నేడు కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లకు వైద్య పరీక్షలు
Published Tue, Apr 25 2017 11:11 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
కర్నూలు: పోలీసు శాఖ కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ తెలిపారు. ఇటీవల కమ్యూనికేషన్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన 56 మంది ఆస్పత్రి చార్జీల నిమిత్తం రూ.1500 నగదు, 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా ఎస్పీ సూచించారు.
Advertisement
Advertisement