సర్జికల్ స్ట్రైక్స్ రెండో వార్షికోత్సవం సందర్భంగా జోధ్‌పూర్‌లో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
జోధ్‌పూర్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్) జరిపి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ దాడుల్లో భారత సైన్యం దాదాపు 50 మంది ఉగ్రవాదులను హతం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జోధ్‌పూర్ మిలిటరీ స్టేషన్‌లో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే జోధ్‌పూర్ చేరుకున్నారు. తొలుత ఆయన ‘కోణార్క్ అమర వీరుల స్థూపా’న్ని సందర్శించారు. అనంతరం కోణార్క్ స్టేడియంలో సైన్యం ‘పరాక్రమ్ పర్వ్’ పేరిట నిర్వహిస్తోన్న ఆర్మీ ఎగ్జిబిషన్‌ని మోదీ ప్రారంభించారు.
ఈ వేడుకల గురించి ఆర్మీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ ఎగ్జిబిషన్ భారత సైన్యం శౌర్య, పరాక్రమాలను ప్రదర్శించాడానికి ఉద్దేశించినవి. ఈ ఎగ్జిబిషన్‌కి జోధ్‌పూర్‌కి చెందిన 250 మంది విద్యార్థులను ఆహ్వనించాము. ఈ కార్యక్రమంలో వీరు పదాతి దళం ఉపయోగించిన ఆయుధాలను స్వయంగా వీక్షిస్తారు. అంతేకాక పిల్లలంతా ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వబడింది. దాంతో పాటు సప్తశక్తి ఆడిటోరియంలో ‘సర్జికల్ స్ట్రైక్స్’కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శిస్తాం. అనంతరం విద్యార్థులు సైన్యంలోని వివిధ హోదాలకు చెందిన అధికారులతో సంభాషిస్తార’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment