dharmendra pradhan
-
కేంద్రం Vs తమిళనాడు.. సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్
ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్దమే నడుస్తోంది. హిందీ భాష అమలు చేయడంపై కూడా నేతలు వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ సీఎం స్టాలిన్‌కు కౌంటరిచ్చారు. విద్యార్థులపై ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.జాతీయ విద్యా విధానంపై కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 భాషా స్వేచ్చ సూత్రాన్ని సమర్థిస్తుంది. విద్యార్థులపై బలవంతంగా ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు. విద్యార్థులు తమకు నచ్చిన భాషను నేర్చుకోవచ్చు. దాన్ని కొనసాగించేలా ఈ పాలసీ ఉంది. ఇదే సమయంలో విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుంది.తమిళనాడు ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాల వల్లే కొత్త పాలసీని వ్యతిరేకిస్తోందన్నారు. ప్రగతిశీల సంస్కరణలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. అలాగే, 2022లోనే ప్రధాని మోదీ తమిళ భాష శాశ్వతం అనే వ్యాఖ్యలు చేసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యను రాజకీయం చేయడం వంటి పనులు మానుకోవాలని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. సమగ్రశిక్షా పథకం కింద రాష్ట్రానికి రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని స్టాలిన్ కోరారు. జాతీయ విద్యా విధానం-2020ని పూర్తిగా అమలు చేసి త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని విద్యార్థులు, రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య ఆవేదన, ఆక్రోశం కలిగించిందని తెలిపారు. తమిళనాడులో చాలాకాలంగా ద్విభాషా విధానమే ఉందన్నారు. దాన్ని ఆచరించడంలో రాష్ట్రం దృఢంగా ఉందని పేర్కొన్నారు. అధికారిక భాషా నిబంధన 1976లో పేర్కొన్న మేరకు అధికార భాషా చట్టం 1963 హెచ్ అమలు చేయడం నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించడాన్ని గుర్తు చేశారు.Highly inappropriate for a State to view NEP 2020 with a myopic vision and use threats to sustain political narratives. Hon’ble PM @narendramodi ji’s govt. is fully committed to promote and popularise the eternal Tamil culture and language globally. I humbly appeal to not… pic.twitter.com/aw06cVCyAP— Dharmendra Pradhan (@dpradhanbjp) February 21, 2025ఒక రాష్ట్రంలోని కాలపరిస్థితులను అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రాన్ని నిర్బంధించడానికి, నిధులు అందించే వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ఇలాంటి ప్రయత్నం సమాఖ్య పాలనాతత్వాన్ని అతిక్రమించే చర్యగా పేర్కొన్నారు. సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయకపోతే ఉపాధ్యాయులకు వేతనం, విద్యార్థులకు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. అందుకే నిధులు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.ఇదిలాఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం కొనసాగిస్తే, ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోదీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోదీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల కారణంగా తమిళనాడులో రాజకీయం మరింత హీటెక్కింది. బీజేపీ నేతలు డీఎంకే నేతలపై మండిపడుతున్నారు. -
కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి వీసీలను నియమిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లో పూర్తిస్థాయి వైస్ చాన్స్లర్ల (వీసీ) ను నియమిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలి పారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో వీసీల నియామకం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్రమంత్రికి లేఖ రాశా రు. ఈ లేఖకు స్పందించి ఆయన ప్రత్యుత్తరం రాశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, హైదరాబాద్ ఐఐటీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో బోధన సిబ్బంది నియామకాల్లో ఓబీసీ రిజ ర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని మ రో లేఖలో ఎంపీ చామల కోరగా.. శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రత్యుత్తరంలో వెల్లడించారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధానన్ను కలిసిన కేటీఆర్
-
పర్లేదు సార్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్‌కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 బడ్జెట్లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్‌ను స్వాగతించారు. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్‌ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది. ఐఐటీల విస్తరణ.. 2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు. నైపుణ్యాల పెంపు.. విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్నర్íÙప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు. ఐఐఎంలకు పెరిగిన కేటాయింపులు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు గతేడాది రూ.227 కోట్లు కేటాయించగా ఈదఫా రూ.251 కోట్లను కేటాయించారు. ఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు కేటాయింపుల్లో రూ.137 కోట్ల మేర కోత విధించడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇతర ఉన్నత విద్యా సంస్థలకు కేటాయింపుల్లో 50 శాతం మేర కోత పడింది. ఏఐ ఆవశ్యకతకు గుర్తింపు విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తించినట్లు తాజా బడ్జెట్ స్పష్టం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – వి. రాజన్న, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ – సాఫ్ట్వేర్ సర్విసెస్)రీసెర్చ్ ఔత్సాహికులు పెరుగుతారు ఐఐటీలు, ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్స్‌ను పెంచడం వల్ల పీహెచ్డీ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. – ప్రొఫెసర్. బి.ఎస్.మూర్తిఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్స్పష్టత ఇవ్వాల్సింది సర్వ శిక్ష అభియాన్, రీసెర్చ్ ఫెలోషిప్స్‌కు కేటాయింపులు పెంచడం హర్షణీయం. ఐఐటీల్లో సీట్ల పెంపు, మెడికల్ సీట్ల పెంపు విషయంలో స్పష్టత లేదు. బీటెక్ స్థాయిలో ఎన్ని సీట్లు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్ల పెంపులో ప్రైవేట్, ప్రభుత్వ సీట్ల సంఖ్యను వేర్వేరుగా స్పష్టం చేస్తే బాగుండేది. ఉన్నత విద్యకు కేటాయింపులు తగ్గాయి. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం సరికాదు. – మహేశ్వర్ పేరి, ఫౌండర్, కెరీర్స్360జాతి వృద్ధికి ఊతం ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుతో ప్రతి విద్యార్థికి ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సాహం లభిస్తుంది. – నిపుణ్ గోయెంక, ఎండీ, జీడీ గోయెంక గ్రూప్ఏటా కుదింపులు.. ఇది మరోసారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ.1,28,650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 2.53 శాతం. గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గాయి. – ముత్యాల రవీందర్టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి -
ఉన్నత విద్య ఎంట్రన్స్లకే ఎన్టీఏ పరిమితం
న్యూఢిల్లీ: 2025 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్య తల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలను మాత్రమే ఎన్టీఏ ఇకపై నిర్వహిస్తుందన్నారు. వచ్చే ఏడాదిలో ఈ మేరకు ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నీట్‌ను సంప్రదాయ పెన్, పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా చేపట్టేందుకు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ప్రధాన్ మంగళవారం మీడియాకు చెప్పారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా పలు పరీక్షా పత్రాల లీకేజీలు, రద్దు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణకు పలు చర్యలు తీసుకుంటోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్– యూజీ)ను ఇకపైనా ఏడాదిలో ఒక్క పర్యాయం మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్టీఏను ప్రవేశ పరీక్షల బాధ్యతలను మాత్రమే అప్పగించాలి. దాని సామర్థాన్ని పెంచిన తర్వాత ఇతర పరీక్షల బాధ్యతలను అప్పగించే విషయం ఆలోచించాలి’అని ఇస్రో మాజీ చీఫ్ ఆర్. రాధాకృష్ణన్ సారథ్యంలోని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత కోర్సులో జాయినయ్యే విద్యార్థి మాత్రమే ఆన్లైన్ పరీక్ష రాసేలా డిజి–యాత్ర మాదిరిగానే డిజి–ఎగ్జామ్ విధానాన్ని తీసుకురావాలని కమిటీ పేర్కొంది. ఇందుకోసం, ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్ స్థాయిలో 10 సిఫారసులను చేసిందిఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు2025 నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. -
కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనుమతులు ఇప్పించండి ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్ఆర్ఆర్కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి. మెట్రో ఫేజ్–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి మెట్రో ఫేజ్–2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీ నగర్–హయత్‌నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. ‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు వెంటనే ఇవ్వండి ‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. హైదరాబాద్–విజయవాడ డీపీఆర్ త్వరగా పూర్తి చేయండి హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి..’ అని నితిన్ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి ‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం. -
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు చెంపపెట్టు
న్యూఢిల్లీ: నీట్–యూజీ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యానికి, చిల్లర రాజకీయాలకు చెంపపెట్టని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. సుప్రీం నిర్ణయం విద్యార్థుల ఓటమి కానేకాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం ప్రభుత్వంపైనే కాదు, సుప్రీంకోర్టుపైనా విశ్వాసం లేదని విమర్శించారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పేపర్ లీకేజీలు జరగడం తెలియదా అని ఆ పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన ప్రశ్నించారు. అప్పటి ఘటనలపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. పేపర్ లీకేజీలకు, అవినీతికి తండ్రివంటిది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ మనుగడ కోసం ఆ పార్టీ అబద్ధాలు, అరాచకాలనే నమ్ముకుందని మంత్రి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలపైనే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఖర్గేకు, రాహుల్ గాం«దీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించారు. -
చదువులు ‘ఉన్నతం’
న్యూఢిల్లీ: దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.మేనేజ్మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్‌ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి.యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు. ఐఐఎంలకు బడ్జెట్లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది. ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు. సెంట్రల్ వర్సిటీలకు మరికొంత.. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి.సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్సీఈఆరీ్ట, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. -
2028లో గెలుపు మనదే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ నంబర్‌వన్ పార్టీగా మారడం ఖాయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాల ద్వారా కాంగ్రెస్, బీఅర్ఎస్కు నిద్ర పట్టకుండా చేసి.. ఆ పారీ్టల అక్రమాలపై పోరాటాలతో బీజేపీ తప్పకుండా నంబర్‌వన్ స్థానానికి చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.రానున్న 1,500 రోజుల్లో (రివర్స్ ప్లానింగ్) ప్రజా పోరాటాల ద్వారా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ వద్ద 1,500 రోజుల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గం ముగింపు సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పిన ధర్మేంద్ర.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తూనే ఉందన్నారు. దక్షిణాది సీట్లతోనే మూడోసారి మోదీ సర్కార్ తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సీట్లతో మరింత బలం చేకూరడంతోనే మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిందని ధర్మేంద్ర చెప్పారు. ‘ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిస్తేనే ప్రధాని కావాలని కొందరు కలలు కంటుంటారు. అలాంటిది తెలంగాణ నుంచి పార్టీ సొంతంగా 8 సీట్లను గెలవడం మామూలు విజయం కాదు.. ఇందుకు ఓటర్లకు కృతజ్ఞతలు. లోక్‌సభ ఎన్నికలతో బీజేపీ ఉత్తరాది పార్టీ అనే అపవాదు తొలగింది. దక్షిణ భారతంలో బీజేపీ మరింత బలపడింది. కొత్త శకం మొదలైంది. కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. తమిళనాడు లో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించాం’’అని ఆయన అన్నారు. రాజ్యాంగం మార్చం.. రిజర్వేషన్లను ఎత్తివేయం ‘పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ పారీ్టకి వంద సీట్లు దాటలేదు. 13 రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. అహంకారంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని పదే పదే అవమానించే కాంగ్రెస్‌నేతలు, రాహుల్‌గాంధీ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారు.. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులూ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగానికి ఎలాంటి హానీ జరగదని మేమంతా సామూహికంగా వాగ్దానం చేస్తున్నాం బీజేపీ అధికారంలో ఉండగా రిజర్వేషన్లకూ ఎటువంటి ఢోకా లేదు’అని ధర్మేంద్ర స్పష్టం చేశారు. -
Dharmendra Pradhan: రెండు రోజుల్లో నీట్–పీజీ పరీక్ష షెడ్యూల్
న్యూఢిల్లీ: నీట్–పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) ఒకటి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్–పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్‌నెట్‌లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 18న జరిగిన యూజీసీ–నెట్ పరీక్ష సైతం రద్దయ్యింది. -
కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేదు అనుభవం
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారాయన. అయితే అక్కడ ఆయనకు నల్లజెండాలతో విద్యార్థులు స్వాగతం పలికారు.నీట్, యూసీజీ-నెట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ యోగా డే కార్యక్రమం కోసం వెళ్లిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యార్థులు అడ్డుకునే యత్నం చేశారు. నల్లజెండాలతో అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే యత్నం చేశారు. ఈ నిరసనలతో ఆయన యోగా డేలో పాల్గొనకుండానే వెనక్కి వెళ్లిపోయారు.ఇదీ చదవండి: నీట్ పేపర్ లీకేజీ నిజమే మరోవైపు.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ నివాసం బయట ఈ ఉదయం యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. యూజీసీ నెట్‌ను రద్దు చేసిన కేంద్రం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ మీట్ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడబోమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇవాళ కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో కీలక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశం లేకపోలేదు. -
నీట్ వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్‌పై పూర్తి స్థాయి రిపోర్టు అడిగామని తెలిపారు. దోషులెవరైనా వదిలి పెట్టమని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంపై ఉన్నస్థాయి కమిటీ వేస్తున్నామని చెప్పారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. దీంతోపాటు అనేకమంది పూర్తి స్థాయి మార్కులు రావడంతో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు, పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. -
ఆందోళన వద్దు.. నీట్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024 వివాదంపై కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ వివాదంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు భయపడొద్దని తెలిపారు.పేపర్ లీక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై అధికారులు వాటిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అంశంలో సంబంధిత అధికారుల విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం జూలై 8 వరకు వేచి చూద్దాం. దాచడానికి ఏమీ లేదు అని ఆయన అన్నారు.భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా 4,700 కేంద్రాలలో 14 విదేశాలలో 13 భాషలలో 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రధాన్ తెలిపారు. రెండు కేంద్రాలపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. -
NEET-UG 2024: లీక్ కాలేదు, రిగ్గింగ్ జరగలేదు: ప్రధాన్
న్యూఢిల్లీ: నీట్–యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ వచి్చన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖండించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని అన్నారు. పేపర్ లీక్గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని చెప్పారు. పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఏ ఒక్క అభ్యరి్థకీ అన్యాయం జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కు ఎంతో విశ్వసనీయత ఉందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. -
సంస్కృత భాషాభివృద్ధికి ఎన్ఎస్యూ కృషి అభినందనీయం
తిరుపతి సిటీ/ఏర్పేడు: సంస్కృత భాషాభివృద్ధికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్ఎస్యూ) ఎనలేని కృషి చేస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. గురువారం తిరుపతి ఎన్‌ఎస్‌యూలో ఉత్కల పీఠం (ఒడిశా చైర్) ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీవారి పాదాల చెంత వెలసిన సంస్కృత వర్సిటీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసి పరిరక్షించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వర్చువల్ విధానంలో వర్సిటీలో నూతన హాస్టల్ భవనాలను, తరగతి గదులను ప్రారంభించారు. ఉత్కల పీఠం రజతోత్సవ పైలాన్, శిలాఫలకాన్ని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు రేవతి రమణదాన ప్రభు ప్రారంభించారు. ఇన్నోవేషన్ హబ్‌గా తిరుపతి ఐఐటీ తిరుపతి కేంద్రంగా ఏర్పేడులో స్థాపించిన ఐఐటీ విద్యాసంస్థ అనతి కాలంలోనే ఇన్నోవేషన్ హబ్‌గా పేరుగాంచడం గర్వంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. గురువారం తిరుపతి ఐఐటీలో జరిగిన నాల్గొవ, ఐదవ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం శుభపరిణామమన్నారు. మొత్తం 355మంది బీటెక్, 106 మంది ఎంటెక్, ఇద్దరు డ్యూయల్ డిగ్రీ, 74మంది ఎమ్మెస్సీ, 17మంది ఎంఎస్, 21మంది పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. -
తెలంగాణకు మరిన్ని కేంద్ర సంస్థలు
సాక్షి, హైదరాబాద్: డిజిటైజేషన్, డిస్టెన్స్ లెర్నింగ్ మెథడాలజీ, ఆన్లైన్ అప్రోచ్, డిజిటల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలకు సంబంధించి తెలంగాణలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తెలంగాణలో ఇటీవలే రూ.వెయ్యి కోట్ల తో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రాచీన భారతం ఎన్నో ఆవిష్కరణలకు భూమికగా నిలిచిందని.. ఆధునిక భారతం విశ్వమిత్రగా వ్యవహరి స్తోందని పేర్కొన్నారు. ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ నినాదంతో దేశయువత భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థల రెండో ఎడిషన్ ‘ఇన్వెంటివ్, ఆర్అండ్డీ ఇన్నోవేషన్ ఫెయిర్’ను ధర్మేంద్ర ప్రధా న్ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థలు కలిపి మొత్తం 53 విద్యా సంస్థల నుంచి 120 ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టారు. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, క్లైమేట్ చేంజ్, ఈ–మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ స్పేస్, ఇండస్ట్రీ 4.0 తదితర ఇతివృత్తాలతో వీటిని రూపొందించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతాం ప్రజల రోజువారీ జీవితంలో ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఐఐటీలకు ప్రధాని మోదీ సూచించినట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న కల సాకారంలో స్టార్టప్ కంపెనీలు వెన్నెముకగా నిలుస్తాయని.. ఇన్వెంటివ్–2024 వంటి సమావేశాలు రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడతాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు మరింత పెరిగేలా విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ అంతా సహకారం అందించాలని కోరారు. దేశ జీడీపీలో కనీసం 25 శాతా నికి దోహదపడేలా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని వివరించారు. ఆ దిశగానే ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, పీఎల్ఐ స్కీమ్, ఎఫ్‌డీఐ లిబరలైజేషన్’వంటి విధానాలను కేంద్రం తీసుకొచి్చందన్నారు. డిజిటల్ పబ్లి క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డొమైన్లో 46 శాతం గ్లోబల్ డిజి టల్ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయని, మనదేశం ఇన్నోవేషన్‌కు ఇంక్యుబేటర్‌గా మారిందని చెప్పారు. 2014లో 350 స్టార్టప్ కంపెనీలు ఉంటే.. ఇప్పుడవి లక్షా 20వేలకు చేరాయన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు విద్యార్థుల ఆత్మహత్యలు సమాజానికి మంచిది కా దని కేంద్ర మంత్రి అన్నారు. ఐఐటీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయన్నారు. -
వచ్చే ఏడాది గిరిజన వర్సిటీ షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి మార్గం సుగమమైంది. సమ్మక్క –సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అనుమతులు, ఇతర ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం (2023–24) నుంచే వర్సిటీ అందుబా టులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టంలోనే గిరిజన యూని వర్సిటీ ఏర్పాటును నిర్దేశించినప్పటికీ వివిధ కారణాలతో పదేళ్లుగా జాప్యం అవుతూ వచ్చింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల క్రితమే భూ కేటాయింపులు పూర్తి చేసి గిరిజన సంక్షేమ శాఖకు స్వాధీనం చేసింది. తాత్కాలిక అవస రాల కోసం భవనాలను కూడా కేటాయించింది. అనంతరం నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) అప్పగించారు. కానీ కేబినెట్ అనుమతులు, పార్ల మెంటులో బిల్లు ఆమోదం కాకపోవడంతో యూని వర్సిటీ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. హెచ్‌సీయూ పర్యవేక్షణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి గెజిట్ జారీ కావడంతో కేంద్ర విద్యా శాఖ అధికారుల బృందం అతి త్వరలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వర్సిటీకి అవసరమైన మౌలిక వసతులు తదితరాలను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది. ఇది పూర్తయిన తర్వాత సంబంధిత అనుమతులన్నీ వేగంగా జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వర్సిటీని హెచ్‌సీయూ పర్యవేక్షించనుంది. ఇప్పటికే కోర్సులు, ఇతరత్రా కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను రూపొందించింది. అనుమతులు వచ్చిన వెంటనే 2023–24 విద్యా సంవత్సరంలో తరగతులు సైతం ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేస్తోంది. రూ.10 కోట్ల నిధులు..498 ఎకరాల భూమి రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2016–17 వార్షిక బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో 498 ఎకరాల భూమిని వర్సిటీ ఏర్పాటు కోసం గుర్తించి గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. ఇందులో 285 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతా 213 ఎకరాలు అటవీ శాఖకు చెందింది. ఈ భూసేకరణ కోసం అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని చూపించింది. కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)ను కేటాయించింది. వర్సిటీ ఏర్పాటుపై హెచ్‌సీయూ లోతైన పరిశీలన జరిపి, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను సమర్పించాలని ఆదేశించడంతో, ఆ మేరకు ప్రక్రియ పూర్తి చేసిన హెచ్‌సీయూ.. మూడేళ్ల క్రితమే కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
కొత్త విశ్వ వ్యవస్థకు ఆశాదీపం
భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభా భాండాగారాన్ని కలిగి ఉంది. ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలుస్తామో అటువంటి ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడాలి. భారతదేశ అధ్యక్షతన జి–20 ఇతివృత్తం అయిన ‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’, మన ప్రాచీన విలువ ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. జ్ఞాన నాగరికతగా, భారతదేశం సహజంగానే తన డీఎన్ఏలో ప్రతిభ భాండాగారాన్ని కలిగి ఉంది. భారతదేశ చరిత్ర చూస్తే– గణితం, ఖగోళ శాస్త్రం,వైద్యం, తత్వశాస్త్రం, సాహిత్యంతో సహా వివిధ విజ్ఞాన రంగాల్లో గణనీయమైన కృషి చేసిన ప్రస్థానమే గోచరిస్తుంది. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల సంఖ్యా సిద్ధాంతం, గణిత విశ్లేషణలో అద్భుతమైన కృషి ఆధునిక పరిశోధనలను కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. జ్ఞాన నాగరికతగా భారతదేశ చరిత్ర దాని సమకాలీన విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ఇది ప్రపంచ శ్రేయస్సుకు గణనీయమైన సహకారిగా నిలిచింది. విశ్వ శ్రేయస్సుకు జి–20 జి–20 అధ్యక్షతలో భారతదేశం మొత్తం వర్కింగ్ గ్రూపులు లేదా మంత్రుల సమావేశాలలో జరిగిన అన్ని చర్చలను కూడా గొప్ప ప్రపంచ శ్రేయస్సు అనే బంధంతో అనుసంధానం చేసింది. ‘‘ఒక భూమి – ఒక కుటుంబం – ఒక భవిష్యత్తు’’ అనే జి–20 ఇతివృత్తం, మన ప్రాచీన విలువలైన ‘వసుధైవ కుటుంబం’తో ముడిపడి ఉంది. భారతదేశ పురోగమనం, ఎదుగుదల కేవలం దాని సొంత ప్రజల కోసమే కాకుండా, మనం ‘ప్రపంచ కల్యాణం’ అని దేన్నయితే పిలు స్తామో అటువంటి ప్రపంచ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగ పడాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాని సహజసిద్ధమైన బలం, సామర్థ్యాలను ప్రపంచం స్పష్టంగా విశ్లేషించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ‘ప్రకాశవంతమైన ప్రదేశం’గా గుర్తించింది. భారతదేశ స్థూల ఆర్థిక మూలాధారాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పవనాలు ఎదురవుతున్నప్పటికే , భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశం ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అతి తక్కువ సమయంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆదర్శాలతో కూడిన విద్య విజ్ఞానం, నైపుణ్యం ద్వారా మానవ మూలధనాన్ని పెంచడం అనేది భారతదేశ సామర్థ్యానికి కీలకం. విద్య అనేది వృద్ధి, ప్రేరణలను నడిపించే, నిలబెట్టే ‘మదర్–షిప్’(కేంద్రం). విద్య అనేది పౌరులను శక్తిమంతం చేసే మాతృశక్తి. దానికి అనుగుణంగా రూపొందించిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అన్నింటికీ మూల పత్రం. సమగ్ర జాతీయ విద్యా విధానం–2020, భారత్‌లో విద్యను సమగ్రంగా, భవిష్యత్తు మార్గదర్శకంగా, ప్రగతి శీలంగా ఒక ముందు చూపు ఉండేలా సంపూర్ణంగా రూపొందించడం జరిగింది. బలమైన విషయ అవగాహన, స్పష్టతను నిర్ధారించడం కోసం మాతృభాషలో నేర్చుకోవడానికి నూతన విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే మాతృభాషలో విద్య అనుసంధాన భాషలను భర్తీ చేయదు, కానీ వాటికి అనుబంధంగా ఉంటుంది. ఇది జ్ఞానపరంగా తక్కువ సమస్యలను అధిగమించే విద్యార్థులతోపాటు సజావుగా చదువుకొనే విద్యార్థులకు కూడా చక్కటి విద్యా మార్గాలను అందిస్తుంది. ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ ఇప్పుడు ప్రాధాన్యతను సంత రించుకుంది. ఎన్ఈపీ–2020, భారతదేశాన్ని అత్యుత్తమ అధ్యయన గమ్యస్థానంగా మార్చడానికిగానూ, అధ్యాపకులు/ విద్యార్థుల మార్పిడి, పరిశోధన, బోధనా భాగస్వామ్యాలు, విదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన ఎంఓయూలపై సంతకాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఐఐటీ– మద్రాస్, ఐఐటీ– ఢిల్లీ ఇప్పటికే తమ విదేశీ క్యాంపస్‌లను వరుసగా జాంజిబార్–టాంజానియా, అబుదాబి– యూఏఈలలో ఏర్పాటు చేయడానికి అవగాహనా ఒప్పందాలను కుదర్చుకున్నాయి. విదేశాలతో విద్యా భాగస్వామ్యం పరిశోధనను ప్రోత్సహించడానికి పరిశ్రమ–అకాడెమియా సహ కారం అనేది ఎన్ఈపీలో చేర్చిన మరొక ప్రాధాన్యత అంశం. అకడమిక్ ఇన్ స్టిట్యూషన్ ్సలో తొలి అడుగు నుండి పరిశోధనల వరకు సులభతరం చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు అవుతోంది. భారతదేశాన్ని పరిశోధన–అభివృద్ధి హబ్‌గా మార్చ డంపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. సులభతర వ్యాపారం మాత్రమే కాకుండా సులభతర పరిశోధన కూడా ఉండేలా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా, ప్రధాన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యూరప్ దేశాలతో భారతదేశం విద్యా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ భారతదేశ ప్రతిభను గుర్తించి, దృష్టిలో ఉంచుకుంటారు. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్), క్వాడ్ ఫెలోషిప్ కింద హై–టెక్నాలజీ రంగాలలో మెరుగైన సహకారాన్ని ప్రోత్సహించడం జరగుతుంది. భారతీయ విద్యను ప్రపంచ విద్యతో సమలేఖనం చేయడంలో ప్రామాణీకరణ సహాయ పడుతుంది. జాతీయ విద్యా విదానం కింద, పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ విడుదల చేయడమైనది. ఇది నిర్దిష్ట అభ్యాస ప్రమాణాలు, కంటెంట్, బోధనాశాస్త్రం, మూల్యాంకనాలకు ప్రమాణాలను ఏర్పరుస్తుంది. అదేవిధంగా, విభిన్న విద్యావేత్తల అభ్యాసాన్ని అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ పరిధిలోకి తీసుకు రావడానికి నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ పనిచేస్తుంది. గొప్ప శ్రామిక శక్తి భారతదేశంలో ఇప్పుడు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 60 కోట్ల జనాభా ఉంది. 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు. బహుళ–క్రమశిక్షణ, బహుళ–నైపుణ్యం కలిగిన, విమర్శనాత్మకంగా ఆలోచించే, యువకులు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామికశక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. భారతదేశం ఇప్పుడు మూడవ అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యావరణ వ్యవస్థ. 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో నైపుణ్యం, వ్యవస్థాపక తకు ప్రతీకగా నిలిచింది. మెట్రో నగరాల్లో మాత్రమే కాదు, భారతదేశ ఆవిష్కరణలు, స్టార్టప్‌లు టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల ద్వారా కూడా ఆవిష్కారం అవుతున్నాయి. 6వ తరగతి నుండి పాఠశాల విద్యలో నైపుణ్యం ఏకీకృతం అయింది. సాంకేతికతతో నడిచే పారిశ్రామిక వాతావరణంలో నిల దొక్కుకోవడానికిగానూ పాఠశాల స్థాయి నుండే నైపుణ్యం కలిగిన మానవ శక్తిని రూపొందించడానికి సింగపూర్ స్కిల్ ఫ్రేమ్‌వర్క్ అనుసరించదగినది. అభివృద్ధి చెందుతున్న కొత్త క్రమంలో మానవ మూలవనరుల ప్రధాన పాత్రను భారతదేశం గుర్తించింది. విద్య, నైపుణ్యంతో కూడిన వ్యక్తులు నేటి జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మాత్రమే విజ్ఞాన సరిహద్దును విస్తరించడం, ఆర్థిక వృద్ధికి ఊత మివ్వడంతో పాటు, అద్భుతమైన ఆవిష్కరణలు అందించగలరు; శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణానికి అసాధారణమైన సహకారాన్ని అందించగలరు. ప్రపంచ ప్రయోజనాల కోసం ఇప్పుడు భారత దేశం ఒక పెద్ద ప్రయోగశాల. జ్ఞాన శతాబ్దం అయిన 21వ శతాబ్దంలో కొత్త సాంకేతి కతలు కొత్త క్రమానికి నాంది పలుకుతాయి. భారతదేశం తన విస్తారమైన నైపుణ్య గనిని ఏర్పరచడంలో, కొత్త క్రమాన్ని రూపొందించడంలో ముందంజలో ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాసకర్త కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపకత మంత్రి -
ఈ ఘనత మోదీ, జగన్‌లదే
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలకే దక్కుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. శుక్రవారం వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ ప్రాంతానికి రావడం పట్ల గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. విజయవంతమైన చంద్రయాన్–3 ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం సంతోషకరం అన్నారు. ఇలాంటి రాష్ట్రంలో గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అభినందనీయం అని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమష్టి కృషితో రూ.800 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారమవుతోందన్నారు. 561 ఎకరాల భూమి, విద్యుత్తు, రోడ్డు, నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్ చొరవ తీసుకొని ముందుకు వచ్చారని తెలిపారు. 21వ శతాబ్దానికి ఆధునిక దేవాలయమైన ఈ విశ్వ విద్యాలయం సాలూరు గిరిజన ప్రాంతంలో ఏర్పాటవ్వడం వల్ల పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్టాల్లోని గిరిజనులతో సామాజిక అనుబంధం ఏర్పడుతుందన్నారు. గిరిజనుల ప్రగతికి దోహదం ఇక్కడ ప్రసిద్ధి గాంచిన అరకు కాఫీ, నల్ల మిరియాలు, తేనె, పనస, పైనాపిల్ తదితర అటవీ పంటలపై పరిశోధనకు ఈ వర్సిటీ ద్వారా అవకాశం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. క్రీడా సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. ఒడిశాలో ఉన్న యూనివర్సిటీతో ఈ వర్సిటీ భాగస్వామ్యమైతే దేశంలో గిరిజనుల ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్లవచ్చని ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్ నుంచి ఒడిశా మీదుగా విశాఖ, గంగవరం పోర్టులను కలిపే గ్రీన్‌ఫీల్డ్ హైవే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ట్రైబల్ వర్సిటీ ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, స్థానికంగా ప్రజల మాతృభాషనూ ప్రోత్సహిస్తూ బోధనలో బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్‌ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కళ్లెదుటే అభివృద్ధి ► భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గిరిజన ప్రాంతంలోకి వెళ్తుంటే మనం గిరిజనుల కోసం ఏం చేశామో కళ్లెదుటే కనిపిస్తోంది. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజినీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒకటి కాదు.. రెండు జిల్లాలు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఏర్పాటు చేశాం. ఇవాళ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. ► రూ.వెయ్యి కోట్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లా పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణమవుతోంది. గిరిజన ప్రాంతానికి గేట్వేగా ఉన్న నర్సీపట్నంలో ఇంకో కాలేజీ కడుతున్నాం. ► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం మన కళ్ల ముందే కనిపిస్తోంది. గిరిజన తండాలో జనాభా 500 ఉంటే గ్రామ పంచాయతీగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటికే 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని మాట ఇచ్చాం. ఆ ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాలలో రూ.250 కోట్లు ఖర్చుతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయి. ► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన అసైన్మెంట్ భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశాం. ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. -
గిరిజనుల్లో విద్యా కాంతులు
గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగిన కల్మషం లేని మనుషులు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతోంది. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని జీవన ప్రమాణాలు వారివి. వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో బాహ్య ప్రపంచంతో అడుగులు వేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వారిని గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశాం. నాలుగేళ్లలో 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.16,805 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా గిరిజనుల జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పలికామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల్లో విద్యాకాంతులు నింపే ఈ ప్రాజెక్టును రూ.830 కోట్ల ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ఆయన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికి, ఆయనతో కలిసి నేరుగా చినమేడపల్లికి హెలికాప్టర్లో చేరుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయం వచ్చిందని, రాష్ట్రంలో రెండవ సెంట్రల్ వర్సిటీ అని చెప్పారు. గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా మన గిరిజనులు ప్రపంచంతో పోటీపడేలా గొప్ప అడుగుకు బీజం పడబోతోందని చెప్పారు. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి మీ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లుగా గుండెల్లో పెట్టుకున్నాం ► ఈ నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేశాం. వారిని గుండెల్లో పెట్టుకున్నాం. అన్ని విధాలా అండగా నిలబడ్డాం. వారిని తోటి ప్రపంచంలో నిలబెట్టే సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. ► తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్నాం. మీడియం నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటిలోనూ ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ► గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోంది. వారి విద్యా సాధికారత కోసం, తోటి పోటీ ప్రపంచంలో గెలవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ అనే కాన్సెప్ట్ అమలవుతోంది. నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయి. విద్యాకానుకతో బడిపిల్లల రూపాన్ని, బైలింగువల్ విధానంతో వారి టెక్టŠస్ బుక్స్‌నూ మార్చగలిగాం. ► ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తున్నాం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను చదువును ప్రోత్సహించేలా తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చాం. ► మెరుగైన చదువులు, కరిక్యులమ్‌లో మార్పులతో పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచి్చన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కుతుంది. విదేశీ విద్యా దీవెనలో భాగంగా ప్రపంచంలోని టాప్ 50 వర్సిటీల్లోని 21 ఫ్యాకలీ్టలకు వర్తింపజేస్తున్నాం. మొత్తంగా 350 కాలేజీల్లో సీటు సంపాదించుకుంటే చాలు రూ.1.25 కోట్ల వరకు మన పిల్లలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రాజకీయంగానూ పెద్దపీట ► నా ఎస్టీలు.. అనే పదానికి అర్థం చెబుతూ గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంతగా గిరిజనులకు రాజకీయ పదవులిచ్చి నా పక్కనే పెట్టుకున్నాను. ఏ నామినేటెడ్ పదవి, ఏ నామినేటెడ్ కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. మొట్టమొదట గిరిజన చెల్లెమ్మకు, తర్వాత గిరిజన అన్నకు కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. గత ప్రభుత్వానికి భిన్నంగా.. రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడా నియమించాం. ► నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిíÙగా వారికి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధితో అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 4.58 లక్షల గిరిజన కుటుంబాల ప్రయోజనం కోసం రూ.410 కోట్లు ఖర్చు చేశాం. ఆరోగ్య పరిరక్షణలోనూ శ్రద్ధ ► గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భవతుల వరకు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్, చిన్న పిల్లలకు గోరుముద్ద స్కీమ్‌లతో వారు తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగాం. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం అమలు జరుగుతోంది. ప్రతి అడుగూ గిరిజనుల బాగు కోసమే ► గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. 1,53,820 కుటుంబాలకు మేలు చేస్తూ 3,22,538 ఎకరాలను ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే ఏకంగా 84 శాతం కనిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 497 సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ముళ్లూ, చెల్లెమ్మలే. ► నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. మీ బిడ్డ బటన్ నొక్కుతుంటే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. నాలుగేళ్ల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ రూ.11,548 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాం. నాన్ డీబీటీ అంటే ట్యాబ్‌లు, ఇళ్ల పట్టాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద వంటివి కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు మరో రూ.5,257 కోట్ల మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్ల లబ్ధి చేకూరింది. ► సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వల్ల గొప్ప మార్పు జరగబోతోంది. దీన్ని మన ప్రాంతానికి మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అభినందనలు. -
గిరిపుత్రుల కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చాం : సీఎం జగన్
సాక్షి, విజయనగరం: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిడ్డ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. సీఎం జగన్ కామెంట్స్ చిక్కటి చిరునవ్వుల మధ్య, చెరగని ఆప్యాయతల మధ్య ఈరోజు దేవుడి ఆశీస్సులతో మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతోంది. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈ వేదికపై నుంచి అభినందనలు తెలియజేస్తున్నా. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న నా గిరిజన జాతికి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా మీ జగన్ ఎప్పటికీ రుణపడి ఉంటాడు. ఈ సభకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతిస్నేహితుడికీ, నిండు మనసుతో రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ► ఈరోజు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాలకు పునాదులు వేస్తున్నాం. దాదాపు 830 కోట్ల ప్రాజెక్టు. మరో మూడు సంవత్సరాలకు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోయే గొప్ప ప్రాజెక్టు. మంజూరు చేసినందుకు ఈ వేదికపై నుంచి మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం ఇక్కడ శంకుస్థాపన చేసిన ఈ కార్యక్రమం 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గిరి పుత్రుల జిల్లాలో వారి జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ► రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగు ఇక్కడి నుంచి బీజం పడబోతోంది. మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ ఉండేది. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగిన వారు. కల్మషం లేని మనసులు కలిగిన వారు. తరతరాలుగా వారిని వెంటాడుతున్న పేదరికం.. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు. ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగులు వేసే క్రమంలో వెనకాలే ఉన్నారు. ఈనాలుగు సంవత్సరాల పరిపాలనలో విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా కానీ గిరిజనులను గుండెల్లో పెట్టుకొని అడుగులు వేశామని గర్వంగా చెప్పలగుతా. ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలి. ► తరతరలాలుగా నిర్లక్షానికి గురైన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ఈరోజు గిరిపుత్రులకు అభివృద్ధిపట్ల మనందరి ప్రభుత్వం బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోందో నాలుగు మాటల్లో పంచుకుంటా. విద్య, సాధికారత కోసం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలని, మన పిల్లలు గెలవాలని, వారు చదువుకొనే మీడియంలో మార్పులు తీసుకొచ్చాం. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేసే పరిస్థితి ఉందని మన రాష్ట్రంలో ఉందని గర్వంగా చెబుతున్నా. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ అమలవుతోంది. నాడు-నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు మార్చబడుతూ కనిపిస్తున్నాయి. ► విద్యాకానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగువల్ టెక్స్ట్ బుక్కులతో మార్చగలుగుతున్నాం. ప్రతి గవర్నమెంట్ బడిలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటలైజ్ తెస్తూ, ఐఎఫ్పీలను ఏర్పాటు చేస్తున్నాం. గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతికి వస్తే ఆ పిల్లలందరికీ వారి చేతిలో ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. చదువులను ప్రోత్సహిస్తూ కల్యాణమస్తు, షాదీ తోఫా అనే కార్యక్రమాలను తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తెచ్చాం. మెరుగైన చదువులు, కరిక్యులమ్ లో మార్పులు తెచ్చి పిల్లలకు అందుబాటులోకి తెచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. ► ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంది. పాడేరులో మరో మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో మూడో మెడికల్ కాలేజీ కట్టబడుతోంది. ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త దూరం కురుపాంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టబడుతోంది. ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతోందో చెప్పడానికి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కనిపిస్తుంది. అక్కడ నుంచి కాస్త దూరంలో పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నది మన కళ్ల ఎదుట కనిపిస్తోంది. ► మరికాస్త దూరంలో సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం. మరో నాలుగు అడుగులు ముందుకు వెళ్లి చూస్తే కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ మనకు కనిపిస్తోంది. ఒక్క గిరిజన ప్రాంతలోనే రెండు మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, నాడు-నేడుతో మొదలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు గిరిజనులకు కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. మనందరి ప్రభుత్వం 50 నెలల పాలనలో గిరిజనులకు ఏం చేసిందో మీ అందరితో నాలుగు మాటలు పంచుకుంటా. నా ఎస్టీలు అనే పదానికి అర్థం చెబుతూ రాజకీయంగా పదవుల్లో వారికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా గిరిజనులకు నా పక్కనే పెట్టుకున్నా. ఏ నామినేటెడ్ పదవి, కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించేట్లుగా ఏకంగా చట్టం చేసి కార్యరూపం చేస్తున్నాం. ఇంకా ఏమన్నారంటే.. ► మొట్ట మొదట గిరిజన చెల్లెమ్మకు, నా గిరిజన అన్నకు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా నా పక్కన కూర్చోబెట్టుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ బద్ధంగా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమించిన చరిత్ర మీ బిడ్డ ప్రభుత్వంలోనే. నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిషిగా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీ కూడా మనసా, వాచా, కర్మణా, త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాం. 2019 జూలై నుంచి 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం 410 కోట్లు ఖర్చు చేశామని సవినయంగా తెలియజేస్తున్నా. గిరిజనులకు ప్రత్యేక జిల్లా, ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య, ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ఒక జిల్లా కాదు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నాం. ► రూ.1000 కోట్లతో అల్లూరి జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ కడుతున్నాం. మన్యం జిల్లాలో పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజీ వేగంగా నిర్మాణం అవుతోంది. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం అని చెబితే మన కళ్ల ఎదుటే నిర్మాణం కనిపిస్తోంది. గిరిజన తండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ 165 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాస్తామని మాట ఇచ్చాం. మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురంలో, అల్లూరి జిల్లా రంపచోడవం, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, ప్రకారం జిల్లా దోర్నాలలో 250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాల్టీ హాస్పిటళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లు కనిపించే కార్యక్రమం జరుగుతోంది. ► ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకుంటూ 2021 మే 19న జీవో 109 జారీ చేశామని తెలియజేస్తున్నా. ఐదుగురు సభ్యులుండే ప్రత్యేక ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చింది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. వారి బాగోగుల కోసం 153820 గిరిజన కుటుంబాలకు మేలు చేస్తూ, 322538 ఎకరాలను ఆర్వోఎఫ్ ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా ఇస్తోంది మీ బిడ్డ ప్రభుత్వమే. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాల వారు ఏకంగా 84 శాతం ఉద్యోగాలు వాళ్లే చేస్తూ అక్కడే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ములు, చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వ పడుతున్నా. నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. ► అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. గిరిజనుల వరకు మాత్రమే చూస్తే 50 నెలల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు 11548 కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతోంది. నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు రూ.5,257 కోట్లు మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే అక్షరాలా 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్లు నేరుగా వాళ్లకు వెళ్లాయి. ఈ ప్రాంతంలో మీకు జరిగిన మార్పును మీకు తెలియజేసేందుకు ఇవన్నీ చెబుతున్నా. ఈ యూనివర్సిటీ వల్ల గొప్పమార్పు జరగబోతోంది. రాబోయే రోజుల్లో తరతరాలు గుర్తుండిపోయేలా ఉండిపోతుందని తెలియజేస్తున్నా. దేవుడి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల, ఈ ప్రభుత్వం పట్ల ఉండాలని, కేంద్ర ప్రభుత్వ సహకారం మరింతగా రావాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం: సీఎం జగన్
Updates.. ►ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ► నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. ► మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను తీసుకువచ్చాం. ► కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతోంది. పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోంది. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోంది. సాలూరులో గిరిజన వర్సిటీ వచ్చేస్తోంది. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. ► రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ► కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైంది. రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్ తలచారు. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోంది. పేదల గృహాల కోసం కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తున్నాం. మాతృ భాషలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకురావడం అభినందనీయం. అల్లూరి సీతారామరాజు నడిచిన పవిత్ర నేల ఇది. ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. గిరిజన వర్సిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు. ఏపీలో అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెడతాం. ► కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ► ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. ► మన్యం జిల్లా చినమేడపల్లి చేరుకున్న సీఎం జగన్ ► కాసేపట్లో కేంద్ర గిరిజన వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ► గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్. ► రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. ► విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్‌లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. ► వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
AP: గిరిజనం ముంగిట విద్యావనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(సీటీయూఏపీ) నిర్మాణానికి సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద ఈ నెల 25న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువిశాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారం కానుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014లో కేంద్రం మన రాష్ట్రానికి 13 కేంద్రీయ విద్యా సంస్థలను మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(సీటీయూఏపీ)ను కేటాయించింది. 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. దీనిని పట్టించుకోలేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద భూమి కేటాయించినా అది ఏ మాత్రం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేని పరిస్థితి. పూర్తిగా కొండప్రాంతం. పరిసరాల్లో టీడీపీ నాయకుల స్థిరాస్తి వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడలేదు. తమ పదవీకాలం ముగిసేవరకూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది. చివరకు సీటీయూఏపీ తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాల్సి రావడంతో విజయనగరం పట్టణ శివారు కొండకరకాం వద్దనున్న ఏయూ పీజీ క్యాంపస్ పాత భవనంలోనే 2019 ఆగస్టు 5న తరగతులు ప్రారంభమయ్యాయి. గిరిజనులకు చేరువగా.. ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ లక్ష్యం సార్థకమయ్యేలా గిరిజన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ–హౌరా రైల్వేలైన్‌లోని విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉండేలా భూమి కేటాయించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా స మీపంలోనే ఉంటుంది. మెంటాడ మండలం చినమేడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 224.01 ఎకరాలు, దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూ గ్రామ పరిధిలో 337.87 ఎకరాలు.. మొత్తం 561.88 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దాదాపు 480 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు రూ. 30.58 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల ఆగిన మిగిలినవారికి 2 రోజుల్లో చెల్లింపు ప్రక్రియ పూర్తి చేస్తామని విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట సీటీయూఏపీకి కేటాయించిన భూమిని గతేడాది కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. వర్సిటీ భవనాల నిర్మాణమంతా కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇందుకోసం రూ.23.60 కోట్లను గతేడాది విడుదల చేసింది. విశాఖ–రాయ్‌పూర్ జాతీయ రహదారి నుంచి సీటీయూఏపీ ప్రాంగణం వరకూ రూ.16 కోట్లతో 100 అడుగుల వెడల్పున ఆరు లైన్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాగునీటి వసతి కల్పనకు రూ.7 కోట్లు, విద్యుత్ సౌకర్యానికి దాదాపు రూ.60 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. కాగా, విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడంలో సీటీయూఏపీ ముందుంది. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా 6గ్రాడ్యుయేట్(యూజీ), 8 పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో బోధన జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెటింగ్ నైపుణ్యాల కోర్సులను ప్రవేశపెడుతున్నా రు. ఇప్పటికే పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా నైపుణ్యాలను, మెలకువలను అందించేలా సాంకేతిక మాధ్యమాలనూ సీటీయూఏపీ రూపొందిస్తోంది. అందుకు సిలబస్‌ను కూర్పు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పర్యవేక్షణలో ప్రవేశపరీక్షలు నిర్వహించి.. ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు. -
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలో భాగంగా పరీక్షల విధానంలో కేంద్రం కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్) ప్రతిపాదనలు చేసింది. అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్సీఎఫ్ నివేదికను బుధవారం జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు. ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్ లేదా టర్మ్ బేస్డ్ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్ భారం తగ్గుతుందని చెప్పింది. ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో ఇలాంటి సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో పదో తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తెచ్చారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎన్సీఎఫ్ సిఫార్సు చేసింది. వీరు మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్స్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వెల్–బియింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. -
సీబీఎస్ఈ బోధన... ఇకపై తెలుగులో కూడా
భువనేశ్వర్: ఉన్న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి. -
‘రాహుల్ అనర్హతవేటుపై.. కాంగ్రెస్‌లోనే జరిగిన కుట్ర!’
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుపై బీజేపీ స్పందించింది. రాహుల్‌కు మద్ధతుగా వ్యాఖ్యలు చేసే క్రమంలో కాంగ్రెస్ నేతలు కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలను బలంగా తిప్పికొట్టారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్లు. అసలు ఇది కాంగ్రెస్‌లోనే జరిగిన కుట్ర అని పేర్కొన్నారు వాళ్లు. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఈ వ్యవహారంలో మీరు(రాహుల్ గాంధీ) లోతుగా వెళ్తేనే అసలు విషయాలు తెలుస్తాయి. మిమ్మల్ని అడ్డుతొలగించుకునేందుకు, పార్టీ నుంచి వదిలించుకునేందుకు ఎవరు కుట్ర పన్నారనేది మీకే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో నిష్ణాతులైన న్యాయవాదులెందరో ఉన్నారు. అలాంటప్పుడు మీకు సలహా ఇవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదా? అని ఠాకూర్ ప్రశ్నించారు. అలాగే.. రాహుల్ గాంధీ కేవలం 21 లోక్‌సభ చర్చల్లో మాత్రమే పాల్గొన్నారని, 2009 నుంచి పార్లమెంటేరియన్‌గా ఉన్నప్పటికీ ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని కేంద్ర మంత్రి ఠాకూర్ విమర్శించారు. అంతెందుకు రాహుల్ గాంధీ తన సొంత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చించివేసిన సంఘటనను కూడా ప్రస్తావించారు. రాహుల్‌కి ఇదేం కొత్త కాదని, ఇలాంటి ఏడు కేసుల్లో బెయిల్ మీద ఉన్న విషయాన్ని ప్రస్తావించిన ఠాకూర్.. జరగబోయే పరిణామాలను పట్టించుకోకుండా మాట్లాడడం రాహుల్‌కు అలవాటైన పనేనని విమర్శించారు. ఇక మరో కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి ఇలాంటి నేరాలు అలవాటయ్యాయని పేర్కొన్నారు. రాహుల్ చేసిన మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన.. ఫ్యూడల్ మనస్తత్వం ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడతారని రాహుల్‌పై మండిపడ్డారు. అంతకు ముందు మరో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఈ పరిణామంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశ చట్టం కంటే ఉన్నతమైనవారా?. ఓబీసీ సమాజానికి చెందిన ఓ ఇంటిపేరును దుర్భాషలాడడం, అవమానించడం జాతీయ నాయకుడి పనా? అంటూ మండిపడ్డారాయన. -
త్వరలో ‘నైపుణ్యాల హబ్’గా భారత్
న్యూఢిల్లీ: ప్రజల్లో అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాలు, అవగాహనను పెంపొందించేందుకు విద్య, నైపుణ్యాల కల్పనపై మరింతగా ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యమని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అప్పుడే వారు 21వ శతాబ్దంలో అవకాశాలను దక్కించుకోవడానికి సర్వసన్నద్ధులుగా ఉండగలరని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న భారత్.. అతి త్వరలోనే ప్రపంచ నైపుణ్యాల హబ్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్విట్జర్లాండ్‌కి చెందిన హోటల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ (హెచ్టీఎంఐ) భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆతిథ్య రంగంలో విద్యార్థులు కెరియర్ను ఏర్పర్చుకోవడానికి, అంతర్జాతీయంగా నిపుణుల కొరతను తగ్గించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొన్నారు. దీనితో డ్యుయల్ డిగ్రీ విధానంలో విద్యాభ్యాసం చేస్తున్న వారికి కచ్చితమైన ఉద్యోగావకాశాలు లభించగలవని, పరిజ్ఞానం పెంపొందించుకోగలరని ప్రధాన్ వివరించారు. హెచ్టీఎంఐకి ఆస్ట్రేలియా, చైనా, దుబాయ్, మారిషస్ తదితర దేశాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. స్విస్–యూరోపియన్ కలినరీ ఆర్ట్స్ మొదలైన విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు అందిస్తోంది. -
కర్ణాటక ఎన్నికలకు బీజేపీ సారథిగా ఉజ్వల్ మ్యాన్
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే అభివృద్ధి పనులు, బడ్జెట్ కేటాయింపులతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. ఇక ఈ ఏడాది వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. తాజాగా ఆ రాష్ట్రానికి ఎన్నికల సారథిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(54)ను నియమించింది ఆ పార్టీ. అలాగే.. కో ఇన్ఛార్జిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పేరుతో ఒక ప్రకటనను శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖలను ధర్మేంద్ర ప్రధాన్ చూసుకుంటున్నారు. ఒడిషాలో పుట్టిపెరిగిన ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ తనయుడు. దేవేంద్ర ప్రధాన్.. వాజ్‌పేయి హయంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ధర్మేంద్ర ప్రధాన్.. ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టారు. పలు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగానూ పని చేశారు. 2004లో దియోగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆపై బీహార్, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘ కాలం పెట్రోలియం, సహజ ఇంధనాల శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ధర్మేంద్ర ప్రధాన్ ఖాతాలో ఉంది.ఈయన హయాంలోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం అయ్యి.. విజయవంతమైంది. అందుకే ఈయన్ని ఉజ్వల మ్యాన్‌గా పిలుస్తుంటారు. ఆంత్రోపాలజీలో పీజీ చేసిన ధర్మేంద్ర ప్రధాన్.. మంచి వక్త కూడా. ఈ ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా.. ప్రభుత్వ ఏర్పాటులో అద్భుతం సృష్టిస్తామంటూ జేడీఎస్ ప్రకటించుకుంటోంది. -
భరోస్, డేటా భద్రతకు ఓఎస్! భారత్ విప్లవాత్మక ముందడుగు
ప్రపంచమంతటా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు విలాసాలు కాదు.. నిత్యావసరాలుగా మారిపోయాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. దాదాపు అన్ని రంగాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇక ఫోన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు పని చేయాలంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఓఎస్ కోసం మనం ఇన్నాళ్లూ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఓఎస్‌ను దేశీయంగా మనమే తయారు చేసుకోలేమా? అన్న ప్రశ్నకు సమాధానమే ‘భరోస్’. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే ఓఎస్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాస్ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించారు. భరోస్ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఓఎస్ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైన వారిని అభినందించారు. ఏమిటీ భరోస్? ► విదేశీ ఓఎస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇందుకోసం భరోస్ పేరిట దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిధులు సమకూర్చింది. ► ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఓఎస్‌లతో డిఫాల్ట్ యాప్‌లు, గూగుల్ సర్వీసులు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో చాలావరకు మనకు అవసరం లేనివే ఉంటాయి. అవి ఏ మేరకు భద్రమో తెలియదు. ► భరోస్ ఓఎస్ వీటి కంటే కొంత భిన్నమనే చెప్పాలి. ఇదొక ఉచిత, ఓపెన్–సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నో డిఫాల్ట్ యాప్స్(ఎన్డీఏ)తో వస్తుంది. అంటే భరోస్ ఓఎస్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లో ఎలాంటి యాప్‌లు కనిపించవు. ► గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లతో క్రోమ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్ వంటివి డిఫాల్ట్‌గా వస్తుండడం తెలిసిందే. ► డిఫాల్ట్‌గా వచ్చే యాప్‌లతో మోసాలకు గురవుతుండడం వినియోగదారులకు అనుభవమే. అందుకే భరోస్ ఓఎస్ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్‌లను ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్(పాస్) నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ‘పాస్’లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న, అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్‌లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఫోన్లలోని డేటా చోరీకి గురవుతుందన్న ఆందోళన ఉండదు. ► స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ ఓఎస్‌ను ఎలా అందజేస్తారు? ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఇస్తారా? లేదా? అనేదానిపై ఐఐటీ–మద్రాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు వాడుతున్నారు? ► కఠినమైన భద్రత, గోప్య త అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం భరోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్నాయి. ► రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రభుత్వ కంపెనీలు ఈ ఓఎస్‌ను వాడుతున్నట్లు సమాచారం. ఎందుకీ ఓఎస్? ► గూగుల్ మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్‌పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ► ఆండ్రాయిడ్‌తో డిఫాల్ట్‌గా వస్తున్న కొన్ని యాప్‌ల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు తెలియజేసింది. ► ఈ నేపథ్యంలోనే దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విప్లవాత్మక ముందడుగు ఐఐటీ–మద్రాసు ఆధ్వర్యంలో స్థాపించిన జండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జండ్‌కాప్స్) అనే లాభాపేక్ష లేని స్టార్టప్ కంపెనీ భరోస్ ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది. నమ్మకం అనే పునాదిపై భరోస్ మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించినట్లు ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ చెప్పారు. తమ అవసరాలను తీర్చే యాప్‌లను పొందే స్వేచ్ఛను వినియోగదారులకు కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. దీనివల్ల సంబంధిత యాప్‌లపై వారికి తగిన నియంత్రణ ఉంటుందన్నారు. ఫోన్లలోని డేటా భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని అభివర్ణించారు. మన దేశంలో ఈ ఓఎస్ వినియోగాన్ని పెంచేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తామని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. వెంటనే ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కాన్వాయ్, సభలు, ర్యాలీ లపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారని, రాజగోపాల్ రెడ్డికి ఉన్న ముప్పు కారణంగా ఆయన భద్రతను బలో పేతం చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) దాదాపు 12 వేల బోగస్ ఓట్లను తొలగించినప్పటికీ ఇంకా ఉన్న 14 వేల ఓటర్లలో ర్యాండమ్ వెరిఫికేషన్ సందర్భంగా 1,800 కంటే ఎక్కువ బోగస్ ఓటర్లు ఉన్నారని ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి టీఆర్ఎస్పై ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 13న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘాన్ని కలసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లా డుతూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని, రిటర్నింగ్ అధికారి, డీఈవో అనుమతి లేకుండానే భారీ సంఖ్యలో వాహనాలను టీఆర్ఎస్ మోహరించిందని తెలిపారు. అంతేగాక టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల వనరుల దుర్వినియోగం, ఓటర్లను ప్రలోభపెట్టడంతోపాటు ఆ పార్టీ నాయకులు, మంత్రులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా మద్యం, నగదును చెక్‌పోస్టుల ద్వారా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు చెందిన అనధికార వ్యక్తులను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బోగస్ ఓట్లను పునఃపరిశీలించి, ఓటర్ల జాబితాలో నిజమైన ఓటర్లు మాత్రమే ఉండేలా చూడాలని కోరారు. మైక్రో జనరల్ అబ్జర్వర్లను, మైక్రో పోలీస్ అబ్జర్వర్లను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాయుధ బలగాల ద్వారా అన్ని పోలింగ్ స్టేషన్లకు భద్రత కల్పించడంతో పాటు పోలింగ్ బూత్‌లలో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ చేయాలని బీజేపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. -
ఐఐటీలకు విదేశాల నుంచి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఐఐటీ క్యాంపస్‌లను నెలకొల్పాలంటూ పలు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయని ఆయన అన్నారు. ఇవి కేవలం ఐఐటీలుగానే కాదు, పరివర్తన సాధనాలుగా కూడా మారాయన్నారు. ఐఐటీ –ఢిల్లీలో శుక్రవారం ఆయన రెండు రోజుల ఇన్వెంటివ్ ఫెయిర్‌ను ప్రారంభించి ప్రసంగించారు. ప్రతిభ, మార్కెట్ పరిమాణం, కొనుగోలు శక్తి వంటివి దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్నాయని, మన ఐఐటీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. -
నైపుణ్యాల శిక్షణపై పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: కార్మికుల్లో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. నైపుణ్యాలు, విద్యను ప్రోత్సహించడానికి విధాన కర్తలు, విద్యా వంతులు, పరిశ్రమ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. ఫిక్కీ నిర్వహించిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రధాన్ మాట్లాడారు. రెండు చేతులతోనే చప్పట్లు సాధ్యపడుతుందని చెబుతూ.. నైపుణ్యాభివృద్ధికి అందరు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పనివారిలో నైపుణ్యాల పెంపునకు పరిశ్రమ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ‘‘శిక్షణ ఇచ్చేవారు, లబ్ధిదారులే కనిపిస్తున్నారు. కానీ, పరిశ్రమల భాగస్వామ్యం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని గుర్తు చేస్తూ.. నిపుణులైన మానవవనరులు ఉన్నప్పుడే ఈ లక్ష్యం సాకరమవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరిశ్రమలకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందని చెప్పారు. నైపుణ్యాల శిక్షణకు కూడా నిధులు ఖర్చు చేస్తోందని చెబుతూ.. పరిశ్రమలు కూడా ముందుకు రావాలని కోరారు. -
హైదరాబాద్ ఐఐటీ అదుర్స్
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. హెచ్‌సీయూ భళా.. జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది. వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలోవరంగల్ ఎన్ఐటీ 21 ర్యాంకు ఓవరాల్ విభాగంలో 45వ ర్యాంకు పొందింది. ఇంజనీరింగ్ విద్యలో జేఎన్టీయూ (హైదరాబాద్)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రతీ నిర్ణయం పేదల కోసమే..
తమ ప్రభుత్వానికి పేదలే ప్రధానమని, ప్రధాని మోదీ ప్రతి నిర్ణయాన్ని పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్య వర్గ సమావేశాల తొలిరోజు విశేషాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, గరీబ్ కల్యాణ్ యోజనపై తొలిరోజు సమావేశాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ బలపర్చారని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది జనాభాకు లబ్ధి చేకూరుతోందన్నారు. కరోనా సంకట కాలంలో ఈ పథకం పేదలకు ఎంతో మేలు చేసిందని, గత 25 నెలలుగా రూ.2.6 లక్షల కోట్లను పేదలకు అందించామని చెప్పారు. 2014 మేలో అధికారం చేపట్టినప్పుడు ప్రధాని మోదీ తొలిసారి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీ మేరకు పేదలు, మహిళలు, యువత, దళితులు, బడుగు, బలహీనవర్గాల కోసం తమ ప్రభు త్వం పని చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పా రు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సౌభాగ్య, ప్రతి ఇం టికి నల్లా నీరు, జన్‌ధన్ బ్యాంకు ఖతాలు, ముద్ర యోజన వంటి పథకాలు మంచి ఫలి తాలు ఇచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ ప్రభా వం ఉన్నా.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో గత 8 ఏళ్లలో విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరిగాయని.. మన దేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే మహా శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దడం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యమన్నారు. -
ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌లు
న్యూఢిల్లీ: భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అయిదు ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయిదు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల వివరాలను ఆయన తన జవాబులో పొందుపరిచారు. అందులో విశాఖపట్నం-రాయపూర్ మధ్య 99.63 కిలోమీటర్లు దూరం నిర్మించే ఆరు వరసల జాతీయ రహదారికి రూ. 3,183 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే రూ.202 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఖమ్మం-దేవరాపల్లి మధ్య 56 కి.మీ దూరం నిర్మించే నాలుగు వరుసల రహదారి (ఎన్‌హెచ్ 365బీజీ) కోసం రూ.1281 కోట్లు కేటాయించగా ఇప్పటికే 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. చిత్తూరు-థాట్చూర్ మధ్య 96 కి.మీ దూరం నిర్మించే ఆరు వరసల రహదారి (ఎన్‌హెచ్-716బీ) కోసం 3179 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు ఖర్చయింది. బెంగుళూరు-చెన్నై మధ్య 85 కి.మీ దూరం నిర్మించే ఎక్స్‌ప్రెస్‌వేకు రూ.4,137 కోట్లు కేటాయింపు జరగ్గా ఇప్పటికి రూ. 123 కోట్లు ఖర్చయింది. బెంగుళూరు-విజయవాడ మధ్య 343 కి.మీ దూరం నిర్మించే కారిడార్‌కు సంబంధించి ప్రాజెక్ట్ తీరుతెన్నులు, వ్యయంకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించే పని ప్రారంభమైనట్లు మంత్రి గడ్కరీ వివరించారు. చదవండి: (ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు!) ఏపీలో రూ.5,347 కోట్లతో 28 ఆర్వోబీల నిర్మాణం 'సేతు భారతం' కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో 28 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు), రోడ్డు అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ల నిర్మాణం చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ 28 ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి 5,347 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఎన్‌హెచ్ 205పై చిత్తూరు జిల్లా తుమ్మనం గుంట వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు, ఎన్‌హెచ్ 40పై వైఎస్సార్ కడప జిల్లాలోని ఊటుకూరు వద్ద నాలుగు వరసల ఆర్వోబీ పనులు, ఎన్‌హెచ్ 18పై చిత్తూరు జిల్లా ముత్తిరేవుల వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు, చిత్తూరు జిల్లాలో ఎన్‌హెచ్18పై మురకంబట్టు వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు పూర్తయినట్లు మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఎన్‌హెచ్ 205పై రాప్తాడు వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయి. చిత్తూరు జిల్లాలోని ఎన్‌హెచ్ 205పై తిరుపతి వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరుల నాటికి పూర్తవుతాయని తెలిపారు. మిగిలిన ప్రాజెక్ట్‌లలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో ఎన్‌హెచ్ 214పై నిర్మించ తలపెట్టిన ఆర్వోబీ, అదే జిల్లాలోని వీరవాసరం వద్ద తలపెట్టిన ఆర్వోబీ కోర్టు కేసుల కారణంగా నిలిపివేసినట్లు మంత్రి చెప్పారు. ఏపీలో మరిన్ని కేవీలు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యావకాశాలను అన్ని ప్రాంతాలకు సమంగా విస్తరించేలా చూసేందుకు మరిన్ని కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి విద్యా శాఖ మంత్రిని ప్రశ్నించారు. దీనికి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జవాబిస్తూ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికమంది ఉండే ప్రాంతాల్లో మాత్రమే వారి పిల్లలకు విద్యావకాశం కల్పించేందుకు ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తుంది తప్ప జిల్లాల ప్రాతిపదికన కేవీల ఏర్పాటు జరగదని, అది ప్రభుత్వ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. -
రెండోరోజు ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్
-
ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
రెండో విడత మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్
న్యూఢిల్లీ: యువతకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు, అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజీఎన్ఎఫ్) రెండో విడతను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఆవిష్కరించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్)లతో కలిసి ఈ రెండేళ్ల కోర్సును రూపొందించారు. దీనిలో భాగంగా విద్యార్థులు ఇటు తరగతి గదుల్లో విద్యాభ్యాసంతో పాటు క్షేత్ర స్థాయిలోనూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. సుశిక్షితులైన మానవ వనరులకు సంబంధించి నెలకొన్న డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం, జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడం మొదలైనవి ఎంజీఎన్ఎఫ్ ప్రోగ్రాం లక్ష్యాలు. విద్య, వృత్తిపరమైన అనుభవం ఉన్న 21–30 మధ్య వయస్సు గల పురుషులు, మహిళలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..!
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భారంగా మారుతున్నాయి. కొన్ని రోజులపాటు నిలకడగా ఉన్న ఇంధన ధరలు వరుసగా మూడో రోజు శనివారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరగడంతో చమురు కంపెనీలు డీజిల్ ధరల్ని ఊహించని విధంగా పదిరోజుల వ్యవధిలో ఆరుసార్లు పెంచాయి. ఇంధన ధరలు పెరగడానికి కేంద్రం పలు కారణాలను చెప్తూ వస్తోంది. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! తొమ్మిది నెలల్లో కేంద్రం చెప్పిన కారణాలు ఇవే...! 1. ఈ పాపమంతా గత కాంగ్రెస్ ప్రభుత్వానిదే (2021 ఫిబ్రవరి 18) ప్రధానమంతి నరేంద్ర మోదీ ఇంధన ధరల పెంపుపై‘ గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి పెడితే, మధ్యతరగతి వారికి ఇంధన ధరలు అంత భారం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. 2. ఇంధన ధరలు పెరుగుదల ‘ధర్మ సంకటమే’..: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(2021 ఫిబ్రవరి 20) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన ధరల పెరుగుదల' ధర్మసంకట్ ' పరిస్థితి అన్నారు. తుది ధర లేదా ఇంధన రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు ఒక మార్గాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. 3. ధర్మేంద్ర ప్రధాన్ ఇంధన ధరల పెంపు వెనుక అంతర్జాతీయ మార్కెట్ల వాదన (2021 ఫిబ్రవరి 22) మాజీ కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, రిటైల్ ఇంధన ధరలు పెరిగాయన్నారు. కోవిడ్-19 కారణంగా ముడిచమురు ఉత్పత్తి నెమ్మదించడంతో సరఫరా తగ్గిందన్నారు. 4. ఇంధన ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుపై వెనుకడుగు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (2021 మార్చి 5) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నులను తగ్గిస్తే ఇంధన ధరలు అదుపులోకి వస్తాయన్నారు. అప్పుడు సామాన్యులపై భారం తగ్గుతుందని మీడియా సమావేశంలో వెల్లడించారు. 5. సంక్షేమ పథకాలు, టీకాల కోసం ధరల పెంపు: మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (జూన్ 14, 2021) అధిక ఇంధన ధరలు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని అంగీకరిస్తూ, మాజీ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "ఇంధన ధరలు వినియోగదారులను చిదిమేస్తున్నాయని నేను అంగీకరిస్తున్నాను. అయితే కోవిడ్ టీకాల కోసం ఒక ఏడాదిలో రూ. 35,000 కోట్లు ఖర్చు అవుతోంది.ఇటీవల, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించడానికి ప్రధాన మంత్రి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. 6.కాంగ్రెసే కారణం..!: ధర్మేంద్ర ప్రధాన్(2021 జూలై 3) అప్పటి కేంద్ర పెట్రోలియం , సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలి ఇంధన ధరల పెంపును కాంగ్రెస్ పాలనతో ముడిపెట్టారు. ఆర్థికవేత్తలను ఉటంకిస్తూనే...అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విలువైన చమురు బాండ్లను వదిలిపెట్టిందని, అందుకే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వాటికి వడ్డీ , ప్రధాన ధరలను రెండింటినీ చెల్లిస్తోందని పేర్కొన్నారు. 7. మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనివార్యం: ఆర్థికమంత్రిత్వ శాఖ(2021 జూలై 20) రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రిత్వ శాఖ సహయమంత్రి పకజ్ చౌదరీ సమాధానమిస్తూ...దేశంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనివార్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పన్నులు పెంచాల్సి వస్తుందన్నారు. 8.పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులను కేంద్రం సమర్థిస్తోంది: పెట్రోలియం , సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి(2021 జూలై 26) ప్రతిపక్షాలు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ.. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని (పెట్రోలియం ఉత్పత్తులపై) వివిధ అభివృద్ధి పథకాలలో ఉపయోగించబడుతుందని, మహమ్మారి సమయంలో పేదలకు ఉపశమనం అందించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన వంటి పథకాల కింద 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 9. యూపీఎ ప్రభుత్వం చేసిన తప్పులకు మోదీ 2.0 చెల్లిస్తోంది: నిర్మలా సీతారామన్(2021 ఆగస్టు 16) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.."గత యూపీఎ ప్రభుత్వం చేసిన ఆయిల్ బాండ్లకు పన్నులను చెల్లించే భారం లేకపోతే, పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే పరిస్థితి ఉండేదని అభిప్రాయపడ్డారు. చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్ బ్రాండ్ టీవీలు.. -
ఆంధ్ర–ఒడిశా ‘సరిహద్దు’పై చర్చలు జరపాలి
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు వివాదంపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. కొటియా గ్రామాల సమస్య పరిష్కారానికి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ సీఎంకు లేఖ రాశారు. ఒడిశా–ఏపీ రెండు రాష్ట్రాల నివాసితుల ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. చీఫ్ సెక్రటరీలు, డెవలప్మెంట్ కమిషనర్ల స్థాయిలో ఉమ్మడి–వర్కింగ్ గ్రూప్ చర్చలతో పాటు, సమస్యల పరిష్కారానికి భవిష్యత్ రోడ్ మ్యాప్ రూపకల్పనకు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని సూచించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్‌లోని కొటియా గ్రామ పంచాయతీల్లో కొన్ని నెలలుగా అనేక ఘర్షణలు జరిగాయని, అవి ఇప్పుడు గజపతిలోని ఇతర సరిహద్దు గ్రామాలకు విస్తరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇటీవల కొటియాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. ఒడిశా ప్రభుత్వం పోలీసులను మోహరించిందని, కొటియా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్న గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారని విస్తృత ప్రచారం కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే వ్యూహం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. ఈ ఊహించని పరిణామంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా పురోలా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ కండువా కప్పి రాజ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ... అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బీజేపీ పని చేస్తోంది. కానీ కాంగ్రెస్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బడుగు, బలహీనవర్గాలను సబ్సిడీలపై ఆధారపడి బతికేలా చేసింది. ఉత్తరాఖండ్‌లో మెరుగైన పాలనను చూసి బీజేపీలో చేరా’ అని పేర్కొన్నారు. రాజ్‌కుమార్ గతంలో బీజేపీలోనే కొనసాగారు. 2007-2012 మధ్య బీజేపీలో ఉన్న ఆయన అనంతరం 2012లో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికల దృష్ట్యా బీజేపీ ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది. 2017లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. పార్టీలో విబేధాలు రాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పార్టీ పాత నాయకులను తిరిగి చేర్చుకుంటోంది. అందులో భాగంగానే రాజ్‌కుమార్ బీజేపీలో చేరిక. చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం -
నెంబర్ వన్‌గా ఐఐటీ మద్రాస్.. వరుసగా మూడో ఏడాది..
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ–మద్రాస్ నెంబర్ వన్‌గా నిలిచింది. ఓవరాల్ ర్యాంకుల్లోనూ, ఇంజినీరింగ్‌లోనూ వరుసగా మూడోసారి తొలి స్థానం సాధించింది. 2021 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) రూపొందించిన ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం విడుదల చేశారు. టాప్–100లో ఏపీ, తెలంగాణ విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు రెండోస్థానంలో, ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఏపీ, తెలంగాణకు చెందిన పలు ఉన్నత విద్యా సంస్థలు ఓవరాల్ కేటగిరీ టాప్–100లో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–హైదరాబాద్ 16వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ఐఐటీ–హైదరాబాద్ 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 15వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండు స్థానాలు వెనుకబడింది. ఇక ఆంధ్రా యూనివర్సిటీ 48వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 59వ, ఉస్మానియా యూనివర్సిటీ 62వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది ర్యాంకులతో పోల్చితే ఈ వర్సిటీలు వెనుకబడ్డాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వర్సిటీ(కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) 69వ స్థానంలో, ఎస్వీయూ 92వ స్థానంలో నిలిచాయి. వర్సిటీ కేటగిరీల్లో హెచ్సీయూకు 9వ ర్యాంకు యూనివర్సిటీ కేటగిరీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూర్ తొలిస్థానంలో నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 9వ స్థానంలో నిలిచి టాప్–10లో చోటు దక్కించుకుంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీకి 24వ స్థానం దక్కింది. ఉస్మానియా వర్సిటీ 32వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 35వ స్థానంలో, ఎస్వీయూ 54వ స్థానంలో, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 67వ స్థానంలో, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 83వ స్థానంలో, విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ యూనివర్శిటీ 97వ స్థానంలో నిలిచాయి. కాలేజీల కేటగిరీల్లో టాప్–100లో రెండే.. కాలేజీల కేటగిరీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కేవలం రెండు కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. 34వ స్థానంలో విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, 85వ స్థానంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ నిలిచాయి. ర్యాంకింగ్స్.. రీసెర్చ్ కేటగిరీలో..: రీసెర్చ్ కేటగిరీలో ఐఐటీ హైదరాబాద్ 15వ స్థానంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచాయి. ఇంజినీరింగ్: ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 8వ స్థానంలో, ఎన్ఐటీ–వరంగల్ 23వ, కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ 50వ, ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 54వ స్థానంలో, జేఎన్టీయూ–హైదరాబాద్ 62వ స్థానంలో, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్–విశాఖపట్నం 74వ స్థానంలో నిలిచాయి. మేనేజ్మెంట్: మేనేజ్మెంట్ విభాగంలో ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్– హైదరాబాద్ 27వ స్థానంలో, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 38వ, క్రియా యూనివర్సిటీ–చిత్తూరు 50వ స్థానంలో, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ–హైదరాబాద్ 63వ స్థానంలో నిలిచాయి. ఫార్మసీ: ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైఫర్) హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ సైన్సెస్–విశాఖ 30వ స్థానంలో, శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం–తిరుపతి 44వ, కాకతీయ యూనివర్సిటీ 48వ, ఎస్వీయూ 54వ, రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–అనంతపురం 55వ స్థానంలో నిలిచాయి. శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ–చిత్తూరు 62వ, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా– గుంటూరు 69వ స్థానంలో, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా–నర్సాపూర్ 72వ స్థానంలో నిలిచాయి. వైద్య విద్య విభాగం వైద్య విద్య విభాగంలో ఎయిమ్స్–ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. నారాయణ మెడికల్ కాలేజ్–నెల్లూరు 43వ స్థానంలో నిలిచింది. న్యాయ విద్య: న్యాయ విద్యా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ – బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, నల్సార్ – హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 28వ ర్యాంకు, ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ – హైదరాబాద్ 29వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఆర్కిటెక్చర్: ఆర్కిటెక్చర్ విభాగంలో ఐఐటీ రూర్కీ మొదటి స్థానంలో, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 8వ ర్యాంకు సాధించాయి. దంత వైద్య విద్య: దంత వైద్య విద్యా విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని విష్ణు డెంటల్ కాలేజీ 23వ స్థానంలో, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ – సికింద్రాబాద్ 30వ స్థానంలో నిలిచాయి. -
ఏపీలోని 4 కళాశాలలకు ఛాత్ర విశ్వకర్మ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏటా అందించే ‘ఛాత్ర విశ్వకర్మ అవార్డీ స్టూ డెంట్స్ ప్రాజెక్ట్స్, ఇట్స్ అప్లికేషన్ ఫర్ సొసైటీ’ అవా ర్డులు ఏపీలోని నాలుగు కళాశాలల విద్యార్థులకు దక్కాయి. పరిశుభ్రత విభాగంలో దక్షిణ మధ్య వర్సిటీల్లో ఏపీకి చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)కి ‘ద క్లీన్, స్మార్ట్ క్యాంపస్(ఐకేఎస్)’అవార్డు దక్కింది. ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్ర మంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ విజేతల ప్రతినిధులకు అవార్డు అందజేశారు. ఏపీలోని సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్‌కు చెందిన ‘శ్రామిక్స్’బృందానికి రీసైక్లింగ్ ఆర్ అప్ స్కిల్లింగ్ ఫర్ ఎ న్య్సూరింగ్ లైవ్లీహుడ్ విభాగంలో తొలిస్థానం దక్కింది. ఆదిత్య ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్‌కు చెందిన ‘ఛాలెంజర్స్’ బృందానికి ఐఓటీ –బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉమెన్ ప్రొటెక్షన్ డివైజ్‌కు ‘జెండర్–రెస్పాన్సివ్ మెకానిజం టు కాంబాట్ డొమెస్టిక్ వయెలెన్స్’ విభాగంలో రెండోస్థానం దక్కింది. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బ్లూ లియో’ బృందానికి స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టంలో మూడో ర్యాంకు దక్కింది. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీకి చెందిన ‘షాహుల్’బృందానికి బారియర్స్ ఇన్ యాక్సెసింగ్ అడక్వెట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ విభాగంలో మూడో స్థానం దక్కింది. విశ్వేశ్వరయ్య, డాక్టర్ ప్రీతమ్ సింగ్ బెస్ట్ టీచర్ అవార్డు 2021ను కూడా ప్రదానం చేశారు. ఇవీ చదవండి: ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. -
15 కోట్ల మంది పాఠశాలలకు దూరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరో 25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదని వెల్లడించారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) గురువారం ‘‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు’’ అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3–22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఆ వయసు కలిగిన వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారని, దీనిని బట్టి చూస్తే 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. వారందరినీ బడిబాట పట్టించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వారి సంఖ్య పెంచాలంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అక్షరాస్యత 80 శాతానికి చేరుకుందని ప్రధాన్ చెప్పారు. దాదాపుగా 25 కోట్ల మంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మరో 25 సంవత్సరాలకి సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ అన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి ఏం సాధించాలో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని, తద్వారా విద్యారంగంలో సృజనాత్మకత, పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో పల్లె పల్లెకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వస్తాయని, దీనివల్ల విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి వినూత్న మార్పులు వస్తాయని చెప్పారు. -
ఏపీలో గిరిజన వర్సిటీ స్థాపనకు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చెప్పారు. లద్దాఖ్ ప్రాంతంలో సిందూ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించి సెంట్రల్ వర్సిటీస్ (సవరణ) బిల్లు–2021పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఉన్నతవిద్యలో ప్రాంతీయ అసమతుల్యతను తగ్గించేందుకు లద్దాఖ్‌లో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇదేతరహాలో ప్రాంతీయ అసమానతను ఏపీ ఎదుర్కొంటోంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఏపీకి గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు హామీ ఇచ్చింది. ఈ వర్సిటీ గిరిజనులకు మరింత సమీపంలో ఉండేందుకు వీలుగా రెల్లి గ్రా మం నుంచి సాలూరు ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. పార్వతీపురం సమీకృత గిరిజన అభివృద్ధిసంస్థ పరిధిలో ఈ ప్రాంతం ఉం ది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు మద్దతు ఇ చ్చి త్వరితగతిన వర్సిటీ ఏర్పాటుచేయాలి. అలాగే ఏపీలో 13 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాని కోరాం. రాష్ట్ర విభజన అనంతరం టైర్–1 నగరాలు కోల్పోయి వైద్యరంగంలో సూపర్ స్పెషాలిటీ వసతుల లేమి ఏర్పడింది. అందువల్ల ఆరోగ్యరంగంలో మానవ వనరుల అభివృద్ధికి వీలుగా కేంద్ర సాయంతో 13 వైద్య కళాశాలలు స్థాపనకు సహకరించాలని కోరుతున్నాం..’ అని పేర్కొన్నారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమాధానం ఇస్తూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు హామీ ఇచ్చింది. అయితే యూనివర్సిటీ స్థలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక సూచన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆత్మీయ మిత్రుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు ఈ విషయమై లేఖ రాశారు. నాకు సంతోషకరమైన విషయమేంటంటే ఈ యూనివర్సిటీ ఒడిశాకు దగ్గరగా ఏర్పాటవుతోంది. సాలూరుకు సమీపంలో ఏర్పాటవుతున్న ఈ వర్సిటీ వల్ల ఒడిశా విద్యార్థులకు కూడా మేలు చేకూరుతుంది. ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఈ విషయంలో హామీ ఇచ్చారు. యూనివర్సిటీ రహదారులు, విద్యుత్తు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మోదీ సర్కారు స్థాపిస్తుంది..’ అని చెప్పారు. -
కేంద్రం తీపికబురు.. సమగ్ర శిక్షా పథకం 2026 వరకు పొడిగింపు..
న్యూఢిల్లీ: సమగ్ర శిక్షా పథకాన్ని 2026 వరకు పొడిగించినట్టు కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యం అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. అదే విధంగా, సమగ్ర శిక్షా పథకానికి గాను.. రూ.1,85,398 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకనుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్లేస్లూల్స్ కూడా ఉండాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, 2023 వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కేంద్ర ప్రాయోజిత పథకాన్ని పొడిగించామని పేర్కొన్నారు. అదే విధంగా.. 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో లైంగిక పరమైన నేరాలలో సత్వర న్యాయం అందించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. కాగా, నిర్భయ నిధి నుంచి నిధులను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
భారత్‌లో ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. తస్మాత్ జాగ్రత్త
న్యూఢిల్లీ: సక్రమమైన అనుమతులు లేకుండా నడుస్తున్న 24 ఫేక్ యూనివర్సిటీలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల ద్వారా తమ దృష్టికి వచ్చిన ఫేక్ యూనివర్సిటీలను చెల్లవని చెప్పినట్లు వెల్లడించారు. మరో రెండు యూనివర్సిటీలు సైతం నిబంధనలను మీరాయని, వాటి వ్యవహారంప ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో వచ్చిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఫేక్ యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులకు ప్రత్యేక లేఖలను రాసి ఆయా ఫేక్ వర్సిటీలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయా ఫేక్ యూనివర్సిటీల లిస్టు ఇదే.. ఉత్తరప్రదేశ్ (8): వారనసేయ సంస్కృతి విశ్వవిద్యాలయ, వారణాసి; మహిళా గ్రామ్ విద్యాపీఠ్, అలహాబాద్; గాంధీ హింది విద్యాపీఠ్, అలహాబాద్; నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్; నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, అలీగఢ్; ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ, మథుర; మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయ, ప్రతాప్‌గఢ్; ఇంద్రప్రస్త శిక్షా పరిషద్, నోయిడా ఢిల్లీ (7): కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడిసియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక యూనివర్సిటీ) పశ్చిమబెంగాల్ (2): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కతా; ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా ఒడిశా (2): నవభారత్ శిక్షా పరిషద్, రూర్కెలా? నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. వీటితో పాటు పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడెమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీలు కూడా ఫేక్ యూనివర్సిటీలని యూజీసీ తెలిపింది. 17.94 లక్షల ‘కరోనా’ క్లెయిమ్‌లు సెటిల్ దేశంలో గత 15 నెలల్లో కోవిడ్–19కు సంబంధించి రూ.21,837 కోట్ల విలువైన 17.94 లక్షల ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ సంస్థలు సెటిల్ చేసినట్లు భగవత్ కరాడ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసేందుకు ఐఆర్డీఏఐ చర్చలు చేపట్టిందని అన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 జూలై 15 వరకూ 17.94 లక్షల క్లెయిమ్‌లు సెటిల్ అయ్యాయని వివరించారు. 204 ప్రైవేటు చానెళ్ల నిలిపివేత నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 2016–20ల మధ్య 204 ప్రైవేటు చానెళ్ల లైసెన్సులను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మరో 128 కేసులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 916 ప్రైవేటు శాటిలైట్ టీవీ చానెళ్లకు అప్–లింకింగ్, డౌన్–లింకింగ్ల మార్గదర్శకాల ప్రకారం అనుమతులు ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. నిబంధలను పాటించలేకపోవడం వల్లే 204 చానళ్ల అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించారు. కొత్త చానెళ్ల వ్యవహారంపై స్పందిస్తూ.. 2016–17లో 60 చానెళ్లు, 2017–18లో 34 చానెళ్లు, 2018–19లో 56 చానెళ్లు, 2020–21లో 22 చానెళ్లకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ►దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 2.96 కోట్ల మంది స్కూలు విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఆన్లైన్ విద్య కోసం ఉపయోగించాల్సిన మొబైల్/లాప్‌టాప్‌లు లేని విద్యార్థులు అత్యధికంగా బిహార్‌లో ఉన్నారని పేర్కొంది. మరి కొన్ని రాష్ట్రాల్లో సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపింది. ►కరోనా కారణంగా మరణించిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ. 5.05 కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో వెల్లడించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్ధారించిన విధానాలకు లోబడి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్హెచ్ఏఐ రుణాలు రూ.3.06 లక్షల కోట్లు: గడ్కరీ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తీసుకున్న రుణాలు 2021 మార్చి నాటికి రూ.3,06,704 కోట్లకు చేరాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో చెప్పారు. 2017 మార్చి నాటికి ఈ రుణాలు రూ.74,742 కోట్లు ఉండేవని తెలిపారు. రుణాలపై ఎన్హెచ్ఏఐ 2020–21లో రూ.18,840 కోట్ల వడ్డీని చెల్లించిందని పేర్కొన్నారు. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించాలంటూ కేంద్రం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు పాత వాహనాలపై అత్యధికంగా గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. -
కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ కసరత్తు
-
కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. యడియూరప్ప కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. దీనిపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. బి.ఎస్.యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. సీఎం ఎంపికకు పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలను నియమించింది. ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బెంగళూరుకు చేరుకోగా, కిషన్ రెడ్డి కూడా బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. అయితే, సీఎం రేసులో ప్రహ్లద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్‌లు తదితరులు ఉన్నారు. అయితే, కేంద్ర మంత్రులిద్దరు కలిసి సాయంత్రం 5 గంటలకు కర్ణాటక కొత్త సీఎంను ఖరారు చేయనున్నారు. -
ఎర్ర కందిపప్పుపై దిగుమతి పన్ను రద్దు
న్యూఢిల్లీ: దేశీయంగా సరఫరా పెంచేందుకు, పెరుగుతున్న ధరలకు చెక్ పెట్టేందుకు ఎర్ర కందిపప్పుపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది. దీంతోపాటు, ఎర్ర కందిపప్పుపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ సెస్‌ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయసభలకు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీనాటికి బహిరంగ మార్కెట్లో ఎర్ర కందిపప్పు ధర కిలో రూ.70 ఉండగా, అది ప్రస్తుతం 21 శాతం మేర పెరిగి కిలో రూ.85కు చేరుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. ముసాయిదా రూపకల్పనలో ఉన్నత విద్యా కమిషన్ బిల్లు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లు ముసాయిదా రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని లోక్‌సభలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020లో ప్రతిపాదించిన విధంగానే నాలుగు స్వతంత్ర వ్యవస్థలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ముసాయిదా రూపకల్పన చేస్తున్నామని ప్రధాన్ పేర్కొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) వంటి వ్యవస్థల స్థానంలో హెచ్ఈసీఐ రానుంది. -
యడియూరప్ప రాజీనామా.. పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్!
బెంగళూరు: కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్సెన్స్‌కు బి.ఎస్.యడియూరప్ప (78) తెరదించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ గహ్లోత్‌కు సమర్పించారు. స్వచ్ఛందంగానే పదవి నుంచి దిగిపోతున్నానని పేర్కొన్నారు. యడియురప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ మొదలయ్యింది. బీజేపీ అధిష్టానం కొత్త సీఎంపై ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం గమనార్హం. యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. యడియూరప్ప మంత్రివర్గాన్ని గవర్నర్ రద్దు చేశారని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదాకా ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారని పేర్కొంది. గవర్నర్‌కు రాజీనామాను సమర్పించిన అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, నాయకులకు, సహకరించిన అధికారులకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీనామా విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని, స్వచ్ఛందంగానే తప్పుకున్నానని, సీఎంగా ప్రజలకు సేవ చేసేందుకు ఇతరులకు మార్గం సుగమం చేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. యడియూరప్ప ఏం చెప్పారంటే.. ‘ఎవరిని సీఎంగా ఎంపిక చేసినా పూర్తిగా సహకరిస్తా. రాజీయాల్లో కొనసాగుతా. పార్టీ అండతోనే పైకి ఎదిగా. నాకు దక్కినన్ని అవకాశాలు బహుశా మరో నాయకుడికి లభించి ఉండకపోవచ్చు. పదవులు ఇచ్చినా స్వీకరించను గవర్నర్ పదవి స్వీకరించాలన్న ఉద్దేశం లేదు. వాజ్‌పేయి నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నారు. వద్దని చెప్పా. కర్ణాటకలో బీజేపీ పటిష్టత కోసం పనిచేస్తా’అని యడియూరప్ప స్పష్టం చేశారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) నుంచి ఫిరాయించి, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేల(ప్రస్తుత మంత్రులు) భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించగా.. తమతోనే కలిసి ఉంటారని స్పష్టం చేశారు. విధాన సౌధాలో భావోద్వేగంతో కంటతడి తన ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం విధాన సౌధాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యడియూరప్ప ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గద్గద స్వరంతో ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, రాజీనామాను సమర్పించబోతున్నట్లు తెలిపారు. బాధతో కాదు, సంతోషంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా, జనసంఘ్ సభ్యుడిగా పనిచేసినప్పటి తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తనకు 75 ఏళ్లు దాటినప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్! యడియూరప్ప రాజీనామాతో ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవురు అవుతారన్న దానిపై పడింది. 2023లో జరగబోయే శానసభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలుపు తీరానికి చేర్చే నాయకుడు ఎవరన్న చర్చ మొదలయ్యింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ పార్లమెంటరీ బోర్డుకు, పార్టీ శాసనసభా పక్షానికి కట్టబెట్టినట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్ వెల్లడించారు. శాసనసభా పక్షం భేటీ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. యడియూరప్ప రాజీనామాకు గల కారణాలను ఆయనే వివరిస్తారని స్పష్టం చేశారు. కొత్త సీఎం ఎంపిక కోసం నిర్వహించే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
జేఈఈ–మెయిన్ నాలుగో ఎడిషన్ వాయిదా
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్ ఫోర్త్ ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెండు సెషన్ల మధ్య 4 వారాల విరామం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫోర్త్ ఎడిషన్ జేఈఈ–మెయిన్ పరీక్షను ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకూ నిర్వహిస్తామన్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకూ జరగాల్సి ఉంది. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ కోసం ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రిజిస్ట్రేషన్ గడువును జూలై 20 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో జరుగనుంది. ఈ పరీక్షను 334 దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ చెప్పారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 828కి పెంచినట్లు తెలిపారు. -
NEET-2021: నీట్ పరీక్ష తేదీ ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖరారు చేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ సెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులను జులై 13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించనున్నారు. ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కోవిడ్-19 దృష్ట్యా పరీక్షా నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198 కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాంతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. The NEET (UG) 2021 will be held on 12th September 2021 across the country following COVID-19 protocols. The application process will begin from 5 pm tomorrow through the NTA website(s). — Dharmendra Pradhan (@dpradhanbjp) July 12, 2021 -
భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు.. సామాన్యులకు మోతేనా..!
సౌదీ-యూఎఈ మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొవడంతో యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఆయిల్ ఉత్పత్తి దేశాలు(ఒపెక్) మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమైనాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్‌ఆయిల్ ధర గణనీయంగా పెరిగింది. 2014 సంవత్సరం తరువాత తిరిగి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రెంట్(అట్లాంటిక్ బేసిన్ క్రూడ్‌ఆయిల్) బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 0.8 శాతం పెరిగి 77.78 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్ 2018 నుంచి ఈ స్థాయిలో బ్యారెల్ ధరలు పెరగలేదు. ఆయిల్ ఉత్పత్తి దేశాల(ఒపెక్)తో గతవారం ఏర్పడిన విభేదాల తరువాత మూడవరోజు చర్చలు జరిపిన ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. ఆయిల్ కంపెనీ ఉత్పత్తి దేశాలు తిరిగి సమావేశమయ్యే తేదీలను ప్రకటించలేదు. కొన్ని ఒపెక్ దేశాలు ఈ నెలలో చర్చలను తిరిగి ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. అంతేకాకుంగా డిమాండ్‌కు సరిపడ ముడిచమురును ఆగస్టు నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఆయిల్ ఉత్పత్తి దేశాలతో చర్చలు వెంటనే సఫలమైయేలా చూడాలని బైడెన్ సర్కార్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాక్ చమురు మంత్రి ఇహ్సాన్ అబ్దుల్ జబ్బర్ సోమవారం మాట్లాడుతూ..తమ దేశం చమురు ధరలు పెరగడం ఇష్టం లేదని తెలిపారు. 10 రోజుల్లోపు కొత్త ఒపెక్ + సమావేశానికి తేదీ నిర్ణయించబడుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. భారత్‌పై ప్రభావం..! యుఎఈ, ఇతర ఒపెక్ + దేశాలు ఆగస్టులో ఉత్పత్తిని పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే, ముడి చమురు ధరలనుంచి సామాన్యులకు ఉపశమనం కలిగే అవకాశం తక్కువ ఉండనుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి. సుమారు 13 రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఈ ధరలు తిరిగి తగ్గేట్గుగా కనిపించట్లేదు. భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2021 ప్రారంభం నుండి పెట్రోల్ ధరను 19.3 శాతం, డీజిల్ ధరను 21 శాతం పెంచాయి.పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం ఒపెక్ సభ్య దేశాలతో సంభాషణలు జరిపారు. ఈ సమావేశాల తరువాత ముడి చమురు ధరలు నియంత్రణలోకి వస్తాయనిఆశాభావం వ్యక్తం చేశారు. -
చమురు ధరలు: ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు!
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు ‘భరించగలిగే స్థాయిలో’ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఒపెక్‌ను (పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య– ఓపీఈసీ) భారత్ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా రిటైల్ ఇంధన ధరలు రికార్డు గరిష్టాలకు చేరిన నేపథ్యంలో గురువారం భారత్ ఈ కీలక పిలుపునిచ్చింది. చమురు ధరలను ‘తగిన సమంజసమైన శ్రేణిలో’ ఉండేలా తక్షణ చర్యలు అవసరమని సూచించింది. ప్రత్యేకించి ఉత్పత్తి కోతల విధానానికి ముగింపు పలకాలని స్పష్టం చేసింది. సౌదీ అరేబియాసహా పలు ఒపెక్ దేశాలు భారత్ ప్రధాన చమురు వనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒపెక్ సెక్రటరీ జనరల్‌తో చర్చలు ఒపెక్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ సనౌసి బర్కిం దోతో భారత్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు ధరల విషయమై వర్చువల్‌గా చర్చలు జరిపారు. 2019 ఏప్రిల్ తరువాత మొదటిసారి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు బేరల్‌కు 75 డాలర్లపైకి ఎగసిన సంగతి తెలిసిందే. దీనికితోడు దేశీయంగా సుంకాలతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర దాదాపు రూ.100 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తగిన స్థాయిలో అంతర్జాతీయంగా ధర ఉండాలని భారత్ కోరినట్లు ఒక ప్రకటనలో ఒపెక్ తెలిపింది. అనంతరం చమురు మంత్రిత్వశాఖ కూడా ఒక ప్రకటన చేస్తూ, ‘‘క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వినియోగదారులు అలాగే ఎకానమీ రికవరీపై చూపుతున్న ప్రభావాన్ని చర్చించారు. భారత్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి పరిస్థితులు దారితీస్తున్నాయని వివరించారు’’ అని పేర్కొంది. ఇరు వర్గాల ప్రకటనల ప్రకారం, చమురు మార్కెట్ పరిణామాలు చర్చల్లో చోటుచేసుకున్నాయి. ఆయిల్ డిమాండ్ రికవరీ, ఎకానమీ వృద్ధిపై ప్రభావం, ఇంధన సవాళ్లను అధిగమంచడం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. చదవండి: అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల ప్రధాన్ కృతజ్ఞతలు.. భారత్‌లో మహమ్మారి రెండవ వేవ్ సమయంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్సహా పలు ఒపెక్ సభ్య దేశాలు చేసిన సహాయం పట్ల ప్రధాన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒపెక్ సెక్రటేరియట్ నిరంతర సంప్రతింపుల కార్యక్రమంలో భాగంగా తాజా వీడియోకాన్ఫరెన్స్ జరి గింది. ప్రపంచ ఎకానమీ 5.5 శాతం పురోగమిస్తుందని, 2021లో రోజూవారీ ఆయిల్ డిమాండ్ 6 మిలియన్ బేరళ్లకుపైగా పెరుగుతుందని జూన్‌లో ఒపెక్ నెలవారీ ఆయిల్ మార్కెట్ నివేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయాలపై భారత్ చూపు! సరఫరాల కోతలకు ముగింపు పలకాలని భారత్ పలు నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఒపెక్ దాని అనుబంధ దేశాలు (ఒపెక్ ప్లస్) పట్టించుకోవడం లేదు. దీనితో ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్ తన చమురు అవసరాలకు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి సారిస్తోంది. ఆయా పరిస్థితుల నేపథ్యంలో భారత్ చమురు దిగుమతుల్లో ఒపెక్ వాటా మేలో 60 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో ఇది ఏకంగా 74 శాతంగా ఉండడం గమనార్హం. నిజానికి చమురు ధరల విషయంలో ఈ ఏడాది మార్చిలో భారత్–ఒపెక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరగాయి. ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణలను సడలించాలని భారత్ అప్పట్లో విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది. 2020 ఏప్రిల్–మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాట క)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ఒపెక్ చేసిన ప్రకటనపై అప్పట్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందని కూడా ప్రధాన్ స్పష్టం చేయడం గమనార్హం. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. భారత్ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’ నుంచి ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్ నిర్ణయమని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్ ప్రాధాన్యత ఇస్తోందా? అన్న అంశంపై ప్రధాన్ సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు దిగ్గజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. భారత్‌లో రిఫైనర్స్ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతుండడం కీలకాంశం. -
‘కాంగ్రెస్ కారణంగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి’
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ప్రజలు కరోనా వైరస్‌తోనే గాక పెరుగుతున్న నిత్యావసరల ధరలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూ సెంచరీనే దాటేసింది. తాజాగా పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన పనుల వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఆయిల్ బాండ్ల ద్వారా రూ.కోట్లు సమీకరించి, తిరిగి చెల్లించలేదని.. ఇప్పుడ తాము అసలు, వడ్డీ కడుతున్నామని తెలిపారు. ధరలు పెరిగేందుకు ఇది కూడా ముఖ్య కారణమనిచెప్పారు. అదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దేశానికి అవసరమయ్యే ఆయిల్ 80శాతం దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద కాంగ్రెస్ నిరసనలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలపై కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. There has been a jump in crude oil prices in the international market. One of the main reasons behind the rise in fuel prices in India is that we have to import 80% of the oil we consume: Union Minister of Petroleum & Natural Gas, Dharmendra Pradhan pic.twitter.com/XMsOhRYMb6 — ANI (@ANI) June 23, 2021 చదవండి: ప్రధాని కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవు -
డీపీఐఐటీ కార్యదర్శి.. గురుప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర పరిశ్రమలు, ఇంటర్నల్ ట్రేడ్ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మొహపాత్ర (59) కన్నుమూశారు. కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించారని ఎయిమ్స్ ప్రకటించింది. అనారోగ్య కారణాలతో ఏప్రిల్ మధ్యలో ఆయన ఆస్పత్రిలో చేరారు. పదవిలో ఉండగా కరోనా కారణంగా మరణించిన మొదటి కార్యదర్శి ఆయనే కావడం గమనార్హం. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకెంతో బాధను కలిగించిందని పేర్కొన్నారు. గుజరాత్‌లోనూ, కేంద్రంలోనూ ఆయనతో కలసి పని చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. గురుప్రసాద్ ఎంతో నిర్మాణాత్మకంగా పని చేసేవారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పియూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి రాజివ్ గౌబా కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. గుజరాత్ కేడర్‌కు చెందిన గురుప్రసాద్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. చదవండి: (ఫోన్ మాట్లాడుతూ.. రెండు డోసులు?) -
రూ.2 లక్షల కోట్లతో పెట్రో కారిడార్
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ యూనిట్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పెట్రో కారిడార్ ద్వారా రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 93(4) ప్రకారం ఏపీలో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. విభజన చట్టం హామీ ప్రకారం సుమారు రూ.25 – 30 వేల కోట్లతో యాంకర్ ఇన్వెస్ట్మెంట్గా రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువు సంయుక్త కార్యదర్శి చైర్మన్‌గా కేంద్ర, రాష్ట్ర అధికారులతో వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు వివరించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్లను కలసి రాష్ట్ర ప్రతిపాదనలు వివరించిన అనంతరం మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడారు. సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం వేగవంతం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం పెట్రో కెమికల్ కారిడార్‌పై కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. తగ్గిన కార్పొరేట్ ట్యాక్స్, వడ్డీరేట్లను పరిగణలోకి తీసుకుంటూ కొత్త ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఎస్బీఐ క్యాప్‌లకు అప్పగించినట్లు చెప్పారు. యాంకర్ యూనిట్ రాకతో కాకినాడ వద్ద ఏర్పాటయ్యే పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని, 50 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని వివరించారు. ఇథనాల్ తయారీ యూనిట్‌పై సానుకూలం దీంతో పాటు రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. చక్కెర కర్మాగారాల ద్వారా వచ్చే మొలాసిస్‌ను ఇథనాల్‌గా మార్చడానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీకి కూడా కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ వినియోగాన్ని 10 నుంచి 20 శాతానికి కేంద్రం పెంచిన నేపథ్యంలో ఇథనాల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ‘వీజీఎఫ్’ లేకుండా ప్రాజెక్టు! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 10వతేదీన ఢిల్లీ పర్యటన సందర్భంగా పెట్రోలియం, ఉక్కు, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలసి విభజన చట్టం ప్రకారం కాకినాడ వద్ద రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. గతంలో రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం వయబులిటీ గ్యాప్ ఫండ్‌ను రాష్ట్రం భరించాల్సి వచ్చేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతం తగ్గించడం, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు దిగిరావడంతో ‘వీజీఎఫ్’ అవసరం లేకుండా ప్రాజెక్టును చేపట్టవచ్చని సూచించారు. దీనిపై రాష్ట్ర ప్రతిపాదనలను వినాల్సిందిగా కోరారు. రెండు రోజుల్లోనే కేంద్రం పిలుపు.. రాష్ట్రంలో ఒక మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ యూనిట్ ఏర్పాటుకు రూ.32,900 కోట్లు అవసరమని గతంలో హెచ్‌పీసీఎల్ – గెయిల్ అంచనా వేశాయి. దీనికి వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే దేశాన్ని 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే ప్రధాని కలలు సాకారమయ్యేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన అనంతరం రెండు రోజుల్లోనే ప్రతిపాదనలతో రావాలంటూ కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, పరిశ్రమలు – పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్‌లతో కూడిన ఉన్నతాధికారుల బృందం ఢిల్లీ చేరుకుని రాష్ట్ర ప్రతిపాదనలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. సంపూర్ణ సహకారం అందిస్తాం: ధర్మేంద్ర ప్రధాన్ ఏపీలో పెట్రో కారిడార్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో సంతృప్తికరంగా సమావేశం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు, ఉపాధి కల్పనకు కీలకమైన పెట్రోలియం, సహజ వాయువు రంగాల అభివృద్ధికి సంబంధించి సమగ్రంగా చర్చించామంటూ ట్వీట్ చేశారు. -
పెట్రో ధరలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో రోజు రోజుకి పెట్రోల్, డీజల్ భారీగా పెరుగుతూ పోతున్న సంగతి అందరికి తెలిసిందే. ధరలు భారీగా పెరుగుతుండటంతో నిత్యావసర ధరలు కూడా పెరుగతున్నాయి. దీంతో సామాన్య ప్రజానీకం ఈ ధరల పెరుగుదలపై గగ్గోలు పెడుతున్నారు. ఈ ధరల పెరగుదలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. పెట్రో ధరలు భారీగా పెరుగుతున్నాయిని, దీన్ని తాము అంగీకరిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు. గత నెల మే 4వ తేదీ నుంచి ఇప్పటివరకు చమురు ధరలు 23 సార్లు పెరిగిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పైవిధంగా స్పందించారు. పెట్రో ధరలపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు కూడా వివరించారు. సంక్షేమ పథకాలకు నిధులు కోసం నగదును సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని ఆయన వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా రేషన్ కోసం రూ. లక్ష కోట్లు, వ్యాక్సిన్ల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నిధులు ఆదా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే పెట్రో భారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? -
ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ భేటీ
-
కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి వివరించారు. కాకినాడ ఎస్ఈజెడ్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై భారం లేకుండా చూడాలన్నారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి తెలిపారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ సీఎస్, పెట్రోలియం కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు వచ్చిందన్నారు. 2002-15 మధ్య స్టీల్‌ప్లాంట్ మంచి పనితీరు కనబరిచిందని కేంద్రమంత్రికి సీఎం జగన్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో 19,700 ఎకరాల భూమి ఉందని, స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉందని వివరించారు. గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014-15 నుంచి స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు. సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలను సీఎం సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలన్నారు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ ప్లాంట్‌కు కేటాయించాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో కేంద్ర శాఖలతో కలిసి పనిచేస్తామని సీఎం అన్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను స్టీల్‌ప్లాంట్ అందించిందని.. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిందని కేంద్రమంత్రికి సీఎం వైఎస్ జగన్ వివరించారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ ఉన్నారు. చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం పోలవరం ప్రాజెక్ట్‌లో నేడు తొలి ఫలితానికి అంకురార్పణ -
‘దేశంలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమిదే’
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ బాదుడు సామాన్యుడిపై భారంగా మారింది. తాజాగా సోమవారం కూడా పెట్రోల్‌పై రేటు పెరగడంతో పలు రాష్ట్రాల్లో ఒక లీటరు పెట్రోల్ ధర సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెరుగుతున్న పెట్రోల్ ధరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గుజరాత్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారల్‌కు ధర 70 డాలర్లుగా ఉండటమే. అంతే కాకుండా మన అవసరాల్లో 80శాతం దిగుమతి చేసుకోవడంతో ఇక్కడ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడుతోందని వెల్లడించారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఖరీదైనట్లు తెలిపారు. దేశంలో ఇంధన ధరలు ఇంతలా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలే కారణమన్నారు. జీఎస్టీ అంశం గురించి ప్రస్తావిస్తూ.. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలా? వద్దా అనేది జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని తెలిపారు. దీన్ని జీఎస్టీ కిందకు తెస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని చెప్పారు. అయితే తాను కూడా ఈ ఆలోచనను తాను కూడా అంగీకరిస్తున్నట్టు చెప్పారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చదవండి: ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం: మోదీ -
కోవిడ్ కట్టడిలో సీఎం జగన్ చర్యలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యల వల్ల సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర పెట్రోలియం, స్టీల్, నేచురల్ గ్యాసెస్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న గురజాడ కళాక్షేత్రంలో 1000 పడకల కోవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటులో భాగంగా తొలి విడత సిద్ధమైన 300 పడకల ఆస్పత్రిని ఆదివారం ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో నా స్నేహితుడు.. డైనమిక్ లీడర్, సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇద్దరూ అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ మాదిరిగా.. వైఎస్ జగన్ లక్ష్యం ఉన్న నాయకుడని కితాబిచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో ఎదురైన సవాళ్లను వీరు ఎంత సమర్థంగా ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వమంటే ప్రజలకు, వారి సంక్షేమానికి, వారి ఆరోగ్య భద్రతకు జవాబుదారీతనంగా ఉండాలని, ఈ విషయంలో వైఎస్ జగన్ కృషికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. కోవిడ్ కట్టడి విషయంలో ఏపీ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా ఏమన్నారంటే.. డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సినేషన్ – రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చొరవ వల్లే కొత్త ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి, కనీసం 100 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆర్ఐఎన్ఎల్ కృషి చేస్తోంది. – దేశంలో జూన్ తర్వాత.. వ్యాక్సినేషన్ సామర్థ్యం పెరుగుతుంది. డిసెంబర్ నాటికి దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం. – ఆర్ఐఎన్ఎల్ సామాజిక బాధ్యత ఉన్న కార్పొరేట్ సంస్థ. అందుకే కార్పొరేట్ కోటా కింద వ్యాక్సిన్ కొనుగోలు చేసి.. ఏపీ ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంది. – నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీ.. దేశంలోనే అతి పెద్ద క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంక్‌గా అవతరించబోతోంది. భవిష్యత్తులో మెడికల్, ఆక్సిజన్, లాజిస్టిక్ మెకానిజమ్‌లో కీలకంగా మారనుంది. మెగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు. – ఈ కార్యక్రమంలో ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులాస్టే, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్, అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సీఎం ముందు చూపే కారణం సీఎం జగన్ ముందు చూపు కారణంగానే దేశంలోనే కోవిడ్ మరణాల రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో 0.64 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంది. సీఎం చొరవ వల్లే రాష్ట్రంలో 32,125 అక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశాం. రూర్కెలా, జంషెడ్ పూర్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ నుంచి 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ని అదనంగా అందించాలి. – ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ సేవలు అనిర్వచనీయం కోవిడ్ కష్ట కాలంలో స్టీల్ ప్లాంట్ చేసిన సేవలు అనిర్వచనీయం. దేశం మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో దేశానికి ప్రాణవాయువు అందించిన ఘనత ఆర్ఐఎన్ఎల్ ఆధ్వర్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌దే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఉంటే దేశానికి ఇంత సేవ చేయగలిగేదా? కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలి. – వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు -
సీఎం జగన్‌ను ప్రశంసించిన కేంద్రమంత్రి
సాక్షి, విజయవాడ/విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. విశాఖలోని 1000 పడకల కోవిడ్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ లక్ష్యమున్న లక్షణమైన నాయకులని పేర్కొన్నారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. వైద్య సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని.. మంచి నిర్ణయాలు, పనులకు ఎప్పుడూ అండగా ఏపీ నిలుస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కరోనా కట్టకికి నిరంతరం పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంతా ఏకమైతేనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం. మెగా మెడికల్ ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్న సీఎం జగన్‌కు అభినందనలు. రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా ఆ ప్రభావం తగ్గించినట్లే అన్ని రంగాల్లో ముందుండి, అన్ని అంశాల్లో చొరవ తీసుకుని.. ముందుకు వెళ్తున్న ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని’’ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. చదవండి: గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ సాకారం చేశారు: సజ్జల చంద్రబాబు కుయుక్తులు ప్రజలు నమ్మరు: కొడాలి నాని -
ఎక్కడ తక్కువ ధరో అక్కడే కొంటాం!
న్యూఢిల్లీ: క్రూడ్ ఆయిల్‌ను ఏ దేశం తక్కువ ధరకు సరఫరా చేస్తుందో ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉత్పత్తి, సరఫరాల విషయంలో నియంత్రణలు లేకుండా చూస్తూ, తక్కువ ధరకు చమురు సరఫరా చేయాలన్న భారత్ విజ్ఞప్తి పట్ల సౌదీ అరేబియా సమాధానం ‘దౌత్యధోరణి’ కాని రీతిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ సమావేశంలో ఆయన ప్రసంగం, ఈ అంశానికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే... ►డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ►ఈ నేపథ్యంలో చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఇందుకు సంబంధించి ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణలను సడలించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ►ఈ విజ్ఞప్తిని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఈ నెల మొదట్లో ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. పైగా ఒపెక్ సమావేశం అనంతరం మార్చి 4వ తేదీన సౌదీ అరేబియా భారత్‌కు ఒక ఉచిత సలహా ఇస్తూ, కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సూచించింది. 2020 ఏప్రిల్–మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. ►ఒపెక్ చేసిన ప్రకటనపై శుక్రవారం టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ సమావేశంలో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది కరోనా వైరస్‌పరమైన కారణాలతో డిమాండ్ పడిపోయి, ఉత్పత్తి తగ్గించుకోవాలని ఒపెక్ కూటమి నిర్ణయించుకున్నప్పుడు తాము కూడా మద్దతునిచ్చామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని .. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి మాత్రం సాధారణ స్థితికి రావడం లేదని ప్రధాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రేట్లు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ►ప్రపంచంలో చమురు దిగుమతులకు సంబంధించి మూడవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో రిఫైనర్స్ ఇప్పటికే తమ చమురు అవసరాలకు పశ్చిమ ఆసియావైపుకాకుండా తక్కువ ధరకు లభించే ఇతర దేశాల వైపూ దృష్టి పెడుతున్నాయి. నిజానికి సౌదీ అరేబియా భారత్‌కు రెండవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఫిబ్రవరిలో ఈ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. చమురు దిగుమతుల విషయంలో తన ప్రయోజనాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందని శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశం ఏదైనా తక్కువ ధరకు లభ్యమైనచోటి నుంచే చమురును కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. భారత్ చమురు వినియోగంపై సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లాజిజ్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనను ‘‘సన్నిహితమైన స్నేహితుని’’ నుంచి ‘‘దౌత్యరీతిలేని సమాధానం’’ అని ప్రధాన్ అభివర్ణించారు. ఇలాంటి వైఖరిని భారత్ అసలు అంగీకరించబోదని అన్నారు. భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలను ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలన్నది భారత్ నిర్ణయమని పేర్కొన్నారు. ►సౌదీ అరేబియాకన్నా, అమెరికాకే భారత్ ప్రాధాన్యత ఇస్తుంది అన్న విషయాన్ని ఫిబ్రవరి చమురు దిగుమతి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ‘‘మేము ఎవరికి దగ్గర అవుతున్నామన్న అంశం ఇక్కడ ప్రధానం కాదు. భారత్ ప్రయోజనాల పరిరక్షణ ఎలా అన్నదే ఇక్కడ ముఖ్యం. మాది బహిరంగ, స్వేచ్ఛాయుత మార్కెట్. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చమురు దిగుమతిచేసుకునే అవకాశం మా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేటు రంగం చమురు ద్గిగజ సంస్థలకు ఉంది. తక్కువ ధరకు చమురు లభ్యత మాకు ముఖ్యం. అది అమెరికానా లేక ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియానా అన్నది ప్రధానం కాదు.’’ అని అన్నారు. ప్రస్తుత ధరలు ఇలా... ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ ధర బ్యారల్‌కు 61.16 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర 64.64 వద్ద ట్రేడవుతోంది. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేప థ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. 2020 రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారల్‌కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారల్‌కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. దేశంలో పెట్రో ధరల మంట... గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం దఫదఫాలుగా పెంచుకుం టూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40 శాతం దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాలు విధించే పన్నులు కూడా తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటిపోయింది. తాజాగా అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు ఇంకా పెరిగిన పక్షంలో దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ధరలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెస్తే, ధర కొంత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నప్పటికీ అలాంటిది ఇప్పట్లో సాధ్యంకాదని కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. -
ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే చమురు ధరలు సెంచరీ కూడా కొట్టేశాయి. దీంతో సామాన్య ప్రజానీకం బయటకి వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు ధరల తగ్గింపు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రజలు ఏదైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు మాట్లాడుతూ.. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ముడి చమురును సరఫరా చేసే దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని తెలిపారు. ఫలితంగా వీటి ప్రభావం చమురు ఆధారిత దేశంలోని వినియోగదారులపై పడుతోందన్నారు. ఇదే అంశంపై ఆయా దేశాలతో చర్చించినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ‘అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ సీజన్ గడిస్తే ధరలు తగ్గుతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు మాత్రం చమురు ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్రం విధించే పన్నులు అధికంగా ఉంటున్నాయని వారు తెలిపారు. వీలైనంతగా త్వరగా ప్రభుత్వాలు పన్నులను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చదవండి: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ ఊరట: దిగొస్తున్న పుత్తడి ధరలు -
స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్ వివరించాం: సోము
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. అనంతరం భేటీ వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివరించారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే, వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము తెలిపారు. అయితే ఏపీ నేతలతో భేటీ అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకారణ చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
వరుసగా అయిదో రోజూ పెట్రో బాదుడు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా అయిదో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్ ధర 36 పైసలు పెరిగింది. దీంతో ముంబైలో పెట్రోల్ ధర రూ. 94.93కి చేరువకాగా, డీజిల్ ధర రూ. 85.70కి చేరుకుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవితకాల గరిష్టానికి రూ. 88.414కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 78.74కు చేరకుంది. ఈ 5 రోజుల్లో పెట్రోల్ ధర రూ. 1.51 పెరగ్గా, డీజిల్ ధర రూ. 1.56 పెరిగింది. మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ రేట్లను తగ్గించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరగా, తగ్గించబోయేది లేదని ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు వేదికగా చెప్పిన సంగతి తెలిసిందే. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోస్కో- ఆర్ఐఎన్ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో ఎంవోయూ కుదిరినట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. ప్లాంట్‌లో ఎవరి వాటా ఎంత ఉండాలన్న అంశం ఇంకా ఖరారు కాలేదని, అయితే ఎంవోయూ ప్రకారం 50 శాతం మేరకు తమకు వాటా ఉండాలని పోస్కో స్పష్టం చేసిందని వివరించారు. ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత ఉండాలన్నది, అది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు. కొండపల్లి - తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు.. విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తిరుపతి వరకు 450 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆసక్తి కనబరిచిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కొండపల్లి-తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ, విస్తరణ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ గెయిల్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ)కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ పైప్ లైన్ నిర్మాణం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు కోసం గ్యాస్ అనునిత్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టిన కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి వివరించారు. -
ధరల దెబ్బతో అమాంతం పెరిగిన ‘జీడీపీ’ : రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే పన్నులు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని పేర్కొన్నాడు. ఇంధన ధరల పెరుగుదలతో జీడీపీ (గ్యాస్-డీజిల్-పెట్రోల్) భారీగా వృద్ధిని కనబరిచిందని సెటైర్లు వేశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన వారంలో నాలుగోసారి రేట్లు పెంచిన తరువాత దేశంలో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.(చదవండి: ఫ్యాక్ట్ చెక్: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు) मोदी जी ने ‘GDP’ यानी गैस-डीज़ल-पेट्रोल के दामों में ज़बरदस्त विकास कर दिखाया है! जनता महँगाई से त्रस्त, मोदी सरकार टैक्स वसूली में मस्त। pic.twitter.com/FsiG8ECajk — Rahul Gandhi (@RahulGandhi) January 24, 2021 పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు రూ.85.70, ముంబైలో రూ.92,28గా ఉంది. అలాగే డీజిల్ రేట్లు కూడా ఆకాశానికి చేరుకున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ.75,88 ఉండగా ముంబైలో లీటరుకు రూ.82,66గా ఉంది. ఈ వారంలో లీటరుకు రూ.1పైగా పెరిగింది. అలాగే హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ ధర రూ.82.80గా ఉంది. చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సౌదీ చమురు ఉత్పత్తిని తగ్గించడమే అని కారణమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా, చమురు ఉత్పత్తి చేసే అనేక దేశాలు ఉత్పత్తిని నిలిపివేసాయి లేదా తగ్గించాయి. డిమాండ్, సరఫరాలో అసమతుల్యత కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. -
మరోసారి సత్తా చాటిన టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. డీజిల్ వినియోగంలో పొదుపు పాటించి మైలేజీలో మెరుగుదల సాధించటం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2019 అక్టోబర్–2020 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ ఢిల్లీలో బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 4,001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. 2019లో ఆర్టీసీ సగటు మైలేజీ (కిలోమీటర్ పర్ లీటర్–కేఎంపీఎల్) 5.16 ఉండగా, 2020లో 5.28కి పెరిగింది. అంటే 0.12 మేర మెరుగుపడింది. ఏయేటికాయేడు కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకుంటూ వస్తున్న ఆర్టీసీ, జాతీయ స్థాయిలో ఇంధన పొదుపులో ఉత్తమ సంస్థగా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తు వస్తోంది. తాజాగా మరోసారి దాన్ని నిలబెట్టుకుంది. చదవండి: హమ్మయ్యా! బ్యాటరీ బస్సు ఆశలు సజీవం ఈ మెరుగుదల ఆధారంగా సంవత్సర కాలంలో ఆర్టీసీ 24 లక్షల లీటర్ల ఇంధనాన్ని పొదుపు చేసినట్టయింది. ప్రసుతం బహిరంగ మార్కెట్లో ఉన్న డీజిల్ ధర ప్రకారం చూస్తే ఈ పొదుపు మొత్తం విలువ దాదాపు రూ.19 కోట్లు అవుతుంది. జనవరి 16న వర్చువల్ పద్ధతిలో జరిగే సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ ఆర్టీసీ ఎండీకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. పురస్కారంతోపాటు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని హయత్‌నగర్–1, ఉప్పల్, దిల్సుఖ్నగర్ డిపోలు ఇంధన పొదుపులో ఉత్తమ డిపోలుగా నిలిచాయి. కేంద్రమంత్రి ఈ మూడు డిపోలకు కూడా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నగదు ప్రోత్సాహకం కింద ఒక్కో డిపోకు రూ.50 వేల చొప్పున అందించనున్నారు. చదవండి: సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం -
గ్యాస్ ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు..
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడంపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 66 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రస్తుతమున్న 16,800 కి.మీ. నెట్‌వర్క్‌కు అదనంగా మరో 14,700 కి.మీ. మేర గ్యాస్ పైప్లైన్లను నిర్మించే ప్రక్రియ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 కల్లా 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ఎన్రిచ్ 2020లో వార్షిక ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇది 6.3 శాతంగా ఉంది. పశ్చిమ, తూర్పు తీరాల్లో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతికి టెర్మినల్స్‌ను పెంచుకోవడంపైనా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ట్రక్కులు, బస్సులకు కూడా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో పాటు ఎల్ఎన్జీని కూడా ఇంధనంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇక పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇరాన్ చమురుకు అవకాశం లభించాలి ఇరాన్, వెనెజులా నుంచి చమురు దిగుమతులను పునరుద్ధరించే దిశగా అమెరికా కొత్త ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. దీనివల్ల మరిన్ని ప్రాంతాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు భారత్‌కు అవకాశం లభించగలదని తెలిపారు. చమురు క్షేత్రాలపై ఎక్సాన్ ఆసక్తి భారత్‌లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు ఎక్సాన్ మొబిల్ చర్చలు జరుపుతోందని ప్రధాన్ చెప్పారు. ఆఫ్‌షోర్ బ్లాక్‌ల అభివృద్ధిలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ఎక్సాన్ మొబిల్ గతేడాదే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
తక్కువ ధరకు కొన్నాం.. రూ.5,000 కోట్లు పొదుపుచేశాం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏప్రిల్–మే నెలల్లో రెండు దశాబ్దాల కనిష్టానికి పడినప్పుడు, ఈ పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. తక్కువ ధర వద్ద భారీగా ముడి చమురును కొనుగోలుచేసి, తన మూడు వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వల క్షేత్రాలనూ నింపుకుందని వెల్లడించారు. తద్వారా రూ.5,000 కోట్లను భారత్ పొదుపుచేయగలిగిందని ఆయన వివరించారు. భారత్ తన మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదేశంగా భారత్ కొనసాగుతోంది. ఆయా అంశాలపై రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► అంతర్జాతీయంగా భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలను అవకాశంగా తీసుకుని ఏప్రిల్, మే నెలల్లో భారత్ 16.71 మిలియన్ బేరళ్ల (ఎంబీబీఎల్)ను కొనుగోలుచేసింది. విశాఖపట్నం, మంగళూరు, పద్దూర్‌లలో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వల క్షేత్రాలను నింపుకుంది. ► సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఇరాక్‌ల నుంచి ఈ కొనుగోళ్లు జరిగాయి. ► 2020 జనవరిలో బేరల్ 60 డాలర్లకు కొంటే, తదుపరి తక్కువ ధరకు కొనుగోళ్ల వల్ల సగటు వ్యయం బేరల్‌కు 19 డాలర్లకు పడిపోయింది. ► మంగళూరు నిల్వల సామర్థ్యం మొత్తం 1.5 మిలియన్ టన్నులు. మూడింటిలో పద్దూర్ నిల్వల సామర్థ్యం 2.6 మిలియన్ టన్నులు. విశాఖ విషయంలో ఈ సామర్థ్యం 1.33 మిలియన్ టన్నులు. ► 5.33 మిలియన్ టన్నుల అత్యవసర నిల్వ భారత్ 9.5 రోజుల అవసరాలకు సరిపోతుంది. భారత్ రిఫైనరీలు 65 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలను నిర్వహిస్తాయి. మూడు నిల్వ క్షేత్రాలనూ కలుపుకుంటే, 87 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలు భారత్ వద్ద ఉంటాయి. ఇంధన భద్రతకు సభ్య దేశాలకు ఐఈఏ నిర్దేశిస్తున్న చమురు నిల్వల స్థాయికి ఈ పరిమాణం దాదాపు చేరువగా ఉంది. -
మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: మనుషుల్లో పేద, ధనిక, కుల, మత బేధాలు ఉంటాయి కానీ కరోనాకు మాత్రం అందరూ సమానమే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు. రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా సోకినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ప్రసుత్తం ప్రధాన్ హరియాణాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్ షాకు కూడా ఇదే ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్ మెంట్ జరుగుతుంది. (మంత్రులెందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరరు?!) #COVID19 के लक्षण दिखने पर मैंने टेस्ट करवाया जिसमें मेरी रिपोर्ट पॉज़िटिव आई है। डाक्टरों की सलाह पर मैं अस्पताल में भर्ती हूँ और स्वस्थ हूँ। — Dharmendra Pradhan (@dpradhanbjp) August 4, 2020 ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వీరితో పాటు కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. వీరిలో 12 లక్షల 30 వేల మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో వరుసగా నేడు రెండో రోజు 50 వేల కేసులు వెలుగు చూశాయి. -
వాహనదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులకు ఊరటనిచ్చేలా పెట్రోలు కూడా ఇకపై డోర్ డెలివరీ కానుంది. ప్రజల సహాయార్ధం పెట్రోల్ సీఎన్జీని ఇంటివద్దకే పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చమురు కంపెనీలకు త్వరలోనే అనుమతినివ్వనుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నలాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న (శుక్రవారం) తెలిపారు. డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కాగా భారతదేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 2018లో భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా డీజిల్‌ను ఇంటికి పంపిణీ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు కొనుగోలుదారు ఇండియాలో కరోనా కారణంగా డిమాండ్ భారీగా పడిపోయింది. ఇంధన వినియోగం ఏప్రిల్‌లో దాదాపు 70 శాతం తగ్గింది. మరోవైపు రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ, మొబైల్ పెట్రోల్ పంపుల సాయంతో ఇంటి వద్దకే పెట్రోలు అందించనున్నామని ఇటీవల ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూణేకు చెందిన సంస్థ తెలిపింది. చదవండి : రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు -
ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్జీ: ప్రధాన్
న్యూఢిల్లీ: డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. -
మీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒడిశాకు చెందిన వలస కూలీలు, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన (ఇక్కడి వారు అక్కడ.. అక్కడి వారు ఇక్కడ) వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే విషయమై శనివారం వారి మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఒడిశా వలస కూలీలను బాగా చూసుకుంటుండటంపై వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సమర్థవంతంగా పని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్నాం. కోవిడ్ వల్ల ఎదురైన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది. – నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్న వారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడే ఉంటామన్న వారి కోసం వారు పని చేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్లేందుకు సిద్ధమైతే కూడా వారిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం. మీలాంటి నాయకులు స్ఫూర్తిదాయకులు. – వైఎస్ జగన్, ఏపీ సీఎం గట్టి చర్యలు తీసుకుంటున్నారు విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారు. ఇందుకు ధన్యవాదాలు. కోవిడ్19ను ఎదుర్కోవడానికి బాగా పని చేస్తున్నారు. వైరస్ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. – ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి -
లాక్డౌన్: కేంద్రం వివాదాస్పద ప్రకటన
న్యూఢిల్లీ: గోదాముల్లో అవసరానికి మించి ఉన్న బియ్యాన్ని ఇథనాల్‌గా మార్చి, శానిటైజర్ల తయారీకి, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగిస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. జీవ ఇంధనాలపై జాతీయ విధానంలో భాగంగా.. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ‘నేషనల్ బయో ఫ్యూయల్ కోఆర్డినేషన్’ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ కారణంగా లక్షలాదిగా వలస కూలీలు, ఇతర పేదలు ఆకలితో బాధపడుతున్న తరుణంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది. లాక్డౌన్ సమయంలో.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రానున్న మూడు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. అధికారిక సమాచారం ప్రకారం ఎఫ్‌సీఐ గోడౌన్లలో 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్ టన్నుల బియ్యం, 27.52 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నాయి. నిర్దేశించిన ఆహార నిల్వల కంటే ఏప్రిల్ 1 నాటికి 21 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఇథనాల్‌తో హాండ్ శానిటైజర్ల తయారీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ షూగర్ కంపెనీలు, డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది. సాధారణంగా పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్‌ను చమురు సంస్థలకు షూగర్ కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శానిటైజర్లు తయారుచేసి ఆస్పత్రులు, సంస్థలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు షూగర్ కంపెనీల సంఘం(ఐఎస్ఎంఏ) వెల్లడించింది. వీటిని తయారు చేసిన ధరకు లేదా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు -
కేంద్ర మంత్రి భార్య, కుమార్తెపై ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో దేశమంతా ప్రస్తుతం లాక్డౌన్లో ఉంది. కరోనా ‘ప్రసాదించిన’ఈ ఖాళీ సమయాన్ని కొంతమంది కుటుంబానికి కేటాయించగా.. మరికొంత మంది తమలోని నైపుణ్యాలకు పదునుపెడుతూ సృజనాత్మకత జోడించి కరోనాపై పాటలు, పద్యాలు, కథలు, కవితల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంకొంత మంది కరోనాపై పోరులో తోటివారిని గెలిపించేందుకు సామాజిక సేవకు నడుం బిగిస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భార్య మృదుల, కుమార్తె నైమిష కూడా ఈ కోవకే చెందుతారు. లాక్డౌన్ సమయాన్ని వృథా చేయకుండా దర్జీ అవతారమెత్తి మాస్కులు కుడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో మనం చేసే చిన్న సాయానికి కూడా ఎదుటివారి ప్రాణాలు నిలపగల శక్తి ఉంటుందని చాటిచెబుతున్నారు.(రైట్ పర్సన్‌కు రాంగ్ నంబర్) తన భార్య, కూతురు సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నారంటూ స్వయానా ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘ నా ఇల్లాలు మృదుల, కుమార్తె నైమిష మా ఇంట్లో వాళ్ల కోసం, ఆపన్నుల కోసం మాస్కులు తయారుచేస్తున్నారు. వాళ్లను చూస్తే గర్వంగా ఉంది. ఆపద సమయాల్లో మా వంతుగా సమాజానికి చిన్నపాటి సేవలు అందిస్తున్నాం. మనలోని నైపుణ్యాలకు పదును పెట్టేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకుతుందా’’అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మృదుల, నైమిషపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనాపై పోరులో మీ వంతు కృషికి ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. (కరోనా: గొప్పవాడివయ్యా) కాగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇక మాస్కులు కొనే ఆర్థిక స్థోమత, అవకాశం లేనివాళ్లు ఇంట్లోనే వాటిని తయారు చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా 160 మంది మృత్యువాత పడగా.. 5351 మంది మహమ్మారి బారిన పడ్డారు. మిజోరాంలో మాస్కులు కుడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు We should all try and do our bit for society in these difficult times. Proud of my wife Mridula and daughter Naimisha who are making safety masks for all of us at home, and also for others who need it. No better time to hone your skills and learn new ones. #Masks4All pic.twitter.com/YtGNZvj7VS — Dharmendra Pradhan (@dpradhanbjp) April 7, 2020