
సాక్షి, ముంబై : గుజరాత్ నుంచి బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన వలస కూలీలు భయందోళనతో స్వస్ధలాలకు తరలివస్తున్న క్రమంలో ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాల వలస కూలీలను బీజేపీ తరిమికొడుతోందని దుయ్యబట్టారు. మోదీజీ మీరూ ఏదో ఒక రోజు వారణాసి (యూపీ)కి వెళతారని వ్యాఖ్యానించారు.
పద్నాలుగు నెలల పసికందుపై బిహార్ వలస కార్మికుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో గుజరాతేతర వలస కూలీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. వారణాసి ప్రజలు మోదీని ఆశీర్వదించి ప్రధానిని చేసిన విషయం గుర్తురగాలని సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. పండుగ సెలవల కారణంగానే వలస కూలీలు తమ స్వస్ధలాలకు వెళుతున్నారని, దాడుల భయంతో కాదని గుజరాత్ డీజీపీ చేసిన ప్రకటనపై సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దివాళీ సెలవులు ప్రారంభమయ్యేందుకు ఇంకా నెలరోజుల సమయం ఉందని డీజీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఠాకూర్ సేన చీఫ్ అల్పేష్ ఠాకూర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే వలస కూలీలను భయాందోళనలకు గురిచేసి పారిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment