
మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం
సాక్షి, భువనేశ్వర్/కటక్: ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందిన దివ్యాంగ యువకుని మృతదేహం మోటార్ సైకిల్‌పై తరలించారు. ఈ ఘటన కటక్ జిల్లాలోని బంకిడొంపొడా సమితిలో గురువారం చోటుచేసుకుంది. ఢంసర్ గ్రామానికి చెందిన సరోజ్ లెంకా(19) ఆరోగ్యం క్షీణించడంతో బంకిడొంపొడా సబ్‌డివిజనల్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స జరుగుతుండగా ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
చదవండి: బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్‌చల్
అయితే ఇటువంటి మృతదేహాల తరలింపు కోసం ప్రభుత్వం మహా ప్రయాణం పేరిట వాహనాలను ఏర్పాటు చేసింది. కానీ యువకుని శవం స్వగ్రామం తరలించేందుకు అటువంటి వాహనం ఇక్కడ లేదని ఆస్పత్రి వర్గాలు బదులివ్వడంతో గత్యంతరం లేక బాధిత బంధువులు ఇలా మోటార్‌బైక్‌పై తరలించడం గమనార్హం
చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు..
Comments
Please login to add a commentAdd a comment