petrol prices increased
-
సాక్షి కార్టూన్ 20-10-2021
-
మళ్లీ పెట్రో ధరల షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. రోజురోజుకూ భారమవుతూ చుక్కలు చూపుతున్నాయి. ఇంధన ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం వరుసగా 17వ రోజూ పెంచాయి. పెట్రోల్ లీటర్‌కు 20 పైసలు, డీజిల్ లీటర్‌కు 63 పైసల మేర పెరిగాయి. తాజా ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ 79.76 రూపాయలు కాగా, డీజిల్ లీటర్ 79.40కి ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ఏకంగా 82.59కి చేరింది. కరోనా మహమ్మారితో ప్రజల ఆదాయాలు పడిపోయిన క్రమంలో ప్రభుత్వం పెట్రో భారాలు మోపుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. చదవండి : మనకు పెట్రో ఊరట లేనట్టే! -
ఏడాది గరిష్టానికి పెట్రోల్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా ఏడో రోజూ ఎగబాకాయి. సోమవారం లీటరుపై పెట్రోల్ 29 పైసలు, డీజిల్ 19 పైసలు పెరిగింది. దీంతో వారం రోజుల్లో లీటరుపై పెట్రోల్ రూ.1.88, డీజిల్ రూ.1.50 పెరిగినట్లయింది. 2018 నవంబర్ తర్వాత పెట్రో ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరుపై పెట్రోల్ రూ.74, డీజిల్ రూ.69కి చేరుకుంది. పెట్రోల్ ధర ఈ ఏడాది ఇదే గరిష్టం కాగా, ఇటీవలి కాలంలో డీజిల్ ధర ఇదే అత్యధికం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై పడింది. -
జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు ఎప్పుడంటే..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు రికార్డుస్ధాయిలో పెరుగుతుండటం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రో ధరల నియంత్రణలో భాగంగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్ మారకంలో మార్పులు, పన్నుల వంటి మూడు కారణాలతో ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. శాశ్వత పరిష్కారం దిశగా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఒకటని అన్నారు. దీనిపై తాము తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని..పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలని వ్యాఖ్యానించారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం వరుసగా 15వ రోజు కూడా భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 78.27కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 15 పైసలు పెరిగి రూ 82.91కి చేరింది. కోల్‌కతా, ముంబయి నగరాల్లో పెట్రోల్ ధరలు రికార్డుస్థాయిలో లీటర్‌కు రూ 85 దాటాయి. -
రోజు వారీ బాదుడు
శ్రీకాకుళం : పెట్రో ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ తొలగిన తర్వాత ధరల పెరుగుదలపై నియంత్రణ లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో చము రు ధరలకు అనుగుణంగా ఆయిల్ సంస్థలే రోజువారీ ధరలను సవరిస్తున్నాయి. అయితే గత రెండు నెలల్లో పెట్రోల్ ధరలు పెరగడం తప్ప తగ్గింది లేదు. ఈ ఏడాది జనవరి నెలలోనే 18 రోజుల వ్యవధిలో పెట్రోలుపై రూ. 1.51 పెరగ్గా, డీజిల్‌పై రూ. 2.55 పెరిగింది. ఫిబ్రవరిలో పది రోజులే గడవగా ఇదే రీతిన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల మార్పు కారణంగా ఒకేసారి పెంపు లేకపోయినప్పటికీ మెల్లమెల్లగా వినియోగదారులపై భారీగా భారం పడుతోంది. నెల వ్యవధిలో పెట్రోల్ ధర 24 సార్లు పెరిగితే రెండుమూడు సార్లు మాత్రమే తగ్గింది. జనవరి 1 నుంచి మాత్రం పెట్రోలు, డీజి ల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గింది. జనవరి 1న పెట్రోల్ ధర రూ. 75.87 ఉండగా ప్రస్తుతం రూ. 79.14కు చేరింది. డీజిల్ సైతం అదే దారిలో జనవరి 1న రూ. 66.76 ఉంటే ప్రస్తుతం రూ.71.11కు చేరింది. చమురు సంస్థలు రాత్రి 12 గంటలకు ఆ రోజు అమలు చేసే ధరను ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. దీనిని చూసుకొని ఉదయం 5 గంటల నుంచి కొత్త ధరను అమలుచేస్తూ బంకు యాజమాన్యాలు విక్రయాలు జరుపుతున్నాయి. కొన్ని రోజుల నుంచి ధర పెరుగుదలను పరిశీలిస్తే వారంలోపే లీటరు పెట్రోల్ ధర రూ. 85 వరకు, డీజిల్ ధర రూ.80 వరకు చేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పన్నుల మోత కొత్త విధానంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ బంకుల మధ్య ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కంటే పొరుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు తక్కువగా ఉంటున్నాయి. లీటరు పెట్రోలుపై కర్ణాటకలో రూ. 6.50, తమిళనాడులో రూ.3, తెలంగాణలో రూ.2 , ఒడిశాలో రూ.2 వరకు తక్కువగా ఉంటున్నాయి. కేంద్రంతోపాటు రాష్ట్రం విధించే పన్నులకు తోడు ఏపీ ప్రభుత్వం అదనంగా వ్యాట్ రూపంలో 28 శాతం వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఇక్కడే పెట్రో ధరలు మండిపోతున్నాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌లో పెంచిన ఎక్సైజ్ సంకాన్ని కొంతమేర తగ్గించింది. లీటరుకు రూ.2 తగ్గించడంతో పాటు రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించాలని ప్రభుత్వం సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినా ఏపీలో మాత్రం తగ్గించలేదు. అంతేకాకుండా లీటరుకు అదనంగా రూ. 4 వ్యాట్ వసూలు చేస్తుండటం గమనార్హం. ఇలా ధరలు పెరుగుదలతో జిల్లా పెట్రో వినియోగదారులపై నెలకు దాదాపు కోటి రూపాయిలకు పైగా భారం పడుతోందని అంచనా. మన రాష్ట్రంలోనే ఎక్కువ పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎంత రేటు పెరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనిపై బీజేపీ, టీడీపీ నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. – గుండబాల మోహన్, కాంట్రాక్టు ఉద్యోగి అంతా గందరగోళం పెట్రోల్ ధరలను రోజుకో విధంగా నిర్ణయిస్తుండటంతో గందరగోళ ప రిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎంత ధర ఉంటుందో తెలియడం లేదు. ఇది సరైన విధానం కాదు. గతంలో మాదిరిగా ఒకే ధరను అమలు చేయాలి. – యండ ఉమాశంకర్, ఉపాధ్యాయుడు -
పెట్రో పిడుగు
విజయనగరం కంటోన్మెంట్ : రైలు ప్రయాణ ఛార్జీలు పెరిగి వారం కూడా గడవకముందే కేంద్రప్రభుత్వ సూచనలతో పెట్రో ధరలు కూడా భగ్గుమన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ సోమవారం రాత్రి ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంక్‌లకు ఉత్తర్వులు విడుదల చేశాయి. పెరిగిన ధరలు, పన్నులెంత వసూలు చేయాలనే సూచనలున్న మెసేజ్‌లు పంపాయి. ఈ ధరల పెంపు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తున్నాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రో ధరల పెంపు వల్ల జిల్లా వాసులు నెలకు రూ. అరకోటికి పైగా భారాన్ని మోయాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సమాంతరంగా రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు, ఇతర ప్రయాణ ఛార్జీలు పెరిగి సామాన్య జీవనం ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యుడి నడ్డి విరవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్న విమర్శలు అప్పుడే వెల్లువెత్తున్నాయి. గత నెల 25నుంచే రైలు ఛార్జీలు పెరిగాయి. వాటిని ప్రజలు ఇంకా మర్చిపోకపోకముందే పెట్రో ధరలు పెంచడంతో ప్రజలపై తీవ్ర ఆర్థికభారం పడనుంది. జిల్లాలో 95 పెట్రోల్ బంక్‌లున్నాయి. వీటి ద్వారా ప్రతీ రోజూ 48 వేల నుంచి 50 వేల లీటర్ల దాకా పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పెంచిన ఛార్జీలను పరిశీలిస్తే పెట్రోల్ లీటరుకు రూ. 1:69 పైసలు పెరిగింది. దీనికి వ్యాట్ అదనంగా ఉంటుంది. వ్యాట్ పెట్రోల్‌పై 31 శాతం వసూలు చేస్తారు. వ్యాట్‌తో కలిపి లీటర్ పెట్రోల్ ధర 2.20 రూపాయలకు చేరుకోనుంది. దీంతో రోజుకు 50 వేల లీటర్ల పెట్రోల్ విక్రయాల ప్రకారం నెలకు రూ. 33 లక్షల భారం పడుతోంది. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా లీటరుకు 50 పైసల చొప్పున పెరిగింది. దీనికి వ్యాట్ 28 శాతం వసూలు చేస్తారు. దీంతో లీటరుకు వినియోగదారునిపై 62 పైసల భారం పడుతుంది. ప్రతీ నెలా జిల్లాలోని అన్ని బంకుల్లో కలిపి లక్షా 20 వేల లీటర్ల డీజెల్ విక్రయాలు జరుగుతాయి. ఈ లెక్కన ప్రతీ నెలా రూ.21.60 లక్షల భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల వినియోగదారులపై ప్రతీ నెలా రూ.54.60 లక్షల భారం పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సమాంతరంగా పలు నిత్యావసర సరుకుల ధరలు, ప్రయాణ ఛార్జీలు పెరిగిపోతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విక్రయాలు నిలిపివేసిన బంక్ యజమానులు పెట్రో ధరలు పెరగడంతో బంక్ యజమానులు సోమవారం రాత్రి నుంచి విక్రయాలను నిలిపివేశారు. లీటరుకు 2రూపాయల 20 పైసలు పెరగడంతో కనీసం ఎంతో కొంత లాభపడొచ్చనే ఉద్దేశంతో అర్ధరాత్రికి ముందుగానే పెట్రోల్ అమ్మకాలను ఆపేశారు. దీంతో చాలామంది వినియోగదారులు, ద్విచక్రవాహన దారులు ఇబ్బందులు పడ్డారు.