surgical strike
-
సర్జికల్ స్ట్రైక్: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016, సెప్టెంబర్ 18న కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో భారత సైనికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 18 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన తరువాత భారత జవాన్లు పాక్ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాధానం ఇప్పటికీ వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది.పాక్ ఉగ్రవాదులు ఉరీలో దాడి చేసి పది రోజుల తర్వాత అంటే 2016, సెప్టెంబర్ 18న భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి, పాక్‌పై తగిన ప్రతీకారం తీర్చుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరీలో భారత సైన్యం క్యాంపుపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు భారత ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భారత సైనికులు నిద్రిస్తున్న గుడారాలకు నిప్పు పెట్టారు. ఈ దాడి అకస్మాత్తుగా జరగడంలో సైనికులకు తప్పించుకునే అవకాశం దొరకలేదు. ఈ దాడిలో 18 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం అక్కడ ఉన్న ప్రత్యేక బలగాలు నలుగురు పాక్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఉరీ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ నేపధ్యంలో పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో భారత సైన్యం పాక్‌పై ప్రతీకార దాడికి పక్కా ప్రణాళిక రూపొందించింది. ప్లాన్‌లో భాగంగా ముందుగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు. 2016, సెప్టెంబర్ 28 నాటి అర్థరాత్రి భారత పారా కమాండోల బృందం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. భారత సైన్యం తన పని ముగించుకుని, విజయవంతంగా తిరిగి వచ్చింది. ఈ దాడిలో 50 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌కు ‘సర్జికల్ స్ట్రైక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. దీంతో నాడు దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.ఇది కూడా చదవండి: మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు -
పాక్‌కు బాలాకోట్ దాడుల సమాచారం ఇచ్చాం: ప్రధాని మోదీ
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 నాటి పాకిస్తాన్ బాలాకోట్‌పై జరిపిన సర్జీకల్ స్ట్రైక్స్ విషయాన్ని దాడి తర్వాత ఆ దేశానికి తెలిపామని అన్నారు. మంగళవారం కర్ణాటకలోని బాలాకోట్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.‘వెనక నుంచి దాడులు చేయడాన్ని మోదీ నమ్మడు. దేనినైనా ధైర్యంగా ముఖాముఖీ చేస్తాడు. బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత మీడియాకు సమాచారం అందించాలని భద్రతా బలగాలు చెప్పాయి. ఈ విషయాన్ని అదే రాత్రి.. పాకిస్తాన్‌కు టెలిఫోన్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేశాం. కానీ పాక్ టెలిఫోన్ కాల్‌కు స్పందించలేదు. తర్వాతే ఈ దాడుల విషయాన్నిప్రపంచానికి తెలియజేశాం. మోదీ ఎటువంటి విషయాన్ని దాచిపెట్టడు. ప్రతి విషయాన్ని బహిరంగంగా వెళ్లడిస్తాడు’ అని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో అమాయక ప్రజలకు బలి తీసుకోవాలనుకునేవారిని మోదీ హెచ్చరించారు. ఇది కొత్త భారత్ అని అన్నారు.‘పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడు. చాలా మంది కర్ణాటకలోని బాలాకోట్ అనుకున్నారు. అందుకే వెంటనే తాము సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించి మీడియాకు సమాచారం ఇచ్చాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక.. పుల్వామాలో జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత బలగాలు పాక్‌లోని బాలాకోట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. -
రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?
Uri: The Surgical Strike (2019): దంగల్, ఆర్ఆర్ఆర్,కేజీఎఫ్ KGF చాప్టర్ 2, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, పఠాన్ లాంటి మూవీలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ష సునామీ సృష్టించాయి అనడంలో ఎలాంటి సందేహంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లను ఆర్జించిన భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇవి కొన్ని. అయితే, ఈ సినిమాలు నిజానికి భారీ బడ్జెట్‌తో నిర్మితమైనాయి. కాబట్టి ఊహించినట్టుగా ఆ రేంజ్లో వసూళ్లను రాబట్టాయి. కానీ అతి తక్కువ బడ్జెట్‌తో 876శాతం ఆశ్చర్యకరమైన లాభాలను సాధించింది అంటే నమ్ముతారా? అవును ఇది నిజం.యురీ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసినబాలీవుడ్ హీరో విక్కి కౌశల్ ఈ రికార్డు సాధించాడు. ఈ సక్సెస్ రూ. 1500 తొలి రెమ్యునరేషన్ అందుకున్న విక్కీ కౌశల్ గ్రాఫ్‌ని అమాంతం పెంచేసింది.(జవాన్ ప్రభంజనం: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్, ఏమన్నారో తెలుసా?) 2019లో విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా యురి: ది సర్జికల్ స్ట్రైక్ రికార్డు వసూళ్లను రాబట్టింది. 2016 ఉరీ దాడులకు భారతదేశం ప్రతీకారానికి సంబంధించిన చిత్రమిది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 240 కోట్ల నెట్‌ని ,ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది . వార్ , కబీర్ సింగ్ తర్వాత 2019లో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది. ఇంకో విశేషం ఏమిటంటే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ధర్ ఈ మూవీకిగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. మిలిటరీ యాక్షన్ చిత్రానికి గానూ విక్కీ స్వయంగా ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. దీంతోపాటు ఉత్తమ ఆడియోగ్రఫీ , ఉత్తమ సంగీతం (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) విభాగంలో మరో రెండు అవార్డులను గెలుచుకుంది. (హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్) బీ ఎ మ్యాన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తొలి సంపాన వివరాలను పంచకున్నాడు విక్కీ. ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత యాక్టర్ అవ్వాలనుకున్నాడట. రాహుల్ డా కున్హా, రజిత్ కపూర్ , షెర్నాజ్ పటేల్ నిర్వహించే రేజ్ ప్రొడక్షన్స్ కంపెనీలో చేరాననీ ఆ సమయంలో, ప్రొడక్షన్ బాయ్‌ని, ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ హ్యాండిల్ చేసానని తెలిపారు. ఈ క్రమంలో తన సంపాదనగా రూ. 1,500 చెక్కును అందుకున్నానని చెప్పుకొచ్చాడు. అప్పటివరకు నాన్న బ్యాంకు పనిలో మాత్రమే హెల్ప్ చేసిన తనకు విక్కీ కౌశల్ పేరుమీద 1500 రూపాయల చెక్ చూసిన క్షణాలు చాలా ప్రత్యేకమైవి, అదొక మరుపురాని అనుభవం అంటూ గుర్తు చేసుకున్నాడు. కాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021, డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇక ఈ ఏడాది సినిమాల పరంగా చూస్తే అక్షయ్ కుమార్ సెల్ఫీ , ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిస్తే.. సారా అలీ ఖాన్‌తో విక్కీ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హిట్ జరా హాట్కే జరా బచ్కే’ సర్ప్రైజ్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. -
చైనా మ్యాప్ విడుదల.. సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము మోదీకి ఉందా?
భారతలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను (standard map) విడుదల చేసిన విషయం తెలిసిందే. 2023 చైనా ఎడిషన్ పేరుతో విడుదలైన ఈ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ వంటి వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చూపించడంతోపాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా కలిపేసుకుంది. ఆ దమ్ము ఉందా? అయితే చైనాకు పొరుగు దేశాలతో కలిసి జాతీయ సరిహద్దులను తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్ రాజకీయ దుమారానికి తెరలేపింది. తాజాగా చైనా మ్యాప్ వివాదంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనాపై సర్జికల్ స్టైక్ చేసే దమ్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉందా అని ప్రశ్నించారు. రాహుల్ చెప్పింది నిజమే! ‘చైనాపై దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి. ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాలి. ఇటీవలె మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ చైనా అధికారులను ఆలింగనం కూడా చేసుకున్నారు. ఈ దృశ్యాలు మా మనసులను గాయపరిచాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్‌లోకి చైనా ప్రవేశించిందటూ రాహుల్ గాంధీ ముందే చెప్పారు. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద మన భూభాగాన్ని చైనా కాజేసిందని రాహుల్ చెప్పింది నిజమే’ నని వ్యాఖ్యానించారు. చదవండి: మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్, అక్సాయిచిన్ మావే! ఎన్నికలొస్తున్నాయి.. అల్లరు జరుగుతాయి 'ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ సర్జికల్ స్ట్రైక్ డ్రామా ఆడుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. పుల్వామా దాడి కూడా కుట్రపూరితంగా జరిగిందని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉంది. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామభక్తుల రైలుపై రాళ్లు రువ్వడం, బాంబులు విసరడం, దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం వంటివి జరిగే అవకాశం ఉందన్న భయం ప్రజల్లో ఉంది. హర్యానా అల్లర్లే ఉదాహరణ ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కోసమే. ప్రధాన రాజకీయ పార్టీల మనస్సులలోనూ ఈ ఆందోళన ఉంది. ప్రతి విషయాన్ని ప్రజల ముందు ఉంచడం మన బాధ్యత. అలా జరగని పక్షంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హర్యానాలో జరిగిన అల్లర్లే దీనికి ఉదాహరణ’ అని రౌత్ పేర్కొన్నారు. రాహుల్ ఏమన్నారంటే.. ఈ నెల 17 నుంచి లద్దాఖ్‌లో కాంగ్రెస్ పర్యటించిన కాంగ్రెస్ నేత గాంధీ.. మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ‘వారం రోజులుగా లద్దాఖ్‌లో బైక్‌పై పర్యటిస్తున్నా. లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం. భారత్‌కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు. చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని రాహుల్ అన్నారు. -
'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..'
ఇంఫాల్: మణిపూర్‌లో వలసదారుల సమస్యను పరిష్కరించాలంటే 'సర్జికల్ స్ట్రైక్ట్' చేయాల్సిందేనని నేషనల్ పీపుల్ పార్టీ నాయకుడు ఎమ్ రామేశ్వర్ సింగ్ వివాదాస్పదంగా మాట్లాడారు. అక్రమంగా వలసదారులు, ఉగ్రవాదులను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఎన్పీపీ బీజేపీతో కలిసి మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పరించింది. 'మణిపూర్‌కు కొంతమంది కుకీ ఉగ్రవాదులు సరిహద్దు దాటి వస్తున్నారని హోం మంత్రి చెబుతున్నారు. నేను ఎప్పటినుంచే చెబుతున్నా..ఈ అల్లర్లు బయటి నుంచి ప్రేరణకు గురువుతున్నాయని.. ఈ విషయంలో జాతీయ భద్రత కూడా రాజీపడుతోంది. దేశాన్ని రక్షించుకోవాలి ఒక్క మణిపూర్‌నే కాదు. ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సమస్య పరిష్కారం అవుతోంది.' అని ఆయన అన్నారు. 'కుకీ ప్రజలు క్యాంపుల్లో ఉన్నారు. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరి ఇదే వాస్తవం అయితే.. ఇప్పుడు ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తోంది. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.' అని రామేశ్వర్ సింగ్ అన్నారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకీ ప్రజల బయోమెట్రిక్‌లను మణిపూర్ ప్రభుత్వం గత నెలలోనే తీసుకుంది. దాదాపు 700 మంది అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడ్డారని పుకార్ల రావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్‌లో మే3 న అల్లర్లు ప్రారంభమయ్యాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్‌పై బీజేపీ కుట్ర చేసిందని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. మత కల్లోలాలు సృష్టించేందుకు హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేపట్టిందని మండిపడ్డారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్‌ను హైదరాబాదీలు భగ్నం చేశారని అన్నారు. పాతబస్తీలో కొంతమంది ఆందోళన చేశారని, అందులో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు విసరలేదని స్పష్టం చేశారు. కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వాళ్లను విడిపిస్తే తప్పేముందని నిలదీశారు. రాజాసింగ్‌కు ఇప్పటికీ బీజేపీ పెద్దల మద్దతు ఉందన్నారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీయాక్ట్పై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మసీదుల్లో ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు శుక్రవారం ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ సూచించారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇళ్లలోకి వెళ్లాలని తెలిపారు. ఓవైసీ, మత పెద్దల పిలుపుతో ప్రశాంతంగా ప్రార్ధనలు ముగిశాయి. చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా -
రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం
మాస్కో: నిత్యం బాంబు దాడులతో దద్దరిల్లే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదులు, సామాన్యులపై చేసే దాడుల నేపథ్యంలోనే సిరియా పేరు వార్తల్లో వినపడుతోంది. తాజాగా మరోసారి బాంబుల మోతతో వార్తల్లో నిలిచింది సిరియా. కాకపోతే ఈ సారి దాడులు సామాన్య ప్రజలపై కాకుండా ఉగ్రవాదులపై జరిగాయి. ఈ ఘటనలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారు. సిరియాలోని ఉగ్రవాద స్థావరంపై రష్యా తమ యుద్ధ విమానాలతో సోమవారం దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో 200 మంది ఉగ్రవాదులు మృతి చెందారని, 24 వాహనాలు, సుమారు 500 కిలోగ్రాముల (1,100 పౌండ్లకు పైగా) మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను ధ్వంసం చేశామని రష్యా సైన్యం ప్రకటించింది. పల్మైరా ప్రాంతంలో ఉన్న క్యాంపులో ఉగ్రవాదులు పేలుడు పదార్థాల తయారీపై శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. ఈ సమాచారం అందిన వెంటనే రష్యా తమ సైన్యంతో ఈ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇటీవల ఇద్దరు రష్యా సైనికులను చంపినట్లు ఇస్లామిక్ స్టేట్ పేర్కొనగా.. ప్రతీకార చర్యల్లో భాగంగానే రష్యా ఈ దాడులు చేసింది. ( చదవండి: తీవ్ర పరిణామాలు తప్పవు: రష్యాకు అమెరికా వార్నింగ్! ) -
బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’
న్యూఢిల్లీ: 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం తర్వాత భారతదేశం దాయాది పాకిస్తాన్‌పై చేసిన మొదటి వైమానకి దాడి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై చేసిన దాడికి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3.30 గంటలకు భారత మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ ఎల్ఓసీని దాటుకుని.. పాకిస్తాన్ బాలకోట్‌లోని జైషే మహ్మమద్ టెర్రర్ క్యాంప్‌పై దాడి చేశాయి. ఉరి, బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడులతో పాక్‌కు భారత సామార్థ్యం మరోసారి తెలిసి వచ్చింది. ఇక రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాటి ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతో పాటు నాడు ఓ క్షిపణి విఫలమయ్యిందనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాటి ఆపరేషన్‌లో మన మిరాజ్ ఫైటర్ జెట్స్‌ని ఎదిరించేందుకు.. పాక్ తన ఎఫ్ 16 ఫైటర్ జెట్స్‌ని రంగంలోకి దింపింది. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ దాడిలో ఐఏఎఫ్ మిరాజ్ 2000 యోధులు తమ స్పైస్ 2000 పెనెట్రేటర్ బాంబులను విడుదల చేశాయి. ఇవి ఒక్కొక్కటి 90 కిలోల పేలుడు పదార్థాలతో నిండి ఉంటాయి. సరిగ్గా పావుగంట తర్వాత అనగా 3.45 గంటలకు ఎయిర్ చీఫ్ బీఎస్ ధనోవా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందనే సమాచారం ఇచ్చారు. ప్రత్యేక ఆర్ఏఎక్స్ నంబర్ ద్వారా టెలిఫోన్ కాల్ చేసిన ధనోవా హిందీలో బందర్ మారా గయా(కోతి చంపబడింది) అని తెలిపారు. అంటే పాకిస్తాన్, బాలకోట్లో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ టెర్రరిస్ట్ శిక్షణా క్యాంప్‌ని సరిహద్దు దాటి సాహసోపేతమైన ముందస్తు ఆపరేషన్‌లో భారత్ నాశనం చేసింది అని అర్థం. ఆర్ఏఎక్స్ అనేది అల్ట్రా-సేఫ్డ్ ఫిక్స్డ్-లైన్ నెట్వర్క్. అజిత్ దోవల్‌తో మాట్లాడిన అనంతరం ధనోవా అప్పటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రా సెక్రటరీ అనిల్ ధస్మానాకు తెలియజేశారు. ఆ తర్వాత దోవల్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను గందరగోళపరిచేందుకు ‘బందర్’ అనే కోడ్ పేరును ఉద్దేశపూర్వకంగా ఎన్నుకున్నట్లు బాలకోట్ దాడిలో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. చదవండి: బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి పుల్వామా దాడిపై పాక్ సంచలన ప్రకటన -
బాలాకోట్ దాడి: సంచలన విషయాలు వెల్లడి
ఇస్లామాబాద్: దాయాది దేశం కుట్ర పన్ని చేసిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత్ బాలకోట్ ఉగ్రస్థావారలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఇక నాటి దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇవ్వన్ని గాలి మాటలే.. అంతమంది చనిపోతే.. రక్తం ఎక్కడ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. (చదవండి: దేశమంతా శోకంలో ఉంటే నీచ రాజకీయాలా?) ఓ ఉర్దు చానెల్ డిబెట్లో పాక్ దౌత్యవేత్త ఆఘా హిలాలీ మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం. కానీ మా లక్ష్యం వేరు. మేం వారి హై కమాండ్ని టార్గెట్ చేశాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఇక మేం సర్జికల్ దాడులు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించాం. వారు ఎంత నష్టం కలిగించారో.. మేం కూడా అంతే నష్టం వారికి కలగజేస్తాం. ఎక్కువ చేయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. -
సర్జికల్ స్ట్రైక్ చేయండి: సంజయ్ రౌత్
ముంబై: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన వెనక పాకిస్తాన్, చైనా హస్తం ఉందంటూ కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. రైతుల ఉద్యమం వెనక చైనా, పాక్ హస్తం ఉన్నది నిజమే అయితే ఆ రెండు దేశాల మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రౌత్ మాట్లాడుతూ.. ‘రైతుల ఉద్యమం వెనక పాక్, చైనా హస్తం ఉందని స్వయంగా ఓ కేంద్రమంత్రి ప్రకటించారు. అలాంటప్పుడు ఆ రెండు దేశాలపై సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిందే. రక్షణ శాఖ మంత్రి వెంటనే దీని గురించి రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ ఉన్నతాధికారులతో సీరియస్‌గా చర్చించి.. వెంటనే రంగంలోకి దిగాలి’ అంటూ రౌత్ ఎద్దేవా చేశారు. (చదవండి: ప్రభుత్వం నా చెప్పుల్ని చోరీ చేయించింది) రావుసాహేబ్ దాన్వే రైతుల ఉద్యమం గురించి మాట్లాడుతూ.. ‘ఇది రైతులు చేస్తోన్న ఆందోళన కాదు. దీని వెనక పాక్, చైనాల హస్తం ఉంది. దేశంలో ఏం జరిగినా వెంటనే ముస్లింలను ప్రేరేపిస్తారు. ఎన్ఆర్సీ, సీఏఏ అమల్లోకి వస్తే ఆరు నెలల్లో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఎంత మంది ముస్లింలు దేశం నుంచి వెళ్లిపోయారో చెప్పాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. రావుసాహేబ్ వ్యాఖ్యల్ని ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ కూడా ఖండించింది. -
సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపైన కేసులు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకుని హైదరాబాద్‌లో మత ఘర్షణలు తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. చదవండి: గ్రేటర్లో అందరికీ ఉచితంగా కరోనా టీకా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. ప్రజలందరూ పోలీసులతో భాగస్వామ్యం కావాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు. మూడు కమిషనరేట్ పరిధి లో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలీస్ శాఖ ఉన్నత సమావేశం ఏర్పాటు చేశామని, ముందస్తుగా ఉన్న సమాచారం మేరకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసకున్నామన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
‘బాలాకోట్’ దాడులపై మళ్లీ అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి భారత వైమానికి దళం చొచ్చుకుపోయి ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాన్ని ఉగ్రవాదులు ఇటీవల పునుద్ధరించుకున్నారని భారత సైనిక చీఫ్ బిపిన్ రావత్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అసలు ఆ రోజున ఉగ్రవాదుల శిబిరం ఏ మేరకు ధ్వంసమయింది? అన్న అనుమానం నేడే కాదు, దాడులు జరిగిన రోజే కలిగాయి. అంతకుముందు, ఆ తర్వాత అంతర్జాతీయ శాటిలైట్లు తీసిన చిత్రాలను కూడా కొన్ని ఆంగ్ల వెబ్సైట్లు ఉదహరిస్తూ భారత వైమానిక దళం దాడులు గురితప్పాయని ఆరోపించాయి. ఆ ఆరోపణలను, ఆ విమర్శలను భారత ప్రభుత్వ వర్గాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. తాజాగా చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణా అకాడమీలో బిపిన్ రావత్ మాట్లాడుతూ నాడు భారత ధ్వంసం చేసిన ఉగ్రవాదుల శిబిరాన్ని వారు మళ్లి పునరుద్ధరించుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పడం ఎంత మేరకు నిజం? పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులకు కోలుకోని దెబ్బపడిందని, బాలాకోట్‌లోని వారి శిబిరాన్ని సమూలంగా నాశనం చేశామంటూ నాడు ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంలో నిజం లేదా? ఈ రెండు నిజం అవడానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడు ఒక్కటే నిజం కావాలి? 2016లో భారత సైనికులు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా టెర్రరిస్టు లాంఛింగ్ పాడ్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అప్పుడు కూడా సైనిక వర్గాలుగానీ, ప్రభుత్వ వర్గాలుగానీ అందుకు సరైన సాక్ష్యాలు చూపించలేక పోయాయి. మళ్లీ ఈసారి కూడా బాలాకోట్ లాంటి దాడులు జరిపి భారత సైనిక వర్గాలు నెగ్గుకు రావాలంటే చాలా కష్టం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్ సరిహద్దుల్లో పాక్ సైనిక భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోపక్క కశ్మీర్ మిలిటెంట్లు ఉగ్రదాడులకు అవకాశాలు వెతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ సర్జికల్ దాడులు నిర్వహించలేదు. (చదవండి: బాలాకోట్ ఉగ్రశిబిరం మొదలైంది) -
నేను న్యాయం చేస్తా: రాహుల్
దుంగార్పూర్(రాజస్తాన్): ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకు తాను వచ్చే ఐదేళ్లలో న్యాయం చేయడం ద్వారా ఆ ధోరణికి స్వస్తి పలకాలనుకుంటున్నానని చెప్పారు. మంగళవారమిక్కడి గిరిజన ఆధిపత్య ప్రాంతమైన బనేశ్వర్ ధామ్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఒక వేళ తమ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, వచ్చే ఏడాదిలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘ఐదేళ్లలో పేదలు, గిరిజనులు, బలహీన వర్గాల వారికి అన్యాయం చేశారు. కానీ కాంగ్రెస్ వారికి న్యాయం చేయాలనుకుంటోంది. మీరు ఐదేళ్లలో వారి నుంచి లాక్కున్న దాని కంటే ఎక్కువ మొత్తం మేం వారికి ఇస్తాం’అని చెప్పారు. ప్రధాని ఆయనకు ఏది తోస్తే అది మాట్లాడేస్తారని, తాము మాత్రం కనీస ఆదాయ పథకం న్యాయ్, ఉద్యోగిత, రైతుల సంక్షోభంపై నిజాలే చెప్తామని వ్యాఖ్యానించారు. లక్షలాదిమంది యువకులు ‘న్యాయ్’కావాలంటూ ఓటు వేసేందుకు వస్తున్నారని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా యువత ఓటు వినియోగించుకుంటున్నారు. అందులో చాలావరకు తొలి ఓటర్లున్నారు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. ప్రతి భారతీయుడికీ న్యాయ్ కావాలి. అందరూ తెలివిగా ఆలోచించే ఓటు వేస్తారనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. -
పేదరికంపై సర్జికల్ స్ట్రైక్
జైపూర్/పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్) అనేది పేదరికంపై సర్జికల్ దాడి చేయడమేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పథకం రూపకల్పన కోసం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను సంప్రదించామని వెల్లడించారు. 21వ శతాబ్దంలో ప్రజలెవరూ పేదలుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌లోని సూరత్‌గఢ్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 14 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టారు.. న్యుంతమ్ ఆయ్ యోజన(న్యాయ్) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ‘ఇది బిగ్ బ్యాంగ్. బాంబు పేలేందుకు సిద్ధంగా ఉంది. ఇది పేదరికంపై కాంగ్రెస్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్. యూపీఏ ప్రభుత్వం గతంలో 14 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయగా, బీజేపీ వారందర్ని మళ్లీ పేదరికంలోకి నెట్టింది’ అని వెల్లడించారు. దేశప్రజలకు చౌకీదార్(కాపలాదారు)గా ఉంటానన్న మోదీ.. అనిల్ అంబానీ వంటివారికి చౌకీదార్‌గా మారారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశంలోని చిన్న, మధ్యతరగతి వ్యాపారులు వ్యాపారం చేయడం మానేసి జీఎస్టీ దరఖాస్తులు నింపుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. న్యాయ్ పథకాన్ని మాస్టర్ స్ట్రోక్‌గా బీజేపీ రెబెల్ నేత శతృఘ్న సిన్హా అభివర్ణించారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని సిన్హా గుర్తుచేశారు. మరోవైపు న్యాయ్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఢిల్లీ కాంగ్రెస్ విభాగం ఆయ్ పే చర్చా(ఆదాయంపై చర్చ) అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించింది. -
ఇదే అసలైన సర్జికల్ స్ట్రైక్ అంటూ ఎగతాళి
కృష్ణరాజపురం (బెంగళూరు): కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా బెంగళూరులో ఓ యువకుడు ‘అసలైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇదే’ అని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన అబిద్ మాలిక్ అనే యువకుడు ఉగ్రవాదుల దాడిపై తన ఫేస్బుక్ ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అసలైన సర్జికల్ దాడి అంటే ఇదే అని అందులో ఎగతాళి చేశాడు. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదిని పొగుడుతూ ‘రిప్ బ్రో’ అని కూడా వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ సమస్యపై స్పందించకపోతే భవిష్యత్‌లో మరో 40 మంది సైనికులు మరణిస్తారని కూడా ఆ పోస్ట్‌లో హెచ్చరించాడు. దీనిని చూసిన నెటిజన్లు అతనిపై భగ్గుమనడంతో వెంటనే ఖాతా నుంచి పోస్ట్ తొలగించి అబిద్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అబిద్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
థియేటర్లో నినాదాలు చేసిన కేంద్ర మంత్రి
బెంగళూరు : మెరుపు దాడుల నేపథ్యంలో బాలీవుడ్లో ‘ఉడి : ది సర్జికల్ స్ట్రయిక్స్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విక్కి కౌశల్, యామీ గౌతమ్, పరేష్ రావల్, మోహిత్ రైనా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఆదివారం మాజీ ఆర్మీ ఉద్యోగులతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం ‘పవర్ ప్యాక్డ్ మూవీ. యామీ గౌతమ్, విక్కీ కౌషల్, పరేష్ రావల్, మోహిత్ రైనా తమ అద్భుత నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు’ అంటూ నిర్మల సీతారామన్ ట్వీట్ చేశారు. దాంతో పాటు సినిమాలో విక్కీ కౌశల్ చెప్పిన క్యాచీ డైలాగ్.. ‘హౌ ఈజ్ ద జోష్’ అంటూ థియేటర్లో నినదాలు చేసిన వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ‘నిర్మలాజీ.. హీరో కన్నా మీరే చాలా పవర్‌ఫుల్‌గా ఈ డైలాగ్ చెప్పారు’ అంటూ అభినందిస్తున్నారు నెటిజన్లు. సెప్టెంబరు 18, 2016 లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు తెల్లవారుజామున వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి వచ్చి, ‘ఉడి’ ప్రాంతంలో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఆరవ బెటాలియన్‌లోని పందొమ్మిది మంది జవానులు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. -
ఒక ఉడి కథ
ఏ దేశంలో ఉండేదైనా మనుషులే. వాళ్లకుండేదీ కుటుంబాలే. తప్పు చేసిన ‘రోగ్ నేషన్స్’కి శిక్ష వేయాలి కానీ.. ఆ దేశంలో ప్రజలకు నష్టం కలక్కూడదు. యుద్ధంలో అదెలా సాధ్యం?! బాంబులు వేస్తే మంచివారు, చెడ్డవారూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోతారు కదా! అందుకే... సర్జికల్ స్ట్రయిక్స్. అందుకే.. ఈ రిపబ్లిడ్ డే రోజు ‘ఉడి’ చిత్రంపై స్పెషల్ ఫోకస్. సెప్టెంబరు 18, 2016. లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు తెల్లవారుజామున వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లోకి వచ్చి, ‘ఉడి’ ప్రాంతంలో ఉన్న 12 బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. వారి దాడిలో బిహార్‌కు చెందిన ఆరవ బెటాలియన్‌లోని పందొమ్మిది మంది జవానులు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్ చేసింది. ఆ వాస్తవ కథాంశమే ‘ఉడి: ది సర్జికల్ స్ట్రయిక్.’ విహాన్ సింగ్ షెర్గిల్ (వికీ కౌశల్) భారత ఆర్మీ మేజర్. ఎన్నో యుద్ధాలలో విజయాలు సాధిస్తూ, మాతృదేశానికి సేవ చేస్తుంటాడు. అయితే తన తల్లిని విస్మరిస్తున్నాననే బాధ అతడి హృదయాన్ని దహిస్తూ ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో ఉన్న తల్లి.. చెల్లి దగ్గర ఉంటుంది. ఈ సమయంలో తల్లి దగ్గరకు వెళ్లకపోతే, తనను పూర్తిగా మరచిపోతుంది అనుకుంటాడు. విధుల నుంచి తప్పుకుని, తల్లి దగ్గరకు వెళ్లిపోతానని చెబుతాడు. ‘దేశానికి సేవ చేసే అదృష్టం అందరికీ లభించదు. శక్తి ఉన్నంతవరకు దేశం కోసం పాటుపడాలి’ అని పై అధికారి అనడంతో మనసు మార్చుకుని, తన తల్లి ఉండే ప్రాంతానికి బదిలీ చేయించుకుంటాడు. రాజధానిలో ఆర్మీ బేస్‌లో చేరి, తల్లికి సేవ చేస్తుంటాడు. చెల్లి భర్త మేజర్ కరణ్ కశ్యప్ (మోహిత్ రైనా) కూడా సైనికదళంలోనే పని చేస్తుంటాడు. వారికి ఒక పాప. ఆ పాపలో తండ్రి, మేనమామల దేశభక్తి ప్రవహిస్తుంటుంది. తను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరతానంటుంది. తల్లి (స్వరూప్ సంపత్)ని చూసుకోవడానికి జాస్మిన్ అల్మైదా (యామీ గౌతమ్) అనే ఒక నర్సుని పెడతాడు విహాన్. ఆమే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజున అకస్మాత్తుగా తల్లి కనిపించదు. అంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించదు. ఆ కోపంలో నర్సుని విధుల నుంచి తొలగిస్తారు. ఆమె వెళ్లిపోతుంది. ఇంతలో తల్లిని కారులో తీసుకువస్తారు అపరిచితులు. (వెళ్లిపోయిన ఆ నర్సు తరవాత ‘రా’ ఏజెంట్ అని విహాన్‌కి తెలుస్తుంది). ఈ క్రమంలో లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఉడిలో చేసిన దాడిలో వీర మరణం పొందుతాడు విహాన్ చెల్లి భర్త కరణ్. టెర్రిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు విహాన్. అదే సమయంలో పాకిస్తాన్ చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది భారత ప్రభుత్వం. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ గోవింద్ భరద్వాజ్ (పరేశ్ రావల్) సర్జికల్ స్ట్రయిక్‌కి ప్రణాళిక రూపొందిస్తాడు. ఆ బెటాలియన్‌కి నాయకత్వం వహించి, ఉడి ఆర్మీ బేస్ క్యాంపులో పథకం ప్రకారం దాడులు జరపడానికి విహాన్సింగ్ సన్నద్ధుడవుతాడు. మరోవైపు.. చేతికి చిక్కిన పాకిస్తాన్ టెర్రరిస్టుల నుంచి నిజాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు ‘రా’ ఏజెంట్ పల్లవి శర్మ, విహాన్ సింగ్. మొత్తానికి తమకు కావలసిన సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రయిక్‌కి ముహూర్తం నిర్ణయం అవుతుంది. కేవలం గంటలో ఈ ఆపరేషన్ పూర్తి కావాలి. అయితే పాకిస్తాన్ స్థావరాలలో ఎవరెవరు ఉన్నారో తెలిస్తేనే కాని, వీరి దాడి త్వరగా పూర్తి చేయలేరు. ఏం చేయాలా అని ఆలోస్తుంటారు. ఆ సమయంలో ఒక కుర్రవాడు తయారుచేస్తున్న గరుడ డ్రోన్ (గరుడ పక్షి బొమ్మ లోపల డ్రోన్ కెమెరా ఉంచుతారు)ను చూస్తాడు భారత ఆఫీసర్. దాని సహాయంతో టెర్రరిస్టుల స్థావరాలను గమనిస్తూ, సమాచారం అందించుకుంటూ టెర్రరిస్టులను మట్టుపెట్టాలనుకుంటారు. పథకం ప్రకారం అన్నీ సిద్ధం చేస్తారు. అర్ధరాత్రి వేళ పాకిస్తాన్ స్థావరాలకు చేరుకుని, పని పూర్తి చేసుకుని తెల్లారేలోగా వెనక్కు వచ్చేయాలని ప్రధాని ఆదేశం. అడుగడుగునా గరుడ డ్రోన్ సమాచారం అందిస్తూనే ఉంటుంది. పథకం ప్రకారం దాడి జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా గరుడ డ్రోన్ అకస్మాత్తుగా కింద పడిపోతుంది. ఎంత ప్రయత్నించినా కొద్దిగా కూడా కదలదు. ఇంతలో పాకిస్తానీ టెర్రరిస్టులకు చెందిన ఒక చిన్న కుర్రవాడు అక్కడకు వచ్చి, గరుడను చూసి బొమ్మ అనుకుని, చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తుంటాడు. ఆ పిల్లవాడు గరుడను ఏం చేస్తాడా అని భారత అధికారులు ఆందోళనగా చూస్తుంటారు. రిమోట్ ఒక్కసారిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గాలిలోకి ఎగురుతుంది. నిమిషాలలో సర్జికల్ స్ట్రయిక్ విజయవంతం అవుతుంది. ఈ దాడిలో ఆ గరుడను పట్టుకున్న కుర్రవాడు ఎదురుపడతాడు భారత సైనికులకు. ఆ బాలుడి పట్ల దయచూపి విడిచిపెడతాడు విహాన్సింగ్. తెలతెలవారుతున్నా వీరజవానులు ఇంకా వెనుకకు రాకపోవడంతో ప్రధానిలో ఆందోళన బయలుదేరుతుంది. ఇంతలోనే ‘ఆపరేషన్ సక్సెస్, మనవారంతా వెనక్కు వస్తున్నారు’ అనే సమాచారం అందుతుంది. సెర్బియాలో ‘వాస్తవాధీన’ సన్నివేశాలు పాకిస్తాన్‌పై భారతదేశం సర్జికల్ స్ట్రయిక్ జరిగిన సంవత్సరానికి.. సెప్టెంబరు 2017లో తాను ఈ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు ఆదిత్యధర్. ఆ పదకొండు రోజులు (సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 29 వరకు) ఏం జరిగిందనే అంశం ఆధారంగా కథను రూపొందించుకున్నారు. మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో నటించడం కోసం విక్కీ కౌశల్ ఐదు మాసాల పాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నారు. బరువు పెరిగారు. రోజుకి ఐదు గంటల పాటు శ్రమపడ్డారు. ముంబైలోని ‘కఫ్ పరేడ్’లో గన్ ట్రయినింగ్ కూడా తీసుకున్నారు. ముంబై నవీ నగర్లోనే నటులందరికీ శిక్షణ ఇచ్చారు. ఆయుధాలు ఉపయోగించడం నేర్పారు. ‘వాస్తవ అధీన రేఖ’ సన్నివేశాలను సెర్బియాలో చిత్రీకరించారు. యామీ గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ చిత్రంలో యుద్ధం, యాక్షన్, స్ట్రాటెజీ అన్నీ ఉన్నాయి. నరేంద్రమోడి, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ పాత్రలను కూడా చూపారు దర్శకులు. సర్జికల్‌స్ట్రయిక్ అంటే?! ఇదొక సైనిక దాడి. లక్ష్యాన్ని మాత్రమే ఛేదించి.. ప్రజలకు, చుట్టుపక్క ప్రదేశాలకు, వాహనాలకు, భవంతులకు ఏ మాత్రం హాని, విధ్వంసం జరగకుండా చేసేదే సర్జికల్ స్ట్రయిక్. 1976లో ఉగాండాలోని ఎంటెబ్బే మీద ఆ ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్ చేసింది. 1981లో ఇజ్రాయిల్.. ఇరాక్ అణు రియాక్టర్ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసింది. అఫ్గానిస్తాన్‌లోని అల్‌కాయిదా స్థావరాల మీద అమెరికా చాలాసార్లు సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఇక మన దేశం 2016 సెప్టెంబరు 18న ‘ఉడి’ ప్రాంతంలో పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రయిక్ చేసింది. – డా. పురాణపండ వైజయంతి -
అయోధ్యపై ఆర్డినెన్స్ ఉండదు
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్ తీసుకు వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కోర్టు కేసు తేలేవరకు, న్యాయప్రక్రియ ముగిసేవరకు ఆర్డినెన్స్ గురించి ఆలోచించబోమన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రజలకు, విపక్ష మహాకూటమికి మధ్యనే జరగనున్నాయన్నారు. నోట్ల రద్దు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, దాన్ని ఒక షాక్ గా చూడకూడదని, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నూతన సంవత్సర తొలి ఇంటర్వ్యూను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చారు. ప్రతిపక్షాలు, మీడియా గత కొన్నాళ్లుగా లేవనెత్తుతున్న అనేక అంశాలపై వివరణ ఇచ్చారు. మీడియా ముందుకు రావడం లేదన్న విమర్శలకు జవాబు అన్నట్లుగా దాదాపు 90 నిమిషాల పాటు ముఖాముఖిలో పాల్గొని పలు ప్రశ్నలకు సదీర్ఘ సమాధానాలిచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అయోధ్యలో రామ మందిరం న్యాయ ప్రక్రియ ముగిసేవరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలనుకోవడం లేదు. ఈ సమస్యకు రాజ్యాంగ పరిధిలో పరిష్కారం చూస్తామని మా మేనిఫెస్టోలో చెప్పాం. న్యాయ ప్రక్రియ పూర్తి కానివ్వండి. ఒక ప్రభుత్వంగా మా బాధ్యత ఏమిటో అది నిర్వర్తించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ట్రిపుల్ తలాక్ పై ఆర్డినెన్స్‌ను కూడా సుప్రీంకోర్టు తీర్పు తరువాతే తెచ్చాం. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ న్యాయవాదులు అడ్డంకులు సృష్టిస్తుండటం వల్లనే తీర్పు ఆలస్యమవుతోంది. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్లు ఈ సమస్యను అపరిష్కృతంగా ఉంచేందుకే కృషి చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అది ఒక క్లిష్టమైన నిర్ణయం. అప్పుడు రాజకీయాల కన్నా జవాన్ల భద్రత గురించి ఎక్కువగా ఆలోచించాం. ఆపరేషన్ విజయవంతం కావడం కన్నా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్ల ప్రాణాలు ముఖ్యమనుకున్నా. అందుకే మెరుపుదాడుల తేదీలను రెండు సార్లు మార్చాం. ఆపరేషన్‌లో పాల్గొనే వారికి కఠోర శిక్షణ ఇచ్చాం. సర్జికల్ స్ట్రైక్స్ కోసం నియంత్రణ రేఖ దాటి వెళ్లిన ప్రతీ జవాను తిరిగొచ్చే వరకు ఉత్కంఠ, ఆందోళనతో ఎదురుచూశా. మెరుపుదాడుల్లో విజయం సాధించినా, పరాజయం పాలైనా.. అందరినీ సూర్యోదయం లోపే తిరిగిరావాలని ఆదేశించాం. ఉడీ ఉగ్రదాడి మన ఆర్మీ జవాన్లలో కసిని పెంచింది. పాకిస్తాన్ పాకిస్తాన్ అంత తొందరగా మారదు. ఒక్క యుద్ధం వల్ల పాక్ వైఖరిలో మార్పు వస్తుందని నేను భావించడం లేదు. అలా ఎవరు అనుకున్నా పొరపాటే. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా హఠాత్తుగా జరిగినదేమీ కాదు. ఏడు, ఎనిమిది నెలల క్రితమే ఆయన రాజీనామా చేస్తానన్నారు. అందుకు వ్యక్తిగత కారణాలున్నాయన్నారు. ఈ విషయం నేను ఇప్పుడు మొదటిసారి చెబుతున్నా. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడులు లేనే లేవు. ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన అద్భుతంగా పనిచేశారు. నోట్లరద్దు నల్లధనం కారణంగా దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందనే విషయంలో సందేహం లేదు. అందుకే పెద్ద నోట్లు రద్దు చేశాం. ఇది హఠాత్తు నిర్ణయం కాదు. ఏడాది క్రితమే హెచ్చరించాం. మీ దగ్గర నల్లధనం ఉంటే బ్యాంకుల్లో దానిని డిపాజిట్ చేయండి. జరిమానాలు చెల్లించండి, అందుకు ప్రభుత్వం మీకు సాయం చేస్తుందని ఏడాది ముందుగానే ప్రజలను హెచ్చరించాం. నోట్ల రద్దు ఫలితంగా మంచాల కింద, అరల్లో దాచిన కట్టల కొద్దీ నగదు బయటపడింది. అదంతా ఇప్పుడు బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. పన్నుల వసూళ్లు పెరిగాయి. ఇది గెలుపు కాదంటారా? జీడీపీతో పోలిస్తే కరెన్సీ చెలామణీ తగ్గింది. వచ్చే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. ఈ నిర్ణయాన్ని షాక్గానో, ప్రజలపై భారంగానో భావించకూడదు. మాల్యా, చోక్సీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు చర్యకు భయపడే వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారు. మా ప్రభుత్వ హయాంలో పారిపోయిన ఆ ఇద్దరినీ నేడో రేపో తిరిగి తీసుకువస్తాం. దేశ ప్రజల సొమ్ము దొంగిలించిన వారి నుంచి ప్రతిపైసా తిరిగి రాబడతాం. 2019 ఎన్నికలు రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రజలకు, విపక్ష మహా కూటమికి మధ్య జరగనున్నాయి. ఈ సారి బీజేపీకి 180 స్థానాల కన్నా ఎక్కువ రావని కొందరు చెబుతున్నారు. అలాంటి అంచనాలే 2014లోనూ వచ్చాయి. ప్రజలు నావైపే ఉన్నారనుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేవారు.. ఆ ఆకాంక్షలు నెరవేరకుండా అడ్డుకునే వారు.. ఈ ఇద్దరి మధ్యనే రానున్న ఎన్నికలు జరుగుతాయి. వారి 70 ఏళ్ల పాలన ప్రజలకు గుర్తుంది. ఫెడరల్ ఫ్రంట్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిపాదిస్తున్న కూటమి గురించి నేను వినలేదు. నాకు తెలియదు. మోదీ మ్యాజిక్ అలా అనే వారందరికీ కృతజ్ఞతలు. 2014లోనూ కొందరు మోదీ హవా ప్రభావమేం లేదన్నారు. వాళ్లే ఇప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ హవా అనేది ఒకటుందని వారు నమ్ముతున్నందుకు నేను హ్యాపీ. దాని గురించి వారికి తెలిసినందుకు సంతోషం. నా దృష్టిలో హవా అంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేవారిని విశ్వసించడమే. ప్రజలదే నిర్ణయం నా ప్రతి పనిలో నిజం ఉంది, నిజాయతీ ఉంది. నేను ఏం చేశానో, ఎలా చేశానో నిర్ణయించే బాధ్యత ప్రజలకే వదిలిపెట్టా. ప్రతిపక్షాలు మాపై దుష్ప్రచారం తప్ప మరేం చేస్తాయి? అలా చేయకుంటే వారి కూటమి ఎలా నిలుస్తుంది? మాకు హాని చేసేందుకే అవి చెడు ప్రచారం చేస్తున్నాయి. కానీ, ప్రజా తీర్పుపైనే నా విశ్వాసం. రఫేల్ ఒప్పందం రఫేల్ ఒప్పందానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు నాపై వ్యక్తిగతంగా చేస్తున్నవి కాదు. నా ప్రభుత్వంపై చేస్తున్నవి. నాపై వ్యక్తిగత ఆరోపణలైతే.. ఎవరు, ఎప్పుడు, ఎలా ఇచ్చారు? లాంటి ఆధారాలుంటే బయటపెట్టాలంటున్నా. ఊరికే బురద చల్లి పారిపోవడం కాదు. వాళ్లకు పదేపదే ఒకే విషయాన్ని అరచి చెప్పే జబ్బు ఉంది. ఈ విషయంపై పార్లమెంటులోనూ, బయట చాలాసార్లు వివరణ ఇచ్చాను. సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అసలు రక్షణ రంగ ఒప్పందాల్లో మధ్యవర్తులు ఎందుకు ఉంటారు? ‘మేక్ ఇన్ ఇండియా’ను 70 ఏళ్ల క్రితమే ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేనా పని ఇప్పుడు చేస్తుండటమే నా నేరం. మన సాయుధ దళాలకు రక్షణ రంగ ఉత్పత్తులను సమకూర్చడానికి ప్రయత్నించడమే నేను చేస్తున్న నేరంలా ఉంది. మోదీ–అమిత్ షా ద్వయం మోదీ, అమిత్‌షాల కారణంగానే బీజేపీ ముందుకు సాగుతోందని అనుకునే వారికి బీజేపీ గురించి తెలియదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. ‘హర్ పోలింగ్ బూత్, సబ్సే మజ్బూత్’ అనే నినాదంతో పోలింగ్ బూత్ నుంచే బీజేపీ పని మొదలవుతుంది. మా కార్యకర్తలు 365 రోజులూ ఇదే లక్ష్యంగా పనిచేస్తుంటారు. బీజేపీని ఒకరిద్దరు నడుపుతున్నారని భావించే వారు బీజేపీ సంస్థలను అర్థం చేసుకోలేదు. పార్టీలోని ప్రతి స్థాయి లోనూ కార్యకర్తల నాయకత్వం ఉంటుంది. అది పైకి చేరేకొద్దీ అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్ అన్న సిద్ధాంతంతో ప్రజల మెప్పును పొందుతూ బీజేపీ ముందుకు సాగుతుంది. బీజేపీ పట్టు తగ్గుతుందంటే దానర్థం మేం నష్టపోతున్నామని కాదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం అసోం, హరియాణా, త్రిపురల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. డోక్లాం వివాదం డోక్లాం సంక్షోభ సమయంలో వ్యవహరించిన తీరును బట్టే భారత్ సామర్థ్యాన్ని నిర్ణయించాలి. చైనా చేతిలో నెహ్రూ హయాంలో మాదిరిగా భారత్ మోస పోయిందని చెప్పేంత స్థాయిలో ఏదీ జరగలేదు. అయితే, పొరుగు వారితో స్నేహాన్ని కోరుకోవాలన్నదే మన సిద్ధాంతం. మన ప్రభుత్వాలన్నీ అదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. మహాకూటమి తెలంగాణలో వీళ్లు చెబుతున్న మహా కూటమి ఏమైంది? అట్టర్ ఫ్లాప్ అయింది. ఐదేళ్లుగా మనం చూస్తే, కచ్చితమైన మహాకూటమి ఏర్పాటుపై ఎవరైనా మాట్లాడారా? వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఎవరు వీరు? తమను తాము రక్షించుకునేందుకు, మద్దతు కోరుకుంటూ ‘ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటే అందరం సురక్షితంగా ఉంటాం’ అని అనుకునేవారు. వీరందరి ఎజెండా ఒక్కటే.. మోదీ. ఏ వార్తా పత్రికలో పది పేజీలు తిరగేసినా మోదీ ఇది చేయలేదు, మోదీ అలా మోదీ ఇలా అని విమర్శించే పది మంది కూటమి నేతల మాటలే కనిపిస్తాయి. దేశం కోసం వారేం చేయబోతున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారనే దానిపై ఏకాభిప్రాయం లేదు. మూక దాడులు సభ్య సమాజంలో ఇలాంటి వాటిని ఎవరూ సమర్ధించరు. అయితే, ఇవి 2014లోనే ప్రారంభమయ్యాయా? మన సమాజంలోని చెడు అలా బహిర్గతమవుతోంది. ఇలాంటి ఘటనలను అంతా కలసికట్టుగా ఖండించాల్సిందే. భారత దేశంలో అహింసే సంప్రదాయం. ఇది అలాగే కొనసాగుతుంది. చర్చలు, సంప్రదింపుల పైనే మనకు విశ్వాసం ఉంది. సబ్ కాసాథ్.. సబ్ కా వికాస్.. మా నినాదం. 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం. వర్గా ల ప్రాతిపదికన ఆ గ్రామాలను ఎంపిక చేయలేదు. ‘గాంధీ’ కుటుంబం ఆ కుటుంబంలోని నాలుగు తరాల నేతలు దేశాన్ని పాలించారు. అందుకే ఆ కుటుంబాన్ని ఒకప్పుడు ‘ప్రథమ కుటుంబం’ అనేవాళ్లు. ఆ ‘ప్రథమ కుటుంబం’లోని వ్యక్తులు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసుల్లో ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మాజీ ఆర్థిక మంత్రి(చిదంబరం) పలు ఆర్థిక అక్రమాల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవస్థల విధ్వంసం ఈ విషయంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు. పీఎంకు, పీఎంఓకు వ్యతిరేకంగా ఎన్ఏసీ(జాతీయ సలహా మండలి)ని ఏర్పాటు చేసిందెవరు? కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుంటే.. ఓ పెద్ద నేత ఆ పేపర్లను ప్రెస్‌మీట్‌లోనే చింపేస్తారు. ఇదేనా వ్యవస్థను గౌరవించడం. న్యాయవ్యవస్థలోనూ తమకు అనుకూలురైన జూనియర్లను జడ్జీలుగా నియమించలేదా? ఎంతమంది ఆర్బీఐ గవర్నర్లను బలవంతంగా పంపించలేదు? వీళ్లు వ్యవస్థల విధ్వంసం గురించి మాట్లాడుతారా? ప్రణాళిక సంఘాన్ని జోకర్ల బృందంగా అభివర్ణించింది వీరు కాదా? ట్రిపుల్ తలాక్.. శబరిమల ట్రిపుల్ తలాక్, శబరిమల రెండు వేర్వేరు అంశాలు. ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్తలాక్ను నిషేధించాయి. కాబట్టి, ఇది మతపరమైన అంశం కాదు. పొరుగునే ఉన్న పాకిస్తాన్ కూడా ట్రిపుల్తలాక్ను నిషేధించింది. కాబట్టి, దీనిని లింగ సమానత్వానికి, సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంగా గుర్తెరగాలి. ఇది మత విశ్వాసంలో భాగం కాదు. అందుకే, శబరిమల అంశంతో దీనిని పోల్చడం సరికాదు. రైతు రుణ మాఫీ రుణమాఫీతో అత్యధిక శాతం రైతులకు ప్రయోజనం కలగదు. రుణమాఫీ రాజకీయ స్టంట్. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలవి. రైతులకు సాధికారత కల్పించడమే వారి సమస్యలకు పరిష్కారం. ఆ దిశగానే మేం ఆలోచిస్తున్నాం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువగా ప్రైవేటు రుణాలే తీసుకుంటారు. వారికి రుణమాఫీతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. రుణాలు తీసుకోవాల్సి రాకుండా ఉండాల్సిన పరిస్థితి రైతులకు రావాలి. వాళ్లు పూర్తిగా రుణమాఫీ చేశామంటున్నారు. కానీ అది నిజం కా>దు. అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఉద్దేశంతోనే ‘లాలీపాప్’ కామెంట్ చేశాను. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఏదైనా రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెట్టదు. రుణమాఫీతో నిజంగా ప్రయోజనం ఉంటే.. మే మూ చేసేవాళ్లం. గతంలో దేవీలాల్(ఉప ప్రధాని) సమయం నుంచి రుణమాఫీలు చేస్తూ వస్తున్నారు. 2009లో ఎన్నికల్లో గెలవడం కోసం యూపీఏ రుణమాఫీ ప్రకటించింది. రాహుల్.. గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో, అతని మాటలూ అలాగే ఉంటాయి. ప్రణబ్ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటి నుంచే జీఎస్టీ ప్రక్రియ కొనసాగుతోంది. పార్లమెంట్లో జీఎస్టీ బిల్లును అందరూ ఆమోదించారు. జీఎస్టీకి ముందు రోజుల్లో దేశంలో పన్ను రేటు 30 నుంచి 40 శాతం వరకు ఉండేది. దీంతోపాటు కనిపించని పన్నులు, మళ్లీమళ్లీ పన్నులు అదనంగా ఉండేవి. జీఎస్టీతో పన్ను విధానం సరళమైంది. అత్యధిక పన్ను రేటు ఉండే దాదాపు 500 వస్తువులపై జీఎస్టీ వల్ల పన్ను రద్దయింది. రోజువారీ వాడే దాదాపు 1200 వస్తువులపై పన్ను 18శాతం నుంచి దాదాపుగా 5 శాతానికి తగ్గింది. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాం. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు తమను తామే విమర్శించుకుంటున్నారా లేదా తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను విమర్శిస్తున్నారా? జీఎస్టీ కొత్త విధానం. సాంకేతిక అంశాల ఆధారంగా పెనుమార్పు తీసుకువచ్చిన విధానం. దీనిపై రాజకీయ దురుద్దేశాలతో విమర్శలు చేయడం సరికాదు. కొందరు చిన్న వ్యాపారుల అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు పంపుతున్నాం. అందరం కలిసి పరిష్కరిస్తున్నాం. తాజా ఎన్నికల్లో ఓటమి.. తెలంగాణ, మిజోరంలలో బీజేపీ గెలుస్తుందని ఎవరూ భావించలేదు. ఆ ఆలోచన మాకూ లేదు. మిగతా మూడు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓడిపోయింది. కానీ మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో హంగ్ అసెంబ్లీ వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రాష్ట్రాల్లో 15 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగానే ఉంటుంది. స్వోత్కర్ష.. వాగాడంబరమే! ప్రధాని ఇంటర్వ్యూపై కాంగ్రెస్, బీజేపీల వాగ్యుద్ధం న్యూఢిల్లీ: మోదీ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ స్పందించింది. ఇంటర్వ్యూలో దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ప్రస్తావించలేదని, కేవలం వాగాడంబరం అందులో ఉంద ని ఆరోపించింది. నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకు స్కామ్‌లు, రైతాంగ సంక్షోభం.. తదితరాల వల్ల దేశ పౌరులు ఎదుర్కొన్న కష్టనష్టాలపై ప్రధాని మాట్లాడితే బావుండేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ‘నేను, నా’లకే ప్రధాని ఇంటర్వ్యూ పరిమి తమయిందన్నారు. ఇది ‘ఫిక్స్డ్ ఇంటర్వ్యూ’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రెస్ కాన్ఫెరెన్స్‌ను ఎదుర్కోవాలని సవాలు చేశారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు: బీజేపీ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలను ప్రధాని మోదీ చీల్చి చెండాడారని బీజేపీ ప్రశంసించింది. ‘ఇది సమగ్రమైన, అద్భుతమైన ఇంటర్వ్యూ. చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న అనేక అంశాలపై ప్రధాని విస్పష్ట సమాధానం, వివరణ ఇచ్చారు. విపక్ష పార్టీల స్వార్ధ ప్రచారాన్ని ప్రధాని సమర్ధంగా తిప్పికొట్టారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ పేర్కొన్నారు. ‘గత కొన్ని నెలలుగా విపక్ష పార్టీలు ప్రణాళికాబద్దంగా ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని, అబద్ధాలను ఒకే ఒక ఇంటర్వ్యూలో ప్రధాని ప్రజలకు తేటతెల్లం చేశారు. నిజం, నిజాయితీకున్న శక్తి ఇదే’ అని మరో నేత షానవాజ్ హుస్సేన్ తెలిపారు. కోర్టు కేసు తేలేవరకు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకు రాబోమని ప్రధాని స్పష్టం చేయడాన్ని జనతాదళ్(యూ) స్వాగతించింది. మోదీ హయాంలోనే రామమందిర నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. -
మరో ‘సర్జికల్’కు వెనుకాడం
డెహ్రాడూన్: సరిహద్దులకు ఆవల ఉన్న ఉగ్రవాదులపై అవసరమైతే మరోసారి సర్జికల్ దాడులకు వెనుకాడబోమని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ దేవరాజ్ అన్బూ స్పష్టం చేశారు. శత్రువు సవాలు విసిరితే భారత ఆర్మీ తమ శక్తి సామర్థ్యాన్ని చూపేందుకు వెనుకాడదని ఆయన హెచ్చరించారు. డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన భారత మిలిటరీ అకాడెమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కదనరంగంలో మహిళలను నియమించే అంశం పరిశీలనలో ఉందన్నారు. పాకిస్తాన్, చైనాలతో భారత్‌కు ఉన్న సరిహద్దు ప్రాంతాలకంటే మిగతా సరిహద్దు ప్రాంతాల్లో కాస్త భిన్నమైన పరిస్థితులుంటాయన్నారు. భారత్‌లో ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్నారు. యుద్ధరంగంలో మహిళలను పంపించేందుకు ఈ ఏడాది జూలైలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అనుమతించారని చెప్పారు. క్రమంగా మిలిటరీలో వివిధ స్థానాల్లో మహిళలను నియమిస్తామని వెల్లడించారు. కార్యక్రమం అనంతరం మిలిటరీ అధికారులతో దేవరాజ్ అన్బూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో భారత భద్రతా బలగాల స్థావరాలపై 2016లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత మిలిటరీ బలగాలు అదే ఏడాది సెప్టెంబర్ 29న ఎల్వోసీ ఆవలిలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేసి పాక్‌కు గట్టి హెచ్చరికను పంపిన సంగతి తెలిసిందే. -
మరిన్ని సర్జికల్ దాడులు..?!
న్యూఢిల్లీ : ‘సర్జికల్ స్ట్రైక్స్’ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ‘పరాక్రమ్ పర్వ్’ పేరుతో ఆర్మీ ఎగ్జిబిషన్‌ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘గత రెండు మూడు రోజుల్లో మరో పెద్ద విషయం జరిగింది. ఇప్పుడే దీని గురించి ఏం చెప్పలేను.. కానీ భవిష్యత్తులో తెలుస్తుంది’ అన్నారు. కొన్ని రోజుల క్రితం ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ సైన్యాలు నాగేంద్ర సింగ్ అనే సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌ను కాల్చి చంపారు. ఈ సంఘటన నేపధ్యంలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్ మృతికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ స్థావరాలను నాశనం చేశారనే విషయం గురించి రాజ్‌నాథ్ సింగ్ సూచనప్రాయంగా తెలియజేశారని విశ్వసనియ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక విషయం అయితే జరిగింది.. కానీ దాని గురించి ఇప్పుడేం ఏం చెప్పలేను. కానీ జరిగింది ఏదైనా మంచికే జరిగింది. నన్ను నమ్మండి. గడిచిన రెండు, మూడు రోజుల్లో చాలా గొప్ప విషయం ఒకటి జరిగింది. నిన్న, మొన్న ఏం జరిగిందనేది మీకు భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ నిగూఢంగా మాట్లాడారు. ‘నేను మన బీఎస్ఎఫ్ జవాన్లకు ఒకటే చెప్పాను. ముందు పేలిన తూటా ఎప్పటికీ మనది కాకుడదు. వారు మన పొరుగువారు. కానీ వారు కాల్పులకు తెగబడితే మాత్రం ఊరుకోకండి. విజృంభించండి అని చెప్పాను’ అని వివరించారు. పాక్ సైన్యం నాగేంద్ర సింగ్‌ని అతి క్రూరంగా చంపేసినందుకు ప్రతీకారంగా బీఎస్ఎఫ్ కొన్ని చర్యలు తీసుకున్నట్లు.. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. -
సర్జికల్ స్ట్రైక్స్ 2వ వార్షికోత్సవం
-
సర్జికల్ స్ట్రైక్స్ 2వ వార్షికోత్సవం : వెలుగులోకి మరో వీడియో
జోధ్‌పూర్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) జరిపి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ దాడుల్లో భారత సైన్యం దాదాపు 50 మంది ఉగ్రవాదులను హతం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జోధ్‌పూర్ మిలిటరీ స్టేషన్లో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే జోధ్‌పూర్ చేరుకున్నారు. తొలుత ఆయన ‘కోణార్క్ అమర వీరుల స్థూపా’న్ని సందర్శించారు. అనంతరం కోణార్క్ స్టేడియంలో సైన్యం ‘పరాక్రమ్ పర్వ్’ పేరిట నిర్వహిస్తోన్న ఆర్మీ ఎగ్జిబిషన్‌ని మోదీ ప్రారంభించారు. ఈ వేడుకల గురించి ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ ఎగ్జిబిషన్ భారత సైన్యం శౌర్య, పరాక్రమాలను ప్రదర్శించాడానికి ఉద్దేశించినవి. ఈ ఎగ్జిబిషన్‌కి జోధ్‌పూర్‌కి చెందిన 250 మంది విద్యార్థులను ఆహ్వనించాము. ఈ కార్యక్రమంలో వీరు పదాతి దళం ఉపయోగించిన ఆయుధాలను స్వయంగా వీక్షిస్తారు. అంతేకాక పిల్లలంతా ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వబడింది. దాంతో పాటు సప్తశక్తి ఆడిటోరియంలో ‘సర్జికల్ స్ట్రైక్స్’కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తాం. అనంతరం విద్యార్థులు సైన్యంలోని వివిధ హోదాలకు చెందిన అధికారులతో సంభాషిస్తార’ని తెలిపారు. -
సర్జికల్ స్ట్రైక్స్ జవాన్ వీర మరణం
శ్రీనగర్: నిత్యం దేశం కోసం పరితపించే లాన్స్ నాయక్ సందీప్ సింగ్ సోమవారం వీర మరణం పొందారు. 2016లో పీవోకేలో తలదాచుకుంటున్న ఉగ్రమూకలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌లో సందీప్ సింగ్ చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం జుమ్మూ కశ్మీర్‌లోని టాంగ్దార్ సెక్టార్లో భారత దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సందీప్ తన చివరి శ్వాస ఉన్నంత వరకు దేశం కోసం పోరాడుతూనే ఉన్నారు. శనివారం టాంగ్దార్ సెక్టార్లో ఉగ్ర కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వారిని నివారించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగా ఆది, సోమ వారాల్లో ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఆపరేషన్‌లో సందీప్ ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ ప్రయత్నంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అతని శరీరంలోకి బులెట్లు దూసుకెళ్లాయి. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. కాగా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన సందీప్‌కు భార్య, ఐదేళ్ల బాబు ఉన్నారు. -
భారత్ సర్జికల్ స్ట్రైక్ వీడియో..!
-
‘భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది’
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన’ పై హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ..భారత్ మాట కోసం ప్రపంచం ఎదురుచూసేలా మోదీ దేశ గౌరవాన్ని పెంచారన్నారు. రష్యా, చైనా దేశాలు ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించాయని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగేళ్ల నుంచి దేశ ఆర్థికస్థితి స్థిరంగా, వేగంగా పెరుగుతోందన్నారు. రెండులక్షల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ నాలుగేళ్లలో వెయ్యగలిగామని పేర్కొన్నారు. 120 కంపెనీలు స్వదేశంలోనే మొబైల్స్ తయారు చేస్తున్నాయని, గ్రామీణ, పట్టణ రహదారులు వేగంగా నిర్మించామని తెలిపారు. 50కోట్ల మందికి 5లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. ఆధార్ వాడకంలో ప్రైవసీ, సెక్యూరిటీని పెంచామని, సర్టికల్ స్ట్రైక్ లాంటి గట్టి నిర్ణయాలు మోదీ సర్కార్ తీసుకుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఒంటరి చేశామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ఇలా ప్రతి పథకం ప్రజల కోసమే అమలు చేశామన్నారు. దేశంలో అందరికి జన్‌ధన్ ఖాతా తెరిపించి డిజిటల్ పరిపాలన పెంచామని ఆయన పేర్కొన్నారు. -
'సర్జికల్ స్ట్రైక్స్ నేను లైవ్‌లో చూశా.. '
సాక్షి, న్యూఢిల్లీ : అసలు భారత్ సర్జికల్ దాడులు నిర్వహించిందా? నిజంగా నిర్వహిస్తే దానికి సంబంధించిన ఆధారాలు ఏవి ? అంటూ పాకిస్థాన్‌తోపాటు భారత్‌లో కూడా పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని, మిలిటరీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడులు నిర్వహించే సమయంలో ఆర్మీ అధికారులు ఢిల్లీలో లైవ్ స్ట్రీమ్ చేశారంట. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతం చేసే సమయంలో వైట్ హౌస్‌లో ఉండి నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎలా వీక్షించారో ఢిల్లీ, ఉదమ్ పూర్లోని ఆర్మీ ఉన్నతకార్యాలయంలో లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షించారు. ఈ విషయాన్ని ఆ సమయంలో ఇన్చార్జ్గా వ్యవహరించిన డీఎస్ హుడా అనే ఆర్మీ అధికారి తెలియజేశారు. 'అవును.. మాకు లైవ్ ఛాయా చిత్రాలు వచ్చాయి. ఆ సమయంలో నేను ఉదమ్‌పూర్‌లో ఆపరేషన్ నిర్వహణ రూమ్‌లో కూర్చొని ఉన్నాను. లక్షిత ప్రాంతాలపై మన సైనికులు ఎలా దాడి చేశారో నేను లైవ్‌లో చూశాను. అదే మొత్తం లైవ్‌ను ఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు కూడా పంపించాం' అని చెప్పారు. అయితే, ఢిల్లీలో లైవ్‌ను ఎవరు చూశారని ప్రశ్నించగా 'ఆ లైవ్ ఫుటేజీని ఢిల్లీలో ఎవరు చూశారో నాకు తెలియదు.. మేం మాత్రం ఉదమ్‌పూర్‌లో చూశాం.. ఇందుకోసం ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారనే విషయం నేను చెప్పను.. కానీ, ఎక్కడి దాడినైనా లైవ్‌లో పంపించగల సామర్థ్యం భారత ఆర్మీకి ఉంది' అని చెప్పారు. దాడిలో పాల్గొని సైనికులు ఉదయం 6.30గంటలకు తిరిగొచ్చేశారని తెలిపారు. -
భారత జవాన్‌ను విడుదల చేసిన పాక్!
న్యూఢిల్లీ: నిన్నటిదాకా భారత్‌తో కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్ నేడు అనూహ్యంగా స్నేహ హస్తం చాచింది. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన రోజే (సెప్టెంబర్ 29నే) పొరపాటున సరిహద్దు దాటి పాక్‌లోకి ప్రవేశించిన జవాన్ చందు బాబుల్ చౌహాన్‌ను శుక్రవారం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద పాక్ సైనికాధికారులు జవాన్ చందును భారత అధికారులకు అప్పగించింది. 22 ఏళ్ల చందు చౌహాన్.. రాష్ట్రీయ రైఫిల్ బలగానికి చెందిన సైనికుడు. పొరపాటున సరిహద్దుదాటిన అతణ్ని పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా చౌహాన్ పాక్‌లోనే బందీగా ఉన్నాడు. అతణ్ని విడిపించేందుకు కేంద్ర హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. భారత ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని, మానవీయదృష్టితో జవాన్ విడుదలకు అంగీకరించామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చోటుచేసుకున్న తర్వాతి రోజే భారత జవాన్ పాక్ చేతికి చిక్కడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే చందూ చౌహాన్ సర్జికల్ దాడుల్లో పాల్గొన్న జవాను కాదని, పొరపాటున సరిహద్దు దాటాడని భారత సైన్యం ప్రకటించింది. చందూ విడుదలపై మహారాష్ట్రలోని అతని కుటుంబం చెప్పలేనంత సంతోషం వ్యక్తంచేసింది. -
నోట్ల రద్దు నష్టం రూ.1.28 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వంపై ఉత్తమ్ ధ్వజం ► మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని మండిపాటు ►ఆర్బీఐ కార్యాలయం ఎదుట టీ పీసీసీ ధర్నా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అపార నష్టం కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్ శాస్త్రి మండిపడ్డారు. మోదీ సర్కారు అనాలోచిత, మూర్ఖపు, పిచ్చి తుగ్లక్ నిర్ణయం వల్ల అన్ని రంగాలకు దాదాపు రూ. 1.28 లక్షల కోట్ల నష్టం కలిగిందన్నారు. నోట్ల రద్దును నిరసిస్తూ హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఎదుట టీ పీసీసీ శుక్రవారం ధర్నా నిర్వహించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు కాంగ్రెస్ సీనియర్లంతా ధర్నాలో పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేదలపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. దేశంలో 86 శాతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రధాని తన నిర్ణయంతో ఆర్బీఐపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కూడా దెబ్బ తీశారని విమర్శించారు. ఈ నిర్ణయం తర్వాత 138 సార్లు నగదు డిపాజిట్లు, ఉపసంహరణల నిబంధనలను మార్చారన్నారు. నగదు కోసం బ్యాంకుల వద్ద కూలైన్లలో నిలబడి దాదాపు 120 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారని, ఇందుకు బాధ్యత వహించి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మాట మార్చిన మోదీ... పెద్ద నోట్ల రద్దు జాతీయ స్థూల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, రబీలో సాగు విస్తీర్ణం చాలా వరకు పడిపోయిందని ఉత్తమ్ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోగా, నిజాయితీపరులే నగదు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోవడంతో ప్రధాని మోదీ నగదు రహిత, డిజిటల్ లావాదేవీలంటూ కొత్తరాగం అందు కున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో నోట్ల మార్పిడి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు నోట్లను మార్చుకోవాలనుకుంటే నాగపూర్, చెన్నై ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లాలని బ్యాంకులు చెబుతున్నా యని...దీనిపై సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నోట్ల రద్దును తొలుత దిక్కుమాలిన నిర్ణయంగా అభివర్ణించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత మాటమా ర్చడంలో మతలబు ఏమిటో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు ఆర్.సి.కుంతియా, జి.చిన్నారెడ్డి, వి.హన్మంతరావు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, డి.కె.అరుణ, సునీతా లక్ష్మా రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, రంగారెడ్డి, నేతలు నేరెళ్ల శారద, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, బండ కార్తీకరెడ్డి పాల్గొన్నారు. నష్టపోతున్నామంటూ కేంద్రానికి మద్దతేల? పెద్ద నోట్ల రద్దు వల్ల రుణమాఫీ చేయలేకపోతున్నా మని, ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేకపోతున్నా మని, ఆదాయం పడిపోయిందని చెబుతున్న కేసీఆర్... మోదీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతిస్తున్నారని ఉత్తమ్, నోట్ల రద్దు వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దును దిక్కుమాలిన నిర్ణయమంటూ అసహనం ప్రదర్శించిన కేసీఆర్... ఉన్నఫళంగా వైఖరిని ఎందుకు మార్చుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అసలు రహస్యం ఏమిటో ప్రజలే చర్చించుకుంటున్నారని చెప్పారు. పేద మహిళల ఖాతాల్లో రూ. 25 వేలు డిపాజిట్ చేయాలి: అనిల్‌శాస్త్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్ శాస్త్రి మాట్లాడుతూ విదేశీ కంపెనీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి, దేశంలోని బడా కంపెనీలను బాగుచేయడానికే మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో నష్టపోయిన ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు బ్యాంకులో వేసుకున్న నగదును ఉపసంహరించుకోవడానికి పరిమితు లను తొలగించాలని డిమాండ్ చేశారు. పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 25 వేల చొప్పున జమ చేయాలని కోరారు. అలాగే ఉపాధి హామీ చట్టం కూలీ రేట్లు పెంచాలని, పని దినాలను రెట్టింపు చేయాలని, చిరు వ్యాపారులకు పన్ను మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. 27న జన ఆవేదన సమ్మేళనం పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రానికి తెలియ జేప్పేందుకు ఈ నెల 27న సికింద్రాబాద్‌లో భారీగా జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. నోట్ల రద్దుపై టీపీసీసీ ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం గాంధీ భవన్ లో సమావేశమైంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా ముఖ్య నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు. -
ఉగ్రదాడి: భారీ సంఖ్యలో భారత సైనికుల మృతి!
- 30 మందిని చంపేశాం: ఉగ్రనాయకుడు హఫీజ్ సయీద్ - అది తప్పు, చనిపోయింది ముగ్గురే: ఇండియన్ ఆర్మీ న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా, జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ ఆర్మీ క్యాంపుపై నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాడి చేశారని, మొత్తం 30 మంది సైనికులను చంపేసి, సురక్షితంగా తప్పించుకున్నారని టెర్రరిస్టు నాయకుడు హఫీజ్ సయీద్ చెప్పుకున్నాడు. అయితే భారత సైన్యం మాత్రం ఆ ప్రకటనను ఖండించింది. హఫీజ్ చెప్పినట్లు కాక, వేరొక ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోయారని వివరణ ఇచ్చింది. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉల్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ బుధవారం ముజఫరాబాద్‌లో ఒక సభ నిర్వహించాడు. ఆ ప్రసంగం తాలూకు ఆడియోను పలు వార్తా సంస్థలు ప్రసారం చెయ్యడంతో దుమారం చెలరేగింది. పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ బూటకమని, ఈ విషయంలో మోదీ సర్కారు ప్రపంచాన్ని మోసం చేసిందని హఫీజ్ ఆరోపించాడు. ‘అసలైన సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందో మన ముజాహిద్దీన్లు(ఉగ్రవాదులు) మొన్ననే(సోమవారం) ఇండియాకు రుచి చూపించారు. అఖ్నూర్ ఆర్మీపై మెరుపుదాడిచేసి, 30 మంది సైనికుల్ని చంపేసి, చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా తిరిగొచ్చారు’అని ఆడియోలో హఫీజ్ అన్నాడు. అసలేం జరిగిందంటే.. హఫీజ్ వ్యాఖ్యలను ఖండించిన భారత సైన్యాధికారులు ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. ‘పాక్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్(డీఆర్‌ఈఎఫ్) క్యాంపుపై సోమవారం ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ 10 మంది సిబ్బంది, మరో 10 మంది కూలీలు ఇంజనీరింగ్ పనులు చేస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు డీఆర్‌ఈఎఫ్ కూలీలు చనిపోగా, మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. హఫీజ్ చెప్పుకున్నట్లు 30 మంది చనిపోవడంగానీ, ఆర్మీ క్యాంపుపై దాడిగానీ జరగలేదు’ అని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
ఈసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ గురి తప్పింది
న్యూఢిల్లీ: నల్ల కుబేరులపై నిజంగా ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేసే సదావకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేజార్చుకున్నారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1978లో పదివేలు, ఐదువేల రూపాయల నోట్లను నిషేధించినప్పుడు దేశంలో ఆర్థికంగా మంచి ఫలితాలు వచ్చాయని, వ్యక్తుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు కూడా తరిగి పోయాయని వారంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వెయ్యి రూపాయల నోటుకు మించిన నోట్లను భారత ప్రభుత్వం తీసుకరాకపోవడం కూడా కొంత నల్ల డబ్బును అరికట్టిందని వారు చెబుతున్నారు. ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను నిషేధిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, అయితే రెండు వేల రూపాయల కొత్త నోటును తీసుకురావడం ద్వారా అనసరంగా లక్ష్యాన్ని గురితప్పారని కొంతమంది ఆర్థిక వేత్తల అభిప్రాయం. రెండు వేలకు బదులుగా రెండు వందల నోటును తీసుకొచ్చి ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉండేవని వారంటున్నారు. కొంత మంది నల్ల కుబేరులు పెద్ద నోట్లను పరుపుల్లో దాచుకుంటారని ఓ నానుడిగా చెబుతారు. దాని ప్రకారమే ఆలోచిస్తే రెండు పరుపుల్లో దాచుకునే సొమ్ము ఇప్పుడు ఒక్క పరుపులోనే దాగి పోతుంది. కొత్త నోటు పాత వెయ్యి రూపాయిలకన్నా పలుచగా ఉన్నందున మరిన్ని ఎక్కువ నోట్లను దాచుకోవచ్చు. కొత్త ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యుంటాయని, వాటికి బదులు 200 నోట్లను మాత్రమే తీసుకొచ్చి, ఆన్లైన్, మొబైల్ చెల్లింపుల వ్యవస్థను ప్రోత్సహించినట్లయితే నరేంద్ర మోదీకి ఆశించిన ప్రయోజనం దక్కేదని ఆర్థిక నిపుణుల అంచనా. పేటీఎం, ఫ్రీచార్జ్, పేటూయు లాంటి ఆన్లైన్ చెల్లింపుల సంస్థలెన్నో నేడు అందుబాటులోకి వచ్చాయి. మరింత సులువైన అప్లికేషన్లతో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ చెల్లింపులను ప్రోత్సహించినట్లయితే క్రమంగా నల్లడబ్బు దానంతట అదే కరుగుతూ వచ్చేది. నల్ల డబ్బంటే కేవలం డబ్బు రూపంలోనిదేనన్న భ్రమ కొంత మంది ప్రజల్లో ఉంది. ప్రధానంగా స్థలాలు, బంగారం రూపంలో ఎక్కువగా ఉంటోంది. ఈ బంగారమే విదేశీ బ్యాంకులకు నల్ల డబ్బును తరలించేందుకు ప్రధాన సాధనంగా కూడా మారింది. కేవలం నల్ల డబ్బును అరికట్టినంత మాత్రాన అవినీతి, చీకటి సొమ్ము నిలిచిపోదు. అన్ని రూపాల్లో ఉన్న నల్ల డబ్బును అరికట్టాలంటే సింగిల్ ఎంట్రీ పాస్‌బుక్ వ్యవస్థను తీసుకరావచ్చు. దానికి అవసరమైతే ఆధార్ కార్డును కూడా జత చేయవచ్చు. దేశ పౌరుడికి దేశ, విదేశాల్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో వాటిన్నింటి వివరాలను ఆ పాస్ బుక్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. బంగారు నగల విలువలను కూడా జత చేయాలి. ప్రతి పౌరుడి ఆర్థిక లావాదేవీలు ఆటోమేటిక్‌గా ఆ పాస్‌బుక్‌లోకి ఎంట్రీ అవ్వాలి. వాటికి ప్రతి పౌరుడి నుంచి కచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాలి. డిక్లరేషన్‌ను ఉల్లంఘించినట్లయితే కఠిన శిక్షలు అమలుచేసే చట్టాలు తేవాలి. అప్పుడే మోదీ కల సంపూర్ణంగా నెరవేరగలదని కొంత మంది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
ఈ సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై చేయండి!
-
ఈ సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై చేయండి!
పెద్ద నోట్లను రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై శివసేన మండిపడింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ సామాన్యులపై కాదని.. స్విస్ బ్యాంకుపై చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. నల్లధనం పెద్ద మొత్తంలో స్విస్ బ్యాంకులో దాగిఉన్న సంగతి విదితమే. నల్లధనం వెలికితీతకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం లేదని, కానీ అమలుచేసే పద్ధతే సరియైనది కాదన్నారు. పెద్ద నోట్ల రద్దుచేస్తూ ప్రధాని వెల్లడించిన నిర్ణయంతో సామాన్య ప్రజలు అవస్తలు పాలవుతున్నారని విమర్శించారు. ప్రజలు మనకి ఓటేసిన సంగతి మరచిపోకూడదు. ఇది ఇలానే కొనసాగిస్తే.. ప్రజలు మనపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని హెచ్చరించారు. దబార్లో శివసేన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాలు తెలిపారు. '' తరుచూ ప్రజలతో మన్ కీ బాత్ నిర్వహించే మోదీజీ.. ప్రజల మాటను మరచిపోయినట్టు కనిపిస్తున్నారు. ధన్ కీ బాత్ ఎంపికచేసుకున్నారు'' అని వ్యాఖ్యానించారు.. వేల కొద్దీ స్విస్ బ్యాంకులో దాగిఉన్న బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని మోదీని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లపై బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడే మోదీ చర్యలకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. నల్లధనంపై ఉక్కుపాదం మోపండి, కానీ సామాన్య ప్రజలపై కాదని సలహా ఇచ్చారు. ప్రజలకోసం మంచి చేస్తున్నట్టు చూపిస్తూనే, మరోవైపు ప్రజల సొంత డబ్బుతోనే వారిని చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి కూడా వారి దగ్గర డబ్బు లేదని, పెళ్లిళ్లూ ఆగిపోయాయని చెప్పారు. బ్యాంకు క్యూలో నిల్చుని ఓ సీనియర్ సిటిజన్ మరణించడంతో, ఆయన మృతికి ఎవరు బాధ్యులని ఠాక్రే ప్రశ్నించారు. -
నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్: రాజ్‌నాథ్
బలియ: పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగానే దేశంలోని నల్ల కుబేరులపై సర్జికల్ స్ట్రైక్స్ చేశామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ బిలియ జిల్లాలో పరివర్తన్ ర్యాలీలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో నల్లధనానికి శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో దేశంలో చెలామణి అవుతున్న నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడినట్లు అయిందన్నారు. కాగా రూ.500, 1000 నోట్లు రద్దు వెనుక నల్ల ధనాన్ని అరికట్టడమే కాకుండా, నకిలీ నోట్లు అన్నవి లేకుండా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీ తయారు చేయడం దాదాపు అసాధ్యమేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. -
పాక్, నల్లధనం.. మూడో సర్జికల్ స్ట్రయిక్ దీనిపైనే!
ఇప్పటికే మాట వినని పాకిస్థాన్‌పై, దేశంలో మూలుగుతున్న నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్జికల్ స్ట్రైకులు జరిపారు. వీటి తర్వాత ఇక సర్జికల్ స్ట్రైక్స్ జరపాల్సింది క్రీడారంగంపైనే అంటున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు షట్లర్ పీవీ సంధును సత్కరించిన సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని స్పోర్ట్స్ అసోసియేషన్లను ప్రక్షాళన చేయడానికి సర్జికల్ స్ట్రైక్స్ జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. క్రీడలతో అనుబంధమున్న వారే క్రీడా పరిపాలక సంస్థల్లో ఉండాలని ఆయన తేల్చిచెప్పారు. నిజానికి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఇదే విషయమై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ జాతీయ కార్యదర్శి అయిన కైలాశ్ విజయ్వార్గియా కూడా ఇండోర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా స్పోర్ట్స్ బాడీల్లో పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న నేతలు ఇలా క్రీడలతో అంటకాగి భ్రష్టుపట్టిస్తుండటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు పీవీ సింధుకు సీఎం చౌహాన్ బహూకరించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. -
కేంద్ర హోంశాఖ అత్యున్నతస్ధాయి సమావేశం
-
తప్పు దిద్దుకున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను బహిర్గతం చేయాలని చేసిన వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతోతన తప్పును దిద్దుకునే ప్రయత్నాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేశారు. ఈ విషయంలో రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు. మనమందరం భారత ఆర్మీ వెనకాలనిలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని 'రక్త వ్యాపారి' అని సంభోదించడాన్నికేజ్రీ తీవ్రంగా తప్పుబట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేశామని ప్రకటించగానే నరేంద్రమోదీకి, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ తాను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ అంతర్జాతీయ మీడియాలో అసలు అలాంటిది జరగలేదని బొంకుతున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతోనే తాను సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశానని తెలిపారు. పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని అన్నారు. అందుకు ఈ దేశం ప్రధాని వెనకాల ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.కాగా సైనికులు వీరోచితంగా పోరాడితే దానిని నరేంద్రమోదీ రక్త వ్యాపారిలా వాడుకుంటున్నారని రాహుల్ విమర్శించిన విషయం తెలిసిందే. -
పంజబ్‌లో రాజకీయ యుద్దం ప్రారంభం
-
మోదీపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులు 'ఫేక్' అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర పరుషమైన వ్యాఖ్యలు చేశారు. భారత జవాన్ల త్యాగాలతో మోదీ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ విరుచుకుపడ్డారు. 'మన జవాన్లు వారి రక్తాన్ని ఇచ్చారు. దేశం కోసం సర్జికల్ దాడులు చేశారు. కానీ మీరు (మోదీ) వారి (జవాన్ల) నెత్తురు వెనుక దాక్కుంటున్నారు. వారితో దళాలీ (వ్యాపారం) పనిచేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు' అని ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ ఆగ్రహంగా పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. సైన్యం సత్తాను ప్రశ్నించేలా రాజకీయ వ్యాఖ్యలు వెలువడటంతో సర్జికల్ దాడుల వీడియో దృశ్యాలను సైన్యం కేంద్ర ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే. -
మోదీపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు!
-
కేజ్రీవాల్, చిదంబరంపై కేసు
ముజఫర్‌పూర్: సర్జికల్ దాడులపై వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ నేతలు పీ చిదంబరం, సంజయ్ నిరుపమ్లపై బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో కేసు నమోదైంది. సర్జికల్ దాడులపై ఆధారాలు వెల్లడించాలంటూ భారత సైన్యాన్ని అవమానించేలా ఈ ముగ్గురూ వ్యాఖ్యానించారని, వీరిని విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జగన్నాథ్ షా అనే వ్యక్తి దేశ ద్రోహం కేసు పెట్టారు. ఈ కేసును ఈ నెల 19న కోర్టు విచారించనుంది. ఫిర్యాదు చేసిన జగన్నాథ్ షా .. ఆప్ ఔర్ హమ్ అనే కొత్త పార్టీకి అధ్యక్షుడు. -
'పాకిస్థాన్ మాటలు నమ్మొద్దు'
న్యూఢిల్లీ: అబద్దాలు ఆడడం పాకిస్థాన్ డీఎన్ ఏ భాగమని, దేనిని అంగీకరించకపోవడం ఆ దేశం నైజమని ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో పాకిస్థాన్ మాటలు నమ్మొద్దని, మన సైన్యానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. అసత్యాలు ప్రచారం చేయడానికి దాయాది దేశం ఎప్పుడు వెనుకాడబోదని మండిపడ్డారు. పాక్ నాయకులు పచ్చి అబద్దాలుకోరులని దుయ్యబట్టారు. పాకిస్థాన్ మిలటరీ, దౌత్యపరంగా కార్గిల్ లోనే ఓడిపోయిందని గుర్తు చేశారు. బిన్ లాడెన్ ను చంపినపుడే పాకిస్థాన్ ఎటువంటిదో ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోలు బయటపెట్టమని అడిగే అధికారం అందరికీ లేదని స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనికి సంబంధించిన ఆధారాలు ఎవరికీ పడితే వారికి ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. ఆర్మీ ఒక విషయం చెప్పిన తర్వాత అనుమానాలు అవసరం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. -
మోదీ రాముడైతే.. రావణుడెవరో తెలుసా?
వారణాసి: ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడులతో పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. ఆర్మీ సర్జికల్ దాదాడుల వీడియోలు విడుదలచేయాలంటున్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు.. దీనికి బీజేపీ ప్రతివిమర్శలు.. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో రాజకీయం కొత్త పోకడలు పోతోంది. బుధవారం వారణాసిలో వెలిసిన 'రాంలీలా' పోస్టర్ అందుకు నిదర్శనంగా నిలిచింది. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఏర్పాటుచేసిన పోస్టర్ లో ప్రధాని నరేంద్రమోదీని యుద్ధం చేస్తోన్న రాముడిగా చిత్రీకరించారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను రావణాసురుడిగా పేర్కొంటూ.. 'ఓరీ.. రావణా కాసుకో.. ఇంకా ఒకేఒక్క సర్జికల్ స్ట్రైక్ బాణంతో నీ కథ ముగుస్తుంది'అని రాముడు(మోదీ) హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని ప్రకటనలు చేస్తూ పలు విమర్శలకు గురయిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రావణుడి కొడుకు మేఘనాథుడిగా పేర్కొన్నారు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ డిమాండ్ చేస్తున్నట్లే కేజ్రీవాల్ కూడా సర్జికల్ దాడుల సాక్ష్యాధారాలు అడుగుతున్నారని, ఒకరకంగా అది దేశద్రోహమేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి అన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆపరేషన్ కు రాజకీయాలు జోడించి పోస్టర్లు రూపొందించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. -
'సర్జికల్ స్ట్రైక్స్'పై సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ మరోసారి తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడుల వాస్తవికతను ఆయన ప్రశ్నించారు. ఆర్మీ సర్జికల్ స్టైక్స్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారని, నకిలీ దాడులు కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. 'పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిర్దేశిత దాడులు చేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం నకిలీ దాడి చేయాలని ప్రజలు కోరుకోలేదు. జాతి ప్రయోజనాలపై రాజకీయాలు చేయడం తగద'ని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నిరుపమ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించారు. సైనికుల విశ్వసనీయతను దెబ్బతీసేలా నిరుపమ్ వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. Every Indian wants #SurgicalStrikesAgainstPak but not a fake one to extract just political benefit by #BJP. Politics over national interest pic.twitter.com/4KN6iDqDo5 — Sanjay Nirupam (@sanjaynirupam) 4 October 2016 -
ప్రధాని మోదీకి నా సెల్యూట్: సీఎం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడులు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలో అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది. నిత్యం ఆయన్ను విమర్శించేవారు సైతం ప్రశంసిస్తున్నారు. మోదీతో, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంభించే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల వర్షం కురిపించారు. పలు విషయాల్లో మోదీతో తాము విబేధించినా, సర్జికల్ దాడుల విషయంలో ఆయన చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్నానంటూ కేజ్రీవాల్ అన్నారు. సర్జికల్ దాడులను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై పాక్ ఆర్మీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లోని ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి బదులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేసి పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పార్టీలకతీతంగా అందరూ సమర్థించారు. రెండేళ్లలో ప్రధాని పదవికి తగ్గట్టు మోదీ చేసిన మొదటి మంచి పని ఇదేనని, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. -
'వాళ్లను వివాదాల్లోకి లాగొద్దు'
న్యూఢిల్లీ: భారత్-పాక్ వివాదాల్లోకి సినీ కళాకారులను, ఆటగాళ్లను లాగొద్దని సీపీఐ నేత సీతారం ఏచూరి అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారిని ఆయా రంగాల్లో రాణించనివ్వాలని ఆయన శనివారమక్కడ వ్యాఖ్యానించారు. కాగా, సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పరిస్ధితులు సద్దుమణిగే వరకూ పాక్ సినీ కళాకారులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కళలు, ఆటలను సమస్యలకు అతీతంగా నడవనిచ్చే స్ధాయికి అందరూ చేరుకోవాలని ఏచూరి అన్నారు. పాక్ సినీ కళాకారుల నిషేధంపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కళాకారుల్లో లేదా ఆటగాళ్లలో ఎవరైనా దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తారని భావిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
పాక్‌తో యుద్ధం తప్పదేమో..!
టీపీసీసీ చీఫ్, మాజీ సైనికాధికారి ఉత్తమ్ * ఒకవేళ అనివార్యమైతే పాక్ ఉండదు * సరిహద్దు పరిణామాలపై ‘సాక్షి’తో అభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులనుబట్టి చూస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ సైనికాధికారి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఏడు ఉగ్రవాద శిబిరాలపై సైన్యం మెరుపుదాడి (సర్జికల్ స్ట్రైక్) చేపట్టిన నేపథ్యంలో సరిహద్దులోని తాజా పరిణామాలపై ఆయన శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పాక్‌తో సరిహద్దు వెంబడి 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను సైన్యం ఖాళీ చేయించడం, కశ్మీర్‌లోని పాఠశాలలను మూసివేయించడం, యుద్ధ విమానాలు, బలగాలను మోహరించడం వంటి వాటినిబట్టి చూస్తే యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఉత్తమ్ అభిప్రాయాలు, సూచనలు ఆయన మాటల్లోనే.... ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి పాకిస్తాన్లో అపరిపక్వ నాయకత్వం, కొరవడిన ప్రజాస్వామిక స్ఫూర్తి, జీహాదీ మనస్తత్వంబట్టి ఆ దేశం ఎలా స్పందిస్తుందో ఊహించలేం. మేం నష్టపోయినా సరే భారత్‌కు నష్టం చేయాలనే ప్రతీకార ధోరణితోనే పాక్ ఉండే అవకాశం ఎక్కువ. అందుకని యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువ. దీనికి కొన్ని నెలలు పడుతుంది. 1971లో పాక్‌తో యుద్ధానికి ముందు మొదటి సంకేతం వెలువడిన ఏడాది తర్వాత ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. అందుకని ఒకవైపు సైనిక చర్యలకు దిగుతూనే అంతర్జాతీయంగా అన్ని దేశాలను కూడగట్టుకుని పాక్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేసుకోవాలి. అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పాకిస్తాన్‌కు మనం ఇచ్చిన హోదాతో వ్యాపార, వాణిజ్యాల్లో ఆ దేశం ఎక్కువగా లాభపడుతోంది. ఈ హోదాను రద్దు చేసి పాక్‌ను శత్రు దేశంగానే చూడాలి. అమెరికాతో ఏర్పడిన సత్సంబంధాలను ఉపయోగించుకుని పాక్‌కు అగ్రరాజ్యం నిధులను అడ్డుకోవాలి. పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించేలా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవాలి. అలాగే ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార సంబంధాలపై ఒత్తిడి కలిగించాలి. యుద్ధం అనివార్యమైతే.... పాకిస్తాన్ ప్రధాన మంత్రి సైన్యం చేతిలో కీలుబొమ్మ. అణ్వాయుధాల వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో నిషేధ ఒప్పందాలున్నా యి. దీంతోపాటు అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ఇప్పటిదాకా యుద్ధాలు జరగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సైనిక, వైమానిక, నౌకా దళాలు రెండు దేశాలకు ఉన్నాయి. యుద్ధం జరిగితే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్లో బలూచిస్తాన్ కూడా ఏర్పాటుకావడం తప్పదు. యుద్ధం వల్ల భారత్‌కు కొంత నష్టం జరిగినా పాకిస్తాన్‌కు ఉనికి కూడా ఉండదు. నేనూ యుద్ధానికి వెళ్తా... సర్జికల్ స్ట్రైక్‌ను సైనిక దళాలు సమర్థంగా నిర్వహించాయి. సైనికుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఎంత పొగిడినా తక్కువే. సరిహద్దులో సైనికాధికారిగా రెండు దశాబ్దాలపాటు వివిధ బాధ్యతలను నిర్వహించిన చాలా తక్కువ మంది అధికారుల్లో నేనూ ఒకడిని. నేను రిజర్వులో ఉన్నా. యుద్ధం వస్తే నన్నూ పిలుస్తారు. దేశం కోసం పనిచేసే భాగ్యం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది..? తప్పకుండా యుద్ధంలో పాల్గొంటా. -
భారత్-పాక్ బోర్డర్లో ఉద్రిక్తత
-
అదే జరిగితే ప్రపంచ పటంలో పాక్ ఉండదు
-
ఉడీ దాడి చేసింది ఎవరు?: సల్మాన్ ఖాన్
ముంబై: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ దాడిని సంపూర్ణంగా సమర్థిస్తున్నానన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఇంతటితో ఉడీకి సంబంధించి ప్రతీకారం తీరినట్లేనని వ్యాఖ్యానించారు. ఇండియాలో పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించడం సరికాదన్న ఆయన నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుపట్టారు. 'ఉడీ సైనిక స్థావరంపై దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులేకదా, పాకిస్థానీ నటీనటులు కాదుకదా! మరి అలాంటప్పుడు నటీనటులపై నిషేధం ఎందుకు?' అని ప్రశ్నించాడు. శుక్రవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ విలేకరులతో మాట్లాడుతూ.. 'వాళ్లు ఉగ్రవాదులు కాదు. నటులు. ఇక్కడ(ఇండియాలో) పని చేసుకునేందుకు వీసా తీసుకొనిమరీ వచ్చారు. మన ప్రభుత్వమే వీసాలు మంజూరుచేసింది' అని వ్యాఖ్యానించిన సల్మాన్.. 'వాళ్లు నటులా? ఉగ్రవాదులా?' మీరు చెప్పండి.. అని విలేకరులను ప్రశ్నించారు. పాకిస్థానీ నటులు ఇండియాను విడిచి వెళ్లాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాక్ నటీనలులపై నిషేధం విధిస్తున్నట్లు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సైఫ్ అలీఖాన్, దీపికా సహా పలువురు ఆర్టిస్టులు ఖండించారు. తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ వంతు. -
ఉడీ దాడి చేసింది ఎవరు?: సల్మాన్ ఖాన్
-
‘అదే జరిగితే ప్రపంచ పటంలో పాక్ ఉండదు’
తిరుపతి : ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్‌ను భారత సైన్యం వ్యూహాత్మకంగా విజయవంతం చేసిందని భారత మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఏఆర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ’సాక్షి టీవీ’ తో మాట్లాడుతూ ...దాడి విషయంలో ఇందుకు 10 ఏళ్లుగా పక్కాగా సేకరించిన సమాచారం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆలస్యంగా అయినా పాకిస్తాన్‌కు భారత్ సైన్యం తగిన బుద్ధి చెప్పిందని ఏఆర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. యుద్ధం వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, యుద్ధాన్ని భారత సైనిక దళాలు ధీటుగా ఎదుర్కొంటాయని ఏఆర్ రెడ్డి తెలిపారు. అణు అస్త్రాలు ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్ బెదిరింపులకు పాల్పడుతోందని, వాటి ప్రయోగం అంత సులువు కాదని ఆయన అన్నారు. అదే జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని ఏఆర్ రెడ్డి అన్నారు. కాగా సీమాంతర ఉగ్రభూతంపై భారత్ పంజా విసిరిన విషయం తెలిసిందే. భారత సైన్యం బుధవారం అర్థరాత్రి నియంత్రణ రేఖను దాటి మెరుపు దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పొంచిఉన్న ఉగ్రమూకలను అంతమొందించింది. సుమారు నాలుగుగంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ లో 38మంది ఉగ్రవాదులతో పాటు, వారికి మద్దతు ఇస్తున్న ఇద్దరు పాక్ సైనికులు కూడా చనిపోయినట్లు అంచనా. -
పాక్‌లో మోదీ స్వచ్ఛభారత్: సెహ్వాగ్
తన బ్యాటింగ్ లాగానే.. ట్విట్టర్ లో కూడా విలక్షణంగా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. సర్జికల్ స్ట్రైక్ పై తన దైన శైలి లో స్పందించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సరిహద్దులు దాటి పొరుగు దేశంలో కూడా మొదలు పెట్టారంటూ ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం అక్కడి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ మధ్య కాలంలో తరచు ట్విట్టర్ ద్వారా తన భావాలను బయట పెడుతున్న సెహ్వాగ్ ప్రధాని నరేంద్రమోదీ భారత సరిహద్దులు దాటి పొరుగు దేశంలో స్వచ్ఛ భారత్‌ను మొదలుపెట్టారని అందులో భాగంగానే భారత సైన్యం ఈ దాడులు జరిపిందని తన ట్వీట్లో పేర్కొన్నారు. -
దాడికి సూత్రధారి ఎవరు?
ఉడీలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతీయుల గుండెలన్నీ ఒక్కసారిగా భగభగ మండిపోయాయి. ప్రతీకార జ్వాలలు రగులుకున్నాయి. పాకిస్థాన్ పీచమణచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికులు కూడా గర్జించారు. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని మాత్రమే ప్రధానమంత్రి చెప్పారు. అయితే.. అప్పటికే తెరవెనక జరగాల్సింది అంతా జరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా తెరమీద కనిపించలేదు. తెర వెనకనుంచే ఇద్దరూ వ్యూహరచనలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పారికర్ - దోవల్.. వీళ్లిద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమ్మిన బంట్లు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలుచేయడానికి మన్మోహన్ సింగ్‌ను ఎలా ఎంచుకుని తీసుకొచ్చారో.. అలాగే నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కూడా రక్షణ మంత్రిగా అలాగే తీసుకొచ్చారు. మరోవైపు అప్పటివరకు యూపీఏ హయాంలో పెద్దగా ప్రాధాన్యం లభించని అజిత్ దోవల్‌ను కూడా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 2014 మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 30వ తేదీన దోవల్ ఎన్ఎస్ఏ పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన హస్తం ఉండని సందర్భం లేదు. ఎవరీ దోవల్.. ఏం చేశారు అజిత్ దోవల్.. 1968 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. కేరళ కేడర్‌లో చేరిన ఈయన, 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి దాదాపు నిర్వీర్యం అయిపోయింది. ఇక పాకిస్థాన్‌లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసుకున్న ఘనత దోవల్‌కు ఉంది. ఇక భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లు అన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. కుక్కే పారే లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇటీవలే ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది కాలానికే ఇరాక్ నుంచి 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స ఓటమి వెనక ఉన్నది కూడా అజిత్ దోవలే! రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన దోవల్.. అక్కడకు వెళ్లి ఏం మాయ చేశారో గానీ, మైత్రిపాల సిరిసేన తదుపరి అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా దోవలే. అంతేకాదు.. మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి.. ఒప్పించారు కూడా. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసి.. సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు! -
నిర్దేశిత దాడి: సంచలన నిజాలు
పాక్ పెంచి పోషిస్తూ వస్తున్న ఉగ్రవాదుల దాడులతో ఏళ్లుగా దెబ్బలు తిని, గాయాలకు ఓర్చుకున్న భారతీయ ఆర్మీ.. ప్రభుత్వ సూచనలతో పాకిస్తాన్ కంటి మీద కునుకుతీయలేని దెబ్బకొట్టింది. 38 మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాకిస్తానీ సైనికుల కాల్చివేత, ఐదు ఉగ్ర క్యాంపులు నేలమట్టం ఇవీ కేవలం నాలుగు గంటల వ్యవధిలో 25 మంది భారతీయ సైనికులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సృష్టించిన విధ్వంసం. భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉడీ ఉగ్రదాడి తర్వాత భారత్ లో మరిన్ని విధ్వంసాలను సృష్టించేందుకు పీఓకేలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారని నిఘా వ్యవస్ధలకు సమాచారం అందింది. ఈ మేరకు భారత ప్రభుత్వం ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ ను నిర్వహించేందుకు ప్రణాళిక రచించాలని సూచనలిచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అవకాశానికి భారతీయ ఆర్మీ చక్కని వ్యూహాన్ని తయారుచేసింది. బుధవారం అర్ధరాత్రి 12.30 సమయంలో ఆర్మీకి చెందిన ధ్రువ హెలికాప్టర్లలో(అత్యాధునిక సాంకేతికత కలిగినది) 4, 9 రెజిమెంట్లకు చెందిన 25మంది పారామిలటరీ కమాండోలు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశించారు. ముందుగా అనుకున్న ప్రాంతాల్లో హెలికాప్టర్లు కమాండోలను వదిలేశాయి. టార్గెట్లను ఇలా చేరుకున్నారు ఉగ్రవాదుల క్యాంపులను చేరుకోవడానికి పీఓకే లోపలికి మూడు కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సివుంది. దారిలో పాకిస్తాన్ సైనికుల నుంచి తప్పించుకుంటూ రాళ్లు, బురద, ల్యాండ్ మైన్లను దాటుకుంటూ.. టార్గెట్ గా ఎంచుకున్న భీంబర్, కెల్, తట్టాపని, లీలా ప్రాంతాల్లోని టెర్రర్ క్యాంపులకు కమాండోలు చేరుకున్నారు. దాడి చేయాల్సిన క్యాంపుల్లోని ఉగ్రవాదుల కదలికలను భారతీయ నిఘా సంస్ధ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, మిలటరీ ఇంటిలిజెన్స్ లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్(నిర్దేశిత దాడి) నిర్దేశిత దాడికి వెళ్లిన టీం మొత్తం ఆరు క్యాంపులను దృష్టిలో పెట్టుకుంది. వీటిలో మూడింటిని భారతీయ కమాండోలు నేలమట్టం చేశారు. అత్యాధునిక ఆయుధాలైన టావర్, ఎమ్-4 తుపాకులతో పాటు గ్రేనేడ్లు, పొగ గ్రేనేడ్లు, బ్యారెల్ గ్రేనేడ్ లాంచర్లు, చీకటిలో చూడగలిగే సాంకేతిక వస్తువులను కమాండోలు తమ వెంట తీసుకుని వెళ్లారు. కమాండోలు తలలకు పెట్టుకున్న హెల్మట్లలో కెమెరాలను అమర్చారు. క్యాంపుల వద్దకు చేరుకున్న కమాండోలు ఒక్కసారిగా ఉగ్రవాదులపై దాడి చేశారు. దాడికి జరుగుతుందని తెలిసిలోపై పొగ గ్రేనేడ్లను విసిరి ఉగ్రవాదులను మరింత గందరగోళంలో పడేశారు. పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులకు ఏం జరుగుతుందో తెలిసేలోపే 38 టెర్రరిస్టులను, ఇద్దరు పాకిస్తానీ సైనికులను హత మార్చారు. కాగా, ప్రయాణంలో ల్యాండ్ మైన్ల కారణంగా ఇద్దరు కమాండోలకు గాయాలయ్యాయి. రాత్రంతా పర్యవేక్షిస్తూనే ఉన్న ప్రధానమంత్రి మోదీ ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చే సమయంలో అమెరికా ఎలా మిషన్ ను నడిపిందో అచ్చం అలానే భారత రక్షణశాఖ మంత్రి మనోహర్ పరీకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ లు రియల్ టైంలో దాడిని వీక్షించారు. కమాండోల హెల్మెట్లలోని కెమెరాలతో పాటు ఓ డ్రోన్ దాడిని చిత్రించింది. ఎప్పటికప్పుడు దాడి వివరాలను ఫోన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాత్రంతా తెలుసుకుంటూనే ఉన్నారు. విందు మానుకుని సమావేశం ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి ప్రణాళికను ఆర్మీ బుధవారం రాత్రి 8.30నిమిషాలకు పూర్తి చేసింది. కాగా, బుధవారం రాత్రి కోస్టుగార్డు కమాండర్ తో ఉన్న సమావేశం, డిన్నర్ లో పరీకర్, ధోవల్, జనరల్ సుహాగ్ లు పాల్గొనాల్సివుంది. విందును కాదన్న ముగ్గురూ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో పూర్తి చేసిన ప్లాన్ ను పరిశీలించి అంగీకారం తెలిపారు. దాడి తర్వాత డేగ కన్ను సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారతీయ ఆర్మీ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ), జమ్మూకశ్మీర్, పంజాబ్ లలోని సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ను ప్రకటించింది. ఆర్మీ, బీఎస్ఎఫ్ అధికారుల సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఎల్ఓసీ, పంజాబ్, జమ్మూకశ్మీర్ లలోని సరిహద్దు గ్రామాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరప్రాంతాల్లో కూడా పహారా పెంచాలని ఆర్మీ కోస్టు గార్డుకు సూచించింది. -
భారత హైకమినర్కు పాక్ సమన్లు
కరాచీ: ఇండియన్ ఆర్మీ సర్జికల్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అక్కడి భారత హైకమిషనర్ కార్యాలయానికి సమన్లు పంపించింది. దాడిని ఖండిస్తూ ఇండియన్ హైకమిషనర్ గౌతం బాంబ్వాలేకు నోటీసులు పంపించింది. సర్జికల్ స్ట్రైక్స్ పై వివరణ ఇవ్వాలని, దాడులను ఎలా సమర్థిస్తారో చెప్పాలంటూ పాక్ అందులో ప్రశ్నించినట్లు సమాచారం. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కూడా ఇక్కడి పాక్ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహాలో పాక్ సమన్లు పంపించింది.