
ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
బెంగుళూరుకు చెందిన శశాంక్ జె శ్రీధర ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషన్ శశాంక్ కోరారు. దీంతో గత దాఖలైన పలు పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.

చదవండి: శంకర్ దయాళ్ శర్మకు గిఫ్ట్‌గా వచ్చిన ఏనుగు.. అసలు ఆ కథేంటి?
Comments
Please login to add a commentAdd a comment