Sadhna Saxena: ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా తొలి మహిళ | Lt Gen Sadhna Saxena Nair becomes first woman DG Medical Services | Sakshi
Sakshi News home page

Sadhna Saxena: ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా తొలి మహిళ

Aug 17 2024 4:38 AM | Updated on Aug 17 2024 4:38 AM

Lt Gen Sadhna Saxena Nair becomes first woman DG Medical Services

భారత సాయుధ దళాల జనరల్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా  లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనా సక్సేనా నాయర్‌ నియమితులయ్యారు. మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌కి ప్రిన్సిపల్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. 

    సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది.

 1985లో ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్‌ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్‌ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్‌ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందింది. 

లెఫ్టినెంట్‌ జనరల్‌ నాయర్‌ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఇపి) 2019లోని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కాంపోనెంట్‌లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్‌ చేయబడింది. మెరిటోరియస్‌ సర్వీస్‌ కోసం వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్, ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌–ఇన్‌–చీఫ్‌ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement