కేజ్రీవాల్ను జాతి క్షమించదు: ధర్మేంద్ర ప్రధాన్ | India won’t forgive Arvind Kejriwal for disrespecting army: Dharmendra Pradhan | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ను జాతి క్షమించదు: ధర్మేంద్ర ప్రధాన్

Published Wed, Oct 5 2016 2:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

కేజ్రీవాల్ను జాతి క్షమించదు: ధర్మేంద్ర ప్రధాన్

కేజ్రీవాల్ను జాతి క్షమించదు: ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలంటూ మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్జికల్ దాడుల్లో ఆర్మీ సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేకే కేజ్రీవాల్ లాజిక్ లేకుండా  మాట్లాడుతున్నారని బుధవారం ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు.
 
సైన్యం సాధించిన విజయానికి సంబరాలు చేసుకోకుండా కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ పాకిస్థాన్ మీడియా ప్రచురించే వార్తలపై దృష్టిపెట్టారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అసలు సర్జికల్ దాడులు జరిగాయా అని అనుమానాలు వ్యక్తం చేసిన కేజ్రీవాల్, సంజయ్ నిరుపమ్లను జాతి క్షమించదని, వారికి మానసిక వైకల్యం ఉందని ఆయన విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement