ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’, కాంగెస్ తీవ్రంగా ఖండించాయి. అయితే మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ మాత్రం కేజ్రీవాల్‌కు మద్దతు తెలుపుతునే ఆయన సీఎం పదవిపై ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.
‘ఎల్‌కే అద్వానీ, మాధవరావు సింధియా, కమాల్‌నాథ్‌లపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. వారు తమ పదవులకు రాజీనామా చేశారు. రైలు ప్రమాదానికి బాధ్యత వహింస్తూ.. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ సైతం తన పదవికి రాజీనామా చేశారు. భారత దేశం అంతటి గొప్ప సంప్రదాయాన్ని కలిగి ఉంది. జనవరిలో అరెస్ట్ అయిన హేమంత్‌సోరెన్‌సై కూడా అరెస్ట్‌కు ముందే తన సీఎం పదవి రాజీనామా చేశారు’ అని సంజయ్ నిరూపమ్ అన్నారు.
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल अपने जीवन के सबसे बड़े संकट से गुजर रहे हैं।
— Sanjay Nirupam (@sanjaynirupam) March 23, 2024
इंसानियत के नाते उनके प्रति सहानुभूति है।
कॉंग्रेस पार्टी ने भी उन्हें सार्वजनिक रूप से समर्थन दिया है।
लेकिन वे भारतीय राजनीति में नैतिकता की जो नई परिभाषा लिख रहे हैं,उसने मुझे यह पोस्ट लिखने के…
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిజం ఏంటో కోర్టు తేల్చుతుందని అన్నారు. ఒక సీఎంగా అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారని.. అయినా తన పదవికి రాజీనామా చేయకపోవటం సరికాదన్నారు. ఇది ఎటువంటి నైతికత? అని ప్రశ్నించారు. పార్టీ స్థాపించబడి 11ఏళ్లు అవుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యవహరిస్తున్న తీరు చాలా అనైతికమని విమర్శించారు. అవినీతి కేసులో ఇలా.. ఒక సీఎంగా అరెస్ట్ అయిన వ్యక్తి దేశంలో అరవింద్ కేజ్రీవాల్ మొదటివారు.
అరెస్ట్ అయినా కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతారని, కావాలంటే జైలు నుంచే ఆయన పారిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం ఈడీ... సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో సుమారు రెండున్న గంటల పాటు విచారించి అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ఆరు రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment