కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఫిల్మ్ స్టార్స్! | Aparajita Mohanty joins in BJP is shock to congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఫిల్మ్ స్టార్స్!

Published Mon, Feb 19 2018 5:33 PM | Last Updated on Mon, Feb 19 2018 8:20 PM

Aparajita Mohanty joins in BJP is shock to congress - Sakshi

నటి అపరాజిత మహంతీ (ఫైల్ ఫొటో)

సాక్షి, భువనేశ్వర్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నటి అపరాజిత మహంతీ తన భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, మరికొందరు పార్టీ సీనియర్ల సమక్షంలో ఒడిషా నటి బీజేపీలో చేరారు. రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన సమావేశంలో అపరాజిత బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని, మోదీ హాయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె ఆకాంక్షించారు. మోదీ పాలనలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు తనను బీజేపీ చేరేందుకు ఆకర్షించాయని నటి అపరాజిత మహంతీ తెలిపారు. అపరాజిత చేరికతో బీజేపీ మరింత బలోపేతం అయిందన్నారు.

బిజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అరపున అపరాజిత ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెప్పారు. అపరాజితతో పాటుగా మరికొందరు ఒడిషా ఫిల్మ్ స్టార్లు మిహిర్ దాస్, అను చౌదరి, మహస్వేతా రేలు కాషాయ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. ఈ నటీనటులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసి బీజేపీకి విజయం అందిస్తారని రాష్ట్ర పార్టీ అధిష్టానం భావిస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన నటి ఈ నెల 13న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కటక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన ఆమె బీజేడీ అభ్యర్థి భర్తృహరి మహతాబ్ చేతిలో పరాజయం పాలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement