నది వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబీకులు
భువనేశ్వర్/కటక్: మహానదిలో మునిగి, నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కటక్ నగరంలోని మహానది భడిములో తీరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులంతా కటక్ నయాబజార్ ప్రాంతంలోని పొటొపొఖొరి 8వ తరగతి విద్యార్థులు జొగ్గా బెహరా, ఆకాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టిగా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వీరు..స్నానం చేసేందుకు మహానదికి వెళ్లారు.
ఎంతసేపు అయినా వీరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబాలు వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో నదీ తీరాన విద్యార్థుల సైకిళ్లు, బట్టలు ఉండడం చూసి, నదిలో స్నానం చేస్తూ గల్లంతైనట్లు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో విద్యార్థుల ఆచూకీ కోసం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. గురువారం రాత్రి నాటికి విద్యార్థుల్లో జొగ్గా బెహరా మృతదేహం లభించింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం జరిగిన గాలింపు చర్యల్లో మిగతా విద్యార్థులు కాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
చదవండి: దారుణం: భర్త రాక్షసత్వానికి ఇటీవల అబార్షన్.. ఇప్పుడు చీర కొనుక్కుందని ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment