
3.56 కోట్ల నకిలీ అకౌంట్లు గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యక్ష్ హన్స్‌తంత్రి లాభ్(పీఏహెచ్‌ఎల్) పథకం అమలు తర్వాత దేశవ్యాప్తంగా 3.56 కోట్ల నకిలీ అకౌంట్లను గుర్తించారు. ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 3.56 కోట్లు నకిలీ బ్యాంకు అకౌంట్లను గుర్తించినట్లు చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సబ్సిడీ కింద రూ.40,569 కోట్లు, 2015-16 ఆర్థిక సంత్సరానికి రూ.16,074 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు.
వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం వల్ల(పీఏహెచ్‌ఎల్ పథకం ద్వారా), అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం తదితర కారణాల వల్ల 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,495 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. 2017 జనవరి నెల వరకూ కోటి ఐదు లక్షల మంది ఎల్‌పీజీ వినియోగదారులు స్వచ్ఛందంగా ఎల్‌పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు తెలిపారు.