Rs. 1
-
ఉప్పూ, పప్పూ, బియ్యం కిలో రూ. 1కే
భువనేశ్వర్ : స్వార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ ఓ అసక్తికర వాగ్దానం చేసింది. ఒడిశాలో అధికారంలోకి వచ్చిన పక్షంలో బియ్యం, పప్పు, ఉప్పు కిలో 1 రూపాయికే అందిస్తామని పేర్కొంది. కటక్ జిల్లాలో చౌవార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం ఈ ప్రకటన చేశారు. ఒడిశాలో బీజీపీ అధికారంలోకి వచ్చినట్లయితే, 5 కిలోల బియ్యం, అరకిలో పప్పు, అరకిలో ఉప్పును కేవలం ఒక రూపాయికే అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పథకం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింది ఈ పథకం ద్వారా 3.26 కోట్ల పేద ప్రజలకు లబ్ధి చేకూర్చనుందరని ప్రధాన్ చెప్పారు. ప్రతి కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల సబ్సిడీని అందజేస్తోంటే, రాష్ట్రంలో వాటా కేవలం రూ .2 మాత్రమే అని చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలోని అవినీతి ప్రభుత్వానికి గుడ్ బై చెప్పి, డబుల్ ఇంజీన్ బీజేపీ ప్రభుత్వంవైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను మెరుగు పరుస్తుందని, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయం కోసం ఎక్కువ మంది వైద్యులను నియమిస్తామన్నారు. అలాగే లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ద్వారా నీటిపారుదల వ్యవస్థను విస్తరించడంతోపాటు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను అభివృద్ది పరుస్తామని కేంద్ర మంత్రి వరాల జల్లు కురిపించారు. -
బడ్జెట్లో క్రీడలకు రూ. 1,943 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో క్రీడలకు కాస్త ప్రాధాన్యతను పెంచింది. బుధవారం ప్రకటించిన బడ్జెట్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి క్రీడల అభివృద్ధి కోసం రూ. 1,943 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 350 కోట్లు ఎక్కువ కావడం విశేషం. ఇందులో జాతీయ స్థాయి శిక్షణ శిబిరాల నిర్వహణకు రూ. 481 కోట్లు, క్రీడా సమాఖ్యలకు రూ. 302 కోట్లు ఇస్తారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి కూడా భారీగా రూ. 350 కోట్లు కేటాయించారు. అయితే మరికొన్ని కీలక అంశాలకు ప్రభుత్వం చాలా తక్కువ మొత్తం కేటాయించింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ క్రీడల అభివృద్ధి పథకానికి నిధులను రూ. 5 కోట్ల నుంచి తగ్గించి రూ. 2 కోట్లే ఇవ్వగా... దేశంలో క్రీడా ప్రతిభను గుర్తించి, తీర్చిదిద్దేందుకు అధమంగా కేవలం రూ. 50 లక్షలు మాత్రం ప్రభుత్వం ఇవ్వనుంది. -
రూ. 1,000 కోట్ల సమీకరణలో ఆంధ్రా బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు సుమారు రూ. 1,000 కోట్ల నిధుల సమీకరణ కోసం పదేళ్ల కాల వ్యవధితో అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డెట్ బాండ్లు జారీ చేయనుంది. వీటికి 8.65 శాతం వడ్డీ రేటు ఉంటుంది. జూన్ 22న ప్రారంభమయ్యే ఇష్యూ 27న ముగుస్తుంది. -
రూ.1,990కే స్మార్ట్ ఫోన్
అతి తక్కువ బడ్జెట్ తో మొదటిసారి స్మార్ట్ ఫోన్ వాడే వినియోగదారుల కోసం ఇంటెక్స్ కంపెనీ ఓ కొత్త మొబైల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీ కనెక్టివిటీతో ఇంటెక్స్ 'ఆక్వా జీ2'ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1,990 మాత్రమేనని ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ కు అవసరమయ్యే అన్ని ఫీచర్లు పొందుపరిచిన ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే రూ.3,299 లకు క్లౌడ్ జెమ్ ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించిన ఇంటెక్స్ వెంటనే దానికంటే తక్కువ ధరకు మరో ఫోన్ ను ఆవిష్కరించడం విశేషం. ఇంటెక్స్ ఆక్వా జీ2 ఫీచర్లు 2.8 అంగుళాల టీఈటీ డిస్ ప్లే, 240x320 ఫిక్సల్ రెజుల్యూషన్ స్క్రీన్ ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీ బీన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ 1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా 256ఎంబీ ర్యామ్, ఇన్ బిల్ట్ స్టోరేజ్ 512ఎంబీ బూడిద, లేత గోధుమ రంగుల్లో ఈ ఫోన్ దొరుకుతుంది -
మహిళా, శిశు సంక్షేమానికి రూ. 1,552 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళా, శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్లో రూ. 1,552 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రణాళికా బడ్జెట్ కింద రూ. 1,481. 83 కోట్లు కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ. 70.74 కోట్లు కేటాయించారు. ప్రణాళికా బడ్జెట్లో గత బడ్జెట్ కంటే ఈసారి రూ. 166 కోట్లు అదనంగా కేటాయించగా, ప్రణాళికేతర బడ్జెట్లో కూడా రూ. 47 లక్షలు ఎక్కువగా కేటాయించడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు బంగారుతల్లి పథకానికి నిధులు కేటాయించలేదు. సాంఘిక భద్రత, సంక్షేమం కోసం ఈ ఏడాది రూ. 697. 37 కోట్లు కేటాయించారు. గత ఏడాది సాంఘిక భద్రత, సంక్షేమం కోసం రూ. 730 .91 కోట్లు కేటాయించగా, ఈసారి తగ్గింది. ఐసీడీఎస్‌లో వృత్తి సేవల కింద అంగన్వాడీ వర్కర్ల చెల్లింపులకు వివిధ పద్దుల కింద వందలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యలక్ష్మి కింద రూ. 396.77 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు కేవలం రూ. 35.68 కోట్లు మాత్రమే. బాలికా సంరక్షణ పథకం కింద రూ. 26.62 కోట్లు కేటాయించారు. ఐసీడీఎస్ వేతనాలకు కూడా గత సంవత్సరం కంటే రూ. 67 కోట్లు తగ్గించి బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈసారి రూ. 50 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. గర్భిణులు, శిశువుల పౌష్టికాహారం కోసం కిందటేడు కంటే రూ. 200 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. -
రూ. 1,200 లోపు ఆస్తిపన్ను రద్దు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల ఆస్తిపన్ను రూ. 1,200 లోపు ఉన్న 5,09,187 ఇళ్ల యజమానులకు శుభవార్త. వారంతా ఇకనుంచి తాము జీహెచ్ఎంసీకి ఏటేటా చెల్లిస్తున్న ఆస్తిపన్నును చెల్లించాల్సిన పనిలేదు. ఈ మేరకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఇళ్లను అద్దెకివ్వకుండా యజమానులే ఉంటున్న నివాసగృహాలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే వీరంతా నామమాత్రంగా ప్రతియేటా రూ. 101 ఆస్తిపన్నుగా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గనుంది. ఆస్తిపన్ను జాబితాలోని 5,09,187 ఇళ్ల నుంచి ఈ ఆర్థికసంవత్సరానికి రావాల్సిన ఆస్తిపన్ను రూ.29.40 కోట్లు కాగా, పాతబకాయిలు మరో రూ. 57.99 కోట్లు, వెరసి మొత్తం రూ. 87.39 కోట్ల జీహెచ్ఎంసీ ఆదాయం తగ్గనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంపన్న కాలనీల్లో మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లోని డబుల్బెడ్రూమ్ ఇళ్ల వారి వరకు ప్రయోజనం కలగనుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం తెలిసిందే. అందులో భాగంగా ఇదివరకే తీసుకున్న ఆస్తిపన్ను మినహాయింపు నిర్ణయంపై తాజాగా జీవో జారీ చేశారు. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులు దాదాపు 14.50 లక్షలుండగా, వారిలో 5.09 లక్షల మందికి ఈ సదుపాయం వర్తించనుంది.