
విద్యాశాఖ మంత్రి ప్రధాన్ వెల్లడి
న్యూఢిల్లీ: నీట్–పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈ) ఒకటి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్–పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్‌నెట్‌లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని తెలిపారు.
ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. కీలకమైన పోటీ పరీక్షల్లో పేపర్ లీకవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గతవారం జరగాల్సిన నీట్–పీజీ పరీక్షను ముందు జాగ్రత్తగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 18న జరిగిన యూజీసీ–నెట్ పరీక్ష సైతం రద్దయ్యింది.