స్మృతి ఇరానీ, సంజయ్ నిరుపమ్‌లకు సూచించిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్‌లు పరస్పరం దాఖలు చేసిన పరువునష్టం దావాలపై రాజీ పడాలని ఢిల్లీ కోర్టు శనివారం సూచించింది. నిరుపమ్ తరఫున న్యాయవాది రాజీకి సిద్ధ పడగా, స్మృతి తరఫు న్యాయవాది అంగీకరించలేదు.
దీంతో ఆగస్టు ఒకటిన విచారణ జరుపుతామని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధీరజ్ మిట్టల్ తెలిపారు. 2012 గుజరాత్ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన టీవీ చర్చలో తనను స్మృతి దుర్భాషలాడారని సంజయ్ నిరుపమ్ పరువునష్టం దావా వేశారు. ఇదే విషయంపై స్మృతి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.