కాంగ్రెస్ అభ్యర్థయితే.. మోడీ కూడా ఓడేవాడే! | On Cong ticket, even Modi would have lost, says sanjay Nirupam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అభ్యర్థయితే.. మోడీ కూడా ఓడేవాడే!

Published Sat, Jun 7 2014 11:02 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కాంగ్రెస్ అభ్యర్థయితే.. మోడీ కూడా ఓడేవాడే! - Sakshi

కాంగ్రెస్ అభ్యర్థయితే.. మోడీ కూడా ఓడేవాడే!

న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తే మోడీ కూడా ఓడిపోయేవాడే’ ఈ వ్యాఖ్య ఏ బీజేపీ నేతనో, మరో పార్టీ నాయకుడో చేసింది కాదు. కాంగ్రెస్ దీనస్థితిని అద్దంపట్టేలా ఈ వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్. ఆయన స్వయంగా ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. పలు సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం వల్ల కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ పరాజయం పాలైందని శనివారం ఆయన విలేకరుల సమావేశంలో విశ్లేషించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నందున చాలా కారణాల వల్ల కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహం పెరిగిందన్నారు.

 

‘కాంగ్రెస్ వ్యతిరేక సెంటిమెంట్ ఎంత తీవ్రంగా ఉందంటే.. కాంగ్రెస్ టికెట్‌పై సాక్షాత్తూ నరేంద్ర మోడీ పోటీ చేసినా దారుణంగా ఓడిపోయేవాడు’ అన్నారు. చివరగా, ‘ఇదే ఎల్లకాలం కొనసాగదు.. ప్రతీ ఎన్నికా మాకొక పాఠమే’నంటూ ముక్తాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement