న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడలకు కాస్త ప్రాధాన్యతను పెంచింది. బుధవారం ప్రకటించిన బడ్జెట్‌లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి క్రీడల అభివృద్ధి కోసం రూ. 1,943 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 350 కోట్లు ఎక్కువ కావడం విశేషం. ఇందులో జాతీయ స్థాయి శిక్షణ శిబిరాల నిర్వహణకు రూ. 481 కోట్లు, క్రీడా సమాఖ్యలకు రూ. 302 కోట్లు ఇస్తారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి కూడా భారీగా రూ. 350 కోట్లు కేటాయించారు. అయితే మరికొన్ని కీలక అంశాలకు ప్రభుత్వం చాలా తక్కువ మొత్తం కేటాయించింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ క్రీడల అభివృద్ధి పథకానికి నిధులను రూ. 5 కోట్ల నుంచి తగ్గించి రూ. 2 కోట్లే ఇవ్వగా... దేశంలో క్రీడా ప్రతిభను గుర్తించి, తీర్చిదిద్దేందుకు అధమంగా కేవలం రూ. 50 లక్షలు మాత్రం ప్రభుత్వం ఇవ్వనుంది.
బడ్జెట్‌లో క్రీడలకు రూ. 1,943 కోట్లు
Published Thu, Feb 2 2017 12:57 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement