తీవ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపేలా భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. ఉడీ ఘటనకు ప్రతీకారంగా పీఓకేలోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 2016 సెప్టెంబర్‌లో భారత ఆర్మీ ఈ దాడులకు దిగింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది. భారత సైనికుల ఉగ్ర స్థావరాలపై జరిపిన మెరుపు దాడులకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. నాలుగు ఉగ్ర స్థావరాలను భారత్ సైన్యం ఏ విధంగా భూ స్థాపితం చేసిందో ఈ వీడియోలో కనబడుతుంది.