
శ్రీనగర్: నిత్యం దేశం కోసం పరితపించే లాన్స్ నాయక్ సందీప్ సింగ్ సోమవారం వీర మరణం పొందారు. 2016లో పీవోకేలో తలదాచుకుంటున్న ఉగ్రమూకలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో సందీప్ సింగ్ చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం జుమ్మూ కశ్మీర్‌లోని టాంగ్దార్ సెక్టార్‌లో భారత దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ తన చివరి శ్వాస ఉన్నంత వరకు దేశం కోసం పోరాడుతూనే ఉన్నారు. శనివారం టాంగ్దార్ సెక్టార్‌లో ఉగ్ర కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వారిని నివారించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగా ఆది, సోమ వారాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి.
ఈ ఆపరేషన్‌లో సందీప్ ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ ప్రయత్నంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అతని శరీరంలోకి బులెట్లు దూసుకెళ్లాయి. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. కాగా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన సందీప్‌కు భార్య, ఐదేళ్ల బాబు ఉన్నారు.