phisically challenged person
-
సర్పంచ్ పైశాచికం.. కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై దాడి
మహబూబ్ నగర్: తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బులు ఇప్పించాలని అడిగిన ఓ వికలాంగుడిని సర్పంచ్ కాలితో తన్ని దుర్భాషలాడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్వాడ మండలం ఫుల్పోనీ గ్రామంలో వికలాంగుడైన కృష్ణయ్య తనకు రావాల్సిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు రాలేదని, ఆ డబ్బులు ఇప్పించాలని అధికార పార్టీ సర్పంచ్ శ్రీనివాసులును అడగడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో వికలాంగుడైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు, తదితరులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సర్పంచ్ శ్రీనివాసులు వికలాంగుడు కృష్ణయ్యతో పాటు అధికారులను సైతం బండ బూతులు తిడుతూ.. కాలితో తన్నాడు. ఈ సంఘటన చూసిన మరికొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రూపులలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు కేసును సుమోటోగా స్వీకరించారు. సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు
సాక్షి, భువనేశ్వర్/కటక్: ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందిన దివ్యాంగ యువకుని మృతదేహం మోటార్ సైకిల్‌పై తరలించారు. ఈ ఘటన కటక్ జిల్లాలోని బంకిడొంపొడా సమితిలో గురువారం చోటుచేసుకుంది. ఢంసర్ గ్రామానికి చెందిన సరోజ్ లెంకా(19) ఆరోగ్యం క్షీణించడంతో బంకిడొంపొడా సబ్‌డివిజనల్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స జరుగుతుండగా ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. చదవండి: బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్ అయితే ఇటువంటి మృతదేహాల తరలింపు కోసం ప్రభుత్వం మహా ప్రయాణం పేరిట వాహనాలను ఏర్పాటు చేసింది. కానీ యువకుని శవం స్వగ్రామం తరలించేందుకు అటువంటి వాహనం ఇక్కడ లేదని ఆస్పత్రి వర్గాలు బదులివ్వడంతో గత్యంతరం లేక బాధిత బంధువులు ఇలా మోటార్‌బైక్‌పై తరలించడం గమనార్హం చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
ట్విట్టర్లో బొమ్మను చూసి..
సాక్షి, హైదరాబాద్: ట్విట్టర్లో తనకు ట్యాగ్ చేసిన ఓ చిత్రాన్ని చూసి గవర్నర్ తమిళిసై ముగ్ధులయ్యారు. అంత అద్భుతంగా గీసిన పెయింటర్ ఓ దివ్యాంగ బాలిక అని తెలుసు కొని ఆమెను తన నివాసానికి పిలిపించుకొని భుజం తట్టారు. ఆ బాలికే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సాయిబండతండాకు చెం దిన ఫ్లోరోసిస్ బాధితురాలు రమావత్ సువర్ణ. తమిళిసై చిత్రపటాన్ని(పోర్ట్రైట్) సువర్ణ చక్కగా గీయగా, దానిని ఎన్ఆర్ఐ జలగం సుధీర్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ గవర్నర్‌కు ట్యాగ్ చేశారు. గవర్నర్ స్పందించి సువర్ణతోపాటు ఆమె కుటుంబసభ్యులను శనివారం రాజ్‌భవన్‌కు పిలిపించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కాశీనాథ్‌గౌడ్ కుటుంబసభ్యులు, డాక్టర్ విజయభాస్కర్‌గౌడ్‌కు చెందిన ఓ ఫౌండేషన్ సహకారంతో ఆమెకు ఒక ట్రైసైకిల్‌ను బహూకరించారు. అనంతరం వారితో కలసి భోజనం చేశారు. సువర్ణ తన చదువుతోపాటు పెయింటింగ్‌ను కూడా కొనసాగించాలని, అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తానని హామీ ఇచ్చారు. ట్రైసైకిల్ దాతలను గవర్నర్ అభినందించారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి: గవర్నర్ కరోనాను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్రీచ్ బ్యూరో(ఆర్ఓబీ) కోవిడ్ జాగ్రత్తలపై ఏర్పాటు చేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహనాలను శనివారం ఆమె రాజభవన్లో ప్రారంభించారు. -
నేటి నుంచి సదరం క్యాంపులు
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా కొన్ని నెలలుగా నిలిచిపోయిన సదరం(దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ) క్యాంపులు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మొత్తం 171 ఆస్పత్రుల్లో దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలిస్తారు. ఆర్థోపెడిక్, మానసిక వైద్యులు, కంటి వైద్యులు.. ఇలా నిర్ణయించిన మేరకు అన్ని విభాగాల వైద్యులూ ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు సెంటర్లవారీగా కేటాయింపులు జరిపారు. ఉదయం 8 గంటల నుంచే క్యాంపులు నిర్వహిస్తారు. గత ప్రభుత్వం హయాంలో 52 ఆస్పత్రుల్లోనే క్యాంపులు నిర్వహించేవారు. స్లాట్లు కూడా తక్కువగా ఉండేవి. ఈ పరిస్థితికి స్వస్తి చెప్పి ఆస్పత్రుల సంఖ్యను భారీగా పెంచారు. పైగా బాధితులకు 24 గంటల్లోనే ధ్రువీకరణ పత్రం జారీచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల విద్యా, ఉద్యోగాలకే కాకుండా, ప్రభుత్వ పథకాలకూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు దివ్యాంగులకు లభిస్తుంది. -
ఆమెను చూసి సిగ్గుపడాల్సిందే..!
సాక్షి, బెంగళూరు : ఓటింగ్ శాతానికి పెంచేందుకు ప్రభుత్వాలు తీవ్ర కసరత్తే చేస్తున్నాయి. అంతకంతకూ ఓటు వేసే వారి సంఖ్య దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో పోలింగ్ రోజు సెలవిచ్చి మరీ ఓటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో పోలింగ్‌కు బూత్‌కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు రెండవ విడత పోలింగ్‌లో భాగంగా కర్ణాటక, మంగళూరులోని ఓ యువతి స్ఫూర్తిగా నిలిచారు. దివ్యాంగురాలైన షబ్బిత మోనిష్ ఓటు వేసిన తీరు పలువురిని అబ్బుర పర్చింది. రెండు చేతులు లేని షబ్బిత పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. ఓటు వేసినందుకు గుర్తుగా వేసే ఇంక్ గుర్తును కాలి బ్రొటన వేలిపై వేయించుకున్నారు. అటు బెంగళూరులోని జయనగర్ పోలింగ్ బూత్‌లో వృద్ధ దంపతులు శ్రీనివాస్ (91) మంజుల (84) తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఓటు హక్కును వినియోగించుకోవడానికి చొరవ చూపని దేశ పౌరులు, దివ్యాంగులు, అంధులను, వృద్ధులను చూసి సిగ్గు పడాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కర్టాటకలో మధ్యాహ్నం 1 గంటకు 21.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదుకాగా, తమిళనాడులో 39.49శాతంగా ఉంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా అసోం, బిహార్, జమ్ము కశ్మీర్, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో రెండవ విడత పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. Karnataka: A senior citizen couple, 91-year-old Shrinivas and 84-year-old Manjula, cast their votes at a polling booth in Jayanagar of Bangalore South Parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/9HBHxdgnQv — ANI (@ANI) April 18, 2019 -
పాస్టర్ ముసుగులో అఘాయిత్యం
జెడ్ మేడపాడు (మండపేట): విధి వంచితురాలైన దివ్యాంగురాలిపై పాస్టర్ ముసుగులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అధికారపార్టీ నేతల అండతో రాజీకి ప్రయత్నించాడు. విషయం బయటకు పొక్కడంతో స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని జెడ్ మేడపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జెడ్ మేడపాడుకు చెందిన 22 ఏళ్ల యువతి పుట్టు మూగ కావడంతోపాటు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు రాంబాబు వద్ద ఉంటోంది. రాంబాబు ఉదయాన్నే రైస్ మిల్లులో ఊక మోసేందుకు వెళుతుంటాడు. అతడి భార్య కూలి పనికి వెళుతుంటుంది. బాధితురాలు ఇంటి వద్దనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండలంలోని అర్తమూరుకు చెందిన ఓశెట్టి దుర్గారావు అలియాస్ రాజారావు (60) భార్య చనిపోగా 20 ఏళ్ల క్రితమే జెడ్ మేడపాడు వచ్చేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇంటింటికీ తిరిగి ఇనుస సామాను సేకరించి అమ్ముతుంటాడు. సాయంత్రం సమయంలో పాస్టర్‌గా చలామణి అవుతూ ఇంటింటికీ వెళ్లి ప్రార్థనలు చేస్తుంటాడు. ఈ క్రమంలో వికలాంగ యువతికి పింఛన్ సొమ్ములు ఇప్పించేందుకంటూ ఆమెను రాజారావు తన మోటారు సైకిల్‌పై తీసుకెళుతుండేవాడు. వారం కిందట యువతి తీవ్ర కొడుపునొప్పితో బాధపడుతుండటంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా, ఏడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయమై కుటుంబసభ్యులు యువతిని ప్రశ్నించగా రాజారావు తనను తల్లిని చేసినట్టుగా సైగల ద్వారా తెలిపింది. దీనిపై ఆయన్ని నిలదీయడంతో గ్రామంలో అధికార పార్టీకి చెందిన పెద్దలను ఆశ్రయించాడు. పుట్టే బిడ్డను ఆశ్రమంలో చేర్పించడంతోపాటు మూగ యువతికి రూ.50 వేలు చెల్లించాలని పెద్దలు నిర్ణయించినట్టు రాంబాబు, స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించారు. ఈ విషయం తెలిసి బాధితురాలి ఇంటికి సోమవారం మీడియా వెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. పాస్టర్‌నని చెప్పుకుంటూ తన సోదరిని గర్భవతిని చేశాడంటూ రాంబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం స్థానికులు రాజారావు ఇంటికెళ్లి అతడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : ప్రమాదంలో గాయపడి వికలాంగుడైన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే భావనతో పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెందిన పామర్తి లక్షీ్మనారాయణ ( 37) కల్లుగీత కార్మికుడుగా గతంలో పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వికలాంగుడుగా మారి ఏ పనీ చేయలేక ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులకు భారంగా మారుతున్నాననే బాధతో మనోవ్యథకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు బాధితుని ఏలూరు ్రçపభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం మరణించాడు. ధర్మాజీగూడెం ఎస్ఐ క్రాంతికుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.