పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు రికార్డుస్ధాయిలో పెరుగుతుండటం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రో ధరల నియంత్రణలో భాగంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్ మారకంలో మార్పులు, పన్నుల వంటి మూడు కారణాలతో ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు.
శాశ్వత పరిష్కారం దిశగా పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తేవడం ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఒకటని అన్నారు. దీనిపై తాము తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని..పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలని వ్యాఖ్యానించారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం వరుసగా 15వ రోజు కూడా భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 78.27కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 15 పైసలు పెరిగి రూ 82.91కి చేరింది. కోల్‌కతా, ముంబయి నగరాల్లో పెట్రోల్ ధరలు రికార్డుస్థాయిలో లీటర్‌కు రూ 85 దాటాయి.
Comments
Please login to add a commentAdd a comment