mahanadhi
-
ఇంటికి వచ్చి.. స్నానం కోసం వెళ్లి ఎంతసేపయినా రాలేదు..
భువనేశ్వర్/కటక్: మహానదిలో మునిగి, నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కటక్ నగరంలోని మహానది భడిములో తీరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులంతా కటక్ నయాబజార్ ప్రాంతంలోని పొటొపొఖొరి 8వ తరగతి విద్యార్థులు జొగ్గా బెహరా, ఆకాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టిగా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వీరు..స్నానం చేసేందుకు మహానదికి వెళ్లారు. ఎంతసేపు అయినా వీరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధిత కుటుంబాలు వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో నదీ తీరాన విద్యార్థుల సైకిళ్లు, బట్టలు ఉండడం చూసి, నదిలో స్నానం చేస్తూ గల్లంతైనట్లు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో విద్యార్థుల ఆచూకీ కోసం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. గురువారం రాత్రి నాటికి విద్యార్థుల్లో జొగ్గా బెహరా మృతదేహం లభించింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం జరిగిన గాలింపు చర్యల్లో మిగతా విద్యార్థులు కాష్ బహాలియా, చందన్ బెహరా, శుభం శెట్టి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: దారుణం: భర్త రాక్షసత్వానికి ఇటీవల అబార్షన్.. ఇప్పుడు చీర కొనుక్కుందని ఏకంగా.. -
మహానదిలో తేలిన తల్లీబిడ్డల మృతదేహాలు
భువనేశ్వర్/పారాదీప్ : ఒడిశాలోని మహానది పారాదీప్ తీరంలో నలుగురు తల్లీబిడ్డల మృతదేహాలు తేలాయి. గురువారం ఉదయం స్థానికుల దృష్టికి ఈ విషయం తారసపడడంతో పోలీసుల కు సమాచారం చేరవేశారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. మహానదిలో తలకిందులుగా వీరి మృతదేహా లు తేలుతూ కనిపించాయి. వీరిని ఇటీవల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అనంత శెట్టి భార్యాబిడ్డలుగా గుర్తించారు. ఆస్తి చేజిక్కించుకోవడం కోసం ఎవరో కుట్ర పన్ని వీరిని ఇలా హతమార్చినట్లు మృతురాలి సోదరుడు ఆరోపించాడు. ఈ సంఘటన పూర్వాపరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు రంగంలోకి దిగి మహానదిలో తేలియాడిన మృతదేహాల్ని ఒడ్డుకు చేర్చారు. మృతులంతా పారాదీప్ జగన్నాథ్‌పూర్ గ్రామస్తులు. మహానది శని మందిరం తీరంలో ఈ మృతదేహాలు తేలా యి. జగత్సింగ్పూర్ జిల్లా కుజంగ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వైద్యులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
నంద్యాలఅర్బన్ : వైద్యులు నిరంతరం తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆధునిక విధానాలపై అవగాహన పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎలమంచలి రాజారావు సూచించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్, ఐఎంఏ నంద్యాల శాఖ సం యుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక శాంతిరాం వైద్య కళాశాల ఆడిటోరియం లో రాయలసీమ స్థాయి వైద్యసదస్సు నిర్వహించారు. శాంతిరాం వైద్యకళాశా ల చైర్మన్ మిద్దె శాంతిరాముడు, ఐఎంఏ జాతీయ నాయకులు డాక్టర్ అప్పారావు, డాక్టర్ గంగాధర్, మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, కార్యదర్శి అనిల్, కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, సదస్సు క న్వీనర్ డాక్టర్ మాధవి, విజయభాస్కరరెడ్డి, బుడ్డా శ్రీకాంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజారావు మాట్లాడుతూ సమా జ అవసరాలను గుర్తించి వైద్య విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ కేంద్రం నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం తీసుకరావాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆమోదించరాదన్నా రు. డాక్టర్ మాధవి మాట్లా డుతూ సదస్సుకు హాజరైన వైద్యులకు మెడికల్ కౌన్సిల్ మూ డు వైద్యపాయింట్లు కేటాయించిందని, ప్రతి ఐదు సంవత్సరాలకు తమ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేసే సమయంలో ఈ పాయింట్లు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతిరాం వైద్య కళాశాల ఎండీ డాక్టర్ రవిబాబు, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ త్యాగరాజరెడ్డి, సాయిప్రసాద్, ప్రిన్సిపాల్ గిడ్డయ్య, సూపరింటెండెంట్ చంద్రన్న, డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు. మహానందీశుడి సేవలో.. మహానంది: ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఆదివారం సాయంత్రం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రశేఖర్, ఎంపీహెచ్ఈఓ హుసేన్‌రెడ్డి, మిత్ర చంద్రశేఖర్‌తో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ఇన్స్పెక్టర్ శశిధర్‌రెడ్డి స్వాగతం పలికారు. -
మళ్లీ నటించేందుకు..
తమిళసినిమా: చెన్నై చిన్నది బ్యాక్ టూ యాక్ట్‌కు రెడీ అయిపోయారు. కోలీవుడ్‌లోనే కాదు దక్షిణాదిలోనే లక్కీయస్ట్ నటి అంటే సమంతనే అనాలి. ఏలాంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండా ప్రేమించిన ప్రియుడు, అదీ ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన యువ నటుడిని ఇరుకుటుంబ పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసిన వేదికపై పెళ్లి చేసుకున్న నటి సమంత. గత ఆరో తేదీన పెళ్లి వేడుకలో అమాంతం మునిగి తేలిన సమంత ముందుగానే ఒక విషయాన్ని వెల్లడించారు. పెళ్లైన మూడో రోజునే షూటింగ్లో పాల్గొంటానన్నదే ఆ ప్రకటన. అన్న మాట నిలబెట్టుకుంటూ పెళ్లి అయిన రెండు రోజులకే సమంత తన మామ నాగార్జునతో కలిసి నటించిన రాజుగారి గది–2 చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక వారం కూడా గడవ కుండానే బ్యాక్ టూ యాక్ట్ అంటూ తాను నటిస్తున్న మహానది షూటింగ్లో శనివారం పాల్గొన్నట్లు సినీ వర్గాల సమాచారం. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత విలేకరిగా ఒక కీలకపాత్రను పోషిస్తున్నారని తెలిసింది. తదుపరి సమంత తమిళంలో అంగీకరించిన చిత్రాల షూటింగ్లో వరుసగా పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఇరుంబుతిరై, సూపర్ డీలక్స్, శివకార్తికేయన్‌తో ఒక చిత్రం అంటూ మూడు చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. విజయ్‌తో నటించిన మెర్శల్ చిత్రం దీపావళి పండగ సందర్భంగా తెరపైకి రానుంది. -
కృష్ణమ్మకు టీటీడీ సారె
మహానంది: ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల సందర్భంగా కష్ణమ్మకు టీటీడీ నుంచి పట్టుచీర, పసుపు, కుంకుమతో పాటు సకల సౌభాగ్య ద్రవ్యాలను తీసుకుని వెళ్తున్నట్లు తిరుమలకు చెందిన డాలర్ శేషాద్రి తెలిపారు. కష్ణా పుష్కరాల సందర్భంగా తిరుమల నుంచి బుధవారం బయలుదేరిన శ్రీవారి కల్యాణ రథం గురువారం మహానందికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఆలయ వేదపండితులు రవిశంకర అవధాని.. తదితరులు వారికి స్వాగతం పలికారు. అనంతరం డాలర్ శేషాద్రి మాట్లాడుతూ.. తిరుచానూరు, అహోబిలం, మహానంది, శ్రీశైలం, మంగళగిరి, అమరావతి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ దేవాలయాల నుంచి పసుపు కుంకుమలు తీసుకుని వెళ్తామన్నారు. అనంతరం పుష్కరాల ప్రారంభం రోజున ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కష్ణానదిలో వీటిని సమర్పిస్తారన్నారు. ఒంటిమిట్ట మీదుగా ఇక్కడికి వచ్చామని.. 7వ తేదీకి విజయవాడకు చేరతామన్నారు. విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నమూనా ఏర్పాటు చేశామన్నారు. ఏఈఓ రాజశేఖర్, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యం విక్రయిస్తే లెసైన్స్ రద్దు
మహానంది, న్యూస్‌లైన్: మద్యం దుకాణాల్లో నకిలీలు విక్రయిస్తే లెసైన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రేమ్‌ప్రసాద్ హెచ్చరించారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు శనివారం ఆయన మహానంది వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా 84 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లను నియమించారని, వారు శిక్షణలో ఉన్నారన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన ఆరు ఔట్లెట్లను బుక్కాపురంలో 1, కోవెలకుంట్లలో 2, ఆత్మకూరులో 1, సున్నిపెంటలో 2 ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమ నిల్వలపై దాడులు విస్తృతం చేశామన్నారు. ఇటీవల బేతంచర్ల, మహానంది మండలాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పత్తికొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్ఐల మధ్య జరిగిన గొడవలో బాధ్యులపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నంద్యాల ఎక్సైజ్ సీఐ కేశవులు ఉన్నారు.