టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్ చూసిన వారెవ్వరైనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వస్తుందంటే కచ్చితంగా రెండు పేర్లు చెబుతారు. అయితే సూర్యకుమార్.. లేదంటే 'కిల్లర్' మిల్లర్. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరికి కాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలా అని రాహుల్ ప్రదర్శనను తీసిపారేయలేము.28 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు సాధించాడు.
కానీ రాహుల్ కంటే సూర్యకుమార్ ఇంకా బాగా ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అలా కాదనుకుంటే దక్షిణాఫ్రికాను దాదాపు గెలిపించినంత పనిచేసిన మిల్లర్‌కు అయినా ఇవ్వాల్సింది.. అందునా అతను ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో సందేహం రేకెత్తించింది. ఏ లెక్కన కేఎల్ రాహుల్‌కు అవార్డు ఇచ్చారో అంతుపట్టడం లేదని జట్టు పీక్కుంటున్నారు.
అవార్డు అందుకున్న అనంతరం ఇదే విషయమై కేఎల్ రాహుల్ స్పందించాడు.''నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం ఆశ్చర్యంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనే ఈ అవార్డుకి అర్హుడు. అతనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మిడిల్ ఓవర్లలో సూర్యలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన విషయం. అయితే సూర్యకుమార్ మాత్రం చక్కగా ఆడాడు. ఒకవేళ సూర్యకు ఇవ్వకపోతే.. మిల్లర్‌కు ఇచ్చినా బాగుండేది. జట్టు ఓడిపోయినా సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ అవార్డు నాకు ఎందుకు ఇచ్చారో ఇప్పటికి అంతుచిక్కడం లేదని పేర్కొన్నాడు.
సూర్యకుమార్ కంటే డేవిడ్ మిల్లర్‌కు అవార్డు ఇస్తే ఇంకా ఎంతో బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.చాలా సందర్భాల్లో ఓడిపోయిన టీమ్ ప్లేయర్లకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు ఇవ్వడంచూశాం. ఒకవేళ వీరిద్దరు4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 24 పరుగులు మాత్రమే ఇచ్చిన భారత బౌలర్ దీపక్ చాహార్‌కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ఇచ్చినా బాగుండేదని అంటున్నారు.వీళ్లని కాదని కెఎల్ రాహుల్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం 'కేఎల్ రాహుల్ బీసీసీఐ రికమెండేషన్ క్యాండిడేట్ కదా.. అందుకే అతనికి అవార్డు వచ్చిందంటూ మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment