
సంజయ్ నిరుపమ్ (ఫైల్ పోటో)
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నావిస్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఛీప్ సంజయ్ నిరుపమ్ మండిపడ్డారు. బీజేపీ పాలకులు దళితులపై కక్ష్యపూరింగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముంబైలోని సిద్దార్ధ కాలనీలో పలు సమస్యల పరిష్కారం కోరతూ శుక్రవారం సీఎం ఫెడ్నవిస్‌కు లేఖ రాశారు. రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ నిర్మించిన సిద్దార్ధ కాలనీలో గత కొన్ని రోజులుగా కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారనీ, ప్రజల సమస్యల పట్ల మానవతాదృక్పధంతో స్పందించాలని సీఎంను కోరారు.
రిలయన్స్ కంపెనీ ఆ కాలనీకి విద్యుత్ సరఫరా చేస్తోందని, చాలా రోజలు నుంచి ఈ సమస్య ఉన్నా ఆ సంస్థపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. దళితులు నివసించే ప్రాంతాలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నిరుపమ్ లేఖలో పేర్కొన్నారు. కరెంట్ లేకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో త్రాగు నీరు కొరత కూడా తీవ్రంగా ఉందని, అధికారులు ప్రత్యన్మాయ ఏర్పాట్లు చేయకపోవడంపై నిరుపమ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment