cuttack
-
ప్రముఖ కంపెనీ మాజీ హెచ్ఆర్ హెడ్.. ఒడిశా అభ్యర్థుల్లో రిచెస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ మాజీ హెచ్ఆర్ హెడ్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నిలల్లో కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంతృప్త్ మిశ్రా సుమారు రూ. 461 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.సంతృప్త్ మిశ్రా ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత గత ఫిబ్రవరిలో బీజేడీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ 2021-22లో రూ. 76.23 కోట్లు, 2022-23లో రూ. 66.21 కోట్లుగా ఉన్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.408 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4 కోట్ల బ్యాంకు డిపాజిట్లు సహా రూ.53 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.మ్యూచువల్ ఫండ్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, బాండ్లు, షేర్లలో మిశ్రా పెట్టుబడి మొత్తం ప్రస్తుత విలువ దాదాపు రూ. 308 కోట్లు. రూ.2.3 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన కార్లు ఆయనకున్నాయి. ఇక మిశ్రా భార్య చరాస్తుల విలువ రూ. 11.72 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఒడిశాలో ఎటువంటి స్థిరాస్తి లేనప్పటికీ, మిశ్రాకు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్, ముంబైలలో ఫ్లాట్లు ఉన్నాయి.కాగా ఒడిశాలో 21 లోక్‌స్థానాలు, 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటికీ ఏక కాలంలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సంతృప్త్ మిశ్రా పోటీ చేసే కటక్ లోక్‌సభ స్థానానికి మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి అమర్నాథ్ భేటీ
భువనేశ్వర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద ప్రాంతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆదివారం కటక్‌లో మంత్రి అమర్నాథ్ సమావేశమయ్యారు. రైలు ప్రమాద ఘటనపై సహాయక చర్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. రైలు ప్రమాద క్షతగాత్రులకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. కాల్ సెంటర్లు నిర్వహణ ద్వారా బాధితులను త్వరగా గుర్తించి సహాయం అందించామని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాకు ఒక కాల్ సెంటర్ నిర్వహణను రైల్వే మంత్రి అభినందించారు. చదవండి: ఒడిశా మహా విషాదం.. చుట్టూ కారు చీకటి.. 40 నిమిషాలు ఏం జరిగింది? అంతకుముందు మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. . కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందినవారు 342 ప్రయాణిస్తున్నారని వారిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు మరోవైపు ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. సిగ్నలింగ్ పాయింట్లో మార్పులు చేసిన వారిని కూడా గుర్తించామని వెల్లడించారు. త్వరలో వారిపై చర్యలు ఉంటాయన్నారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదన్నారు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు బహిర్గతమవుతాయని మంత్రి వెల్లడించారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
ప్రాణం తీసిన 'నో బాల్' గొడవ.. అంపైర్ అందుకు నో చెప్పడంతో..
భువనేశ్వర్: క్రికెట్ మ్యాచ్ ఆడే సమయంలో ఇరు జట్లు అపుడుపుడు మాటల యుద్ధానికి దిగుతాయి. భౌతిక దాడులు చేసుకునే సందర్భాలు అత్యంత అరుదు. అయితే గల్లీ క్రికెట్లో మాత్రం ఇలా కాదు.. మాటా మాటా పెరిగి ఒక్కోసారి ఇరుజట్లు బాహాబాహీకి దిగుతాయి. ఆటగాళ్లు ఒకరిపైఒకరు దాడి చేసుకుని తీవ్రంగా గాయపరుచుకుంటారు. ఒడిశా కటక్ జిల్లా మహిసానంద గ్రామంలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. క్రెకెట్ మ్యాచ్ ఆడే సమయంలో అంపైర్ నో బాల్ ఇవ్వలేదని సంగ్రామ్ రౌత్ అనే ఆటగాడు రెచ్చిపోయాడు. నో బాల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కానీ అంపైర్ అందుకు ఒప్పకోలేదు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన సంగ్రామ్, మరో ఇద్దరు ఆటగాళ్లు.. అంపైర్‌ను తోసేసి దాడి చేయబోయారు. గొడవ పెద్దది కావడంతో లక్కీ రౌత్ అనే స్థానికుడు అంపైర్‌ను కాపాడేందుకు మధ్యలో జోక్యం చేసుకుని వెళ్లాడు. దీంతో సంగ్రామ్ అతడ్ని బ్యాట్‌తో కొట్టాడు. ఛాతీలో కత్తితో పొడిచాడు. దీంతో లక్కీ తీవ్రగాయాలతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: 'గాడిద పాల సబ్బు వాడితే మహిళలు ఎప్పటికీ అందంగా ఉంటారు' -
సంక్రాంతి వేడుకల్లో తొక్కిసలాట.. ఒకరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
భువనేశ్వర్: ఒడిశా కటక్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బడాంబ- గోపినాథ్‌పుర్ టీ-బ్రిడ్జిపైకి భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఇక్కడ భారీ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే సామర్థ్యానికి మించి జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు.. -
మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. అడవిలో మృతదేహం!
ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన రాజశ్రీ.. శుక్రవారం(జనవరి 13) కటక్ సమీపంలోని ఓ దట్టమైన ఆడవిలో శవమై కన్పించింది. అథఘర్ ప్రాంతంలోని గురుడిఝాటియా అడవిలో చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా 26 ఏళ్ల రాజశ్రీ స్వైన్‌కు జనవరి 10న ప్రకటించిన ఒడిశా రాష్ట్ర మహిళల క్రికెట్ జట్టు తుది జాబితాలో చోటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. ఇక రాజశ్రీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహం అథఘర్ ఆడివిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Siddharth Sharma Death: భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. స్టార్ బౌలర్ మృతి -
మరీ ఇంత దారుణమా.. అప్పు చెల్లించకపోతే ఇలా చేస్తారా?
భువనేశ్వర్: ఒడిశా కటక్ నగరంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడ్ని స్కూటర్‌కు కట్టేసి పరుగెత్తించింది ఓ గ్యాంగ్. అతని చేతులకు తాడు కట్టి నడిరోడ్డుపై చాలా దూరం లాక్కెల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WatchVideo l Youth tied to scooter dragged along road in #Odisha pic.twitter.com/2idf9dAMrI — Prameya English (@PrameyaEnglish) October 17, 2022 వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. యువకుడు తనకు తెలిసిన వాళ్ల దగ్గరే కొంతడబ్బు అప్పుగా తీసుకున్నాడని, కానీ వాళ్లు తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా అతను ఇవ్వకపోవడంతో ఇలా చేశారని తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసిందని వివరించారు. ఇది చాలా సున్నితమైన కేసు అయినందున నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. విచారణ పూర్తయ్యక అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒడిశాలో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు. గతంలోనూ ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలించాడని అతడ్ని లారీ ముందుభాగంలో కట్టేసి, మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. జగత్సింగ్పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చదవండి: అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్.. కానీ.. పెళ్లిపై షరతు! -
ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై
టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టి20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా రెండో టి20 ఆదివారం(జూన్ 12న) ఒడిశాలోని కటక్ వేదికగా జరగనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లకు ఘన స్వాగతం లభించింది. కాగా సౌతాఫ్రికా క్రికెటర్ వేన్ పార్నెల్‌ను ఒక రిపోర్టర్.. ఒడిశాకు తొలిసారి వచ్చారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ''ఇక్కడ ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. అయితే నేను ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. అయితే భారత్‌లో నాకు నచ్చిన రెండు విషయాలు క్రికెట్ ఒకటి.. మరొకటి ఆతిథ్యం.'' అంటూ పార్నెల్ ఎపిక్ రిప్లై ఇచ్చాడు. చదవండి: 'ఉన్నప్పుడు పెద్దగా ఏం పీకలేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు' -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. తొలి టికెట్ కొన్న ఒడిశా ముఖ్యమంత్రి..!
భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జూన్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 జూన్ 12న కటక్‌లోని బరాబతి స్టేడియం వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కి తొలి టికెట్‌ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు. ఇక బరాబతి స్టేడియం వేదికగా రెండో సారి దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. 2015లో జరగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. బిజినెస్ స్టాండర్డ్ సమాచారం ప్రకారం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహెరా సోమవారం ముఖ్యమంత్రికి టికెట్‌ను అందజేశారు. అదే విధంగా స్టేడియం వద్ద చేసిన భద్రతా ఏర్పాట్లను నవీన్ పట్నాయక్‌కు పంకజ్ లోచన్ వివరించినట్లు తెలుస్తోంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్ మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్ ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు నోట్: అన్ని మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభమవుతాయి. ప్రొటిస్‌తో సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్ చదవండి: SL Vs Aus 1st T20: ఆసీస్‌తో మొదటి టీ20.. శ్రీలంక తుది జట్టు ప్రకటన.. విజయం మాదే! -
సికింద్రాబాద్–కటక్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కటక్ (07581/07582) ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ సాయంత్రం 6.55 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..
భువనేశ్వర్/కటక్: గాలిపటాలు ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరు. కానీ ఆ పతంగి పైపైకి పోవాలనే భావనతో కొంతమంది దారానికి మాంజా(గాజు పెంకుల పొడి) పూయడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని పక్షులు మరణించిన ఉదంతాలు మాత్రమే చూశాం. ప్రస్తుతం మాంజా పూసిన దారం మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. కటక్–చాంద్‌బాలి జాతీయ రహదారిలోని పీర్ బజారు ప్రాంతంలో సోమవారం ఉదయం కటక్‌లోని తమ బంధువుల ఇంటికి భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్న జయంత్ సామల్(31)పీకకు ఓ తెగిన గాలిపటం దారం ఒకటి చుట్టుకుంది. ఒక చేత్తో దాన్ని పక్కకు లాగుతూనే కొంతదూరం వెళ్లారు. ఈ ప్రయత్నంలో పతంగికి ఉన్న దారం అతని గొంతును కోసేసింది. దీంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అదృష్టవశాత్తు అతడితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన మరుక్షణమే స్థానికులు చొరవ కల్పించుకుని చేరువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరినీ చేర్చారు. ఈ క్రమంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు జయంత్ అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగత్పూర్ ఠాణా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం దుర్ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) గాలిపటం దారానికి గాజు పెంకుల పొడి పూస్తున్న దృశ్యం దుకాణానికి వెళ్తుండగా.. పూరీ పట్టణంలో వెలుగుచూసిన మరో గాలిపటం దుర్ఘటనలో ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానిక బొడొదండొలో మందుల దుకాణానికి వెళ్తుండగా, తెగిన గాలిపటం అతడి మెడ భాగం కోసుకుపోయింది. ఈ ప్రమాదంలో భంజబిహారి పాత్రో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఏడేళ్లలో ముగ్గురు మృతి.. గడిచిన ఏడేళ్లలో ఒక్క కటక్ నగరంలోనే గాలిపటంతో పీక తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం, 10 మందికి పైగా గాయాలపాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి పురస్కరించుకుని, జరుపుకునే గాలిపటాల పండుగ మరెంతమందిని విషాదంలోకి నెడుతుందోనని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం మాంజా అమ్మకాలపై నిషేధం విధించినా పలుచోట్ల వాటి అమ్మకాలు జోరుగా సాగుతుండడం గమనార్హం. చదవండి: (Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం) మాంజా తయారీ.. సాధారణంగా సంక్రాంతి పండగ దగ్గర పడుతున్న తరుణంలో గాలి పటాల సందడి ప్రారంభమవుతుంది. నింగికెగసి రెపరెపలాడుతూ ఎగిరే గాలి పటాల మధ్య పోటీ కోసం దారం పదును పెడతారు. ఫుడ్ కలర్ కలిపిన బంకలో గాజు పెంకుల పొడిని జోడించిన మిశ్రమం దారపు పోగును బలంగా చేసేందుకు పూస్తారు. ఎండలో ఇది ఆరిన తర్వాత గాలి పటానికి కట్టి ఎగురవేస్తారు. ఈ ప్రక్రియని మాంజాగా పేర్కొంటారు. గాలిలో జరిగే ఈ పోటీలో ఎవరి గాలి పటం తెగితే ఆ అభ్యర్థి ఓడినట్లే. ఇలా తెగిన గాలి పటం గాలిలో తేలియాడుతూ నేలను చేరుకునే క్రమంలో ఆ ప్రాంతంలోని ఎవరికో ఒకరికి తగిలి, ప్రమాదం తెచ్చిపెడుతోంది. సాధారణంగా మెడ ప్రాంతంలో గాలిపటం దారం కోసుకుపోతుండడంతో ప్రాణాలు పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు.. గాలి పటం తెగడంతో కటక్ ప్రాంతంలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఐపీసీ 304–ఎ సెక్షన్ కింద జగత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయా సడక్, నంది సాహి ప్రాంతాల్లో పూరీ ఘాట్ ఠాణా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విచారకర సంఘటనతో నగర వ్యాప్తంగా ప్రత్యేక దాడులు చేపట్టినట్లు కటక్ నగర డీసీపీ ప్రతీక్ సింఘ్ తెలిపారు. గాలి పటాలు, మాంజా దారం విక్రేతలను పలుచోట్ల అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటుండడం విశేషం. ముఖ్యంగా మాంజా తయారీదారులను గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తారు. గాలి పటాల దుకాణాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతున్నట్లు డీసీపీ తెలిపారు. మాంజా దారాల విక్రయం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. పూరీ సంఘటనపై కేసు నమోదు భువనేశ్వర్/పూరీ: పూరీ బొడొదండొ ప్రాంతంలో జరిగిన గాలిపటం దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ–337, ఐపీసీ–338 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పూరీ కుంభార్‌పడా ఠాణా పోలీసులు తెలిపారు. -
ఇంటికి వచ్చి.. స్నానం కోసం వెళ్లి ఎంతసేపయినా రాలేదు..
భువనేశ్వర్/కటక్: మహానదిలో మునిగి, నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కటక్ నగరంలోని మహానది భడిములో తీరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులంతా కటక్ నయాబజార్ ప్రాంతంలోని పొటొపొఖొరి 8వ తరగతి విద్యార్థులు జొగ్గా బెహరా, ఆకాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టిగా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వీరు..స్నానం చేసేందుకు మహానదికి వెళ్లారు. ఎంతసేపు అయినా వీరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబాలు వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో నదీ తీరాన విద్యార్థుల సైకిళ్లు, బట్టలు ఉండడం చూసి, నదిలో స్నానం చేస్తూ గల్లంతైనట్లు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో విద్యార్థుల ఆచూకీ కోసం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. గురువారం రాత్రి నాటికి విద్యార్థుల్లో జొగ్గా బెహరా మృతదేహం లభించింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం జరిగిన గాలింపు చర్యల్లో మిగతా విద్యార్థులు కాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: దారుణం: భర్త రాక్షసత్వానికి ఇటీవల అబార్షన్.. ఇప్పుడు చీర కొనుక్కుందని ఏకంగా.. -
‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు
సాక్షి, భువనేశ్వర్/కటక్: ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందిన దివ్యాంగ యువకుని మృతదేహం మోటార్ సైకిల్‌పై తరలించారు. ఈ ఘటన కటక్ జిల్లాలోని బంకిడొంపొడా సమితిలో గురువారం చోటుచేసుకుంది. ఢంసర్ గ్రామానికి చెందిన సరోజ్ లెంకా(19) ఆరోగ్యం క్షీణించడంతో బంకిడొంపొడా సబ్‌డివిజనల్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స జరుగుతుండగా ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. చదవండి: బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్ అయితే ఇటువంటి మృతదేహాల తరలింపు కోసం ప్రభుత్వం మహా ప్రయాణం పేరిట వాహనాలను ఏర్పాటు చేసింది. కానీ యువకుని శవం స్వగ్రామం తరలించేందుకు అటువంటి వాహనం ఇక్కడ లేదని ఆస్పత్రి వర్గాలు బదులివ్వడంతో గత్యంతరం లేక బాధిత బంధువులు ఇలా మోటార్‌బైక్‌పై తరలించడం గమనార్హం చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ విజేత తెలంగాణ..
భువనేశ్వర్: కటక్‌లో జరిగిన జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 2–0తో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. ఈ జట్టులో ఎక్కువ మంది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన అమ్మాయిలే ఉన్నారు. విజేతగా నిలిచిన జట్టుకు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రొనాల్డ్ రోస్ అభినందించారు. చదవండి: SRH Vs DC: ఐదేళ్ల తర్వాత మళ్లీ డకౌట్.. -
వరకట్న వేధింపులు.. కటక్ ఎంపీపై కోడలు ఫిర్యాదు
భువనేశ్వర్: కటక్ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కి వ్యతిరేకంగా ఆయన కోడలు ఫిర్యాదు చేసింది. ఎంపీతో పాటు ఆయన భార్య మహాశ్వేతా దేవి, కుమారుడు లోక్‌రంజన్ మెహతాబ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నట్లు భోపాల్ మహిళా పోలీస్ ఠాణాలో గురువారం ఫిర్యాదు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీ కుటుంబ సభ్యులకు తాఖీదులు జారీ చేశారు. 2016 డిసెంబర్ 12న ఎంపీ కుమారుడు లోక్‌రంజన్ మెహతాబ్, భోపాల్‌కి చెందిన సాక్షితో వివాహం జరిగింది. వరకట్న వేధింపులు తాళలేక 2018లో సాక్షి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం న్యూఢిల్లీలోని ఇంట్లో ఉండేందుకు సాక్షిని అనుమతించాలని ప్రత్యర్థులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మెట్టినింటిలో ఉండేందుకు సాక్షి చేసిన ప్రయత్నాలు నిర్వీర్యం కావడంతో భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
Zomato Girl: ఆకలి చూపిన ఉపాధి
కటక్‌కు చెందిన బిష్టుప్రియ సీనియర్ ఇంటర్. క్లాసులు కట్టిపెట్టి తండ్రి బైక్‌ను ఎక్కి జొమాటో టీషర్ట్ వేసుకుంది. లాక్డౌన్లో రాత్రి పూట ఒంటరి రోడ్ల మీద ఫుడ్ డెలివరి ఇస్తూ కనిపిస్తుంది. ఆమెను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంటి ఆకలి తీర్చడానికి ఈ రిస్క్ ఉన్న పనిని సైతం ఎంచుకుంది కనుక. కటక్ ఓన్లీ జొమాటో గర్ల్ బిష్ణు డబ్బు, సంపాదన ఉన్నవారికి డబ్బు, సంపాదన వల్ల ఆకలి తీరకపోవడం మంచిదే. అంటే డబ్బు, సంపాదన ఉన్నా వేళకు వండుకోవాలి. లేదంటే బయటి భోజనం తినాలి. డబ్బు తిని ఉండలేరు కదా. ప్రపంచం అటుదిటు అయినా మనిషికి ఆకలి పోదు. ఈ కథలో ఒకరి ఆకలి ఇంకొకరి ఆకలిని తీర్చింది. ఆకలి ఉన్నవారు ఆహార పదార్థాలు ఇంటికి తెప్పించుకునే వీలున్న జొమాటో సర్వీస్ ఒక కుటుంబం ఆకలి తీర్చింది. అలా తీర్చేందుకు కష్టపడుతున్న అమ్మాయి బిష్ణుప్రియ ఈ కథకు కథానాయిక. కటక్ అమ్మాయి ఫస్ట్‌వేవ్ నుంచి బయటపడి ఎలాగోలా బతుకీడుస్తున్న బడుగు జీవుల మీద సెకండ్ వేవ్ వచ్చి పడింది. మళ్లీ లాక్డౌన్స్ తప్పలేదు. కటక్ శైలబాల విద్యాలయాలో సిబిఎస్ఇ 12వ తరగతి చదువుతున్న బిష్ణుప్రియ చదువులో బ్రైట్. ఇంటర్ అయ్యాక మెడిసిన్ చేయాలని కోరిక. తండ్రి టాక్సీ డ్రైవర్. కాని లాక్డౌన్ వల్ల అతని ఉద్యోగం పోయింది. ఇంట్లో మెల్లమెల్లగా ఆకలి మొదలయ్యింది. ‘నేను నా కాలేజీ ఫీజు కోసం ఇంటి దగ్గర రోజూ ట్యూషన్ చెప్పేదాన్ని. అయితే కరోనా భయంతో పిల్లలు రావడం మానేశారు. ఆ డబ్బు కూడా ఆగిపోయింది. ఏం చేయాలో తోచలేదు’ అంది బిష్ణుప్రియ. ఇంట్లో బిష్ణుప్రియే పెద్ద కూతురు. ఆమె తర్వాత ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ‘నాన్నకు వేరే ఏ పనీ రాదు. అమ్మ టైలరింగ్ చేస్తుంది కాని ఆ పని నడవడం లేదు. ఇక నేను నా చదువును కొంతకాలం పక్కనపెడదామని అనుకున్నాను’ అంటుంది బిష్ణుప్రియ. చదువుకుంటున్న బిష్ణుప్రియ జొమాటో ఉద్యోగి ‘ఈ లాక్డౌన్లో నేను ఏపని చేయగలను రోజూ ఏపని దొరుకుతుంది అని చూస్తే నాకు జొమాటో ఒక మార్గంగా కనిపించింది. కటక్‌లో వాళ్ల బ్రాంచీకి వెళ్లి ఉద్యోగం కావాలన్నాను. నాకు ఈ సంవత్సరమే 18 నిండాయి. వాళ్లు ఉద్యోగం ఇచ్చారు. నాన్న బైక్ నాకు నడపడం వచ్చు. వెంటనే పనిలో దిగాను’ అంటుంది బిష్ణు. అయితే కటక్‌లో ఇలా జొమాటోలో డెలివరీ కి పని చేస్తున్న ఆడపిల్లలు లేరు. బిష్ణు మొదటి అమ్మాయి. మామూలు రోజుల్లో డెలివరీ ఒక పద్ధతి. లాక్డౌన్ అంటే నిర్మానుష్య వీధుల్లో తిరగాలి. డెలివరీ కోసం రాత్రి వరకూ పని చేయాలి. ‘అయినా ఇప్పటివరకూ నాకు ఏ ఇబ్బందీ రాలేదు. పైగా నా పనిని చూసి నలుగురూ మెచ్చుకుంటున్నారు’ అంది బిష్ణు. ఆమెను చూసి తల్లిదండ్రులు కూడా ఆనందిస్తున్నారు. ‘మా అమ్మాయి చాలామందికి స్ఫూర్తినిస్తోంది. నాకు అదే సంతోషం’ అన్నాడు బిష్ణు తండ్రి. చెడు కాలం వచ్చినప్పుడు మనిషిలోని ఎదుర్కొనే శక్తులు బయటకి వస్తాయి. ఇలాంటి అమ్మాయిల శక్తి ఇప్పుడు దేశంలో చాలా కుటుంబాలను ఆదుకుంటోంది. చదవండి: జొమాటో సంచలనం.. నోయిడాలో అమల్లోకి.. చదవండి: కరోనా వ్యాప్తి.. స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్ -
గొడవపడి మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే..
భువనేశ్వర్/ కటక్: కటక్ ప్రాంతంలోని జోబ్రా తీరంలో మహానదిలో శుక్ర వారం దంపతులు దూకేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని మాపక దళం సంఘటనా స్థలానికి వచ్చి నదిలో గాలించి ఆ దంపతులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చి స్థానిక ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత నదిలో దూకిన భార్య స్వల్పంగా గాయపడింది. భార్యను కాపాడేందుకు భర్త వెంటనే మహానదిలో దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనకు ముందు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దంపతులు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియాల్సి ఉంది. చదవండి: ఘోరం.. కారులోనే ముగ్గురు సజీవదహనం చదవండి: ముగ్గురి ఊపిరి తీసిన మ్యాన్‌హోల్ -
ప్రేయసి ఫిర్యాదుతో ప్రియుడు అరెస్టు, కట్ చేస్తే..
భువనేశ్వర్: కోర్టు అనుమతితో ఓ ప్రేమజంట వివాహం జైలు ప్రాంగణంలో సంప్రదాయ రీతిలో శుక్రవారం జరిగింది. దీంతో ఖైదీ నృసింహ దాస్, ప్రియురాలు పూజాదాస్ ఒక్కటయ్యారు. వారి పెళ్లికి జైలు డీఐజీ కులమణి బెహరా, జైలర్ అవినాష్ బెహరా, ఉద్ధార్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాజరై ఆశీర్వదించారు. కటక్ జిల్లా చౌద్వార్ మండల కారాగారంలో హిందూ సంప్రదాయంతో జరిగిన వివాహం అనంతరం ఖైదీ నృసింహ దాస్ కారాగారానికి, పెళ్లి కూతురు మెట్టినింటికి వెళ్లారు. వివరాలు... కటక్ జిల్లా సదర్ స్టేషన్ సొంఖొతొరాస్ గ్రామానికి చెందిన నృసింహదాస్, పూజాదాస్లు ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారానికి పూజాదాస్ తల్లిదండ్రులు అంగీకరించినప్పటికీ నృసింహ దాస్ తల్లిదండ్రులు నిరాకరించారు. నృసింహదాస్‌కు మరో అమ్మాయితో వివాహం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ప్రేమికురాలు పూజాదాస్ ఫిర్యాదు మేరకు 2019వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ప్రేమికుడు నృసింహదాస్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నృసింహదాస్ కటకటాలపాలై అప్పటినుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దిగివచ్చిన ప్రేమికుడి కుటుంబసభ్యులు ఇటీవల నృసింహ దాస్ కుటుంబీకులు తమ కుమారుడి పెళ్లి పూజాదాస్‌తో చేసేందుకు అంగీకరించి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆమె కుటుంసభ్యులను సంప్రదించారు. ఇరు కుటుంబాల అభిప్రాయాన్ని గ్రామ పెద్దలు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించిన కోర్టు జైలు ప్రాంగణంలో ప్రేమికుల వివాహం జరిపించేందుకు అనుమతించింది. ఉద్ధార్ ఫౌండేషన్ ఈ వివాహానికి ఏర్పాట్లు చేసింది. తదుపరి విచారణలో ఖైదీ నృసింహ దాస్‌ను న్యాయస్థానం విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. -
నేడు... రేపటిని చెక్కే ఉలి
‘నీ లక్ష్యాలను, గమ్యాన్ని నిర్ణయించాల్సింది సమాజం కాదు, నువ్వే’ అమ్మ ఈ మాట చెప్పిన క్షణం నుంచి నాకు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. నేను సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో పూర్తి మార్పు వచ్చింది’... ప్రఖ్యాత ఒడిషా శాస్త్రీయ నాట్యకారుడు ప్రేమ్ సాహు చెప్పిన మాట ఇది. అలాగే ‘నిన్నటి రోజున నువ్వు నీ రోజును ఎలా గడిపావో గుర్తు చేసుకో. ఈ రోజు అంతకంటే మెరుగ్గా గడవాలి. ఈ రోజు రేపటి రోజును మరింత మెరుగు పరచాలి. అంటే జరిగి పోయిన రోజు... జరగబోయే రోజును చెక్కే ఉలి కావాలి’ అని చెప్పింది ప్రేమ్సాహు వాళ్ల అమ్మ మంజులత. అబ్బాయేనా! ఒడిశా రాష్ట్రం, కటక్ నగరంలో పుట్టిన ప్రేమ్సాహుకి నాట్యసాధన ఇష్టం. అతడికి నాట్యం నేర్పించడం అతడి తల్లికి ఇష్టం. ముప్పై ఏళ్ల కిందటి కటక్ సమాజానికి మాత్రం ఇష్టం లేదు. ప్రేమ్ నాట్యసాధన చేస్తే నవ్వేవారు. నాట్యముద్రల్లో అతడి వేళ్లు సున్నితంగా ఒదిగిపోయేవి. ‘అబ్బాయి లక్షణాలేమైనా ఉన్నాయా’ అని ముఖం మీదనే నవ్వేవారు. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శన కోసం ఉత్సాహంగా పేరిచ్చే వాడతడు. ప్రాక్టీస్‌కి వెళ్లడానికి క్లాసు టీచర్ని అనుమతి అడిగినప్పుడు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తి నోటి వెంట రాకూడని ఎగతాళి మాటలు వచ్చేవి. టీచర్ల వ్యంగ్యం చాలు తోటి పిల్లలు ప్రేమ్‌ని ఏడిపించడానికి. ప్రేమ్ గురించి మాట్లాడాలంటే అతడి జెండర్ గురించిన మాటలు తప్ప మరేవీ పట్టని సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడుకుకు ధైర్యం చెప్పింది మంజులత. గెలిపించే తెగింపు ఇదిలా ఉండగా ఓ రోజు... ప్రదర్శన తర్వాత మేకప్ గదిలో ఒక సీనియర్ నటుడు ప్రేమ్‌కు దగ్గరగా వచ్చి తాకాడు, ఆ తాకడంలో ఏదో తేడా ఉందని గ్రహించేలోపు అతడు పద్నాలుగేళ్ల ప్రేమ్‌ని గట్టిగా పట్టుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ మూల దాక్కుని వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతులేని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఉరి మెడకు వేసుకునేలోపే... తల్లి ఎప్పుడూ చెప్పే ధైర్య వచనాలు గుర్తు వచ్చాయతడికి. జీవించి చూపించాలనే మొండిధైర్యం అయితే వచ్చింది. కానీ నలుగురిలో కలవడానికి బిడియపడేవాడు. రోజంతా గదిలోనే ఉంటూ గంటల కొద్దీ నాట్యసాధన చేసేవాడు. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఢిల్లీలోని సాహిత్య కళాపరిషత్‌లో స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధవీ ముద్గల్ దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నాడు. హేతుబద్ధమైన విమర్శను స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకోవడం, అసూయతో కూడిన అర్థరహితమైన విమర్శలను మనసుకు పట్టనివ్వకపోవడం కూడా నేర్చుకున్నాడు ప్రేమ్ సాహు. అతడు సాధించిన పరిణతి లండన్‌లోని ఒడిశా సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ ఫెస్టివల్ నిర్వహించిన వేడుకల్లో ప్రేమ్ ఇచ్చిన నాట్యప్రదర్శనలో వ్యక్తమైంది. ఆ ప్రదర్శన పూర్తయిన వెంటనే ఒక వృద్ధ మహిళ వేదిక మీదకొచ్చి ‘మనోహరమైన, మనసు పెట్టి చేసిన నీ నాట్యం చూస్తుంటే నాకు ఏడుపాగలేదు’ అని కన్నీళ్లు తుడుచుకుంది. నాట్యకారులకు ఇంతకంటే గొప్ప ప్రశంస మరొకటి ఉండదని చెప్పాడు ప్రేమ్ సాహు. తనను ఈ స్థాయిలో నిలబెట్టింది తన తల్లి అలవరచిన గుండె ధైర్యమేనని చెప్పాడు. ఆమె సింహం లాంటి «గుండెదిటవు కలిగిన మనిషి అని తల్లిని ప్రశంసించాడు ప్రేమ్ సాహు. తల్లితో ప్రేమ్సాహు ప్రేమ్సాహు -
తన మేకను కుక్క కరిచిందని, 40 కుక్కలను..
భువనేశ్వర్ : ఓ వీధి కుక్క తన మేకను కరిచిందని కుక్కలన్నింటిపైనా కక్ష కట్టాడో వ్యక్తి. ఊర్లో ఉన్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి వాటిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని చౌదార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ జిల్లాలోని మహంగలో బ్రహ్మానంద మాలిక్ అనే వ్యక్తి పెంచుకుంటున్న మేకను ఓ రోజు వీధి కుక్క కరిచింది. దానికి గాయమవడంతో అతడు కుక్క జాతిపైనే పగ పట్టాడు. ఊరిలోని కుక్కలన్నింటి ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నాడు. దీనికి భరత్ మాలిక్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. అతనితో కలిసి కుక్కలకు ఎంతో ఇష్టమైన మాంసం తీసుకొచ్చి వాటిలో విషపు గుళికలు కలిపాడు. (మంచాన పడ్డ తల్లిని బ్యాంకుకు లాక్కెళ్తూ..) అనంతరం ఆ విషపు ఆహారాన్ని శునకాలకు ఎరగా వేశాడు. దీంతో దాన్ని తిన్న 40 కుక్కలు రోడ్డుపై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "కళ్లముందే కుక్కలు బాధతో గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోవడం చూడలేకపోయాం. ఇది మా హృదయాలను కలిచి వేసింది" అని ఓ గ్రామస్థుడు తెలిపాడు. ఈ విషయం గురించి ఆ ఊరి సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు సమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఈ ఘటన సరిగ్గా ఏ రోజు జరిగిందనేది తెలియరాలేదు. (పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు) -
ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..
కటక్ : కాలం ఎంత అభివృద్ది చెందుతున్న కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూడ నమ్మకాలనే బలంగా నమ్ముతున్నారనడానికి ఈ వార్త ఉదాహరణగా చెప్పవచ్చు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఈ యుగంలో ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రాణత్యాగం చేస్తే కరోనా పారిపోతుందంటూ ఒక పూజారి నిండు మనిషి ప్రాణం తీసేశాడు. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి ఒడిశాలోని కటక్‌లో చోటుచేసుకుంది.(నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) వివరాలు.. కటక్ జిల్లా బందాహుదా గ్రామానికి చెందిన సన్సారి ఓజా( 72) బందా మా బుద్ద బ్రాహ్మణి దేయి గుడిలో పూజారీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరోజ్ కుమార్ ప్రధాన్(52) పూజ చేసేందుకు ఆలయంలోకి వచ్చాడు. పూజ నిర్వహించిన అనంతరం ప్రధాన్ ఓజాను పలకరించాడు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేస్తే దేవుడు కరుణించి కరోనాను మాయం చేస్తానని దేవుడే స్వయంగా కలలో వచ్చి తనకు చెప్పాడంటూ సన్సాన్ ఓజా ప్రధాన్‌తో పేర్కొన్నాడు. టెక్నాలజీ ఇంత పెరుగుతున్న సమయంలో ఇంకా ఇలాంటి మూడ నమ్మకాలెందుకంటూ ప్రధాన్ తెలిపాడు. దీంతో ఇరువరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఓజా తనకే దేవుడే స్వయంగా వచ్చి చెప్పాడంటూ అప్పటికే సిద్ధం చేసుకున్న గొడ్డలితో ప్రధాన్ తలపై బలంగా బాధడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు ఓజారు అదుపులోకి తీసుకొని ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రధాన్‌ను హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని ఫోరెన్సిక్ రిపోర్టుకోసం సీజ్ చేసి ఓజాపై కేసు నమోదు చేశారు.(అద్దె చెల్లించలేదని దంపతుల్ని కాల్చిచంపాడు) ఇదే విషయమై సెంట్రల్ రేంజ్ డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ' ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తోన్న సన్సారి ఓజా మూడ నమ్మకాలను బలంగా నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే దేవుడే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రధాన్‌ను హత్య చేశాడు. అయితే హత్య చేపే సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని మామిడిచెట్టు పైకి ఎక్కించి రాత్రంతా పక్కనే కూర్చున్నాడు. కొంతకాలంగా ఓజా మనసిక పరిస్థితి సరిగా లేదని, ఇంతకుముందు కూడా తనకు దేవుడు కనిపించేవాడంటూ చెప్పేవాడని స్థానికులు పేర్కొన్నారు. కాగా గురువారం ఉదయం మత్తు దిగాక ఓజా చెట్టు మీద నుంచి దిగి తానే ఈ హత్య చేసినట్లు ఓజా పోలీసులకు లొంగిపోయాడు. మనిషి ప్రాణం త్యాగం చేస్తే కరోనా పారిపోతుందనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ను హత్య చేశాడంటూ' తెలిపారు. -
సహచరులతో ఎంజాయ్ చేస్తున్న కోహ్లి
కటక్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన సహచరులతో కలిసి కటక్ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డే ఆదివారం కటక్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు రోజులు విశ్రాంతి దొరికింది. శుక్రవారం ఇరు జట్లకు ప్రాక్టీస్ సెషన్ లేకపోవడంతో కోహ్లి తన సహచరులతో కలిసి చిల్ అయిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశాడు.' ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ లేకపోవడంతో నా సహచరులకు ఒత్తిడి లేకుండా ఉండేందుకు అందరం కలిసి బయటికి వచ్చాం. ఈ మధ్యాహ్నం సహచరులతో కలిసి ఆనందంగా ఆస్వాదిస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఈ ఫోటోలో కోహ్లితో పాటు కేఎల్ రాహుల్, రిషబ్‌పంత్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, యజువేంద్ర చాహల్‌లు ఉన్నారు. చెన్నైలో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్లతో విండీస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే విశాఖలో జరిగిన రెండో వన్డేలో రోహిత్, రాహుల్ శతకాలకు తోడు అయ్యర్, పంత్‌ల మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో 387 పరుగులు చేసింది. ఆపై విండీస్‌ను 280 పరుగులకు ఆలౌట్ చేసి లెక్కను సరిచేసింది. ఇదే మ్యాచ్‌లో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా కీలకంగా మారిన మూడో వన్డేలో విజయం సాధించి 2019కి గుడ్‌బై చెప్పాలని టీమిండియా భావిస్తోంది. A day off and an afternoon with the boys is exactly what we needed 😃🤙 pic.twitter.com/6K3KLW63iJ — Virat Kohli (@imVkohli) December 20, 2019 -
ఒడిశాలో ఘోర ప్రమాదం
-
ఒడిశాలో ఘోర ప్రమాదం
భువనేశ్వర్/కటక్: ఒడిశా రాష్ట్రం కటక్‌లోని మహానది వంతెన పైనుంచి మంగళవారం సాయంత్రం బస్సు బోల్తాపడిన ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డీజీపీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శర్మ తెలిపిన వివరాల మేరకు..అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ నగరానికి వస్తున్న జగన్నాథ్ అనే ప్రైవేట్ బస్సు కటక్‌లోని మహానది వంతెనపై వస్తున్న దున్నపోతును తప్పించే క్రమంలో దాన్ని ఢీకొని..అనంతరం 30 అడుగుల పైనుంచి నది పక్కకు పడిపోయింది. ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, దున్నపోతు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పోలీసు, అగ్నిమాపకదళం, విపత్తు స్పందనదళం (ఒడ్రాఫ్) జవాన్లు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల్ని ఆదుకోవడంలో తలమునకలయ్యారు. చీకటి పడడంతో సహాయ, పునరుద్ధరణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. బాధితుల వివరాల కోసం 6712304001లో సంప్రదించాలని డీజీపీ తెలిపారు. -
పట్టాలు తప్పిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
కటక్: సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ గార్డ్ బోగీ పట్టాలు తప్పింది. ఈ ఘటన ఒడిశాలోని కటక్ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో రైలును వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానట్టుగా తెలుస్తోంది. గార్డ్ బోగీ కాకుండా ఇతర బోగీలు పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు. -
దారుణానికి ఒడిగట్టింది ఓ లెక్చరర్..
కటక్, ఒడిశా : వివాహ బహుమతిలో బాంబు పెట్టి వరుడి ప్రాణాలను బలిగొన్న కేసులో ఒడిశా పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న బొలన్‌గిరిలో సౌమ్య శేఖర్ సాహూకి రీమా అనే యువతితో వివాహం జరిగింది. వరుడు శేఖర్ సాహూ తల్లి సంజుక్త స్థానిక జ్యోతి బికాశ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. కుమారుడి వివాహానికి కొద్దిరోజుల ముందు ఆమెకు ప్రమోషన్ లభించడంతో ప్రిన్సిపాల్ అయ్యారు. దీన్ని ఓర్వలేని ఆమె సహోధ్యాపకుడు పున్‌జీలాల్ మెహర్ ఎలాగైనా సంజుక్త కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకున్నారు. ఈ లోగా తనయుడి వివాహానికి సంజుక్త.. మెహర్‌ను కూడా ఆహ్వానించారు. ఇదే అదునుగా తీసుకున్న మెహర్ వివాహం జరిగిన ఐదో రోజున నవ దంపతులకు బహుమతిని పంపారు. అందులో బాంబు ఉందని తెలీని శేఖర్ సాహూ తన నానమ్మతో కలసి తెరిచాడు. దీంతో బాంబు విస్ఫోటనం చెందడంతో ఇరువురు తీవ్రగాయాలపాలయ్యారు. వారికి చేరువలో ఉన్న వధువు రీమాకు కూడా గాయాలు అయ్యాయి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరుడు, అతడి నాయనమ్మ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. వధువు శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు మెహర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతునట్లు పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఫిల్మ్ స్టార్స్!
సాక్షి, భువనేశ్వర్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నటి అపరాజిత మహంతీ తన భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, మరికొందరు పార్టీ సీనియర్ల సమక్షంలో ఒడిషా నటి బీజేపీలో చేరారు. రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన సమావేశంలో అపరాజిత బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని, మోదీ హాయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె ఆకాంక్షించారు. మోదీ పాలనలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు తనను బీజేపీ చేరేందుకు ఆకర్షించాయని నటి అపరాజిత మహంతీ తెలిపారు. అపరాజిత చేరికతో బీజేపీ మరింత బలోపేతం అయిందన్నారు. బిజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అరపున అపరాజిత ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెప్పారు. అపరాజితతో పాటుగా మరికొందరు ఒడిషా ఫిల్మ్ స్టార్లు మిహిర్ దాస్, అను చౌదరి, మహస్వేతా రేలు కాషాయ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. ఈ నటీనటులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసి బీజేపీకి విజయం అందిస్తారని రాష్ట్ర పార్టీ అధిష్టానం భావిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన నటి ఈ నెల 13న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కటక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన ఆమె బీజేడీ అభ్యర్థి భర్తృహరి మహతాబ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
అధ్యాపకులపై లైంగిక వేధింపుల కేసులు
కటక్ : వైద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని లైంగికంగా వేధించిన ముగ్గురు అధ్యాపకులపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు చెబుతున్న మేరకు వివరాల మేరకు.. ఒడిశాలోని ఎస్జీబీ మెడికల్ కాలేజ్‌లో జార్ఖండ్‌కు చెందిన ఒక అమ్మాయి రెండో ఏడాది వైద్య విద్యను అభ్యసిస్తోంది. తమకు పడక సుఖాన్ని అందిస్తే.. పరీక్షల్లో మంచి మార్కులు వేస్తామని.. అసోసియేట్ ప్రొఫెసర్, డెంటల్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి, మరో వ్యక్తి విద్యార్థిని కొంత కాలంగా లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై ఐపీసీ 354, ఐపీసీ 354ఏ, ఐపీసీ 294, ఐపీసీ 323 కేసులు నమోదు చేసినట్లు ఆయన పోలీసులు ప్రకటించారు. నిందుతులను త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని కటక్ పోలీసులు ప్రకటించారు. -
ఇక హెల్మెట్ లేదో పెట్రోల్ బందే
కటక్: రోడ్డు రవాణ భద్రతా చర్యల్లో భాగంగా ఒడిశాలోని కటక్ పోలీసులు ఒక కొత్తకార్యక్రమానికి తెరతీశారు. ఇక హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు స్ట్రిట్ ఆదేశాలు జారీ చేయనున్నారు. జూలై 1 నుంచి ఈ నిబంధన అమలుకానుంది. దీంతో ఇక హెల్మెట్ లేకుండా బైక్ నడపాలన్నా సాధ్యం కాదన్నమాట. అయితే, ఇందుకోసం ముందుగానే ఈ నెల 20 నుంచి ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించనున్నారు. 'అన్ని పెట్రోల్ బంక్‌లకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, పూజా కమిటీలకు వారి సహాయాన్ని అందించాలని లేఖలు రాస్తున్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతం చేయాలని లేఖలో కోరుతున్నాం' అని కటక్ డీసీపీ సంజీవ్ అరోరా చెప్పారు. అయితే, పెట్రోల్ బంక్ యజమానులు ఇప్పటికే తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. తమ ప్రత్యేక బృందాలు కూడా బంక్ ల పనితీరుపై ఓ కన్నేసి ఉంచుతాయని చెప్పారు. ప్రజల ప్రాణాల రక్షణే తమ ప్రథమ కర్తవ్యంగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
వీళ్లతో గెలుస్తామా..?
అశ్విన్ మినహా బౌలర్లంతా పేలవం టి20 ప్రపంచ కప్ ముంగిట ఇబ్బంది ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భారత్ ఒక్క బౌలర్‌తోనే ఆడుతోంది..! అతిశయోక్తిలా అనిపించినా వాస్తవం ఇలాగే ఉంది. ఒక్క అశ్విన్‌ను మినహాయిస్తే మిగిలిన నలుగురు బౌలర్లూ దారుణంగా తేలిపోయారు. వీళ్లకంటే స్కూల్ పిల్లలు నయమనే తరహాలో బౌలింగ్ చేస్తూ... టి20 ఫార్మాట్లో మన బౌలింగ్ స్థాయి ఎక్కడుందో చూపించారు. ఆరు నెలల్లో స్వదేశంలోనే టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ బౌలింగ్ లైనప్‌తో ఎలా గెలుస్తారనేదే ప్రశ్న. సాక్షి క్రీడా విభాగం కటక్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 20 ఏళ్ల దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కాగిసో రబడ 140 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ... అడపా దడపా 150 కి.మీ.ని దాటి బంతులు విసిరాడు. ఇక బౌన్స్ ఉన్న ధర్మశాలలో అయితే అతని బంతులను అందుకునేందుకు కీపర్ డివిలి యర్స్ చాలా సార్లు ఆకాశాన్ని అందుకోవాలా అన్నట్లుగా ఎగరాల్సి వచ్చింది. పలు సార్లు చక్కటి బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన రబడ అంపైర్ హెచ్చరికకు కూడా గురయ్యాడు. అదే మన పేసర్లు భువనేశ్వర్, మోహిత్, అరవింద్ కలిసి ఒక్కటంటే ఒక్క బౌన్సర్ కూడా వేసింది లేదు! ఆశ్చర్యమే అనిపిస్తున్నా మనోళ్ల పేస్ అంటే నేతి బీరకాయలో నేయి చందమే. కచ్చితంగా వికెట్ దక్కాల్సిన అవసరం లేదు కానీ.... 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఇలాంటి పరుగు రాని బంతుల విలువ ఎక్కువే ఉంటుంది. పైగా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో నెట్టేందుకు ఇవి చాలు. స్టార్ బౌలర్లు స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్ లేకుండా దక్షిణాఫ్రికా ద్వితీయ శ్రేణి పేసర్లు కూడా ప్రభావం చూపిస్తున్న చోట మనోళ్లు తేలిపోతున్నారు. ఉమేశ్ పనికి రాడా..?‘మా ఫాస్ట్ బౌలర్లపై విశ్వాసం కోల్పోలేదు. సిరీస్ జరుగుతున్న పిచ్‌లను బట్టి జట్టును ఎంపిక చేశాం. ఇషాంత్ పేరు కూడా చర్చించాం. అతడు టెస్టులకే పరిమితం కాదు’... టి20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వ్యాఖ్య ఇది. అయితే ఈ లాజిక్‌లో అర్థం లేకపోవడంతో పాటు గందరగోళం కూడా కనిపిస్తోంది. సాధారణంగా అందుబాటులో ఉన్న (ఫిట్నెస్ సమస్యలు లేకుండా) అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలనేది ప్రాథమిక సూత్రం. అయితే ఈ సిరీస్‌లో ఉన్న భువీ, మోహిత్, అరవింద్ ఒకే తరహాలో బౌలింగ్ చేసే సాధారణ మీడియం పేసర్లు. ఎక్కువగా స్వింగ్‌పై ఆధారపడేవారే. తమ వేగంతో ఫలితం రాబట్టగల సామర్థ్యం వీరిలో లేదు. అలాంటప్పుడు ఒక ఫుల్‌లెంగ్త్ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉండాలి. ఉమేశ్ చాలా కాలంగా జట్టులో రెగ్యులర్ సభ్యుడు. వరల్డ్ కప్‌లో చాలా బాగా రాణించాడు. దీనికి ముందు శ్రీలంక సిరీస్‌లోనూ జట్టులో ఉన్నాడు. టి20 స్పెషలిస్ట్‌లు అని పేరు లేకపోయినా... ఇషాంత్, ఆరోన్ తమ వేగంతో బౌలింగ్‌కు వైవిధ్యం తీసుకు రాగలరు. వీరిని ఎందుకు పక్కన పెట్టారో కూడా కనీస కారణం సెలక్టర్లు చెప్పలేకపోయారు. స్పిన్నర్లు ఎక్కడ? మన దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు అంటూ అధ్యక్షుడిగా వచ్చీ రాగానే శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించడం ఒక రకంగా అవమానకర విషయం. జడేజాకు ప్రత్యామ్నాయం అంటూ తీసుకొచ్చిన అక్షర్ పటేల్ సాధారణంగా కనిపిస్తున్నాడు. ‘స్పిన్‌లో వైవిధ్యం చూపించని అక్షర్ అతి సాధారణ బౌలర్. సులువుగా అతడి బంతులను బ్యాట్స్‌మెన్ అంచనా వేయవచ్చు. అంతర్జాతీయ బౌలర్‌గా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’ అని గవాస్కర్ విమర్శించడం పరిస్థితిని సూచిస్తోంది. బహుశా దీని వల్లే డుమిని తొలి టి20లో వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగి మ్యాచ్ దిశను మార్చాడు. సోమవారం మ్యాచ్‌లో అక్షర్‌ను పక్కన పెట్టి రైనాతో పూర్తి కోటా వేయించడం చూస్తే రెగ్యులర్ స్పిన్నర్ల స్థితి అర్థమవుతుంది. గత రెండేళ్లుగా అశ్విన్ ఎంతో ఎదిగిపోగా... రెండో స్పిన్నర్‌గా ఎవరూ ప్రభావం చూపడం లేదు. కెరీర్ చివర్లో ఉన్న హర్భజన్ వరల్డ్ కప్ వరకు జట్టులో ఉంటాడో లేదో కూడా తెలీదు. మిశ్రా, కరణ్ శర్మలకు పూర్తి స్థాయి అవకాశాలే రాలేదు. పరీక్ష ఎప్పటి వరకు ప్రపంచకప్‌లోగా టి20 మ్యాచ్‌ల్లో ఫలితాలకంటే అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించడం, అందరికీ అవకాశం ఇవ్వడం ముఖ్యమని కెప్టెన్ ధోని చెబుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత భారత్ ఆస్ట్రేలియా వెళ్లి 5 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. అక్కడ టి20లు ఆడటం భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు పెద్దగా పనికి రాకపోవచ్చు. కానీ ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీల తరఫున చెలరేగే బౌలర్లు... అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం తేలిపోతున్నారు. మోహిత్, భువీ, అక్షర్... ఎవరైనా అంతే. పరిస్థితి చూస్తే అరవింద్ కెరీర్ ఒక్క మ్యాచ్‌కే ముగిసిపోతుందేమోఅనిపిస్తుంది. అలాంటప్పుడు వరల్డ్ కప్‌లోగా ఎంత మందిని పరీక్షిస్తారు, చివరకు ఎలాంటి జట్టుతో సిద్ధమవుతారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న బృందంతో మాత్రం భారత్ మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టం. -
'కటక్‌కు రెండేళ్లు మ్యాచ్‌లు కేటాయించరాదు'
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా రెండో టి-20 మ్యాచ్ సందర్భంగా కటక్ స్టేడియంలో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి రభస చేయడంపై టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. కటక్ బారాబతి స్టేడియంలో రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధం విధించాలని గవాస్కర్ సూచించాడు. సోమవారం కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ 92 పరుగులకు ఆలౌటయిన తర్వాత ప్రేక్షకులు వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరి ఆటకు అంతరాయం కలిగించారు. ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనను గవాస్కర్ తప్పుపట్టాడు. ఈ ఘటనకు పోలీసులదే బాధ్యతని అన్నాడు. కటక్‌కు మరో రెండేళ్ల అంతర్జాతీయ మ్యాచ్ కేటాయించకపోవడంతో పాటు ఒడిశా క్రికెట్ సంఘానికి సబ్సిడీలు ఆపేయాలని గవాస్కర్ సూచించారు. -
శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం
కటక్: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 169 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. టీమిండియా విసిరిన 364 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో లంకేయులు చతికిలబడ్డారు.ఆదిలోనే శ్రీలంకకు దిల్షాన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దిల్షాన్(18) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరగా, మిడిల్ ఆర్డర్ ఆటగాడు కుమార సంగక్కరా(13) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అనంతరం మరో ఓపెనర్ ఉపల్ తరంగ(28) పరుగులు చేసి నిష్క్రమించడంతో శ్రీలంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. తరువాత జయవర్ధనే(43), మాథ్యూస్ (23), పెరీరా (29) పరుగులు మాత్రమే చేయడంతో లంకేయులు 39. 2 ఓవర్లలో 194 పరుగులకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు లభించగా,ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ కు తలో రెండో వికెట్లు దక్కాయి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ కు భారీ పరుగులతో ఆకట్టుకుంది. -
కటక్ వన్డే.. కష్టాల్లో లంక
కటక్: కటక్ వన్డేలో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లం 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. దిల్షాన్ (18) , సంగక్కర (13), తరంగ (28), ప్రసన్న (5), మహేల జయవర్ధనె (43) అవుటయ్యారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ రెండు, ఇషాంత్, ఉమేష్, అశ్విన్ తలా వికెట్ తీశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ లంకేయులను కట్టడి చేస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లంకేయులు గెలవడం కష్టం. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు. -
కటక్ వన్డే.. భారత్ స్కోరు 363/5
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా 364 పరుగుల లక్ష్యాన్ని లంకకు నిర్దేశించింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు. -
మొదటి వన్డేలో జోరుమీదున్న భారత్
-
రహానె, ధవన్లు సెంచరీలు
కటక్: కటక్ వన్డేలో భారత్ ఓపెనర్లు రహానె, ధవన్ సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. ఆదివారం శ్రీలంకతో జరుగుతున్న తొలివన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 231 పరుగులు చేసింది. రహానె (109), ధవన్ (113) జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీ చేసిన అనంతరం ధవన్ ప్రియంజన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రహానెకు తోడుగా రైనా బ్యాటింగ్‌కు దిగాడు. -
రహానె, ధవన్లు హాఫ్ సెంచరీలు
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 23 ఓవర్లలో 124 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రహానె (54), ధవన్ (63) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించారు. భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు. -
నిలకడగా ఆడుతున్న భారత్
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రహానె, ధవన్ జట్టుకు శుభారంభం అందించారు. 15 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు. -
బ్యాటింగ్ కు దిగిన భారత్
కటక్: భారత్ తో ఆదివారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగింది.అజింక్ రహానే, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చారు. భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు. -
13 వ తేదీ వరకూ ఆ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకండి!
కటక్: ఒడిశా రాష్ట్ర బీజేడీ(బిజూ జనతాదళ్) ఎమ్మెల్యేకు హైకోర్టులో ఉపశమనం లభించింది. పొంజీ స్కీం స్కాంకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నబీజేడీ ఎమ్మెల్యే ప్రవాత్ త్రిపాఠీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టింది. అంతే కాకుండా అక్టోబర్ 13 వ తేదీ వరకూ అతన్ని అదుపులోకి తీసుకోవద్దని కోర్టు సీబీఐకి సూచించింది. పొంజీ స్కీం స్కాం కేసులో ఎమ్మెల్యే త్రిపాఠీని సీబీఐ విచారించడంతో ఆయన ఈ పిటీషన్ దాఖలు చేశారు. గత నెల్లో త్రిపాఠీ ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు అతన్ని ప్రశ్నించారు. దీంతో త్రిపాఠీ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అధికార పార్టీ తనను ఇబ్బందే పెట్టేందుకు యత్నిస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. దీన్ని సోమవారం విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. అతని దరఖాస్తును పెండింగ్ లో పెట్టింది. ఈ నెల 13 వ తేదీ వరకూ సీబీఐ ఎటువంటి అరెస్టు చేయకూడదంటూ జడ్జి డి. దాస్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 15 వ తేదీన కాందామాల్ లోక్ సభ సీటుకు ఎన్నిక జరుగనుంది. -
కిడ్నీల వ్యాపారంలో కొత్తకోణం!!
కిడ్నీ రాకెట్ రోజుకో కొత్త కథను వెలుగులోకి తెస్తోంది. ఇంతకుముందు మన రాష్ట్రం నుంచి శ్రీలంక తీసుకెళ్లి కిడ్నీలు అమ్ముకున్న విషయాలు వెలుగులోకి రాగా, తాజాగా ఒడిషాలోని కటక్‌లో కూడా ఈ దందా జరగుతున్నట్లు తెలియవచ్చింది. ఇందులోనూ మన రాష్ట్ర ప్రమేయం ఉంది. తన వద్ద నుంచి కిడ్నీ తీసుకున్న మధ్యవర్తులు.. తనను మోసం చేశారని, వాళ్లు తనకు ముందుగా చెప్పినంత మొత్తం ఇవ్వలేదంటూ ఓ మహిళ కటక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును తాము పరిశీలించామని, ఇందులో నేరానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. ఆమెకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మధ్యవర్తులు ఆమెవద్ద నుంచి కిడ్నీ తీసుకున్నారని, కానీ చివరకు కేవలం 45 వేలు మాత్రమే చేతిలో పెట్టి పంపేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ తీసినట్లు పోలీసులు చెప్పారు. మధ్యవర్తులు దీన్ని అవయవదానంగా పేర్కొంటూ నకిలీ పత్రాలు సృష్టించారని, బాధితుడి భార్య స్థానంలో ఈమెను చూపించి.. ఈమెవద్ద నుంచి కిడ్నీ తీసుకున్నారని వివరించారు. మొత్తం కేసును తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, కిడ్నీ దాతకు.. ఈమెకు అసలు ఏమైనా సంబంధం ఉందా లేదా అని కూడా చూస్తున్నామని కటక్ నగర పోలీసు కమిషనర్ ఆర్పి శర్మ తెలిపారు. -
ఆకాశమే హద్దుగా...
మళ్లీ చెలరేగిన మ్యాక్స్‌వెల్ బెయిలీ మెరుపు ఇన్నింగ్స్ చెన్నైపై పంజాబ్ ఘన విజయం డు ప్లెసిస్ శ్రమ వృథా మ్యాక్స్‌వెల్ 38 బంతుల్లో 90 6 ఫోర్లు, 8 సిక్స్‌లు మ్యాక్స్‌వెల్ సునామీకి... బెయిలీ తుపాన్‌కు మధ్య మిల్లర్ మెరుపులు మెరిపించడంతో బారాబతి స్టేడియం పరుగుల వర్షంతో తడిసి ముద్దయింది. ఈ ముగ్గుర్ని అడ్డుకోలేక చెన్నై బౌలర్లు చేష్టలుడిగిపోతే... భారీ లక్ష్యం ముందు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా ఐపీఎల్లో పంజాబ్ ఆరో విజయాన్ని నమోదు చేసింది. కటక్: ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను చూస్తే మిగతా జట్లకు ముచ్చెమటలు పడతాయి. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లకూ జట్టులో కొదువలేదు. అలాంటి ధోనిగ్యాంగ్కు పంజాబ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 90; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) వెన్నులో వణుకు పుట్టించాడు. తనకే సాధ్యమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. ఫలితంగా బారాబతి స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 44 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. ధోనిసేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఐపీఎల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. మ్యాక్స్‌వెల్‌తో పాటు బెయిలీ (13 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్లర్ (32 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సెహ్వాగ్ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. మోహిత్ 2, హిల్ఫెన్హాస్, స్మిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (25 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్సర్), బి. మెకల్లమ్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), రైనా (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (20 బంతుల్లో 23; 1 సిక్సర్) పోరాడారు. జాన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పరుగుల వరద పంజాబ్ ఇన్నింగ్స్‌లో తొలి బంతినే బౌండరీకి తరలించిన సెహ్వాగ్ తన మునుపటి ఆటతీరును ప్రదర్శించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో రెచ్చిపోయాడు. కానీ ఆరు బంతుల వ్యవధిలో మన్దీప్ (3), వీరూ అవుటయ్యారు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్ రెండు వికెట్లకు 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదట మ్యాక్స్‌వెల్, మిల్లర్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఏడు నుంచి 10వ ఓవర్ వరకు కేవలం 31 పరుగులు మాత్రమే వచ్చాయి. అప్పటికి మ్యాక్స్‌వెల్ స్కోరు 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే. 11వ ఓవర్ నుంచి మ్యాక్స్‌వెల్ విశ్వరూపం మొదలైంది. అశ్విన్ వేసిన రెండు ఓవర్లలో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. తర్వాత జడేజా రెండు ఓవర్లలో ఒక ఫోర్ మాత్రమే కొట్టినా... మిల్లర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో చెలరేగాడు. పాండే ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్... స్మిత్ బౌలింగ్‌లో వరుసగా మరో మూడు సిక్సర్లు సంధించాడు. దీంతో ఓవరాల్‌గా 36 బంతుల్లో 104 పరుగులు వచ్చాయి. మిల్లర్ అవుటైన కొద్దిసేపటికి మ్యాక్స్‌వెల్ మరో ఫోర్ కొట్టి వెనుదిరిగాడు. ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ చివరి 26 బంతుల్లో 78 పరుగులు చేయడం విశేషం. ఈ ద్వయం 64 బంతుల్లో 135 పరుగులు జోడించింది. ఆఖర్లో బెయిలీ మెరుపు షాట్లతో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. వరుస బౌండరీలతో పాటు ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మల్చాడు. బెయిలీ, జాన్సన్ ఐదో వికెట్‌కు 16 బంతుల్లో అజేయంగా 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభంలోనే తడబాటు... చెన్నై ఇన్నింగ్స్‌లో స్మిత్ తొలి ఓవర్లోనే అవుట్‌కావడంతో మెకల్లమ్ నెమ్మదించాడు. కానీ రైనా మాత్రం వరుస బౌండరీలతో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఓ భారీ సిక్సర్‌తో ఊపు తెచ్చినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మెకల్లమ్, రైనా రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. తర్వాత మెకల్లమ్, జడేజా ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా వీరిద్దరు అవుట్ కావడంతో చెన్నై మళ్లీ తడబడింది. అప్పటికి జట్టు స్కోరు 98/4. డు ప్లెసిస్, ధోని భారీ షాట్లకు పోకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఫలితంగా చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. దీంతో ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) హిల్ఫెన్హాస్ 30; మన్దీప్ (సి) పాండే (బి) మోహిత్ 3; మ్యాక్స్‌వెల్ (సి) జడేజా (బి) మోహిత్ 90; మిల్లర్ (బి) స్మిత్ 47; బెయిలీ నాటౌట్ 40; జాన్సన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1-33; 2-38; 3-173; 4-182 బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-36-1; ఈశ్వర్ పాండే 4-0-41-0; మోహిత్ శర్మ 4-0-38-2; స్మిత్ 3-0-36-1; జడేజా 3-0-37-0; అశ్విన్ 2-0-38-0 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) జాన్సన్ (బి) సందీప్ 4; బి. మెకల్లమ్ రనౌట్ 33; రైనా (సి) మిల్లర్ (బి) మ్యాక్స్‌వెల్ 35; జడేజా (బి) ధావన్ 17; డు ప్లెసిస్ (సి) కార్తీక్ (బి) జాన్సన్ 52; ధోని (సి) బెయిలీ (బి) జాన్సన్ 23; మన్హాస్ నాటౌట్ 8; అశ్విన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1-5; 2-56; 3-88; 4-98; 5-159; 6-167 బౌలింగ్: సందీప్ 4-0-37-1; జాన్సన్ 4-0-37-2; కార్తీక్ 4-0-40-0; అక్షర్ పటేల్ 4-0-28-0; మ్యాక్స్‌వెల్ 2-0-21-1; రిషి ధావన్ 2-0-23-1. మ్యాక్స్‌వెల్ విధ్వంసం సాగిందిలా... 1-10 బంతులు: 11 పరుగులు 11-20 బంతులు: 34 పరుగులు 21-30 బంతులు: 33 పరుగులు 31-38 బంతులు: 12 పరుగులు -
ప్రయత్నం ప్రకాశించింది!
ప్రభుత్వం తన విధికి ఆమడ దూరంలో నిలిచిన చోట కొంతమంది వ్యక్తులు బాధ్యతలను తీసుకొంటుంటారు. తమదైన శైలిలో వాటిని నిర్వర్తిస్తుంటారు. కటక్‌కు చెందిన ప్రకాశ్‌రావు కూడా ఇలాంటివారే. కటక్‌లోని ఒక మురికివాడను ఈయన సంస్కరిస్తున్న విధానం అభినందనీయం. కటక్‌లోని బక్సీబజార్ అసాంఘిక శక్తులకు ఆటపట్టులాంటిది. ఇక్కడ ఉండే వారిలో ఎక్కువమంది తాగుబోతులు, మత్తుపదార్థాలకు బానిసలుగా మారినవారే! అక్కడ యువత వక్రమార్గంలో నడుస్తుంటాన్ని గమనించి.. వారిని మొక్కగా ఉండగానే సరిచేయాల్సిందన్న విషయాన్ని గ్రహించి... రేపటి పౌరులైన బాలలపై దృష్టిపెట్టారు ప్రకాశ్‌రావు. మరి వారిని స్కూల్లో చేర్పిద్దామంటే తల్లిదండ్రుల సహకారం, దగ్గర్లో స్కూలు రెండూ లేవు. దీంతో తనే స్వయంగా ఒక స్కూల్‌ను ఏర్పాటు చేశారీయన. 2002లో ‘ఆశా ఆశావర’ అనే స్కూల్‌ను స్థాపించారు. రెండు గదులున్న తన ఇంటిలో ఒక గదిలో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. స్థానికంగా ఒక టీస్టాల్ నడిపే ప్రకాశ్‌రావు ప్రయత్నానికి మొదట్లో నలుగురు పిల్లలు కలిసి వచ్చారు. కొద్దికాలంలోనే మరో 25 మంది పిల్లలు తోడయ్యారు. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పాఠశాలను నడపడానికి నిధుల అవసరం పెరిగింది. ఆ సమయంలో ప్రకాశ్‌రావు తన టీ స్టాల్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని స్కూల్ కోసమే వెచ్చించేవారట. దీంతో ఈయన ప్రయత్నానికి మంచి గుర్తింపు వచ్చింది. స్థానికంగా ఉండే ఒక ట్రస్ట్ వాళ్లు స్కూల్‌కోసం ఒక బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు ప్రకాశ్‌రావు స్కూల్లోని స్ట్రెంగ్త్ 60 మంది. ప్రస్తుతం నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్‌కు గుర్తింపును ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ కింద ప్రకాశ్‌రావు స్కూల్‌కు ప్రభుత్వం తరఫున ఫండ్స్ ఇస్తున్నారు. ఈ పాఠశాల స్లమ్‌లో చాలా మార్పులు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆ మురికివాడలో వక్రమార్గంలో నడిచే పిల్లల కన్నా... బడి బాట పట్టిన పిల్లలే ఎక్కువమంది ఉన్నారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిరుదివ్వెను వెలిగించడం మిన్న అన్న మహాకవి మాటలను ప్రకాశ్రావులా అందరూ ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సామాజిక అభివృద్ధి. -
ఇక చావోరేవో!
కటక్: ఏడు వన్డేలు...భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రకటించినప్పుడు ఇన్ని వన్డేలా..? ఇంత సుదీర్ఘ పర్యటన అవసరమా..? అనే వ్యాఖ్యలు వచ్చాయి. అయితే వరుణుడి పుణ్యమాని అది ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌గా మారింది. రాంచీలో నాలుగోవన్డేలో వర్షం కారణంగా ఫలితం రాలేదు. తాజాగా కటక్‌లో ఐదో వన్డేలో ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. బారాబతి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని శుక్రవారమే తేలిపోయింది. అయితే శనివారం ఉదయం అంపైర్లు నైజేల్ లాంగ్, రవి, షంషుద్దీన్ ఉదయం 11 గంటలకు మైదానాన్ని పరిశీలించారు. పిచ్ కొంత వరకు బాగున్నా, అవుట్ ఫీల్డ్ పూర్తిగా బురదగా మారడంతో ఆట సాధ్యం కాదంటూ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మ్యాచ్‌కు అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా భువనేశ్వర్‌లో హోటల్లోనే ఉండిపోయారు. స్టేడియానికి కూడా రాలేదు. ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో వెనుకబడిన భారత్ ఇప్పుడు సిరీస్ నెగ్గాలంటే చివరి రెండు వన్డేల్లో కచ్చితంగా గెలవాలి. కాబట్టి ధోనిసేనకు రెండు మ్యాచ్‌ల్లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఆరో వన్డే బుధవారం (30న) నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన గత మూడు వన్డే సిరీస్‌లలో మొదటి రెండింటిని ఆస్ట్రేలియా 4-2 తేడాతో గెలుచుకుంది. చివరి సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు కాగా, భారత్ 1-0తో సిరీస్ నెగ్గింది. భారత్‌పైనే ఒత్తిడి: ఫించ్ సిరీస్‌లో ప్రస్తుతం వెనుకబడి ఉండటంతో భారత్‌పైనే ఒత్తిడి నెలకొందని ఆసీస్ బ్యాట్స్‌మన్ ఫించ్ అన్నాడు. సిరీస్ గెలిచేందుకు తమకే ఎక్కువ అవకాశాలున్నాయని అతను అన్నాడు. ‘మేం ఒక మ్యాచ్ గెలిస్తే చాలు. అదే భారత్ రెండూ గెలవాల్సి ఉంది. కాబట్టి వారిపైనే కొంత ఒత్తిడి ఉండటం సహజం. ఆధిక్యంలో ఉండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం మేం చక్కటి క్రికెట్ ఆడుతున్నాం. కాబట్టి జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు. -
ఐదో వన్డే రద్దు!
కటక్: చెరువును తలపిస్తున్న మైదానం... పిచ్‌పై ఏకంగా మూడు కవర్లు... మధ్య మధ్యలో కాస్త తెరపినిస్తున్నా, వదలని వాన... ఓవర్‌టైమ్ పని చేస్తున్న మైదానం సిబ్బంది... ఇదీ బారాబతి స్టేడియంలో పరిస్థితి. మరో రెండు రోజులు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక. ఈ నేపథ్యంలో శనివారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యే అవకాశం ఉంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ నిర్వహణ అసాధ్యం. అయితే రద్దయినట్లు అధికారికంగా ప్రకటించే హక్కు మాకు లేదు. శనివారం అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఈ ప్రకటన చేస్తారు. అయితే మేం టిక్కెట్ల డబ్బు ఏ తేదీల్లో (నవంబరు 8-15) వాపస్ చేసేదీ ఇప్పటికే ప్రకటించాం’ అని ఒరిస్సా క్రికెట్ సంఘం కార్యదర్శి బెహరా చెప్పారు. శనివారం ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియానికి కూడా రాకపోవచ్చు. కేవలం అంపైర్లు, అధికారులు వచ్చి మ్యాచ్ రద్దు ప్రకటన చేస్తారు. 17 సంవత్సరాల క్రితం భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇదే వేదికలో జరగాల్సిన వన్డే కూడా వర్షం కారణంగా రద్దయింది. ఏడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఆరో వన్డే 30న నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ఇక సిరీస్ గెలవాలంటే భారత్ కచ్చితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి తీరాలి. అక్టోబరు 31 నుంచి ఉత్తరప్రదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడు రోజుల మ్యాచ్‌ను కూడా కటక్ నుంచి ముంబైకి తరలించాలని ఒరిస్సా సంఘం ఇప్పటికే బీసీసీఐని కోరింది. వన్డే మ్యాచ్ రద్దు కావడం ద్వారా ఒరిస్సా సంఘానికి రూ. 3 కోట్ల నష్టం వస్తుంది. అయితే ఈ మ్యాచ్‌ను ఇప్పటికే ఇన్సూరెన్స్ చేశారు. కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ‘ఏడు వన్డేల సిరీస్ కాస్తా ఐదు వన్డేల సిరీస్‌గా మారింది. ఇందులో 2-1 ఆధిక్యంలో ఉండటం కచ్చితంగా మాకు కలిసొచ్చే అంశం. భారత్‌లో సిరీస్ గెలవడం మా కోరిక. ఇప్పుడు అది సాధ్యమయ్యే అవకాశం ఉంది’ - వాట్సన్ ‘ఇక మాకు చివరి రెండు వన్డేలు చావోరేవో. వాతావరణం మన చేతుల్లో ఉండదు. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి’ - జడేజా -
వరుణుడు కరుణిస్తేనే...!
కటక్: భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో భారీ వర్షంతో ఇప్పటికే ఒక వన్డే రద్దు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి తర్వాత జరగబోయే ఐదో వన్డేపై నిలిచింది. అయితే ఒడిశాలోని కటక్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. సోమవారంనుంచి ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కనీసం శుక్రవారం ఉదయం వర్షాలు ఆగితే గానీ శనివారం మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం లేదు. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ భారీ వర్ష సూచన ఉంది. ఇక్కడి బారాబతి స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మైదానంలో భారీగా నీరు చేరినా పిచ్‌లను మాత్రం పూర్తిగా కవర్ చేసి జాగ్రత్త పడినట్లు క్యురేటర్ పంకజ్ పట్నాయక్ చెప్పారు. మరో వైపు మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. 45 వేల సామర్థ్యం గల స్టేడియంలో ఇప్పటికే 42 వేల టికెట్లను ఫ్యాన్స్ సొంతం చేసుకున్నారు. బావులు తవ్వేశారు! భారత క్రికెట్ బోర్డు అనుకుంటే కొండ మీది కోతినైనా తేగలదు. ఎలాగైనా మ్యాచ్‌ను నిర్వహించాలని పట్టుదలగా ఉన్న ఒరిస్సా క్రికెట్ సంఘం (ఓసీఏ) అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వినేందుకు కొత్తగా అనిపిస్తున్నా... మైదానంలోని వర్షపు నీరును బయటికి పంపించేందుకు దాని చుట్టుపక్కల పరిధిలో ఏకంగా నాలుగు బావులు కూడా తవ్వేశారు! మరో వైపు వర్షం ఆగిన తర్వాత పిచ్, అవుట్ ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు హెలికాప్టర్‌ను ఉపయోగించాలని కూడా ఓసీఏ నిర్ణయించింది. ఇందు కోసం స్థానిక ఎంపీకి చెందిన హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోనున్నారు. అయితే ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఓసీఏ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.