ముంబై: ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇంకా ఓటింగ్ జరగాల్సిన ప్రాంతాల్లో పార్టీలలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ మాజీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.
బీహార్‌కు చెందిన నిరుపమ్ 1990లలో జర్నలిజం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత 'దోఫర్ కా సామ్నా'కి సంపాదకుడు అయ్యారు. నిరుపమ్ పనికి ముగ్దుడైన శివసేన చీఫ్ బాల్ థాకరే 1996లో రాజ్యసభకు నియమించారు. ఆ తరువాత 2005లో తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2005లో సేనను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిరుపమ్‌ను కాంగ్రెస్ నియమించింది. 2009 ఎన్నికలలో ముంబయి నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ సీనియర్ నేత రామ్‌నాయక్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించారు.
2014లో ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 2017లో ముంబయి సివిక్ బాడీకి జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత నిరుపమ్ ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శివసేనను వీడిన చాలా సంవత్సరాల తరువాత నిరుపమ్ మళ్ళీ సొంతగూటికి చేరారు.
#WATCH | Former Congress leader Sanjay Nirupam along with his wife and daughter join Shiv Sena, in the presence of Maharashtra CM Eknath Shinde, in Mumbai pic.twitter.com/lLtKFcelti
— ANI (@ANI) May 3, 2024
Comments
Please login to add a commentAdd a comment