national seismic program
-
ఢిల్లీలో భూ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. దీంతో దేశరాజధానితో పాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కొద్దిసేపు భూమి కంపించింది. పాక్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. -
ఒడిశాలో నేషనల్ సీస్మిక్ ప్రోగ్రామ్ ప్రారంభం
భువనేశ్వర్: దేశంలో హైడ్రోకర్భన నిక్షేపాల తాజా వాస్తవ నిల్వలను నిర్ధారించుకునేందుకు నేషనల్ సీస్మిక్ ప్రోగ్రామ్(ఎన్ఎస్పీ)ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లా తరంగ్‌లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భూగర్భ తైల, సహజ వాయువు వనరుల అన్వేషణ తమ ప్రధాన లక్ష్యమని ప్రధాన్ అన్నారు. దేశంలో దాదాపు పాతికేళ్ల తర్వాత రూ. 5,000 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించామన్నారు.