Sadhana
-
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
అన్ని ప్రాంతాలపై సీఎం జగన్ సమదృష్టి
అనంతపురం కల్చరల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని ప్రాంతాల పట్ల సమాన భావన ఉందని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రముఖ కథా రచయిత డాక్టర్ శాంతి నారాయణ రచించిన ‘సాధన’ నవలావిష్కరణ సభ ఆదివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ రాయలసీమ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలకు నెలవన్నారు. కానీ సినీ పరిశ్రమలోని కొందర స్వార్థపరులు సీమ సంస్కృతిని కించపరిచేలా ఫ్యాక్షన్ ముద్ర వేసి చూపించడం తనకు వేదన కల్గిస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తనతోపాటు కొంతమంది కలసి వెనుకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితుల గురించి వివరించిన వెంటనే తాండవ రిజర్వాయర్, ఏలూరు కాలువ ఎత్తిపోతల పథకానికి రూ.470 కోట్లతో అనుమతులివ్వడం సంతోషదాయకమన్నారు. అంతకుముందు నారాయణమూర్తిని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ రాగే హరిత, వైఎస్సార్సీపీ నాయకులు చామలూరు రాజగోపాల్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్ శాంతినారాయణ ఘనంగా సత్కరించారు. ఈ సభకు ఉప్పరపాటి వెంకటేశు అధ్యక్షత వహించగా, రాయలసీమ ఉద్యమ నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, మాలపాటి అశోకవర్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ -
‘ట్రీ వాక్’ చేద్దాం.. మర్రిచెట్లను కాపాడుదాం!
ఊడలుగా విస్తరిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వందల ఏళ్లు జీవిస్తుంది ఎన్నో జీవ రాశులకు ఆశ్రయమిస్తుంది అందుకే, భగవద్గీతలో పరమాత్మ చెట్లలో నేను మర్రిచెట్టును అన్నాడు. మనిషి ఎదుగుదలలో మర్రిచెట్టును శిఖరమంతగా పోల్చవచ్చు. అలాంటి మర్రిచెట్టుకు రక్షణ కరువైతే ...!! రోడ్లు అనో, డబ్బు వస్తుందనో... మనిషి తన స్వార్థం కోసం మర్రిచెట్లను తొలగించుకుంటూ పోతే... మన మనుగడ మాత్రమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయానికి గొడ్డలిపెట్టు కాదా?! చెట్లను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఈ నినాదంతో మర్రిచెట్లను కాపాడుదాం.. అని బయల్దేరారు. హైదరాబాద్‌వాసులు ఆసియా ఖాన్, కోబితా దాస్ కొల్లి, సాధన రాంచందర్. వీరి ఆలోచనకు మద్దతునిస్తూ మరికొందరు జత కలిశారు. ఒక చెట్టు ఊడలు ఊడలుగా విస్తరిస్తుందంటే ఆ చెట్టు మనకేదో సందేశం ఇస్తుందని అర్థం. కానీ, ఈ రోజుల్లో ఇది అనర్థం వైపుగా కదులుతోంది. దీనికి అడ్డుకట్టవేయడానికే మేం బయల్దేరాం అన్నారు అసియా, సాధన, కోబితా దాస్. కదిలించిన వార్త ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరంతా కొన్నాళ్లుగా ‘ట్రీ వాక్’ పేరుతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి, వందలనాటి చెట్లను గమనించి, వాటి గురించి తెలుసుకుని వచ్చేవారు. స్కూల్ పిల్లలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. ‘కొన్నాళ్లుగా చెట్లను స్టడీ చేయడంలో ఉండే మా ఆసక్తి ఒక రోజు వచ్చిన వార్త కదిలించింది. 2019లో రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో ఉన్న 9 వేల చెట్లను కట్ చేయడం లేదా వేరే చోటకు తరలించబోతున్నారు..’ అనేది ఆ వార్త సారాంశం. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. చేవెళ్ల రోడ్డులో ఉన్న ఆ చెట్ల సౌందర్యం చూడటానికి మాటలు చాలవు. అంతటి అనుభూతిని ఎలా దూరం చేస్తారు..? మాలో ఎన్నో అలజడులు. మాతో కలిసిన మరికొంత మందితో ఈ విషయాన్ని చర్చించాం. వారూ మా ఆలోచనకు మద్దతునిచ్చారు. వారం వారం ఆ చెట్లకిందనే జనాలను పోగుచేసి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వెయ్యి మర్రి చెట్లను రక్షించడానికి ఒక ఆన్లైన్ పిటిషన్ పెట్టాం. 63 వేల మంది ఈ పిటిషన్ మీద సంతకాలు చేసి, మద్దతు ఇచ్చారు. నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర ప్రభుత్వ అధికారులనే కలిసి మర్రిచెట్ల సంరక్షణ గురించి వివరించాం. ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం’ అని వివరించారు ఈ పర్యావరణ ప్రేమికులు. తరలింపు సరైనదేనా?! రోడ్డు వెడల్పు కోసం ఇక్కడి మర్రిచెట్లను మరో చోటకు తరలించాలనుకుంటే.. వాటిని యధాతధంగా చేయలేరు. వాటి కొమ్మలను నరికేస్తారు. కేవలం మధ్యలో ఉన్న భాగాన్నే తీసుకెళ్లి నాటుతారు. వందల ఏళ్లుగా పాతుకుపోయిన వేళ్లు లేకపోతే, ఆ చెట్టు ఎలా బతుకుతుంది. మోడుపోయినట్టుగా ఉన్న చెట్టు చిగురించినా ఎన్నాళ్లు బతుకుతుంది? అందుకే నేషనల్ (ఎన్హెచ్ఎ) వాళ్లను కలిశాం. కాపాడమని లెటర్లు ఇచ్చాం. తర్వాత ఈ చెట్లను కట్ చేయడం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయరు అని అదే ఏడాది వార్త వచ్చింది. సంతోషమేసింది. అయితే, అంతటితో వదిలేయలేదు. రెగ్యులర్‌గా వెళ్లి చెట్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. మళ్లీ కిందటేడాది రోడ్డు వెడల్పుకు చెట్లను కొట్టేస్తారన్నారు. దీంతో అవగాహన కార్యక్రమాలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులను కలిసి, ప్రపంచంలో మరెక్కడా లేని ఈ మర్రి చెట్ల మార్గాన్ని తొలగించవద్దని అర్జీలు పెడుతున్నాం. అవగాహన అవసరం చెట్టుకు ఇవ్వాల్సిన రక్షణ గురించి తెలిస్తే, కాపాడే గుణం కూడా వస్తుంది. అందుకే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీపావళి సమయంలో చెట్లకింద దీపాలు పెట్టడం, మరోసారి చెట్లకింద నిల్చొని పద్యాలు చదవడం, ఇంకోసారి నిశ్శబ్దంగా ఉండటం, చెట్టుకు స్వాతంత్య్రం .. ఇలా రకరకాల థీమ్‌లతో చెట్ల వద్దే కాదు, నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో ప్రాచీన వృక్షాలను కాపాడటం ఎలాగో వివరిస్తున్నాం. మొత్తం పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న మర్రిచెట్టును రక్షిస్తే సకల జీవరాశిని రక్షించినట్టే. ఇటీవలే ఢిల్లీలో ఒకచోట ఇలాగే చెట్లను మరో చోట నాటే ప్రయత్నం చేస్తే, వాటిలో చాలా చెట్లు బతకలేదని తెలిసింది. ప్రభుత్వం ఈ చెట్ల మార్గాన్ని నేచురల్ హెరిటేజ్‌గా మార్చాలన్నది మా ప్రయత్నం. కొన్నిసార్లు నెమ్మది అవసరమే! ‘జీవితంలో అన్ని చోట్లా వేగం సరికాదు. కొంత నెమ్మది కూడా మంచిది. వేగంగా వెళ్లాలనుకునేవారు ఇతర హైవేల నుంచి వెళ్లచ్చు. ఈ ఒక్క రోడ్డును మాత్రం వదిలేయమని మేం కోరుతున్నాం’ అంటారు ఆసియా ఖాన్. ‘మాతోపాటు మా బృందంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. మాకు సపోర్ట్ చేసే మగవారు కూడా మా బృందంలో చేరారు. స్వచ్ఛందంగా చేసే ఈ నేచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మర్రిచెట్లను కాపాడటం కోసం చేసే అవగాహన సదస్సులలో పాల్గొనేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. (క్లిక్: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!) ఈ యేడాది జూన్‌లో 914 మర్రి చెట్లకు జియో ట్యాగ్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి వాలెంటీర్ల చాలా రోజులపాటు పనిచేశారు. చెట్టు ఏ దిశలో, ఎలా ఉంది..అనే వివరాలతో ఫొటోలతో సహా ప్రతి మర్రి చెట్టు డేటా ఏర్పాటు చేశాం. దీనిని ఆన్లైన్లో కూడా పెట్టాం. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వందల ఏళ్ల నాటి చెట్లు ఉంటే, వాటి గురించి సమాచారం సేకరించి, వాటిని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని వివరించారు ఈ పర్యావరణప్రేమికులు. అనవసర ఆలోచనలు, అవసరాల నుంచి దూరమై, చెట్టును కాపాడుదాం. – నిర్మలారెడ్డి -
ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. సాధన మరణ వార్తపై స్పందించిన ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. యులాయం సింగ్, అతని కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్వీటర్లో.. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం భార్య సాధన మరణించిన చేదు వార్త తెలిసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు’ ట్వీట్ చేశారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విటర్లో కూడా పార్టీ వ్యవస్థాపకుడి భార్య మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. చదవండి: ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా ఎవరీ సాధన 2003లో ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య, అఖిలేష్ యాదవ్ తల్లి మాల్తీ యాదవ్ మరణించే వరకు సాధన గుప్తా గురించి చాలా మందికి తెలియదు. అప్పటికే సాధనా గుప్తాతో సంబంధం కలిగి ఉన్న ములాయం అదే సంవత్సరం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. వయసులో అతని కంటే సాధన 20 ఏళ్లు చిన్నది. ఆమెకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. ప్రతీక్ యాదవ్ ఆమె కుమారుడు కాగా.. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు. -
‘జర్నలిస్ట్ కావాలనుకున్నా’
ఎనిమిదవ తరగతిలోనే టీవీ సీరియల్స్‌కు పరిచయం అయిన సాధన బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటోంది. జీ తెలుగులో ‘ప్రేమ,’ జెమినీ టీవీలో ‘రెండు రెళ్లు ఆరు’ సీరియల్స్‌లో నటిస్తున్న సాధన చదువులోనూ రాణిస్తోంది. వర్క్ గ్యాప్‌లో చదువుకుంటూ ఇటు నటనని, అటు చదువునూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సాధన చెబుతున్న ముచ్చట్లివి. ఇండస్ట్రీతో పరిచయం? మా అమ్మ టీవీ ఆర్టిస్ట్. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మతో పాటు లొకేషన్స్‌కి వచ్చేదాన్ని. అలా ఒకరోజు టీవీ వాళ్లు నా ఆడిషన్స్ తీసుకున్నారు. అలా ఈ ఫీల్డ్కి స్కూల్ డేస్‌లోనే నేనూ పరిచయం అయ్యాను. పుట్టింది ఖమ్మం. చదువు అంతా సాగింది హైదరాబాద్‌లోనే. చిన్నప్పుడు డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. చాలా బాగా డ్యాన్స్ చేసేదాన్ని. దీంతో ఏదో ఒక రోజు ఫేమ్ వస్తుంది, మానొద్దు అని ఇంట్లో ఎంకరేజ్ చేస్తుండేవారు. అనుకోకుండా ఒక అవకాశం రావడంతో ఇలా మీ అందరి ముందుకు వచ్చే అదృష్టం దక్కింది. సీరియల్ వర్క్స్‌తో పాటు ఎంబీఏ సెకండియర్ చేస్తున్నాను. ఫీల్డ్‌లో ప్లస్‌లు మైనస్‌లు ? ఏ కెరియర్ తీసుకున్నా ప్లస్‌లూ మైనస్‌లు అంతటా ఉంటాయి. అన్నింటా మన వ్యక్తిత్వమే మెయిన్. ఇక్కడ నా వర్క్ విషయానికి వస్తే ఉదయం 6:30 గంటలకు లొకేషన్లో ఉంటాను. మళ్లీ రాత్రి 9 గంటలకు ప్యాకప్ చెప్పేంతవరకు అక్కడే ఉంటాను. నెలలో ఇరవై రెండు రోజులు ఇలాగే వర్క్ ఉంటుంది. నిద్ర ఉండదు. రోజులో నాలుగైదు గంటలు పడుకుంటాను. కానీ, ఇదే నా ప్రపంచం. ఈ వర్క్ లేకపోతే నన్ను నేను ఊహించుకోలేను. నెలల తరబడి ఒక సీరియల్‌కి వర్క్ చేస్తాం. రేటింగ్ బట్టి ఒక్కో సీరియల్ ఐదేళ్లు కూడా పడుతుంది. సీరియల్ టీమ్ అంతా కొన్ని రోజుల్లోనే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాం.. డ్రైవర్ నుంచి మేకప్ మ్యాన్, లైట్ బోయ్ వరకూ.. అంతా ఒకే కుటుంబం. చివరగా సీరియల్ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టిన రోజు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి టైమ్‌లో రెండు–మూడు సార్లు ఏడ్చేశాను కూడా. ప్రతిరోజూ లొకేషన్లో ఫన్నీ థింగ్స్ ఉంటూనే ఉంటాయి. కొన్ని చిన్న చిన్న గొడవలుంటాయి. మా రోల్స్‌ని మిగతావాళ్లు ఇమిటేట్ చేసి ఉడికిస్తుంటారు. సీనియర్స్ కూడా మమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటారు. చాలా సరదాగా గడిచిపోతుంది. రియల్ లైఫ్‌లో ప్లస్‌లు మైనస్‌లు? నా చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. మొదట అక్క పుట్టినప్పుడే ‘ఆడపిల్ల’ అని నాన్న చాలా ఫీలయ్యారంట. నేనూ ఆడపిల్లను అనేసరికి నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. అయినా అమ్మ బాధపడలేదు. మా అమ్మే నాన్న అయి మమ్మల్ని పెంచింది. అక్కను డాక్టర్ని చేసింది. నేను యాక్టర్‌ని అయ్యాను. మా భవిష్యత్తు గురించి అమ్మ పడే తపన వల్లే మేమీ రోజుకు ఇలా ఉన్నాం. మా జీవితంలో అమ్మ పెద్ద ప్లస్. అమ్మ లేకపోతే మేం లేం. ఇన్నేళ్ల కెరియర్లో బాగా నచ్చిన పాత్ర? ‘రెండు రెళ్లు ఆరు’ సీరియల్లో కృష్ణ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. కృష్ణ ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్. ఆ పాత్ర చాలా పవర్ఫుల్. డైనమిక్. ఒక అమ్మాయి ధైర్యవంతురాలిగా ఎలా ఉండాలో చూపుతుంది. అన్యాయం జరిగితే తట్టుకోదు. ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోదు. అస్సలు రాజీపడదు. నేనూ రియల్ లైఫ్‌లో జర్నలిస్ట్ అయితే బాగుంటుంది అని చాలా సార్లు అనుకునేదాన్ని. ఎన్నో స్టోరీస్ కవర్ చేయచ్చు, ప్రజలకు సాయంగా ఉండచ్చు అనిపించేది. ఆ ఇష్టం ఇప్పుడీ పాత్ర ద్వారా తీరింది. యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్న అడ్వాంటేజీ ఏంటంటే రియల్ లైఫ్‌లో ఉన్న డ్రీమ్స్‌ని ఇలా కొద్దిగాౖ నెనా సాటిస్ఫై చేసుకోవచ్చు. కన్నడ హీరోయిన్స్‌కే ఇక్కడ అవకాశాలు ఎక్కువ? నిజమే, తెలుగు వారికి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. ఇక్కడ వాళ్లలో ఏం తక్కువైందో తెలియడం లేదు. వేరేవాళ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు. లేదంటే, మనవాళ్లు కూడా చాలా మంది భయపడి ఈ ఇండస్ట్రీకి రావట్లేదేమో అనిపిస్తుంది. షూటింగ్ లేకపోతే..? ఫుల్‌గా నిద్రపోతాను. కాస్త తీరిక అనిపిస్తే వంట చేస్తాను. బాగా వండుతాను. అమ్మ, అక్క నా వంటను చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత నాకు నచ్చిన డ్యాన్స్ ఉండనే ఉంది. అక్కతో కలిసి షటిల్ ఆడటం చాలా బాగుంటుంది. అమ్మ, నేను, అక్క కూర్చుంటే కబుర్లతో సమయమే తెలియదు. – నిర్మలారెడ్డి -
కాబోయే సీఎం సతీమణి.. బెంగళూరు వనితే
సాక్షి, బెంగళూరు: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత, కాబోయే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కు కర్ణాటకతో అనుబంధం ఉంది. ఆయన సతీమణి డాక్టర్ సాధనా రావ్ కర్ణాటకకు చెందిన వారు. ప్రస్తుతం వీరి కుటుంబం సిమ్లాలో నివాసం ఉంటోంది. వివరాలు.... బెంగళూరుకు చెందిన డాక్టర్ సాధనా రావ్ జైపూర్‌లో ఎంబీబీఎస్ చదివే సందర్భంలో ఆమె ఏబీవీపీలో చురుకైన కార్యకర్త. ఇదే సందర్భంలో జమ్మూ– కాశ్మీర్ ఏబీవీపీ విభాగంలో కార్యకర్తగా ఉన్న జైరామ్ ఠాకూర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. వివాహం అనంతరం జైరామ్ ఠాకూర్ రాజకీయాల్లో నిమగ్నం కాగా, సాధనారావ్ తన వైద్య వృత్తిని కొనసాగించారు. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. త్వరలోనే బెంగళూరు వస్తాను: సాధన కాగా, కర్ణాటక అన్నా ముఖ్యంగా బెంగళూరు అన్నా తనకెంతో గౌరవం, అభిమానం ఉన్నాయని డాక్టర్ సాధనా రావ్ చెబుతున్నారు. తనకు అవకాశం లభిస్తే త్వరలోనే బెంగళూరు వస్తానని చెప్పారు. ‘మా తాతగారు బెంగళూరులోనే ఉండేవారు. తండ్రి జైపూర్‌లో ఉండడంతో నా విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తాతగారు బెంగళూరులో ఉండడం వల్ల సెలవుల్లో అక్కడికే వచ్చేవాళ్లం. ప్రస్తుతం బెంగళూరు చాలా మారిపోయిందని, అభివృద్ధి చెందిందని స్నేహితుల ద్వారా విన్నాను. త్వరలోనే బెంగళూరు వస్తాను’ అని డాక్టర్ సాధన తెలిపారు. -
ములాయం ఇంటి రామాయణం!
సాక్షి, సెంట్రల్ డెస్క్ : అనగనగా ఒక రాజు.. ఆయనకు ముగ్గురు భార్యలు.. నలుగురు కుమారులు.. ముగ్గురు భార్యల్లో ఒకరికి తన కొడుకంటేనే ఇష్టం.. సింహాసనంపై తన బిడ్డనే కూర్చోబెట్టాలన్నది ఆమె ఆశ.. అందుకు కుయుక్తులు పన్నుతుంది.. భర్తను వరం కోరుకొని సింహాసనం అధిష్టించాల్సిన తన సోదరి కుమారుడిని కానలకు పంపుతుంది.. తన కొడుకుకు రాజ్యం దక్కేలా చేస్తుంది! ఇది రామాయణం అని అందరికీ అర్థమవుతుంది! ఇప్పుడు యూపీలోనూ ఇంచుమించు ఇలాంటి కథే నడుస్తోంది! దశరథుడి పాత్రలో ఎస్పీ చీఫ్ ములాయం .. తన కొడుకు అఖిలేశ్, రెండో భార్య సాధనా గుప్తా మధ్య నలిగిపోతున్నాడు. రామాయణంలో కైకేయి పాత్రను పోషిస్తూ సాధన తన కొడుకు భార్య (కోడలు)కు పట్టం కట్టాలని చూస్తోందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నాడు తండ్రి మాట జవదాటని రాముడి మాదిరి కాకుండా అఖిలేశ్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని, తండ్రి, పినతల్లి మద్దతుదారులపై యుద్ధం ప్రకటించాడని అంటున్నారు. పీఠం కోసం ములాయం కుటుంబంలో సాగుతున్న ఈ కలహాలే యూపీలో సంక్షోభానికి దారి తీశాయని చెబుతున్నారు. ఎవరీ సాధన? 2003 వరకు ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ ఏడాది ములాయం తొలి భార్య మాలతి(అఖిలేశ్ తల్లి) చనిపోవడంతో ఈమె తెరపైకి వచ్చింది. ములాయం రెండో భార్యగా జనానికి పరిచయమైంది. లక్నోలోని ములాయం ఇంట్లోకి చేరింది. ములాయంతో ఈమె పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలియదుకానీ వీరిరువురికి 1988లోనే కొడుకు పుట్టాడు. పేరు ప్రతీక్. ఈయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు. కానీ ప్రతీక్ భార్య అపర్ణ రాజకీయ భవిష్యత్తు కోసమే సాధన ఇదంతా నడుపుతోందని రాజకీయ పరిశీలకులంటున్నారు. పార్టీలో అఖిలేశ్‌కు చెక్‌పెట్టి, కీలకంగా మారాలన్నది ఈమె వ్యూహంగా చెబుతున్నారు. అందుకే అఖిలేశ్‌కు ఇష్టం లేకపోయినా, ములాయం వద్దన్నా అమర్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చిందని సమాచారం.సాధనకు రాజకీయ సలహాలు ఇస్తోంది అమర్‌సింగే కావడం గమనార్హం. అఖిలేశ్ అంటే ఎందుకు వ్యతిరేకత? తన కోడ లి పొలిటికల్ కెరీర్ కోసం 2012 నుంచే సాధన ప్రణాళికలు వేస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అఖిలేశ్ సీఎం కాకుండా చూసేందుకు సాధన తెరవెనుక ప్రయత్నాలు సాగించింది. పార్టీ నేతలందరినీ తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు యత్నించిందంటూ ఆమెపై ఆరోపణలున్నాయి. నాడు అఖిలేశ్‌ను అడ్డుకోవడం సాధ్యం కాకపోవడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ములాయం సోదరుడు శివపాల్‌తో కలిసి అఖిలేశ్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత తదుపరి సీఎంను ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారంటూ ఇటీవల ములాయం అనడం గమనార్హం. అఖిలేశ్ ‘సర్జికల్ స్ట్రయిక్స్’ తన పీఠానికి ఎసరు తెస్తున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అఖిలేశ్ ఇక ఊరుకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని భావిస్తున్నారు. అందుకే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పార్టీ చీలిపోయినా మెజారిటీ నేతలు తనవైపే ఉంటారని భావిస్తున్నారు. ప్రజల్లో తనపట్ల ఉన్న ‘క్లీన్ఇమేజ్’ ఎన్నికల్లో లాభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. సాధనకు, శివలాల్‌కు మద్దతుదారులుగా ఉన్న ముగ్గురు మంత్రులపై వేటు వేశారు. ఆ మరుసటి రోజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను తొలగించారు. తన చిన్నాన్న శివపాల్‌ను ఒకేనెలలో రెండుసార్లు కేబినెట్ నుంచి తొలగించారు. అపర్ణ పరిస్థితి ఏంటి? తన కోడలు అపర్ణను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని సాధనా గుప్తా భావిస్తున్నారు. ఈ సీటును ఇప్పటికే ఆమెకు అట్టిపెట్టినట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే కొద్దిరోజుల కిందట కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బీజేపీలో చేరిన రీటా బహుగుణ సైతం ఇక్కడ్నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో సాధన పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.