
టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టి20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా రెండో టి20 ఆదివారం(జూన్ 12న) ఒడిశాలోని కటక్ వేదికగా జరగనుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లకు ఘన స్వాగతం లభించింది. కాగా సౌతాఫ్రికా క్రికెటర్ వేన్ పార్నెల్‌ను ఒక రిపోర్టర్.. ఒడిశాకు తొలిసారి వచ్చారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ''ఇక్కడ ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. అయితే నేను ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. అయితే భారత్‌లో నాకు నచ్చిన రెండు విషయాలు క్రికెట్ ఒకటి.. మరొకటి ఆతిథ్యం.'' అంటూ పార్నెల్ ఎపిక్ రిప్లై ఇచ్చాడు.
చదవండి: 'ఉన్నప్పుడు పెద్దగా ఏం పీకలేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు'
Comments
Please login to add a commentAdd a comment