వికలాంగులకు 10 ఏళ్లు
* ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు
* ఓబీసీ వర్గాలకు 13 ఏళ్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నేరుగా నియామకాలు జరిపే అన్ని పోస్టుల్లోనూ.. అంధులు, బధిరులు సహా ఇతరత్రా శారీరక వైకల్యం గల వ్యక్తులకు గరిష్ట వయో పరిమితిలో పదేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే..
షెడ్యూల్డు కులాలు (ఎస్‌సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్‌టీ) వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో 15 ఏళ్ల సడలింపు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) వారికి 13 ఏళ్ల సడిలింపు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర శిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) సోమవారం కొత్త నిబంధనలను రూపొందించింది. అయితే.. దరఖాస్తుదారు వయసు గరిష్టంగా 56 సంవత్సరాలకు మించరాదన్న నిబంధనకు లోబడి పై సడలింపులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఇంతకుముందు.. గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టుల నియామకాల్లో వికలాంగులకు గరిష్ట వయో పరిమితిలో ఐదు సంవత్సరాలు, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి 10 సంవత్సరాలు, ఓబీసీలకు 8 సంవత్సరాలు సడలింపు ఉంది.
కేంద్ర ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపు పెంపు
Published Tue, Jun 30 2015 1:12 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement