కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (ఫైల్ ఫోటో)
భువనేశ్వర్ : స్వార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ ఓ అసక్తికర వాగ్దానం చేసింది. ఒడిశాలో అధికారంలోకి వచ్చిన పక్షంలో బియ్యం, పప్పు, ఉప్పు కిలో 1 రూపాయికే అందిస్తామని పేర్కొంది. కటక్ జిల్లాలో చౌవార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం ఈ ప్రకటన చేశారు.
ఒడిశాలో బీజీపీ అధికారంలోకి వచ్చినట్లయితే, 5 కిలోల బియ్యం, అరకిలో పప్పు, అరకిలో ఉప్పును కేవలం ఒక రూపాయికే అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పథకం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింది ఈ పథకం ద్వారా 3.26 కోట్ల పేద ప్రజలకు లబ్ధి చేకూర్చనుందరని ప్రధాన్ చెప్పారు. ప్రతి కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల సబ్సిడీని అందజేస్తోంటే, రాష్ట్రంలో వాటా కేవలం రూ .2 మాత్రమే అని చెప్పారు.
అంతేకాదు రాష్ట్రంలోని అవినీతి ప్రభుత్వానికి గుడ్ బై చెప్పి, డబుల్ ఇంజీన్ బీజేపీ ప్రభుత్వంవైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను మెరుగు పరుస్తుందని, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయం కోసం ఎక్కువ మంది వైద్యులను నియమిస్తామన్నారు. అలాగే లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ద్వారా నీటిపారుదల వ్యవస్థను విస్తరించడంతోపాటు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను అభివృద్ది పరుస్తామని కేంద్ర మంత్రి వరాల జల్లు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment