ఒడిశాలో నేషనల్‌ సీస్మిక్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం | Dharmendra Pradhan launches National Seismic Program at Mahanadi Basin | Sakshi
Sakshi News home page

ఒడిశాలో నేషనల్‌ సీస్మిక్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం

Published Thu, Oct 13 2016 5:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

Dharmendra Pradhan launches National Seismic Program at Mahanadi Basin

భువనేశ్వర్‌: దేశంలో హైడ్రోకర్భన నిక్షేపాల తాజా వాస్తవ నిల్వలను నిర్ధారించుకునేందుకు నేషనల్‌ సీస్మిక్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌ఎస్‌పీ)ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా తరంగ్‌లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భూగర్భ తైల, సహజ వాయువు వనరుల అన్వేషణ తమ ప్రధాన లక్ష్యమని ప్రధాన్‌ అన్నారు. దేశంలో దాదాపు పాతికేళ్ల తర్వాత రూ. 5,000 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement