న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రమోటర్లు ఈక్విటీ రూపేణా రూ. 1,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి జతగా ముంబైకి చెందిన రెండు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు రూ. 1,900 కోట్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు రూ. 6,000 కోట్ల సమీకరణ ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది.
వీటిలో రూ. 3,014 కోట్లు ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా అందుకోనుంది. మిగిలిన రూ. 3,000 కోట్లు సంస్థాగత కొనుగోలుదారుల నుంచి సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 3,014 కోట్లు సమకూర్చుకోనుంది. వీటిలో ప్రమోటర్ సంస్థ రైజీ ఇన్‌ఫినిటీ ప్రయివేట్ 4.6 కోట్ల షేర్లకు సబ్‌స్క్రయిబ్ చేయనుంది.
ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?
ఈ బాటలో ముంబై సంస్థలు ఫార్చూన్ ఫైనాన్షియల్ అండ్ ఈక్విటీస్ సర్వీసెస్(4.41 కోట్ల షేర్లు– రూ. 1,058 కోట్లు), ఫ్లోరిన్‌ట్రీ ఇన్నొవేషన్స్ ఎల్‌ఎల్‌పీ(3.55 కోట్ల షేర్లు– రూ. 582 కోట్లు) చొప్పున ప్రిఫరెన్షియల్ ఇష్యూలో భాగంకానున్నాయి. పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాథ్యూ సైరియా ఫ్లోరిన్‌ట్రీని ఏర్పాటు చేయగా.. ఫార్చూన్ ఫైన్షాఇయల్‌ను నిమిష్ షా నెలకొల్పారు. రిలయన్స్ ఇన్‌ఫ్రాలో ప్రమోటర్లకు ప్రస్తుతం 21.34 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment