ముంబైలో విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే ఆత్మాహుతి
కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ హెచ్చరిక
సాక్షి, ముంబై: ముంబైలో విద్యుత్ చార్జీలు తగ్గించనట్టయితే రిలయన్స్ ఇన్‌ఫ్రా అధినేత అనిల్ అంబానీ ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంటానని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర సర్కారును హెచ్చరించారు. ముంబైలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాందివలిలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా కార్యాలయం ఎదుట ఆయన మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆయన ఆత్మాహుతికి పాల్పడతానంటూ శనివారం హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న కంపెనీలు ముఖ్యంగా రిలయన్స్ ఇన్‌ఫ్రా అధినేత అనిల్ అంబానీపై నిరుపమ్ నిరసన వ్యక్తం చేశారు.