Physical disability
-
‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు
సాక్షి, భువనేశ్వర్/కటక్: ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందిన దివ్యాంగ యువకుని మృతదేహం మోటార్ సైకిల్‌పై తరలించారు. ఈ ఘటన కటక్ జిల్లాలోని బంకిడొంపొడా సమితిలో గురువారం చోటుచేసుకుంది. ఢంసర్ గ్రామానికి చెందిన సరోజ్ లెంకా(19) ఆరోగ్యం క్షీణించడంతో బంకిడొంపొడా సబ్‌డివిజనల్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స జరుగుతుండగా ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. చదవండి: బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్ అయితే ఇటువంటి మృతదేహాల తరలింపు కోసం ప్రభుత్వం మహా ప్రయాణం పేరిట వాహనాలను ఏర్పాటు చేసింది. కానీ యువకుని శవం స్వగ్రామం తరలించేందుకు అటువంటి వాహనం ఇక్కడ లేదని ఆస్పత్రి వర్గాలు బదులివ్వడంతో గత్యంతరం లేక బాధిత బంధువులు ఇలా మోటార్‌బైక్‌పై తరలించడం గమనార్హం చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
వెక్కి వెక్కి ఏడ్చాను.. కానీ
‘శారీరక వైకల్యం శాపం అనుకుంటారు. నిజానికి.. వికలాంగులను చూసి నానా మాటలూ అనే మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం’ అంటారు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మాళవిక అయ్యర్. అంతేకాదు, అలా మాట్లాడేవాళ్లకు తన ప్రసంగాలను లేపనంగా రాస్తున్నారు! తమిళనాడుకు చెందిన మాళవిక. పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగి గొప్ప వక్తగా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇటీవల ‘వరల్డ్ డిజెబిలిటీ డే’ సందర్భంగా శారీరక వైకల్యం ఉన్న వారి పట్ల సమాజం అనుసరించాల్సిన తీరు గురించి సోషల్ మీడియాలో హృదయానికి హత్తుకునేలా ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలివి. వెక్కి వెక్కి ఏడ్చాను ‘‘ఇది పదిహేడేళ్ల క్రితం నాటి మాట. నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. ‘జనరల్ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే’ అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. గ్రెనేడ్ పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను. నిజానికి దివ్యాంగుల పట్ల సమాజం స్పందించే తీరు సరిగా లేదు. ప్రతి ఒక్కరికీ అటిట్యూడ్ ప్రాబ్లం ఉంటుంది’’ అని మాళవిక అన్నారు. నిరాశ పరచకూడదు ‘‘నిజానికి మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం. ఎదుటివారిని ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ నిరాశ చెందేలా మాట్లాడకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 26.8 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరిది 2.21 శాతం. ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడే ముందు ప్రతీ ఒక్కరు దివ్యాంగుల పట్ల తాము ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆలోచించుకోవాలి. వారిని సమాజంలో మమేకం చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. శారీరక వైకల్యం ఉంటే ఇక జీవితం ముగిసినట్లే అనే మాటలు మానుకోవాలి. దివ్యాంగులనంతా ఒక్కచోట చేర్చడం కాదు.. వారికి ఏమేం అవసరమో గుర్తించి... వాటిని సమకూర్చాలి. అలా చేసినపుడే సమాజంతో వారు కలిసిపోగలుగుతారు. లేదంటే ఆత్మన్యూనతాభావంతో కుంగిపోతారు. అందుకే బాల్యం నుంచే ప్రతి ఒక్కరు వివక్ష లేకుండా పెరిగే వాతావరణం కల్పించాలి’’ అని మాళవిక అన్నారు. ‘చారిటీ’ వస్తువులు కారు ‘‘విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. శారీరక వైకల్యం ఉన్న వారిని చారిటీ వస్తువులుగా చూపకుండా... దివ్యాంగులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థితికి చేరిన వారి గురించి పాఠ్యాంశంలో బోధించాలి. ఒకరిపై ఆధారపడకుండా.. సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా తీర్చిదిద్దాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం అందించాలి. సానుకూల దృక్పథం నెలకొనేలా సినిమాలు నిర్మించాలి. చేతులు, కాళ్లు లేకుంటే పెళ్లి కాదు. ఇక జీవితమే ఉండదు అనే పిచ్చి నమ్మకాలను తొలగించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న దివ్యాంగులకు సమాజం పట్ల, తమ సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పడింది. తమ హక్కులకై గళాన్ని గట్టిగా వినిపించగలుగుతున్నారు. అయితే వారికి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల అవసరం ఎంతగానో ఉంది. దివ్యాంగులను సమాజం నిండు మనస్సుతో ఆలింగనం చేసుకోవాలనేదే నా కల. ఆ దిశగా వడివడిగా అడుగులు పడాలి’’ అని మాళవిక ఆకాంక్షించారు. గ్రనేడ్ పేలడంతో..! మాళవిక అయ్యర్ తమిళనాడులోని కుంభకోణంలో క్రిష్ణన్– హేమా క్రిష్ణన్ దంపతులకు జన్మించారు. తండ్రి వాటర్ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో ఆమె బాల్యం రాజస్తాన్‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రనేడ్ చేతుల్లో పేలి రెండు అరచేతులు పోయాయి. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్క్రైబ్ సహాయంతో పరీక్షలు రాస్తూ మాళవిక తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు(ప్రైవేటు పరీక్ష) సంపాదించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసలు పొందారు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరుకున్న మాళవిక... ఎకనమిక్స్ హానర్స్ చదివారు. సోషల్ వర్క్‌లో ï డాక్టరేట్ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్ స్పీకర్‌గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐరాసలోనూ తన గళాన్ని వినిపించారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌తో సత్కరించింది. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ -
వైకల్యాన్ని జయించాడు...
టెన్నిస్‌లో రాణిస్తున్న బధిర క్రీడాకారుడు సాయిచందన్ - పారాలింపిక్స్ లక్ష్యంగా సాధన - స్పాన్సర్షిప్ కోసం ఎదురుచూపు సాక్షి, హైదరాబాద్: శారీరక వైకల్యం ఆ కుర్రాడి పట్టుదలను ఆపలేకపోయింది. తనలో లోపం ఉన్నా తానూ అందరిలాగే నచ్చిన రంగంలో సత్తా చాటాలనుకున్నాడు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని క్రీడలను ఎంచుకున్నాడు. ఇప్పుడు జాతీయస్థాయిలో రాణించి తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. అతడే యువ టెన్నిస్ ప్లేయర్ లింగాపురం సాయిచందన్. పుట్టుకతోనే మూగ, చెవిటివాడు అయినప్పటికీ సాధనతో టెన్నిస్ క్రీడలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న 15 ఏళ్ల ఈ కుర్రాడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. అతని ఆశయం నెరవేర్చేందుకు అన్ని కష్టనష్టాలకు ఓర్చి తల్లిదండ్రులు కూడా అండగా నిలుస్తున్నారు. ఐదేళ్ల వయసు నుంచి... సాయిచందన్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల. జన్మత బధిరుడు. మూడేళ్ల వయసులో స్పీచ్ థెరపీ చేయించినా పెద్దగా మెరుగుదల కనిపించలేదు. స్థానికంగా కొంత మంది టెన్నిస్ ఆడటాన్ని ఆసక్తిగా గమనించిన అతను దానిపై మక్కువ చూపించాడు. హోమియోపతి వైద్యుడైన తండ్రి నరసింహేశ్వరన్ కొడుకును నిరాశపర్చకుండా ఐదేళ్ల వయసులో రాకెట్ చేతికిచ్చి ప్రోత్సహించారు. అక్కడి నంది అకాడమీలో కోచ్ మేఘ్‌నాథ్, సాయికి శిక్షణ ఇచ్చారు. కొడుకుకు తోడుగా ఉండేందుకు తల్లి కృష్ణప్రియ కూడా టెన్నిస్ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. సైగలే తప్ప మాట్లాడలేని కుమారుడికి టెన్నిస్‌లోనూ ఆమె సహకరించాల్సి వచ్చింది. కోచ్ చెప్పిన మాటలను ఆమె కొడుకుకు సైగలతో చెప్పడం, అతని సందేహాలకు కోచ్‌నుంచి సమాధానం తీసుకొని మళ్లీ అబ్బాయికి వివరించడం చేశారు. ఇలా దాదాపు ఐదేళ్ల శిక్షణ అనంతరం తొలిసారి అతను ఓపెన్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సెమీఫైనల్‌కు చేరాడు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో నిలకడగా విజయాలు సాధించిన సాయిచందన్...అండర్-12, అండర్-14 వయో విభాగాల్లో పలు ఐటా టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. బధిరుల టెన్నిస్‌లోకి.. ఈ దశలో బధిరులకు ప్రత్యేకంగా టెన్నిస్ పోటీలు ఉంటాయనే విషయం సాయి తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా వరుసగా రెండేళ్ల పాటు జాతీయ స్థాయిలో అతను విజేతగా నిలిచాడు. 2012లో పాటియాలాలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు గెలుచుకున్నాడు. 2013లో ఔరంగాబాద్‌లో జరిగిన పోటీల్లో సింగిల్స్, డబుల్స్‌లో రజతాలు సాధించాడు. చేజారిన ఒలింపిక్స్... జాతీయస్థాయిలో నిలకడగా రాణించిన సాయికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెలక్షన్స్ ద్వారా అరుదైన అవకాశం దక్కింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులోకి అతను దాదాపుగా ఎంపికయ్యాడు. ప్రతిభపరంగా చక్కటి ప్రదర్శన కనబర్చినా... ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే కనీసం 15 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనతో అతను వాటికి వెళ్లలేకపోయాడు. ఆర్థిక సమస్యలతో... ఈ దశలో సాయిచందన్కు ఇతర అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. వరల్డ్ డెఫ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కోసం ఎంపికైన తర్వాత కూడా సొంత డబ్బులతో టోర్నీలకు వెళ్లలేని పరిస్థితిలో తప్పుకోవాల్సి వచ్చింది. గత రెండేళ్లలో వరుసగా మూడు పెద్ద ఈవెంట్లు బల్గేరియా, జర్మనీ, ఇటీవల జులైలో నాటింగ్‌హామ్ పోటీలకు ఎంపికైనా అవకాశం తప్పింది. కనీస మొత్తం డిపాజిట్ చేయలేకపోవడంతో అధికారులు వీసా తిరస్కరించారు. ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నట్లు లెటర్ ఉన్నా సాయికి ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అదీ సాధ్యం కాలేదు. హోమియోపతి వైద్యుడిగా పరిమిత ఆదాయంతో తాము అంతటి భారం మోయలేకపోతున్నామని సాయి తండ్రి చెబుతున్నారు. భవిష్యత్తుపై భరోసాతో... అయితే సాయితో పాటు అతని తల్లిదండ్రులు కూడా సై ్థర్యం కోల్పోలేదు. కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని భావిస్తున్న వారు శిక్షణను కొనసాగిస్తున్నారు. సాధారణ కేటగిరీలో ఐటీఎఫ్తో పాటు డెఫ్ విభాగంలో 2016 రియో పారాలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్న సాయి తీవ్రంగా సాధన చేస్తున్నాడు. భారత జూనియర్ డేవిస్‌కప్‌కు గతంలో ప్రాతినిధ్యం వహించిన నున్నా గోపాలకృష్ణ తమ టెన్నిస్ కోర్టును శిక్షణ కోసం ఉచితంగా వాడుకునేందుకు అనుమతినిచ్చారు. హమీద్ అనే కోచ్ ప్రస్తుతం శిక్షణనిస్తున్నారు. అక్టోబరులో చైనీస్ తైపీలో జరిగే మరో పెద్ద ఈవెంట్‌కు అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే మరోసారి ఆర్థిక పరమైన ఇబ్బంది రాకుండా ఉండాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు స్పాన్సర్షిప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఎవరైనా కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా మా అబ్బాయిని ఆటను వదిలేయమని చెప్పలేదు. చిన్నప్పటినుంచి బాగా ఆడాడు. కనీసం 20 ఏళ్ల వయసు వచ్చే సరికి అతను మరింత మంచి ఆటగాడిగా తయారవుతాడన్న ఆశతోనే దీనిని కొనసాగిస్తున్నాం’ అని తల్లి కృష్ణప్రియ చెబుతున్నారు. ఎవరైనా అండగా నిలిస్తే వారి కోరిక ఫలించడంలో సమస్య ఎదురు కాకపోవచ్చు. -
కేంద్ర ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపు పెంపు
-
కేంద్ర ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపు పెంపు
వికలాంగులకు 10 ఏళ్లు * ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు * ఓబీసీ వర్గాలకు 13 ఏళ్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నేరుగా నియామకాలు జరిపే అన్ని పోస్టుల్లోనూ.. అంధులు, బధిరులు సహా ఇతరత్రా శారీరక వైకల్యం గల వ్యక్తులకు గరిష్ట వయో పరిమితిలో పదేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే.. షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ) వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో 15 ఏళ్ల సడలింపు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) వారికి 13 ఏళ్ల సడిలింపు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర శిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) సోమవారం కొత్త నిబంధనలను రూపొందించింది. అయితే.. దరఖాస్తుదారు వయసు గరిష్టంగా 56 సంవత్సరాలకు మించరాదన్న నిబంధనకు లోబడి పై సడలింపులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇంతకుముందు.. గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టుల నియామకాల్లో వికలాంగులకు గరిష్ట వయో పరిమితిలో ఐదు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 10 సంవత్సరాలు, ఓబీసీలకు 8 సంవత్సరాలు సడలింపు ఉంది. -
మదర్ మధు
తల్లిదండ్రులే వద్దనుకున్నవారు కొందరైతే... విధి ఆడిన నాటకంలో అనాథలైన వారు మరికొందరు. వారికి ఇపుడొక అమ్మ ఆసరా దొరికింది. అమ్మ కాని ఆ అమ్మ మధు టుగ్నైడ్! బుద్ధిమాంద్యం, శారీరకవైకల్యం ఉన్న పదకొండు మంది చిన్నారులను దత్తత తీసుకొని కంటిపాపలా చూసుకుంటున్నారామె. వారికోసం నగర రణగొణ ధ్వనులకు, కాలుష్యానికి దూరంగా విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవకు ఆనుకొని ‘ఇచ్ఛ’ ఆశ్రమం నిర్మించారు. ఈ ప్రస్థానంలో ఆమె ప్రారంభపుటడుగులు, ఎదురైన అనుభవాలు ఆమె మాటల్లోనే... ‘‘మా స్వస్థలం ఢిల్లీ. నాన్న మిలట్రీ ఉద్యోగి. నేను పెరిగిందంతా ముంబైలోనే. నా భర్త టుగ్నైడ్ నేవీలో కమాండర్. ఆయనకు 1987లో ముంబై నుంచి కోచికి, అక్కడి నుంచి 1989లో వైజాగ్‌కు ట్రాన్స్ఫర్ అయ్యింది. బీచ్‌రోడ్డులోనే మా ఫ్లాట్. మా అబ్బాయి రోహిత్ ఎంటీవీలో ఉద్యోగి. పెళ్లి చేసుకొని ఢిల్లీలోనే ఉంటున్నాడు. టుగ్నైడ్ కూడా రిటైర్ అయ్యాక డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో కన్సెల్టెంట్‌గా హాల్దియాలో పనిచేస్తున్నారు. ఆ నవ్వే నడిపించింది... ఓ ఇద్దరు అనాథలనైనా దత్తత తీసుకోవాలని ఇరవై ఏళ్ల క్రితమే అనుకున్నా. కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా అపుడు వెనక్కుత గ్గవలసి వచ్చింది. తర్వాత కొంతకాలం ఫ్యాషన్ డిజైనర్‌గా వైజాగ్ సిరిపురం జంక్షన్లో బొటిక్ నడిపాను. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత 2012లో పిల్లలను దత్తత తీసుకోవడానికి ‘శిశుగృహ’ అనాథ శరణాలయానికి వెళ్లాను. అయితే వైకల్యంతో ఉన్న అక్కడి పిల్లలను తీసుకోవడానికి మొదట కొద్దిగా సంశయించాను. కానీ అక్కడున్న రెండేళ్ల మహేశ్ నా వేలు పట్టుకున్నాడు. ఊయలలో ఉన్న సాయి నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. వారిద్దర్నీ చూశాక నా సంశయం పటాపంచలైపోయింది. వారిద్దరితో పాటు అల్కాను దత్తత తీసుకున్నాను. ఇంట్లోనే ఏడాది పాటు వారి సంరక్షణను, బాగోగులను చూసుకున్నాను. కానీ ఏదో వెలితి. ఇంకా ఇలాంటి వారి కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. బ్యాంకు లాకర్లోని నగలు అమ్మేస్తే వచ్చిన రూ. 11 లక్షలతో స్థలం కొన్నాను. ఆశ్రమం నిర్మించడానికి పుణెలో మాకు ఉన్న ఫ్లాట్ అమ్మేశాను. గతంలో కొండకర్ల ఆవకు మా కుటుంబం అంతా చాలాసార్లు పిక్నిక్కు వచ్చాం. ఇక్కడి వాతావరణం నాకెంతో నచ్చింది. అందుకే ఇక్కడ స్థలం కొని 2013లో ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఈ ఆశ్రమానికి, స్వచ్ఛంద సంస్థకూ ‘ఇచ్ఛ-’ అని పేరు పెట్టుకున్నాను. ఇచ్చ అంటే కోరిక. పిల్లలకు అమ్మానాన్న, ఇల్లు కావాలనే కోరిక సహజం కదా! ఇపుడు ఆశ్రమంలో పిల్లల సంఖ్య పదకొండుకు చేరింది. మిగతా పిల్లలతోపోల్చితే వీరి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పూ నేర్పూ ఉండాలి. నాతో పాటు ఒక ఫిజియోథెరఫిస్ట్, ముగ్గురు కేర్‌టేకర్స్ వారినీ నిరంతరం కనిపెట్టుకొని ఉంటాం. నెలవారీ డొనేషన్ ఉండాలి... ఆశ్రమం దినసరి నిర్వహణతో పాటు వైద్యచికిత్సలకూ ఖర్చు పెరుగుతోంది. అయినప్పటికీ ఇక్కడే ఒక పూర్తిస్థాయి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్, ఫిజియోథెరఫీ సెక్షన్, వాటర్ థెరఫీ కోసం హైడ్రోప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాను. దాతలు ఒకేసారి డొనేషన్ మొత్తం ఇచ్చే కంటే నెలనెలా కొంత కచ్చితంగా వచ్చేలా ఏర్పాటు చేస్తే మా ప్లానింగ్ సులువవుతుంది’’. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య మహేశ్ (4ఏళ్లు): చెవుడు లేదు. మూగ మాత్రమే ఉంది. వారానికి రెండ్రోజుల పాటు స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అల్కా (3): రెండ్రోజుల శిశువుగా ఉన్నపుడు విశాఖ రైల్వేస్టేషన్లో వదిలేశారు. ఆమె మెదడు ద్రవస్థితిలో ఉండటంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. సాయి (3): అవాంఛిత గర్భం వల్ల ఓ అవివాహిత ఈ బిడ్డను ఓ న్యాయవాది ఇంటి వద్ద వదిలివెళ్లిపోయింది. అతను రెండు నెలల తర్వాత శిశుకేంద్రానికి అప్పగించారు. దత్తత తీసుకున్నపుడు ఆర్నెల్ల వయసు. నరాల సమస్య వల్ల నడవలేడు, కూర్చోలేడు, ఏమీ తినలేడు. ఫిజియోథెరఫీ చేయడం వల్ల ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. రాణి (2): పెద్ద తల, చిన్న శరీరం, తక్కువ బరువుతో అనకాపల్లి ఆసుపత్రిలో పుట్టిన ఈ పాపను తల్లిదండ్రులు అక్కడే వదిలేశారు. రాణికి ఒక చేయి లేదు. మరో చేతి వేళ్లు అంటుకుపోయాయి. పెదవి కూడా గ్రహణం మొర్రు ఉండటంతో ఇటీవలే శస్త్రచికిత్సతో సరిచేశారు. తేజ (7): బుద్ధిమాంద్యం, హెపటైటిస్-బితో బాధపడుతోన్న ఈమెను తల్లిదండ్రులు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై వదిలేశారు. తేజశ్రీ (4): కొండకర్ల గ్రామానికి చెందిన తేజశ్రీ తల్లి ఆత్మహత్య చేసుకుంది. తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు బుద్ధిమాంద్యంతో పాటు ప్రమాదకరమైన మయోపిట్స్ సమస్య ఉంది. బషీరా (8): మెదడులో సమస్య ఉండటంతో ఏదీ రిజిస్టర్ కాదు. క్షణ క్షణానికి ఆమె ప్రవర్తన మారిపోతుంటుంది. తండ్రి ఎటో వెళ్లిపోవడంతో వైజాగ్‌లో ఉంటోన్న తల్లి ఆమెను తనవద్ద ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. తనూశ్రీ (7 నెలలు): గత జూలై 18న రెండు నెలల పాపగా ఆశ్రమానికి వచ్చింది. ఈమెకు జననేంద్రియాలు రెండూ కలిసిపోయి ఉన్నాయి. వైద్యులతో పరీక్ష చేయిస్తే బాలిక లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని, కొద్దిగా వయసు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని తేలింది. శ్యామ్ (5): అనకాపల్లి రైల్వేస్టేషన్లో తల్లిదండ్రులు చాపలో చుట్టి వదిలేశారు. నరాల సమస్య వల్ల కూర్చోలేదు, నడవలేదు, గొంతులో సమస్యతో ద్రవ పదార్థమే ఆహారం. గిరిజ (8) : ఆశ్రమంలో చేరేటపుడు చాలా సన్నంగా, పెద్ద పొట్టతో ఉండేది. లివర్ సమస్య ఉంది. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. తార (3): కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎవరో వదిలివెళ్లిపోయిన ఆమెను చైల్డ్‌లైన్ అధికారులు గత నెలలోనే ఆశ్రమంలో చేర్పించారు. మెదడు బాగానే ఉన్నా కాళ్లూచేతుల్లో సత్తువ లేదు. నరాల సమస్యతో బాధపడుతోంది. - అల్లు సూరిబాబు -
ఐఐటీ వద్దంది... స్టాన్ఫోర్డ్ రమ్మంది!
‘‘శారీరక వైకల్యం మనిషి సామర్థ్యానికి అడ్డు అవుతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉంటే ఏ వైకల్యం, ఎలాంటి పరిస్థితులూ మన విజయానికి అడ్డుకాబోవు...’’ అంటున్నాడు కార్తీక్ స్వహ్నే. ఇది ఎవరిలోనో స్ఫూర్తిని నింపడానికి చెబుతున్న మాట కాదు. ఇంకెవరిలోనో ఉద్వేగాన్ని రగల్చడానికి చెబుతున్న మాట అంతకన్నా కాదు. తాను మనస్ఫూర్తిగా నమ్మి, ఆచరించి విజయం సాధించి చెబుతున్న మాట. పుట్టుకతో చూపులేక పోయినా వైకల్యాన్ని, వైకల్యం వల్ల తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొని సాధించిన విజయం అభినందనీయం. శారీరక వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం బస్సులో సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి, వారికి సహాయం చేయడానికి చాలామంది ముందుకొస్తారు, కనీసం కొందరైనా వారిమీద జాలి చూపిస్తారు, ప్రభుత్వం కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఇచ్చింది. అయితే కార్తీక్‌కు మాత్రం అవేవీ ఉపయోగపడలేదు! ‘‘నాకు చదివే సామర్థ్యం ఉంది, నేను చదువుకొంటాను... కనీసం పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వండి...’’ అని అభ్యర్థించాడు. కానీ ఈ అంధ విద్యార్థిని పరీక్ష రాయడానికి కూడా అనుమతించలేదు నియమనిబంధనలు. సీబీఎస్ఈ సిలబస్‌లో 96 శాతం మార్కులతో ప్లస్‌టూ పూర్తి చేసిన కార్తీక్‌కు ఐఐటీలో ఇంజినీరింగ్ చదవాలనేది కల. అయితే పూర్తిస్థాయి అంధ విద్యార్థులకు ఐఐటీలో ప్రవేశం లేదు అంటున్నాయి నిబంధనలు. వికలాంగ కోటా ఉన్నప్పటికీ వందశాతం అంధుడైన వ్యక్తికి ఐఐటీ చదువులకు అవకాశం లేదని నిబంధనల్లో స్పష్టంగా ఉండడంతో తన పర్సెంటేజీని చూసి, కనీసం ఇదివరకు చదువుకొన్న విధానాన్ని గమనించి అయినా తనకో అవకాశం ఇవ్వాల్సిందిగా కార్తీక్ ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీలకు విజ్ఞాపన లేఖలు రాశాడు. అయితే ఆ విద్యాలయాల నుంచి స్పందన లేదు. ఎంట్రన్స్కే అవకాశం రాలేదు! ఎంట్రన్స్ రాసి సీటు రాలేదంటే ఏదో విధంగా ఊరట పొందవచ్చు, కానీ ఎంట్రన్స్ రాయడానికే అవకాశం లభించలేదంటే... అది ఎంత బాధో చదువుకొనే వారికి బాగా తెలుస్తుంది. ప్లస్ టూ పూర్తి అయ్యాక.. రెండు సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు, ఐఐటీల నుంచి అనుమతి లభిస్తుందేమోనని ఆశించాడు. కానీ నిరాశే మిగిలింది. అయితే ఈ బాధతో కార్తీక్ కృశించి పోలేదు. స్టాన్‌ఫోర్డ్‌లో సీటొచ్చింది! కార్తీక్ పరిస్థితి గురించి తెలుసుకొన్న ఒక ఎన్జీవో చేయూతను ఇచ్చింది. ఐఐటీలో అవకాశం లేదని స్పష్టత వచ్చాక అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించడానికి రంగం సిద్ధం చేశారు. కార్తీక్ ప్రతిభ గురించి యూనివర్సిటీ వారికి వివరించి, అతడికి సైన్స్, కంప్యూటర్స్ మీదున్న పట్టు గురించి ప్రాజెక్ట్ రూపంలో తెలియజెప్పి ఆ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీట్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. కార్తీక్ చదువుకొన్న పరిస్థితుల గురించి తెలుసుకొన్న ఆ అమెరికన్ వర్సిటీ వారు అతడి ప్రాజెక్ట్‌ను పరిశీలించి ఐదేళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను చదవడానికి అవకాశం ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తిస్థాయిలో స్కాలర్షిప్ను మంజూరుచేశారు. ఈ యేడాదే కార్తీక్‌కు స్టాన్ఫోర్డ్ లో ప్రవేశం దక్కింది. ఇప్పుడు కార్తీక్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తను అనుకొన్న విద్యను అభ్యసిస్తూ స్ఫూర్తిమంతుడిగా మారాడు. వైకల్యం ఉందని చెప్పి చదువుకోవడానికి అవకాశం లభించని సమయంలో నిస్పృహతో కూరుకుపోక, వెనక్కు తగ్గక తన లక్ష్యం కోసం ప్రయత్నాలు చేసిన కార్తీక్‌కు ఆఖరికి ఉత్తమమైన ఫలితం దక్కింది. అనుకొన్న లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతటి నిరాశ ఎదురైనా వెనక్కు దక్కక కృషి చేస్తే అంతిమంగా విజయం సొంతం అవుతుందని కార్తీక్ సక్సెస్ స్టోరీని బట్టి అర్థం చేసుకోవచ్చు!