ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేవుడేం కాదని, ఆయనను ప్రశ్నించే హక్కు దేశ ప్రజలందరికి ఉంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ అన్నారు. ప్రధాన మంత్రిపై తానేమి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చదువు రాదని, ఆయన నిరక్ష్యరాస్యుడని బుధవారం సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా సంజయ్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. సంజయ్‌కి మతి భ్రమించిందని, ఆయన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని బీజేపీ అధికార పత్రినిధి షైనా ఎన్సి ఎద్దేవా చేశారు. దేశ ప్రధానిని అలా విమర్శించడం సరికాదన్నారు. ప్రధాని ఒక్క పార్టీకి చెందిన వాడు మాత్రమే కాదని, ఆయన 125కోట్ల మంది ప్రతినిధి అన్న విషయాన్ని గుర్తించుకోని మాట్లాడాలని వాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్ననాటి సంఘటనలు స్ఫూర్తితో తెరకెక్కిన ‘చలో జీతే హై’ లఘు చిత్రాన్ని పాఠశాల విద్యార్థులకకు చూపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి చదువుకోలేదని, ఆయన జీవిత చరిత్ర పిల్లలకు అవసరం లేదన్నారు.‘ప్రధాన మంత్రి ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. ఆయన సర్టిఫికేట్లను ఇంతవరకూ బయట పెట్టలేదు.పిల్లలపై రాజకీయాలు బలవంతంగా రుద్ధుతున్నారు. అలాంటి వ్యక్తి చరిత్ర విద్యార్థులకు ఎం అవసరం? పిల్లలు నర్రేంద మోదీ ఎంతవరకు చదుకున్నారు అంటే ఏం చెబుతారు.’ అని ప్రశ్నించారు. మోదీ సర్టిఫికేట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment