంటనే 1996లో ఆర్మీ, నావీ, బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ ప్రధాన సైనికాధికారులను కలిశారు. తమ ఆశయం గురించి వివరించారు. సీమా దంపతుల అంకితభావం, నిబద్ధత చూసి సైనికాధికారులు చలించారు. అవకాశమిచ్చారు. అంతే మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు సీమా. ఎన్ని అవరోధాలు ఎదరైనా. 22 ఏళ్లుగా పైసా ప్రతిఫలం ఆశించకుండా ఫుల్‌టైమ్ ట్రైనర్‌గా ఉన్నారు ఆమే, ఆమె భర్త మేజర్ దీపక్‌రావు కూడా. ప్రత్యక్ష యుద్ధంలో ప్రతిపక్ష సైనికులను ఎదుర్కొనే విద్యనూ నేర్పిస్తున్నారు. కమెండోలకు ట్రైనింగ్.. సైనికబలగాల్లోని ఎన్ఎస్జీ బ్లాక్ క్యాట్స్, పారా కమాండోస్, మార్కోస్, గరుడ్, బీఎస్ఎఫ్ కమాండోస్‌కు ట్రైనింగ్ ఇస్తున్నారు సీమా. అయితే మొదట్లో.. ఒక మహిళ దగ్గర మేము శిక్షణ పొందడమేంటీ అన్నట్లుగా తిరస్కార ధోరణితో ఉండేవాళ్లట జవాన్లంతా. అయినా స్థయిర్యం కోల్పోకుండా అదే క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగారు సీమా. చివరకు ఆమెను అనుసరించక తప్పలేదు జవాన్లకు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ రంగంలో అడుగడుగునా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటునే ఉన్నారు. ఇప్పటికీ ప్రతీ కొత్త బ్యాచ్‌లోని జవాన్లు మహిళ అయిన సీమా దగ్గర శిక్షణ పొందడానికి మొదట్లో ఇబ్బంది పడ్తూనే ఉన్నారు. లెక్క చేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు సీమా. ఆమె ఇచ్చే శిక్షణలోని మెళకువలు, నైపుణ్యం చూసి ఆ సేవలను నేషనల్ పోలీస్ అకాడమీ, ది ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అందుకుంటోంది. 2009లో గరుడ కమాండోస్‌కు శిక్షణ తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పారా జంప్ కోర్స్ శిక్షణ ఇవ్వడం కోసం ఆమెను ఆహ్వానించారు. ఇదీ ఆమె అందుకున్న అరుదైన గౌరవం, అరుదైన విజయం కూడా! పదిమందిలో ఒకరు.. షూటింగ్.. ఆమె బలం. మార్షల్ ఆర్ట్స్ ఆమె స్టయిల్. బ్రూస్లీ కనిపెట్టిన జీట్ కూన్ డోలో ఎక్స్పర్ట్. ఈ విద్యలో ప్రపంచ వ్యాప్తంగా కేవలం పది మంది మహిళలు మాత్రమే నిష్ణాతులు. అందులో సీమారావు ఒకరు. 20 ఏళ్లకు పైగా భారత సైస్యంలో తాను అందిస్తున్న సేవలకుగాను 2011లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ ర్యాంక్ అవార్డ్‌ను పొందారు. తన భర్తతో కలిసి నాలుగు సార్లు ఆర్మీ చీఫ్ సైటేషన్స్ అందుకున్నారు. ఇది రికార్డ్. సీమా దంపతులు అనార్మ్డ్ కమాండో కంబాట్ అకాడమీ (యూసీసీఏ), యాన్ ఎలీట్ మిలిటరీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించారు. ఈ అకాడమీలో జీట్ కూన్ డో తోపాటు ఇతర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తారు. ౖౖౖౖట్రైనింగ్ మీద సైనికుల కోసం పుస్తకాలు రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు. మామూలు పౌరుల కోసమూ అనార్మ్డ్ కాంబాట్ బ్లాక్‌బెల్ట్ ప్రోగామ్‌ను నిర్వహిస్తున్నారు. డేర్.. మహిళల రక్షణకోసమూ నడుం బిగించారు సీమా. వేధింపులు, లైంగిక దాడులను స్త్రీలు ఎదుర్కొనేలా ఈఅఖఉ (డిఫెన్స్ ఎగైన్స్ట్ రేప్ అండ్ ఈవ్ టీజింగ్) అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. మానసికంగా, శారిరకంగా మహిళలను దృఢంగా తయారు చేయడమే ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. అంతేకాదు దేశంలోనే మొదటి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మీద ‘ఏ్చ్టజ్చిp్చyజీ’ అనే సినిమా నిర్మించి అందులో సీమా నటించారు కూడా. ఈ సినిమాలో తొలిసారిగా జీట్ కూన్ డోను చూపించారు. ఈ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే జ్యూరీ ప్రత్యేక ప్రశంసలను పొందింది. ఆమె ఓ శక్తి.. ఇప్పటి వరకు దాదాపు పదిహేను వేల మంది సైనికులకు శిక్షణనిచ్చిన సీమారావు 47 దేశవిదేశాల సన్మానపురస్కారాలతోపాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ పీస్ అవార్డ్, ప్రెసిడెంట్స్ వలంటీర్ సర్వీస్ అవార్డ్లనూ అందుకున్నారు. ‘‘భారత సైనికులకు శిక్షణనివ్వడంలో ఉన్న ఆత్మసంతృప్తే నాకు అన్నిటికన్నా గొప్ప అవార్డ్’’ అంటారు సీమారావు వినమ్రంగా. సామాన్యులూ అసాధారణ పనులు చెయ్యొచ్చు అని నిరూపించిన ఈ స్త్రీ శక్తికి సలాం! -
విలువలకు కంచె ఉండదు
‘‘యుద్ధంలో నీకు అత్యంత విలువైనది ఏది?’ అని అడిగినప్పుడు ఏ దేశ సైనికుడైనా ‘రైఫిల్’ అనే చెబుతాడు. అతడికి రైఫిల్ విలువైనదే కావచ్చు. కానీ దేశ పౌరులకు అతడి ప్రాణం విలువైనది. అందుకే దేశానికీ, దేశాధినేతలకూ ఇచ్చినంత గౌరవాన్ని మనం సైనికుడికీ ఇవ్వాలి. శత్రు దేశ సైనికుడు అయినా సరే అతడికుండే గౌరవం అతడికి ఉంటుంది. ఆ గౌరవాన్ని ఇరు దేశాల సైనికులు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇక్కడ ‘గౌరవం’ అంటే అవతలి సైనికుడు బందీగా దొరికినప్పుడు యుద్ధనీతిని మరిచి ప్రవర్తించకుండా ఉండటం.’’ రెండో ప్రపంచ యుద్ధ కాలపు బ్రిటన్ సేనాని మాంట్ గొమరీ అన్న మాటలివి. ‘పీపుల్స్ జనరల్’ అని ఆయనకు పేరు. ఆదేశాలతో కాకుండా, సైనికుల మీద నమ్మకంతో ఆయన తన సైన్యాన్ని నడిపించాడు. లొంగిపోయిన శత్రుదేశ సైనిక అధికారిని విందుకు ఆహ్వానించి వీర సైనికుల మంచీ చెడుల గురించి మాట్లాడిన యుద్ధ ‘దళపతి’ చరిత్రలో బహుశా ఆయన ఒక్కరేనేమో! దేశాల మధ్య కంచె ఉంటుంది. దేశాల సైనికుల మధ్య దేశభక్తి అనే కంచె ఉంటుంది. కానీ మనిషిగా మనం పాటించవలసిన విలువలకు కంచె ఉండదు. జవహర్లాల్ నెహ్రూలో మాంట్ గొమరీ పోలికలు కొన్ని కనిపిస్తాయి. భారత ప్రధానిగా నెహ్రూ 1954 నవంబరు చివరివారంలో ఇండో–చైనా సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి మన సైనికులలోని స్నేహశీలతను, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలతో వారు కలిసిపోయిన తీరును చూసి నెహ్రూ అబ్బురపడ్డారు. ప్రతికూల పరిస్థితులలో సైతం వివేకం కోల్పోకుండా, నిగ్రహంతో మనవాళ్లు తమ విధులలో నిమగ్నమై ఉండటం ఆయనకు నచ్చింది. పైగా ఇటువాళ్లు గానీ, అటువాళ్లు గానీ కయ్యానికి కాలు దువ్వుతుండే వాతావరణానికి భిన్నంగా.. ఎవరి దేశానికి వారు కాపలా కాస్తూనే, ఎవరి పరిధితో వారు ఉండి రెండో వారితో కలుపుగోలుగా ఉండటం.. ప్రపంచవ్యాప్త సైనికులపై నెహ్రూకు గౌరవభావం కలిగేలా చేసింది. ఇదే విషయాన్ని బోర్డర్ నుంచి తిరిగి వచ్చాక డిసెంబర్ 7న నెహ్రూజీ బహిరంగంగా ప్రకటించారు! సైనికుడు దేశాన్ని కాపాడితే, సైనికుడి కుటుంబాలను దేశ పౌరులు కాపాడాలి అని పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపును ప్రతి తరం అందుకోవాలి. ఎదురు పడిన సైనికుడికి వందనం చేసి ఊరుకోకండి. నేను మీకెలాగైనా సహాయపడగలనా? అని అడగండి. (నేడు భారత సైనిక దళాల పతాక దినోత్సవం. ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే). -
ప్రధాని మోదీకి రాహుల్ స్ట్రాంగ్ లెటర్!
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌వోపీ) విధానాన్ని అర్థవంతంగా అమలుచేయాలని, సైనికులు తమ పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతూ రాహుల్ లేఖ రాశారు. దేశ సైనిక దళాల నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీసేవిధంగా గత కొన్నిరోజులుగా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని రాహుల్ ఈ లేఖలో మండిపడ్డారు. ప్రతిరోజూ దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ‘భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన కొద్దిరోజులకే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ విధానాన్ని కొత్తగా స్లాబ్ విధానంగా మార్చారు. దీనివల్ల వీర సైనికులు గాయపడితే వారికి ఘననీయంగా పెన్షన్ తగ్గిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏడో వేతన సవరణ సంఘం కూడా సైనికులకు నిరాశే మిగిల్చింది. పౌర ఉద్యోగులతో పోలిస్తే సైనిక ఉద్యోగులకు వేతనం విషయంలో ఎంతో వివక్ష, వ్యత్యాసం కనిపిస్తోంది’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. సైనికులకు పరిహారం, పెన్షన్ల విషయంలో కేంద్రం సక్రమమైన విధానాన్ని అవలంబించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మహీంద్రా హెలికాప్టర్లు వస్తాయ్..
- ఎయిర్‌బస్‌తో జాయింట్‌వెంచర్ న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాలకు అవసరమయ్యే హెలికాప్టర్ల తయారీ కోసం మహీంద్రా గ్రూప్, యూరోపియన్ దిగ్గజం ఎయిర్‌బస్ చేతులు కలిపాయి. ఎయిర్‌బస్ హెలికాప్టర్స్, మహీంద్రా డిఫెన్స్ కంపెనీలు కలిసి జాయింట్ వెంచర్ సంస్థను నెలకొల్పనున్నాయి. మేకిన్ ఇండియా నినాదం కింద తొలి భారతీయ ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ సంస్థ స్వరూపాన్ని ఖరారు చేసేందుకు త్వరలో చర్చలు జరపనున్నట్లు ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ వెంచర్‌తో వందల కొద్దీ హై-టెక్ ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుందని, అత్యుత్తమ సాంకేతికతను భారత్‌లోకి తీసుకురావడం సాధ్యపడుతుందని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రెసిడెంట్ గిలామ్ ఫౌరీ పేర్కొన్నారు. దేశ రక్షణ అవసరాలను తీర్చడంతో పాటు ఈ హెలికాప్టర్లను ఎగుమతి కూడా చేసే అవకాశాలున్నాయని మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి ఎస్పీ శుక్లా చెప్పారు.