Sanjay Nirupam
-
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
ముంబై: ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇంకా ఓటింగ్ జరగాల్సిన ప్రాంతాల్లో పార్టీలలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ మాజీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.బీహార్‌కు చెందిన నిరుపమ్ 1990లలో జర్నలిజం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత 'దోఫర్ కా సామ్నా'కి సంపాదకుడు అయ్యారు. నిరుపమ్ పనికి ముగ్దుడైన శివసేన చీఫ్ బాల్ థాకరే 1996లో రాజ్యసభకు నియమించారు. ఆ తరువాత 2005లో తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి 2005లో సేనను వీడి కాంగ్రెస్‌లో చేరారు.మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిరుపమ్‌ను కాంగ్రెస్ నియమించింది. 2009 ఎన్నికలలో ముంబయి నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ సీనియర్ నేత రామ్‌నాయక్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2014లో ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 2017లో ముంబయి సివిక్ బాడీకి జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత నిరుపమ్ ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శివసేనను వీడిన చాలా సంవత్సరాల తరువాత నిరుపమ్ మళ్ళీ సొంతగూటికి చేరారు.#WATCH | Former Congress leader Sanjay Nirupam along with his wife and daughter join Shiv Sena, in the presence of Maharashtra CM Eknath Shinde, in Mumbai pic.twitter.com/lLtKFcelti— ANI (@ANI) May 3, 2024 -
Sanjay Nirupam: కొంప ముంచిన విమర్శలు.. ఆరేళ్లపాటు బహిష్కరణ
ముంబై: లోభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్పై వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ‘సంజయ్ నిరూపమ్ క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్సెక్రటరీ కేసీ వేణు గోపాల్ వెల్లడించారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి కూడా పేరును కాంగ్రెస్ పార్టీ తొలగించింది. మాజీ లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ పనిచేసిన సంజయ్ నిరూపమ్.. ఇటీవల సీట్ల పంపిణీ విషయంలో ‘మహావికాశ్ ఆఘాడీ కూటమి’లోని శివసేన(యూబీటీ) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించిన తర్వాత ఎక్స్ వేదికగా సంజయ్ నిరూపమ్ స్పందించారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ తనను తాను రక్షించుకోవడానికి మరింత శక్తిని కూడదీసుకోవాలి. నేను పార్టీకి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. తదుపరి నా కార్యాచరణను తెలియజేస్తాను’ అని ట్వీట్ చేశారు. మహావికాశ్ ఆఘాడీ కూటమిలో భాగంగా ముంబైలోని ఆరు స్థానాల్లో నాలుగు సీట్లను శివసేన (యూబీటీ)కి కేటాయించటంపై కాంగ్రస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తాను పోటీ చేద్దామని భావిస్తున్న ముంబై నార్త్ వెస్ట్ స్థానం శివసేన (యూబీటీ) దక్కటంపై సొంతపార్టీపైనే విమర్శల దాడికి దిగారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలో పోటీ చేసిన సంజయ్ నిరూపమ్ సమీప బీజేపీ అభ్యర్థి గోపాల్‌శెట్టి చేతిలో ఓటమిపాలయ్యారు. -
అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు
ముంబై: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శివసేన (ఉద్దవ్ వర్గం)పై కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ నిరుపమ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. శివసేన వాయువ్య ముంబై అభ్యర్ధిని కిచిడీ ఛోర్ అంటూ మండిపడ్డారు. కాగా మహా వికాస్ అఘాడి కూటమిలో, ఎన్సీపీ(శరద్చంద్ర పవార్), కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో శివసేన బుధవారం 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ కూడా పట్టుబడుతున్న ముంబై సౌత్ సెంట్రల్ స్థానాన్ని అనిల్ దేశాయ్‌కి కేటాయించింది. వాయువ్య ముంబై నుంచి ఎంపీ గంజనన్ కీర్తికర్ కుమారుడు అమోల్‌ను శివసేన పోటీలోకి దింపింది. ఈ విషయంపై నిరుపమ్ స్పందిస్తూ.. అమోల్‌కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముంబై నార్త్-వెస్ట్ స్థానానికి అమోల్ కీర్తికర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం కూటమి ధర్మ ఉల్లంఘనగా పేర్కొన్నారు. శిసేన అభ్యర్థిని ‘కిచిడి చోర్‌గా అభివర్ణించారు. అలాంటి వారి కోసం తాము పనిచేయమని పేర్కొన్నారు. ‘ముంబైలోని ఆరు లోక్ సభ స్థానాల్లో అయిదు చోట్ల శివసేన పోటీ చేస్తుంది. కేవలం ఒక సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది. దీన్ని బట్టి ముంబైలో కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు శివసేన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉండకూడదు. దీని వల్ల కాంగ్రెస్‌కు భారీ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలి. లేకపోతే శివసేనతో పొత్తు విరమించుకునే ఆలోచన చేయాలి. ఒకవేళ శివసేన తాము ఒంటరిగా పోరాడగలమని భావిస్తే అది తమ అతిపెద్ద తప్పు. శివసేన ఇలా జాబితాను ప్రకటించడం కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం కోసం వారం రోజులు వేచిచూస్తా. ఆ తర్వాత తను చేయాల్సింది చేస్తా’ నని పేర్కొన్నారు. చదవండి: లిక్కర్ స్కాం కేసు: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు.. కిచిడీ స్కామ్‌లో అమోల్‌కు సమన్లు అయితే శివసేన టికెట్ ఇచ్చిన అమోల్‌కు కిచిడీ కుంభకోణంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ కుంభకోణం విచారణలో భాగంగా తాజాగా చర్యలు చేపట్టింది. ఇక మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈలోపే శివసేన బుధవారం 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. అంతేగాక తమ పార్టీ 22 చోట్ల పోటీ చేయనున్నట్లు సంజయ్ రౌత్ ప్రకటించారు. -
‘సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిందే’
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’, కాంగెస్ తీవ్రంగా ఖండించాయి. అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ మాత్రం కేజ్రీవాల్‌కు మద్దతు తెలుపుతునే ఆయన సీఎం పదవిపై ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ‘ఎల్కే అద్వానీ, మాధవరావు సింధియా, కమాల్నాథ్లపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. వారు తమ పదవులకు రాజీనామా చేశారు. రైలు ప్రమాదానికి బాధ్యత వహింస్తూ.. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ సైతం తన పదవికి రాజీనామా చేశారు. భారత దేశం అంతటి గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉంది. జనవరిలో అరెస్ట్ అయిన హేమంత్సోరెన్సై కూడా అరెస్ట్‌కు ముందే తన సీఎం పదవి రాజీనామా చేశారు’ అని సంజయ్ నిరూపమ్ అన్నారు. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल अपने जीवन के सबसे बड़े संकट से गुजर रहे हैं। इंसानियत के नाते उनके प्रति सहानुभूति है। कॉंग्रेस पार्टी ने भी उन्हें सार्वजनिक रूप से समर्थन दिया है। लेकिन वे भारतीय राजनीति में नैतिकता की जो नई परिभाषा लिख रहे हैं,उसने मुझे यह पोस्ट लिखने के… — Sanjay Nirupam (@sanjaynirupam) March 23, 2024 ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిజం ఏంటో కోర్టు తేల్చుతుందని అన్నారు. ఒక సీఎంగా అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారని.. అయినా తన పదవికి రాజీనామా చేయకపోవటం సరికాదన్నారు. ఇది ఎటువంటి నైతికత? అని ప్రశ్నించారు. పార్టీ స్థాపించబడి 11ఏళ్లు అవుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యవహరిస్తున్న తీరు చాలా అనైతికమని విమర్శించారు. అవినీతి కేసులో ఇలా.. ఒక సీఎంగా అరెస్ట్ అయిన వ్యక్తి దేశంలో అరవింద్ కేజ్రీవాల్ మొదటివారు. అరెస్ట్ అయినా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని, కావాలంటే జైలు నుంచే ఆయన పారిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం ఈడీ... సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో సుమారు రెండున్న గంటల పాటు విచారించి అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ఆరు రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. -
'సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు'
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణంపై రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ సంచలన ఆరోపణలు చేశారు. 'చిచోర్' సినిమా విజయవంతం అయినప్పటికీ కావాలనే 7 సినిమాల్లో సుశాంత్‌ని తప్పించారని ట్వీట్ చేశారు. సినిమా సక్సెస్ కాగానే ఏడు సినిమాలకి సుశాంత్ సైన్ చేయగా, ఈ ఆరు నెలల్లోనే ఆ చిత్రాలను కోల్పోవాల్సి వచ్చిందని దీనికి కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు. హిందీ పరిశ్రమ క్రూరత్వం మరో స్థాయికి చేరిందని, ఓ ప్రతిభ గల నటుడిని బలితీసుకుందంటూ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. (సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్) छिछोरे हिट होने के बाद #सुशांत_सिंह_राजपूत ने सात फिल्में साइन की थी। छह महीने में उसके हाथ से सारी फिल्में निकल गई थीं।क्यों ? फ़िल्म इंडस्ट्री की निष्ठुरता एक अलग लेवल पर काम करती है। इसी निष्ठुरता ने एक प्रतिभावान कलाकार को मार डाला। सुशांत को विनम्र श्रद्धांजलि!#RIPSushant — Sanjay Nirupam (@sanjaynirupam) June 14, 2020 సుశాంత్ మరణంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ మాట్లాడుతూ.. 'పానీ' చిత్రంలో సుశాంత్ అద్భుతంగా నటించాడు. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది. నీ ఎదుగుదల చూసి ఓర్వలేక నీకు సినిమాలు దూరం చేసిన వారు నాకు తెలుసు. గత ఆరు నెలల్లో నేను మీ దగ్గర ఉండి ఉంటే బావుండేది’ అంటూ ట్వీట్ చేశారు. ఇక కొందరు ప్రముఖలు సైతం బాలీవుడ్లో పేరుకుపోయిన నెపోటిజాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. కంగనా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్..ఇలా పలువురు సుశాంత్ మరణంతోనైనా మేల్కోవాలని, ఇప్పటికైనా వారసత్వాన్ని పక్కనపెట్టి ప్రతిభకు పట్టం కట్టాలంటూ నినదిస్తున్నారు. (బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక కుటుంబం కాదు) I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput — Shekhar Kapur (@shekharkapur) June 15, 2020 -
పెరిగిన అసంతృప్తి: ఠాక్రే నిర్ణయాల వల్లే ఇలా!
ముంబై: రాష్ట్రంలో కరోనా సంక్షోభానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలకడలేని నిర్ణయాలే కారణమని కాంగ్రెస్ పార్టీ కీలక నేత సంజయ్ నిరుపమ్ విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములతో చర్చించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటగా... ఇందులో సగానికి పైగా రాజధాని ముంబైలోనే నమోదు కావడంతో ఆందోళనకరంగా పరిణమించింది. పరిస్థితి రోజురోజుకు చేయిదాటి పోతుందే తప్ప అదుపులోకి రావడం లేదు. (కరోనా: అత్యధికంగా అక్కడే..) ఈ క్రమంలో మంగళవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ.. తాము మహారాష్ట్ర ప్రభుత్వ మద్దతుదారులం మాత్రమేనని.. పూర్తిస్థాయిలో అధికారంలో లేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పుదుచ్చేరిలో మాత్రమే తమకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందంటూ మహారాష్ట్ర పరిస్థితులకు తాము కారణం కాదని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు ఎక్కుపెట్టిన సంజయ్ నిరుపమ్.. ‘‘ ముఖ్యమంత్రి ప్రజలు, మీడియాతో మాట్లాడతారు. కానీ సంకీర్ణ భాగస్వాములతో చర్చలు జరుపరు. అందుకే 60 రోజుల్లో 60 నిర్ణయాలు. ప్రతీ రోజూ తన నిర్ణయం మార్చుకుంటూనే ఉంటారు. వాటి ఫలితంగానే కరోనా సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది’’ అని మండిపడ్డారు. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..!) ఇదిలా ఉండగా సంకీర్ణ ప్రభుత్వంలో చెలరేగిన అసంతృప్తిని ఉపయోగించుకుని ప్రతిపక్ష బీజేపీ నేతలు మహా సర్కార్‌ను కూలదోసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత, అధికార భాగస్వామి శరద్ పవార్ మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం పవర్ మీడియా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.(కరోనా విజృంభిస్తున్నా.. సడలింపులు) -
శివసేనతో కలిస్తే.. వినాశనమే..!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతునిచ్చే అంశంపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పలువురు నేతలు సంతృప్తికరంగా ఉన్నా.. కొంతమంది మాత్రం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన- ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ భాగస్వామం అయితే అది పార్టీ వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే గడిచిన ఆదివారం రాత్రి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతు కోసం శివసేన విశ్వప్రయత్నాలను చేస్తోంది. సేన ప్రతిపాదనపై కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఢిల్లీలో సమావేశమై చర్చిస్తున్నారు. (చదవండి: ఎన్డీయేకు శివసేన గుడ్‌బై.. కేంద్రమంత్రి రాజీనామా) ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఈ సమయంలో శివసేన-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదు. ముఖ్యంగా లౌకిక పార్టీగా ఉన్న కాంగ్రెస్ శివసేనతో అధికారాన్ని పంచుకోవడం సరికాదు. అది పార్టీ మూలాలకు చాలా ప్రమాదం. వీలైతే మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం సరైనది. అయితే శివసేనతో పొత్తుపై చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సేన మాతో (కాంగ్రెస్)తో కలిసి వస్తుందా?. లేదా అనేది ఇప్పుడే తేల్చుకోవాలి. పూర్తి స్థాయి చర్చలు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తే.. అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది’ అని నిరుపమ్ అభిప్రాయపడ్డారు. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ శివసనకు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోసం సేన నేతలు ఢిల్లీ కేంద్రంగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ షరతుకి తలొగ్గిన సేన కేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసింది. దీంతో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతునిచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రంలోపే ఆ పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘అన్ని స్థానాల్లో మేము చిత్తుగా ఓడిపోతాం’
ముంబై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వ్యవహారం చిచ్చుపెట్టింది. తాను సూచించిన నాయకులకు టికెట్ కేటాయించలేదని ఆగ్రహించిన ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పార్టీ అధిష్టానం తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముంబైలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, అతికష్టం మీద మూడు నుంచి నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి రానని స్పష్టం చేసిన సంజయ్ నిరుపమ్... శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఢిల్లీ నేతలకు అర్థం కావడంలేదు. వారు నిజాలు పరిగణనలోకి తీసుకోకుండా.. ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలను నేను ఖండిస్తున్నాను. అందుకే ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ఎంపిక తీరును చూస్తుంటే అన్ని స్థానాల్లో ఓడిపోతుందని... డిపాజిట్ కూడా దక్కదని అర్థమవుతోంది. మహా అయితే ముంబైలో నాలుగు సీట్లలో విజయం సాధిస్తుంది. నలుగురు బలమైన అభ్యర్థుల పేర్లను మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి మల్లికార్జున ఖర్గేకు సూచించాను. కానీ ఆయన నా మాటలు లెక్కచేయలేదు. వారందరి పేర్లను తిరస్కరించారు’ అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాహుల్ గాంధీకి సన్నిహితులుగా ఉన్న నాయకులను మెల్లమెల్లగా ఆయన నుంచి దూరం చేయాలని కొంత మంది కుట్రపన్నుతారంటూ సంజయ్ ఆరోపించారు. పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎటువంటి వారో తెలుసుకోకుండానే టికెట్లు కేటాయించారని విమర్శించారు. సీనియర్ నేతలను సంప్రదించకుండానే ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. ప్రస్తుత విషయాల గురించి పార్టీ అధిష్టానం పట్టించుకోనట్లైతే తాను త్వరలోనే పార్టీని వీడతానని హెచ్చరించారు. కాగా పదిహేనేళ్ల క్రితం శివసేన నుంచి బయటికి వచ్చిన సంజయ్ నిరుపమ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. అదే విధంగా ముంబై కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే ఎంతో మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 9న ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. అక్టోబరు 21న పోలింగ్ జరుగనుండగా.. అదే నెల 24న కౌంటింగ్ జరుగనుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ-శివసేన ఇప్పటికే దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. -
‘మోదీ.. ఓ నయా ఔరంగజేబు’
లక్నో : కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని నయా ఔరంగజేబుగా వర్ణించారు. వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్ నిరుపమ్. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘వారణాసి ప్రజలు ఎన్నుకున్న నరేంద్ర మోదీని చూస్తే.. నాకు నయా ఔరంగబేబులా కనిపిస్తున్నారు. నేను ఆయనను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఔరంగజేబు కూడా చేయని ఎన్నో అకృత్యాలను మోదీ చేస్తున్నార’ని మండిపడ్డారు. అంతేకాక కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని అనేక ఆలయాలను కూలదోశారని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. మోదీ సూచనల మేరకే వాటిని కూలదోశారని ఆయన పేర్కొన్నారు. మోదీ తీసుకొచ్చిన నియమాల వల్లే కాశీ విశ్వనాథుని ఆశీర్వాదం కోసం జనాలు రూ. 550 చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శించారు. 17వ శతాబ్దానికి చెందిన ఔరంగజేబు ఎన్నో హిందూ ఆలయాలను కూల్చి చరిత్రపుటల్లో హిందూ వ్యతిరేకిగా మిగిలాడు. అలాంటి వ్యక్తితో.. నరేంద్ర మోదీని పోల్చడంతో.. బీజేపీ నాయకులు సంజయ్ నిరుపమ్ మీద మండిపడుతున్నారు. -
మోదీజీ వారణాసికి వలస వెళ్లకతప్పదు..
సాక్షి, ముంబై : గుజరాత్ నుంచి బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన వలస కూలీలు భయందోళనతో స్వస్ధలాలకు తరలివస్తున్న క్రమంలో ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాల వలస కూలీలను బీజేపీ తరిమికొడుతోందని దుయ్యబట్టారు. మోదీజీ మీరూ ఏదో ఒక రోజు వారణాసి (యూపీ)కి వెళతారని వ్యాఖ్యానించారు. పద్నాలుగు నెలల పసికందుపై బిహార్ వలస కార్మికుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో గుజరాతేతర వలస కూలీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. వారణాసి ప్రజలు మోదీని ఆశీర్వదించి ప్రధానిని చేసిన విషయం గుర్తురగాలని సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. పండుగ సెలవల కారణంగానే వలస కూలీలు తమ స్వస్ధలాలకు వెళుతున్నారని, దాడుల భయంతో కాదని గుజరాత్ డీజీపీ చేసిన ప్రకటనపై సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దివాళీ సెలవులు ప్రారంభమయ్యేందుకు ఇంకా నెలరోజుల సమయం ఉందని డీజీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఠాకూర్ సేన చీఫ్ అల్పేష్ ఠాకూర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే వలస కూలీలను భయాందోళనలకు గురిచేసి పారిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. -
‘నరేంద్ర మోదీ దేవుడేం కాదు’
ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేవుడేం కాదని, ఆయనను ప్రశ్నించే హక్కు దేశ ప్రజలందరికి ఉంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ అన్నారు. ప్రధాన మంత్రిపై తానేమి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చదువు రాదని, ఆయన నిరక్ష్యరాస్యుడని బుధవారం సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా సంజయ్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. సంజయ్‌కి మతి భ్రమించిందని, ఆయన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని బీజేపీ అధికార పత్రినిధి షైనా ఎన్‌సి ఎద్దేవా చేశారు. దేశ ప్రధానిని అలా విమర్శించడం సరికాదన్నారు. ప్రధాని ఒక్క పార్టీకి చెందిన వాడు మాత్రమే కాదని, ఆయన 125కోట్ల మంది ప్రతినిధి అన్న విషయాన్ని గుర్తించుకోని మాట్లాడాలని వాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి సంఘటనలు స్ఫూర్తితో తెరకెక్కిన ‘చలో జీతే హై’ లఘు చిత్రాన్ని పాఠశాల విద్యార్థులకకు చూపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి చదువుకోలేదని, ఆయన జీవిత చరిత్ర పిల్లలకు అవసరం లేదన్నారు.‘ప్రధాన మంత్రి ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. ఆయన సర్టిఫికేట్లను ఇంతవరకూ బయట పెట్టలేదు.పిల్లలపై రాజకీయాలు బలవంతంగా రుద్ధుతున్నారు. అలాంటి వ్యక్తి చరిత్ర విద్యార్థులకు ఎం అవసరం? పిల్లలు నర్రేంద మోదీ ఎంతవరకు చదుకున్నారు అంటే ఏం చెబుతారు.’ అని ప్రశ్నించారు. మోదీ సర్టిఫికేట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
సీఎంకు కాంగ్రెస్ ఛీప్ లేఖ
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నావిస్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఛీప్ సంజయ్ నిరుపమ్ మండిపడ్డారు. బీజేపీ పాలకులు దళితులపై కక్ష్యపూరింగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముంబైలోని సిద్దార్ధ కాలనీలో పలు సమస్యల పరిష్కారం కోరతూ శుక్రవారం సీఎం ఫెడ్నవిస్కు లేఖ రాశారు. రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ నిర్మించిన సిద్దార్ధ కాలనీలో గత కొన్ని రోజులుగా కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారనీ, ప్రజల సమస్యల పట్ల మానవతాదృక్పధంతో స్పందించాలని సీఎంను కోరారు. రిలయన్స్ కంపెనీ ఆ కాలనీకి విద్యుత్ సరఫరా చేస్తోందని, చాలా రోజలు నుంచి ఈ సమస్య ఉన్నా ఆ సంస్థపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దళితులు నివసించే ప్రాంతాలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నిరుపమ్ లేఖలో పేర్కొన్నారు. కరెంట్ లేకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో త్రాగు నీరు కొరత కూడా తీవ్రంగా ఉందని, అధికారులు ప్రత్యన్మాయ ఏర్పాట్లు చేయకపోవడంపై నిరుపమ్ మండిపడ్డారు. -
అమిత్ షా వచ్చారని.. నాకు గృహనిర్బంధం!
సాక్షి, ముంబై : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముంబైలో పర్యటిస్తున్న సందర్భంగా తనను బుధవారం పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. ‘ఉదయం నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు నా ఇంటి చుట్టు ఉన్నారు. నా బంగళా లోపలకు కూడా వచ్చారు. మేం ఈ రోజు ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదు. అయినా పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు’ అని నిరుపమ్ మీడియాకు తెలిపారు. తన ఇంటి చుట్టూ ఎందుకు ఉన్నారని పోలీసులను అడిగితే.. తనపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు చెప్పారని అన్నారు. ‘మేం అమిత్ షాను ఘెరావ్ చేయడం.. లేదా ఆయన ముందు ఆందోళన చేస్తామని బీజేపీ భావించినట్టు ఉంది. అందుకు నన్ను ఉదయం నుంచి ఇంట్లోనే బంధించారు’ అని ఆయన అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, అమిత్ షాకు భద్రత పేరిట తమ పార్టీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. -
కర్ణాటక గవర్నర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలతో అటు జేడీఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. యెడ్యూరప్ప తన రాజీనామా నిర్ణయం ప్రకటించగానే అసెంబ్లీలో మొదలైన సందడి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విధేయతలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా సరికొత్త రికార్డు సృష్టించారు. రెండు వివాదాస్పద నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని యత్నించారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కాదని, పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పైగా ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకే చెందిన వ్యక్తిని నియమించారు. బీజేపీ పట్ల ఆయనకున్న విశ్వాసం అంతా ఇంతా కాదు. బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఆయన శతవిధాల ప్రయత్నించారు. బహుశా ఇండియాలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ కుక్కలకు వాజుభాయ్ వాలా అని పేరు పెట్టుకోవాలేమో. ఎందుకంటే ఆయన కంటే విశ్వాసం, విధేయతను ప్రదర్శించేవారు ఉండరనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అలవాటేనని మహారాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ విభాగం నేత అమిత్ మాలవియా తెలిపారు. -
భారీ టీ స్కాం : రోజుకి 18,500 కప్పులు?
ముంబై : మంత్రాలయలో ఏడు రోజుల్లో సుమారు 3 లక్షల ఎలుకలను చంపారనే ఆరోపణపై వివాదం చెలరేగిన వెంటనే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కార్యాలయంలో భారీ టీ స్కాం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో రోజుకి సగటున 18,500 కప్పుల టీ సర్వ్ చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత మూడేళ్లుగా సీఎంఓలో టీ వినియోగం పెరుగుతూ వచ్చిందని, దానికి తగ్గ ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయని ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ అన్నారు. ఆర్టీఐ ద్వారా పొందిన డాక్యుమెంట్లను ట్విటర్లో పొందుపరిచారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు 2015-16లో టీకి వెచ్చించిన ఖర్చు సుమారు రూ.58 లక్షలు గాక, 2017-18లో సుమారు రూ.3.4కోట్లగా నమోదైనట్టు కాంగ్రెస్ లీడర్ పేర్కొన్నారు. అంటే 577 శాతం మేర పెరిగినట్టు తెలిపారు. అంటే సగటున సీఎంఓలో రోజూ 18,591 కప్పుల టీ సర్వ్ చేస్తున్నారన్నారు. ఇదెలా సాధ్యమంటూ ఆయన ప్రశ్నించారు. ఎలాంటి టీని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాగుతారు? అని ప్రశ్నించగా.. తమకు తెలిసినంత వరకు ఆయన గ్రీన్ టీ, ఎల్లో టీ.. వంటివి తాగుతారని నిరుపమ్ పేర్కొన్నారు. అయితే ‘గోల్డెన్ టీ’కి సీఎం, సీఎంఓ ఎక్కువగా వెచ్చిస్తుందని, దీనికి ఎక్కువ మొత్తంలో ఖర్చు వస్తుందని చెప్పారు. సీఎంఓ టీ బిల్లుల్లో అవినీతి చోటు చేసుకుందని తెలిపిన ఆయన... ప్రధాన మంత్రి ‘ఛాయ్‌వాలా’ అని చెప్పుకుంటూ ఎంతో గొప్పగా ఫీలవుతారని, మరోవైపు ఫడ్నవిస్ అనవసరంగా టీకి ఎక్కువగా వెచ్చిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని, మహారాష్ట్ర సీఎం ఇద్దరూ కూడా దేశాన్ని ఛాయ్‌తోనే నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రతిరోజూ సీఎంఓలో 18,000 కన్నా ఎక్కువ మందికి టీ సర్వ్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అని నిరుపమ్ అన్నారు. లేదా ఆ టీ అంతటిన్నీ మంత్రాలయంలోని ఎలుకలు తాగాల్సిందేనన్నారు. మహారాష్ట్ర సచివాలయంలో ఎలుకలు పట్టుకునేందుకు ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగినట్లు కొన్ని రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క వారంలో మంత్రాలయలో సుమారు 3 లక్షల ఎలుకలను తొలగించినట్టు బీజేపీ మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే చెప్పారు. ఎలుకల స్కాం మాదిరి సీఎంఓ ఆఫీసులో భారీ మొత్తంలో టీకి కూడా వెచ్చించినట్టు నిరుపమ్ ఆరోపిస్తున్నారు. -
'సెన్సార్ చేయకముందే ఆ మూవీ చూడాలి'
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ రోజులను నేపథ్యంగా ఎంచుకుని దర్శకుడు మధుర్ భండార్కర్ తీసిన ‘ఇందు సర్కార్’ మూవీపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మూవీని బోర్డు సెన్సార్ చేయకముందుగానే తాను చూడాలని కోరుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీకి మంగళవారం ఓ లేఖ రాశారు. తనతో పాటు మరికొందరు పార్టీ నేతలకు ఈ మూవీ స్టోరీపై అనుమానాలున్నట్లు తెలిపారు. 'ఈ మూవీ ట్రైలర్ చూశాను. ఎమర్జెన్సీ రోజుల్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను చూపించారు. ఇందిరాగాంధీ, సంజయ్ తో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలను చెడు కోణంలో చూపించారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కారణం వల్ల మాకు ఇందు సర్కార్ మూవీని సెన్సార్ చేయకముందే ఓసారి ప్రత్యేక షో చూపించాలని' సీబీఎఫ్సీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మూవీలో తరచుగా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ పాత్రలు కూడా వచ్చి పోతుంటాయి. ఇందిరా గాంధీగా కొత్త నటి సుప్రియా వినోద్, సంజయ్ గాంధీగా నీల్ నితిష్ నటించాడు. కీర్తి కుల్హారి, అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో కనిపిస్తారు. 1975 జూన్ 26న మొదలైన ఎమర్జెన్సీ దమనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ముగిసింది. అనంతరం జరిగిన ఎలక్షన్లలో జనం ఇందిరాగాంధీని చావుదెబ్బ తీయగా, జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలోని జనతాపార్టీని అందలం ఎక్కించారు. మరోవైపు ఇందిరాగాంధీ జీవితంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా ఎమర్జన్సీని మచ్చగా, దాచిపెట్టాల్సిన విషయంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. -
అమితాబ్ తీరును తప్పుబట్టిన నిరుపమ్
ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీరును కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తప్పుబట్టారు. జీఎస్టీతో నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు మొత్తుకుంటుంటే... అమితాబ్ దాన్ని ఎలా ప్రమోట్ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేయడం సరికాదని సంజయ్ అభిప్రాయపడ్డారు. తక్షణమే అమితాబ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన ట్విట్ చేశారు. Would advise @SrBachchan to wthdraw frm brand ambassador of #GST in ths form.An expected backlash frm traders may go against him eventually. — Sanjay Nirupam (@sanjaynirupam) 20 June 2017 కాగా దేశంలో పన్నుల సంస్కరణకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను తీసుకొస్తోంది. ఈనెల 30 అర్ధరాత్రి నుంచే జీఎస్టీని అమల్లోకి తేనుంది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత ప్రచారం కల్పించేందుకు జీఎస్టీ ప్రచారకర్తగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక తెలిసిందే. ఇప్పటికే 40 సెకన్ల్ల నిడివున్న వీడియోను కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) అమితాబ్‌పై చిత్రీకరించి ప్రసారం ప్రారంభించింది. ఈ వీడియోలో జీఎస్టీ విశిష్టతను అమితాబ్ వివరించారు. జాతీయ జెండాలో మూడు రంగుల కలిసి ఉన్నట్లే.. జీఎస్టీ కూడా 'ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్'గా మారేందుకు ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ‘జీఎస్టీ– ఏకీకృత జాతీయ విపణి ఏర్పాటు కోసం తొలి అడుగు’ పేరిట ప్రసారమయ్యే ఈ వీడియోను ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. మరోవైపు ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 130 లక్షల కోట్లుగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చేసే ఈ కొత్త పన్ను వ్యవస్థ ప్రారంభోత్సవం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాలును వేదికగా ఎంచుకుంది. జూన్ 30 అర్ధరాత్రి సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినవేళ 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ పేరిట సెంట్రల్ హాల్లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
కేజ్రీవాల్‌ను జాతి క్షమించదు: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలంటూ మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్జికల్ దాడుల్లో ఆర్మీ సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేకే కేజ్రీవాల్ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని బుధవారం ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. సైన్యం సాధించిన విజయానికి సంబరాలు చేసుకోకుండా కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ పాకిస్థాన్ మీడియా ప్రచురించే వార్తలపై దృష్టిపెట్టారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అసలు సర్జికల్ దాడులు జరిగాయా అని అనుమానాలు వ్యక్తం చేసిన కేజ్రీవాల్, సంజయ్ నిరుపమ్లను జాతి క్షమించదని, వారికి మానసిక వైకల్యం ఉందని ఆయన విమర్శించారు. -
'సర్జికల్ స్ట్రైక్స్'పై సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ మరోసారి తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్దేశిత దాడుల వాస్తవికతను ఆయన ప్రశ్నించారు. ఆర్మీ సర్జికల్ స్టైక్స్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారని, నకిలీ దాడులు కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. 'పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిర్దేశిత దాడులు చేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం నకిలీ దాడి చేయాలని ప్రజలు కోరుకోలేదు. జాతి ప్రయోజనాలపై రాజకీయాలు చేయడం తగద'ని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నిరుపమ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించారు. సైనికుల విశ్వసనీయతను దెబ్బతీసేలా నిరుపమ్ వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. Every Indian wants #SurgicalStrikesAgainstPak but not a fake one to extract just political benefit by #BJP. Politics over national interest pic.twitter.com/4KN6iDqDo5 — Sanjay Nirupam (@sanjaynirupam) 4 October 2016 -
స్మృతి ఇరానీకి వెసులుబాటు
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ హైకోర్టు ఆమెకు మినహాయింపునిచ్చింది. కేంద్రమంత్రి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు పరస్పరం పిటిషన్ దాఖలు చేసుకున్న క్రమంలో గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వారిద్దరి మధ్య రాజీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్మృతి ఇరానీ ఆగస్టు ఒకటిన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆమె పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం ఆమోదించింది. 2012 గుజరాత్ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన టీవీ చర్చలో తనను స్మృతి దుర్భాషలాడారని సంజయ్ నిరుపమ్ పరువునష్టం దావా వేశారు. ఇదే విషయంపై స్మృతి కూడా నిరుపమ్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరస్పరం రాజీపడాలని ఢిల్లీ కోర్టు గతంలో సూచించింది. అయితే నిరుపమ్ తరఫున న్యాయవాది రాజీకి సిద్ధ పడగా, స్మృతి తరఫు న్యాయవాది దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో వివాదం కొనసాగుతోంది. -
‘పరువు నష్టం’పై రాజీ పడండి..
స్మృతి ఇరానీ, సంజయ్ నిరుపమ్‌లకు సూచించిన ఢిల్లీ కోర్టు న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్‌లు పరస్పరం దాఖలు చేసిన పరువునష్టం దావాలపై రాజీ పడాలని ఢిల్లీ కోర్టు శనివారం సూచించింది. నిరుపమ్ తరఫున న్యాయవాది రాజీకి సిద్ధ పడగా, స్మృతి తరఫు న్యాయవాది అంగీకరించలేదు. దీంతో ఆగస్టు ఒకటిన విచారణ జరుపుతామని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధీరజ్ మిట్టల్ తెలిపారు. 2012 గుజరాత్ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన టీవీ చర్చలో తనను స్మృతి దుర్భాషలాడారని సంజయ్ నిరుపమ్ పరువునష్టం దావా వేశారు. ఇదే విషయంపై స్మృతి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
కాంగ్రెస్ అభ్యర్థయితే.. మోడీ కూడా ఓడేవాడే!
న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తే మోడీ కూడా ఓడిపోయేవాడే’ ఈ వ్యాఖ్య ఏ బీజేపీ నేతనో, మరో పార్టీ నాయకుడో చేసింది కాదు. కాంగ్రెస్ దీనస్థితిని అద్దంపట్టేలా ఈ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్. ఆయన స్వయంగా ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. పలు సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం వల్ల కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ పరాజయం పాలైందని శనివారం ఆయన విలేకరుల సమావేశంలో విశ్లేషించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నందున చాలా కారణాల వల్ల కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహం పెరిగిందన్నారు. ‘కాంగ్రెస్ వ్యతిరేక సెంటిమెంట్ ఎంత తీవ్రంగా ఉందంటే.. కాంగ్రెస్ టికెట్‌పై సాక్షాత్తూ నరేంద్ర మోడీ పోటీ చేసినా దారుణంగా ఓడిపోయేవాడు’ అన్నారు. చివరగా, ‘ఇదే ఎల్లకాలం కొనసాగదు.. ప్రతీ ఎన్నికా మాకొక పాఠమే’నంటూ ముక్తాయించారు. -
ఎన్నికల బరిలో కోటీశ్వరులు
సాక్షి, ముంబై: మూడో విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలుచేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థుల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. ఈ నెల 24వ తేదీన 19 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం నామినేషన్ల దాఖలు పర్వం మార్చి 29వ తేదీ నుంచి ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం ఉత్తర ముంబై నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సంజయ్ నిరూపమ్, బీజేపీకి చెందిన గోపాల్ శెట్టి, వాయవ్య ముంబై నుంచి కాంగ్రెస్ తరఫున గురుదాస్ కామత్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సంజయ్ నిరూపమ్ రూ.53.93 లక్షలు చరాస్తులు, రూ.47.86 లక్షలు స్థిరాస్తులు ఉన్నాయని నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. భార్య పేరుపై రూ.59.4 లక్షలు చరాస్తులు, కూతురు, తల్లి పేరుపై రూ.34 లక్షల ఆస్తులు ఉన్నాయి. వీటితోపాటు స్థలాలు ఇలా మొత్తం రూ. రెండు కోట్ల ఏడు లక్షల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. మహాకూటమి అభ్యర్థి గోపాల్ శెట్టి రూ. 93.84 లక్షలు చరాస్తులు, భార్య పేరుపై రూ.2.46 కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయని నామినేషన్లో పేర్కొన్నారు. తల్లి పేరుపై రూ.4.15 లక్షలు చరాస్తులు, రూ.11 లక్షలు విలువచేసే బంగారు నగలు, బదలాపూర్‌లో రూ.25 లక్షల విలువచేసే ఎకరన్నర భూమి ఉందని తెలిపారు. కాందివలిలో రూ.40 లక్షల విలువచేసే ఫ్లాటు, రూ.65 లక్షల విలువచేసే స్థిరాస్తులున్నాయని స్పష్టం చేశారు. గురుదాస్ కామత్ తన పేరుపై రూ.ఆరు కోట్ల విలువచేసే చరాస్తులు, భార్య పేరుపై రూ.5.82 లక్షలు విలువచేసే ఆస్తులు, రూ.10 కోట్లు విలువచేసే బాండ్లు ఉన్నాయని నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. రూ.27 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.20 లక్షలు విలువచేసే భూములు, వర్లిలో రూ.మూడు కోట్ల విలువచేసే ఫ్లాటు ఉందని తెలిపారు. ఢిల్లీలో రూ.26 కోట్ల విలువచేసే ఫ్లాటు ఉందని తెలిపారు. వాయవ్య ముంబై నుంచి రాష్ట్రీయ్ ఆమ్ పార్టీ నుంచి పోటీచేస్తున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా తన మొత్తం ఆస్తులు రూ.15 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. -
బీజేపీ కార్పోరేటర్ పై ఎంపీ నిరుపమ్ దౌర్జన్యం
ఓ బీజేపీ కార్పోరేటర్ పై కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంజయ్ నిరుపమ్ దాడికి పాల్పడ్డారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ కార్పోరేటర్ కు చెందిన మొబైల్ ఫోన్ ను సంజయ్ నిరుపమ్ ధ్వంసం చేశారు. కార్పోరేటర్ వినోద్ షెలార్ ఫిర్యాదు మేరకు నిరుపమ్ పై కేసు నమోదు చేశారు. దిండోషి సబర్బన్ లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిరుపమ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని స్తానిక కార్పోరేటర్ వినోద్ అడ్డుకున్నారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించిందని.. ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపిస్తూ కార్పోరేటర్ వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అవుతుందని కార్పోరేటర్ హెచ్చరించారు. దాంతో ఎంపీ, కార్పోరేటర్ మధ్య గొడవ పెరిగింది. ఆతర్వాత కార్పోరేటర్ కు చెందిన మొబైల్ ఫోన్ లాక్కొని.. ఎంపీ నేలకేసి కొట్టినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఎంపీ తీరును నిరసిస్తూ కార్పోరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎంపి నిరుపమ్ పై ఐపీసీ సెక్షన్ 427, 504 కింద కేసు నమోదు చేశారు. -
విద్యుత్ రంగంలో సంస్కరణలు
ముంబై: విద్యుత్ కొనుగోలు, పంపిణీలలో గుత్తాధిపత్యానికి తెరదించేందుకుగాను ఆ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఎంపీ సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు మంగళవారం ఈ మేరకు ఓ లేఖ రాశారు. విద్యుత్ సంస్థల పనితీరు, చార్జీలను నిర్ణయించడం వంటి అంశాలను సంస్కరణలు నియంత్రించేవిధంగా ఉండాలన్నారు. ఆవిధంగా జరిగితే వినియోగదారులు లబ్ధిపొందుతారన్నారు. విద్యుత్ బిల్లులు ఇతర అనేక చార్జీలను జత చేసే విధానాన్ని రద్దు చేయాలని తన లేఖలో సంజయ్ డిమాండ్ చేశారు. నగరానికి చెందిన విద్యుత్ వినియోగదారులకు కూడా రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన 26 లక్షలమంది వినియోగదారులకు రాయితీ ఇవ్వాలనే మీ ఆలోచన వల్ల సామాన్యుడికి మేలు కలుగుతుందని, వారి ఇక్కట్లు కొంతమేర తొలగిపోతాయన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగేరీతిలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వినియోగదారుల లబ్ధి కోసం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించిందని నిరుపమ్ గుర్తుచేశారు. గుత్తాధిపత్యానికి తెరదించాలనేదే ప్రైవేటీకరణ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గుత్తాధిపత్యం వల్ల వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. విద్యుత్ కొనుగోలు, చార్జీలను నిర్ణయించే విధానంలో లోపాలను గుర్తించడం అత్యంత కష్టమని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్కరణలనేవి నియంత్రణ సంస్థపై తప్పనిసరిగా దృష్టిసారించేవిగా ఉండాలన్నారు. ఎటువ ంటి సాంకేతిక పరిజ్ఞానముగానీ లేదా నైపుణ్యంగానీ లేని విశ్రాంత ఐఏఎస్ అధికారులను నియంత్రణ సంస్థలో సభ్యులుగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అసలు ఈ రంగంలోకి అనేకమంది అనేక సంస్థలను ఎందుకు ఆహ్వానించడం లేదని నిలదీశారు.