సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. గాయంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రాహుల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా టి20 సిరీస్ నుంచి వైదొలిగాడు. కాగా కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ జట్టును నడిపించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి టి20 జరగనున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం సాయంత్రం ప్రాక్టీస్ అనంతరం గజ్జల్లో గాయం ఇబ్బంది పెడుతున్నట్లు కేఎల్ రాహుల్ మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు.
కాగా ఇవాళ ఉదయమే రాహుల్ గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించారు. అయితే సాయంత్రానికి నొప్పి ఎక్కువ అవడంతో మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ వైదొలిగినట్లు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక కుల్దీప్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయం బారీన పడ్డాడు. దీంతో అతను కూడా కొన్ని రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇక గురువారం(జూన్ 9న) ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్
మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ
రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్
మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం
నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్
ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు..
పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా!
Comments
Please login to add a commentAdd a comment