జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రముఖులు
నంద్యాలఅర్బన్ : వైద్యులు నిరంతరం తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆధునిక విధానాలపై అవగాహన పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎలమంచలి రాజారావు సూచించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్, ఐఎంఏ నంద్యాల శాఖ సం యుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక శాంతిరాం వైద్య కళాశాల ఆడిటోరియం లో రాయలసీమ స్థాయి వైద్యసదస్సు నిర్వహించారు. శాంతిరాం వైద్యకళాశా ల చైర్మన్ మిద్దె శాంతిరాముడు, ఐఎంఏ జాతీయ నాయకులు డాక్టర్ అప్పారావు, డాక్టర్ గంగాధర్, మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి, కార్యదర్శి అనిల్, కమిటీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, సదస్సు క న్వీనర్ డాక్టర్ మాధవి, విజయభాస్కరరెడ్డి, బుడ్డా శ్రీకాంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజారావు మాట్లాడుతూ సమా జ అవసరాలను గుర్తించి వైద్య విధానాలు రూపొందించుకోవాలని సూచించారు.
డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ కేంద్రం నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం తీసుకరావాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఆమోదించరాదన్నా రు. డాక్టర్ మాధవి మాట్లా డుతూ సదస్సుకు హాజరైన వైద్యులకు మెడికల్ కౌన్సిల్ మూ డు వైద్యపాయింట్లు కేటాయించిందని, ప్రతి ఐదు సంవత్సరాలకు తమ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేసే సమయంలో ఈ పాయింట్లు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతిరాం వైద్య కళాశాల ఎండీ డాక్టర్ రవిబాబు, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ త్యాగరాజరెడ్డి, సాయిప్రసాద్, ప్రిన్సిపాల్ గిడ్డయ్య, సూపరింటెండెంట్ చంద్రన్న, డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు.
మహానందీశుడి సేవలో..
మహానంది: ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఆదివారం సాయంత్రం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రశేఖర్, ఎంపీహెచ్‌ఈఓ హుసేన్‌రెడ్డి, మిత్ర చంద్రశేఖర్‌తో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment