బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 నాటి పాకిస్తాన్ బాలాకోట్‌పై జరిపిన సర్జీకల్ స్ట్రైక్స్ విషయాన్ని దాడి తర్వాత ఆ దేశానికి తెలిపామని అన్నారు. మంగళవారం కర్ణాటకలోని బాలాకోట్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.
‘వెనక నుంచి దాడులు చేయడాన్ని మోదీ నమ్మడు. దేనినైనా ధైర్యంగా ముఖాముఖీ చేస్తాడు. బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత మీడియాకు సమాచారం అందించాలని భద్రతా బలగాలు చెప్పాయి. ఈ విషయాన్ని అదే రాత్రి.. పాకిస్తాన్‌కు టెలిఫోన్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేశాం. కానీ పాక్ టెలిఫోన్ కాల్‌కు స్పందించలేదు. తర్వాతే ఈ దాడుల విషయాన్నిప్రపంచానికి తెలియజేశాం. మోదీ ఎటువంటి విషయాన్ని దాచిపెట్టడు. ప్రతి విషయాన్ని బహిరంగంగా వెళ్లడిస్తాడు’ అని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో అమాయక ప్రజలకు బలి తీసుకోవాలనుకునేవారిని మోదీ హెచ్చరించారు. ఇది కొత్త భారత్ అని అన్నారు.
‘పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడు. చాలా మంది కర్ణాటకలోని బాలాకోట్ అనుకున్నారు. అందుకే వెంటనే తాము సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించి మీడియాకు సమాచారం ఇచ్చాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక.. పుల్వామాలో జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత బలగాలు పాక్‌లోని బాలాకోట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment