'సర్జికల్ స్ట్రైక్స్'పై సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ మరోసారి తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడుల వాస్తవికతను ఆయన ప్రశ్నించారు. ఆర్మీ సర్జికల్ స్టైక్స్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారని, నకిలీ దాడులు కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
'పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిర్దేశిత దాడులు చేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం నకిలీ దాడి చేయాలని ప్రజలు కోరుకోలేదు. జాతి ప్రయోజనాలపై రాజకీయాలు చేయడం తగద'ని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నిరుపమ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించారు. సైనికుల విశ్వసనీయతను దెబ్బతీసేలా నిరుపమ్ వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
Every Indian wants #SurgicalStrikesAgainstPak but not a fake one to extract just political benefit by #BJP.
— Sanjay Nirupam (@sanjaynirupam) 4 October 2016
Politics over national interest pic.twitter.com/4KN6iDqDo5