జమ్మూకశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తర్వాత పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. ఏదో ఒక చోట కవ్వింపులకు పాల్పడుతూ భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 10 మంది పాకిస్తాన్ ఆర్మీ కమాండోలను హతమార్చింది. ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం సహకారంతో భారత్‌కి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పలు సార్లు కాల్పులు జరిగాయి. ఈనేపథ్యంలోనే ఆగస్టు 5 నుండి నేటి వరకు పదిమంది పాకిస్తాన్ కమాండోలను హతం చేసినట్టు భారత భద్రతా దళాలు వెల్లడించాయి.
గత మూడు వారాలుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చోరబడటానికి ప్రయత్నిస్తోందని, పాకిస్తాన్ ఉగ్రవాదులను వెనక్కి పంపే ప్రయత్నంలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పులలో పది మందికి పైగా ఎస్‌ఎస్‌జీ కమాండోలు మరణించినట్లు భద్రతా దళ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘటనను పాకిస్తాన్ ఆర్మీ అంతర్జాతీయం చేయాలని చుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే గత 15 రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ వందమందికి పైగా కమాండోలను నియంత్రణ రేఖ వద్ద కాపలా ఉంచి భారత దళాలపై బ్యాట్ చర్యకు ప్రతిపాదించినట్లు తెలిపారు. పాకిస్తాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి నియంత్రరేఖ వద్ద భారత ఆర్మీ దళాలు హై అలర్ట్‌ను ప్రకటించాయి.
నియంత్రణ రేఖ వద్ద హై అలర్ట్ ప్రకటించిన భారత ఆర్మీ
Published Wed, Aug 28 2019 9:12 PM | Last Updated on Wed, Aug 28 2019 9:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment